Wednesday, 29 December 2021

హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కు సురుచి బాహుబలి కాజా బహుకరణ*

గోదావరి జిల్లాకు ప్రముఖులు ఎవరు వచ్చినా వారిని గౌరవించే సురుచి సాంప్రదాయంలో భాగంగా ఈరోజు కాకినాడ విచ్చేసిన అఖండ మూవీ హీరోయిన్  ప్రగ్య జైస్వాల్ ను సురుచి మర్యాదపూర్వకంగా కలిసి సురుచి గురించి వివరించి బాహుబలి కాజాను అందజేసి శాలువాతో సత్కరించారు
  జైస్వాల్ మాట్లాడుతూ తాపేశ్వరం కాజా గురించి విన్నాను అది ఇప్పడు చూస్తున్నాను అని అన్నారు.  ఇంత పెద్ద బాహుబలి కాజాను చూడడం ఇదే మొదటిసారి అన్నారు

Wednesday, 15 December 2021

తిరుమ‌ల‌లో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి


తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి బుధ‌వారం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాదీ   చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
       శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు ఉదయం మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి  చేరుకున్నారు. అక్కడ శ్రీ చక్రత్తాళ్వారుకు, నరసింహస్వామివారికి, ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం మరియు హార‌తి చేపట్టారు. హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
స్కంద పురాణం ప్ర‌కారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అందుకు సంతసించి శంఖు, చక్ర, గధా భూషితుడైన శ్రీ మ‌హావిష్ణువు ఆతనికి ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్థానమయ్యాడు. పద్మనాభ మహర్షి స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేశాడు. అయితే ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించాడు. అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు. అటు తరువాత ఆ మహర్షి  శ్రీ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని కోరాడు. భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది.

వరాహ పూరాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడే సప్త తీర్థాలలో చక్ర తీర్థం  ప్ర‌ముఖ తీర్థంగా చెప్పబడింది.

Monday, 13 December 2021

దేశానికి నా సేవలన్నీ నీకు చేసే పూజలే శంకరా ప్రధాని ట్వీట్... ఆధునికరణ శ్రమికులతో సహపంక్తి భోజనం


కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం తర్వాత అర్చన, అభిషేకం కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోది ఆ భావోద్వేగంలో 'యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్...' (నేను చేస్తున్న కర్మలన్నీ, ఓ శంభో, నీ ఆరాధనలే!) అనిపిస్తోందని ఆయన ట్వీట్ చేశారు.
మోడీ స్మరించిన పాదం-  ఆదిశంకరుల వారి శివమానసపూజ లో 'ఆత్మా త్వం గిరిజా మతిః' శ్లోకానిది. 
ఆత్మా త్వం, గిరిజా మతిః, పరిజనాః ప్రాణాః, శరీరం గృహం
పూజతే విషయోపభోగరచనా, నిద్రా సమాధిస్థితిః
సంచారః పదయోః ప్రదక్షిణ విధిస్తోత్రాణి సర్వాగిరః
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో! తవారాధనమ్
ఓ ఈశ్వరా నాలోని జీవుడివి నీవే, నా బుద్ధి నీ అర్థాంగి పార్వతీదేవి, నా ప్రాణాలే నీ  సేవకులు, నా శరీరమే నీ గృహము(కైలాసము). నా పంచేద్రియ అనుభూతియే నీ పూజ. నిద్రయే నాకు సమాధ్యవస్థ. నా పాదసంచారమే నీ ప్రదక్షిణ విధానం. నా మాటలన్నీ నీ స్తోత్రాలే. నేను ఏ పనిచేసినా అది నీ ఆరాధనే పరమ శివా- అని దాని భావం.
తాను దేశసేవలో భాగంగా ఏ పని చేస్తున్నా, ఆ మహాదేవుడికి నేను చేస్తున్న కైమోడ్పే అని మోడీ ట్వీట్ లో పేర్కొన్నారు.ఈ సందర్భంగా విశ్వశ్వేర ఆలయం ఆధునికీకరణలో  శ్రమించి భాగస్వామ్యం వహించిన వారితో ప్రధాని సహపంక్తి భోజనం చేశారు...

అన్నం సేవా ఫౌండేషన్ లో ప్రముఖ సామాజిక వేత్త Dr. కడవెండి వేణుగోపాల్ - అరుణకుమారిల పెళ్లి రోజు వేడుకలు .


ఖమ్మం : నగరంలోని అన్నం సేవా ఫౌండేషన్ లో ప్రముఖ సామాజిక వేత్త Dr. కడవెండి వేణుగోపాల్ అరుణకుమారి ల పెళ్లి రోజు సందర్భంగా హరే రామ , హరే కృష్ణ 24 గంటల రామనామ సంకీర్తన , శ్రీ శ్రీ శ్రీ అవధూతేంద్ర భక్తమండలి , సమాజం గొట్టిపర్తి శివాజీ భక్త బృందంచే ఈ రోజు ఉదయం నుండి రేపు ఉదయం వరకు భక్తి శ్రద్ధలతో 350 మంది అనాధల , అభాగ్యుల , సమక్షంలో జరుగుతున్నది , ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్వర్గీయ ప్రముఖ ఫ్రీడమ్ ఫైటర్ , మాజీ సుజాతనగర్ శాసనసభ్యులు శ్రీ బొగ్గవరపు సీతారామయ్య సతీమణి రుక్మిణిమ్మ 85 సంవత్సరముల వయస్సు వృద్ధురాలు నడవలేని స్థితిలో ఉండి కూడా  పాల్గొని అన్నప్రసాదాన్ని వడ్డించి మానవ సేవే మాధవ సేవ ప్రతి ఒక్కరూ సమాజంలో చేయాలని వారు సూచించారు . భవిష్యత్తులో అన్నం ఫౌండేషన్ కి అండగా ఉంటాము అని భరోసా ఇచ్చారు . అన్నం సేవలను కొనియాడుతూ అండగా ఉంటామని బొగ్గవరపు రుక్మిణమ్మ తెలిపారు . అనంతరం వారిని  ఘనంగా శాలువాతో సత్కరించారు . ఈ కార్యక్రమంలో అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావుతో పాటు ఫౌండేషన్ బాధ్యులు  కడవెండి వేణుగోపాల్ కే శ్రీనివాస్ , అన్నం వెంకటేశ్వర రావు , తదితర సేవా సభ్యులు పాల్గొనడం జరిగినది .

Sunday, 12 December 2021

వనదేవతలను దర్శనం చేసుకోవాలంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే


ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మల దర్శనం కోసం వచ్చే భక్తులు ఎవరైనా ఇక తప్పని సరి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే అమ్మవార్లను దర్శించుకోవాల్సి వుంటుంది. వనదేవతల దర్శనం కోసం రోజూ పెద్ద సంఖ్యల భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్ర, చత్తీస్ గడ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవార్ల దర్శనానికి వస్తుంటారు. కోవిడ్ వ్యాప్తి నేపధ్యంలో వనదేవతలను దర్శించుకునే వారికి ప్రత్యేకంగా జిల్లా వైద్యాధికారులు కోవిడ్ టెస్ట్ లు చేస్తున్నారు. అలాగే టీకా తీసుకోనికి వారి టీకా వేయడం, ఫస్ట్ డోస్ తీసుకున్న వారికి సెకండ్ డోస్ ఇవ్వడం, రెండు డోసులు తీసుకున్నవారు సర్టిఫికెట్ చూపిస్తేనే దర్శనానికి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు.
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటారు.జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మల గద్దెల వద్ద వైద్యాధికారులు కరోనా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నట్లు ఆధారాలు చూపిస్తేనే అధికారులు అమ్మవార్ల దర్శనం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ అళ్లెం అప్పయ్య మాట్లాడుతూ..జిల్లాలో మేడారంతో పాటు పర్యాటక ప్రాంతాలైన రామప్ప, బొగత జలపాతం వద్ద ప్రతి ఆది, బుధవారాల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు

Wednesday, 8 December 2021

హెలికాప్టర్‌ ప్రమాద మృతుల్లో ఏపీ వాసి సాయి తేజ్


భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ తమిళనాడు లోని కున్నూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయినట్టు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారికంగా ప్రకటించింది. బిపిన్‌ రావత్‌ ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది ఈ ప్రమాదంలో చనిపోయినట్టు వెల్లడిచింది. అయితే ఈ ప్రమాదంలో ఏపీ వాసి సాయితేజ్ కూడా మృతి చెందాడు. ఇతడి స్వస్థలం చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం ఎగువరేగడ గ్రామం. 

సాయితేజ్ రక్షణ శాఖలో లాన్స్ నాయక్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సీడీఎస్ బిపిన్‌ రావత్‌‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా సాయితేజ్ విధులు నిర్విహిస్తున్నారు. 2013లో ఆర్మీలో జాయిన్ అయ్యాడు సాయితేజ్. సాయితేజ్ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సాయితేజ్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. చివరిసారిగా వినాయక చవితికి సాయితేజ్ స్వగ్రామానికి వచ్చినట్లు బంధువులు తెలిపారు.

A helicopter carrying India's Chief of Defence Staff (CDS) General Bipin Rawat crashed...

General Bipin Laxman Singh Rawat, 
PVSM UYSM AVSM YSM SM VSM ADC 
(born 16 March 1958) is a four star general of the Indian Army. He is the first and current Chief of Defence Staff (CDS) of India. On 30 December 2019, he was appointed as the first CDS of India and assumed office from 1 January 2020. Prior to taking over as the CDS, he served as 57th and last Chairman of the Chiefs of Staff Committee as well as 26th Chief of Army Staff of the Indian Army.
A helicopter carrying India's Chief of Defence Staff (CDS) General Bipin Rawat crashed in the southern state of Tamil Nadu..Nilagiri District, between Coimbatore & Sullur..on Wednesday, the air force said.
“An IAF Mi-17V5 helicopter, with CDS Gen Bipin Rawat on board, met with an accident today near Coonoor, Tamil Nadu,” 
The report quoted sources as saying that there were higher officials in army on board, including Gen Rawat, his wife, defence assistant, security commandos and an IAF pilot.

.

Wednesday, 1 December 2021

తిరుమల ధ్వంసమైనఘాట్రోడ్డుప్రాంతాలనుపరిశీలించిన టీటీడీచైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి.. యుద్ధప్రాతిపదికనఘాట్రోడ్డుమరమ్మతులు... నేటిసాయంత్రానికిఢిల్లీఐఐటినిపుణులరాక-.. డౌన్ ఘట్ రోడ్ ద్వారా రాకపోకలు...


     తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే అప్ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడి ఘాట్ రోడ్డు భారీగా ధ్వంసమైందని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
 బుధవారం తెల్లవారుజామున 5 - 40 గంటల సమయంలో భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడి రక్షణ గోడలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఈ ప్రాంతాలను పరిశీలించారు. నాలుగు చోట్ల భారీ ప్రమాదం జరిగిందని, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దయవల్ల ఎవరూ గాయపడలేదని అధికారులు వివరించారు.నడక భక్తులకు ఇబ్బందులు లేవని..వాహనాలపై వచ్ఛే వారు 15 రోజుల వరకు తిరుమల ప్రయాణం వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.. అనంతరం చైర్మన్ అధికారులకు పలు సూచనలు చేశారు.
       ఈ సందర్భంగా శ్రీ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. గత 30 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఇటీవల కురిసిన వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్ల లో కొండ చరియలు విరిగిపడుతున్నాయని తెలిపారు. ఉదయం 5 - 45 గంటల సమయంలో ఆర్టీసీ బస్సు తిరుమలకు వెళుతుండగా భారీ శబ్దం, పొగ రావడంతో డ్రైవర్ బస్సు  నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చైర్మన్ చెప్పారు. అప్ ఘాట్ రోడ్డులో మరో ఐదారు చోట్ల కొండ చరియలు విరిగిపడే ప్రమాదం గుర్తించామన్నారు. వీలైనంత త్వరలో రోడ్డు మరమ్మతులు చేసి, గట్టి రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని చైర్మన్ చెప్పారు. ఢిల్లీ ఐ ఐ టి నుంచి నిపుణుల బృందం బుధవారం సాయంత్రానికి తిరుపతి కి చేరుకుంటుందన్నారు. టీటీడీ ఇంజినీరింగ్, విజిలెన్స్  అధికారులతో కలిసి వారు ఘాట్ రోడ్ల పరిశీలన చేస్తారన్నారు. కొండ చరియలు విరిగిపడకుండా ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలనే విషయం పై వారు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రెండు, మూడు రోజుల్లో నివేదిక సమర్పిస్తారని ఆయన వివరించారు. ఆ తరువాత భవిష్యత్ లో కూడా ఇలాంటి సంఘటనలు జరక్కుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘాట్ రోడ్డు మరమ్మతులు పూర్తి అయ్యే వరకు డౌన్ ఘాట్ రోడ్డులోనే వాహనాల రాకపోకలు అనుమతిస్తామని అన్నారు.
     ఆన్లైన్లో దర్శనం టికెట్లు బుక్ చేసుకుని వాహనాల ద్వారా తిరుమలకు వచ్చే భక్తులు  భారీ వర్షాల దృష్యా   తమ ప్రయాణం వాయిదా వేసుకుంటే ఆరు నెలల్లోగా  దర్శనం తేదీ మార్పు చేసుకునే అవకాశం ఉందని శ్రీ సుబ్బారెడ్డి   చెప్పారు. నడకదారిలో తిరుమలకు వెళ్ళే భక్తులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు.

   PC:#ttd