Monday, 13 December 2021

దేశానికి నా సేవలన్నీ నీకు చేసే పూజలే శంకరా ప్రధాని ట్వీట్... ఆధునికరణ శ్రమికులతో సహపంక్తి భోజనం


కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం తర్వాత అర్చన, అభిషేకం కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోది ఆ భావోద్వేగంలో 'యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్...' (నేను చేస్తున్న కర్మలన్నీ, ఓ శంభో, నీ ఆరాధనలే!) అనిపిస్తోందని ఆయన ట్వీట్ చేశారు.
మోడీ స్మరించిన పాదం-  ఆదిశంకరుల వారి శివమానసపూజ లో 'ఆత్మా త్వం గిరిజా మతిః' శ్లోకానిది. 
ఆత్మా త్వం, గిరిజా మతిః, పరిజనాః ప్రాణాః, శరీరం గృహం
పూజతే విషయోపభోగరచనా, నిద్రా సమాధిస్థితిః
సంచారః పదయోః ప్రదక్షిణ విధిస్తోత్రాణి సర్వాగిరః
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో! తవారాధనమ్
ఓ ఈశ్వరా నాలోని జీవుడివి నీవే, నా బుద్ధి నీ అర్థాంగి పార్వతీదేవి, నా ప్రాణాలే నీ  సేవకులు, నా శరీరమే నీ గృహము(కైలాసము). నా పంచేద్రియ అనుభూతియే నీ పూజ. నిద్రయే నాకు సమాధ్యవస్థ. నా పాదసంచారమే నీ ప్రదక్షిణ విధానం. నా మాటలన్నీ నీ స్తోత్రాలే. నేను ఏ పనిచేసినా అది నీ ఆరాధనే పరమ శివా- అని దాని భావం.
తాను దేశసేవలో భాగంగా ఏ పని చేస్తున్నా, ఆ మహాదేవుడికి నేను చేస్తున్న కైమోడ్పే అని మోడీ ట్వీట్ లో పేర్కొన్నారు.ఈ సందర్భంగా విశ్వశ్వేర ఆలయం ఆధునికీకరణలో  శ్రమించి భాగస్వామ్యం వహించిన వారితో ప్రధాని సహపంక్తి భోజనం చేశారు...

No comments:

Post a Comment