**పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధంగా ఉండాలి..... రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్*
**స్థానిక ఎన్నికల సన్నద్దతపై అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల కమీషన్ కార్యదర్శి*
ఖమ్మం, : రాబోయే స్థానిక సంస్థల, గ్రామ పంచాయతీల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ కార్యదర్శి ఎం. అశోక్ కుమార్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమీషన్ కార్యదర్శి, స్థానిక ఎన్నికల సన్నద్దతపై అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా, ఖమ్మం కలెక్టరేట్ నుండి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, సంబంధిత అధికారులతో కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.గ్రామ పంచాయతీలలో 2వ సప్లిమెంట్ ఓటర్ జాబితా మ్యాపింగ్, మండలాలకు ఎంపిటిసిల కేటాయింపు, ఎంపిటిసి, జెడ్పిటిసి ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన మ్యాన్ పవర్, బ్యాలెట్ బాక్సుల సన్నద్దత, సిబ్బందికి అవసరమైన శిక్షణ, రిటర్నింగ్ అధికారుల నియామకం, బ్యాలెట్ పేపర్ల ముద్రణ తదితర అంశాలపై కార్యదర్శి, అదనపు కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా చర్చించారు. ఈ సందర్భంగా *రాష్ట్ర ఎన్నికల కమీషన్ కార్యదర్శి మాట్లాడుతూ,* రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఎంపీటీసీ పరిధి చెక్ చేసుకోవాలని, ఎంపిడీఓలు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. మండల స్థాయిలో అందుబాటులో ఉన్న సిబ్బంది ఎన్నికల సమయంలో ఏ బాధ్యతలను నిర్వర్తించాలో స్పష్టమైన ప్రణాళిక తయారు చేసుకోవాలని అన్నారు.గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అవసరమైన బ్యాలెట్ పత్రాలు, బాక్సులు స్ట్రాంగ్ రూమ్ లలో అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఎన్నికలు వస్తే చేయాల్సిన పనులను మండల పంచాయతీ అధికారి, ఎంపిడిఓ కలిసి లిస్ట్ ఔట్ చేసుకోవాలని, ప్రతి పనికి ఒక అధికారికి బాధ్యతలు అప్పగించాలని, అవసరమైన సిబ్బంది, మెటీరియల్ వివరాలు అందించాలని ఆయన సూచించారు.ఎంపిటిసి, జెడ్పిటిసి, గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన రిటర్నింగ్ అధికారులను గుర్తించి వారికి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అన్నారు. రిటర్నింగ్ అధికారులుగా నియమించబడిన వారికి చేపట్టాల్సిన విధులను వివరిస్తూ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయాలని, వారిని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలని అదనపు కలెక్టర్ లను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రణాళికలు చేసుకోవాలని, ఎన్నికల సమయంలో బ్యాలెట్ బాక్స్ ల తరలింపుకు అవసరమైన వాహనాలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికల వ్యయ పరిశీలనకు అవసరమైన బృందాలు ఏర్పాటు చేసుకొని సన్నద్ధంగా ఉండాలని అన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది సిద్ధం చేసుకోవాలని, ఎంపిటిసి, జెడ్పిటిసి ఓటర్ జాబితా తయారు చేయాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో 2వ దశ సప్లిమెంట్ ఓటర్ జాబితా తయారు చేసి పోలింగ్ కేంద్రాల ఓటర్లను మ్యాప్ చేయాలని, దివ్యాంగ ఓటర్లకు కల్పించాల్సిన వసతులపై ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ,* ఎన్నికల కమీషన్ కార్యదర్శి అందించిన సూచనలను నోట్ చేసుకున్నామని, క్షేత్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలను తప్పకుండా పాటిస్తూ రాబోయే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ సిఇఓ దీక్షా రైనా, డిపిఓ ఆశాలత, డిప్యూటీ సిఇఓ కె. నాగపద్మజ, డి.ఎల్.పి.ఓ. రాంబాబు,
సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
###############################
*పకడ్బందీగా ఇంటర్ పరీక్షలను నిర్వహించాలి - జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మజ*
**మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణ*
**ఇంటర్ పరీక్షల కోసం 72 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు*
*ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా రెవెన్యూ అధికారిణి*
ఖమ్మం : జిల్లాలో ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మజ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోనీ తన ఛాంబర్ లో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారిణి సమీక్షించారు. ఈ సందర్భంగా *జిల్లా రెవెన్యూ అధికారిణి మాట్లాడుతూ,* మార్చి 5 నుంచి మార్చి 25 వరకు జరిగే ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం12.00 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే 36660 మంది విద్యార్థుల కోసం 72 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామని అధికారులు జిల్లా రెవెన్యూ అధికారిణి కి తెలిపారు. ఇంటర్ పరీక్షల నిర్వహణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని, పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పరీక్ష హాల్స్ లో త్రాగునీరు, అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కనీస మందులతో పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం సకాలంలో హాజరయ్యే విధంగా ఆర్టీసీ బస్సులు నడపాలని అన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారిణి అన్నారు.ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. కళావతి బాయి, పోస్టల్ శాఖ నుండి ఆర్. నారాయణ, టిజి ఆర్టీసీ నుండి దినేష్ కుమార్, సాంఘీక సంక్షేమ శాఖ ఆర్సీఓ విజయలక్ష్మి, మైనారిటీ శాఖ ఆర్సీఓ వెంకట రామయ్య, విద్యా శాఖ నుండి భానుప్రకాశ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
##############################
**పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి..... స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ*
**ప్రతిరోజు రోడ్లను శుభ్రం చేయడం, చెత్త సేకరణ పక్కాగా జరగాలి*
**ప్రాధాన్యత క్రమంలో ప్రతిపాదించిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలి*
*సతుపల్లి, మధిర, వైరా పట్టణాల మునిసిపాలిటీల పని తీరుపై సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్*
ఖమ్మం : జిల్లాలోని పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి.శ్రీజ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో సతుపల్లి, మధిర, వైరా పట్టణాల మున్సిపాలిటీల పని తీరుపై అధికారులతో సమీక్షించారు.
మున్సిపాలిటీలలో ఆస్తి పన్నుల వసూలు, చేపట్టిన అభివృద్ధి పనులు, పచ్చదనం, త్రాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, టౌన్ ప్లానింగ్ వంటి పలు విభాగాలపై అదనపు కలెక్టర్ వివరాలను తెలుసుకొని పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ,* పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై అధిక ప్రాధాన్యత కల్పించాలని, రోడ్లను శుభ్రంగా ఉంచాలని, రోడ్లపై ఎక్కడ చెత్తా చెదారం, ప్లాస్టిక్ ఉండడానికి వీలు లేదని అన్నారు. పట్టణంలోని ప్రతి వార్డుకు చెత్త నిర్వహణ కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలని, అక్కడ అవసరాలకు అనుగుణంగా సిబ్బంది, అవసరమైన వాహనాలు, యంత్రాలు అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు.
పట్టణంలో ప్రతి రోజు చెత్త సేకరణ జరగాలని, చెత్త సేకరణ కోసం కాలనీలను విభజించుకొని, ఎక్కడ ఏ సమయంలో సేకరిస్తామో నిర్దిష్టమైన వివరాలు అందుబాటులో ఉండాలని అన్నారు. రోజు రోడ్లను శుభ్రం చేయాలని, పారిశుధ్య సిబ్బంది పూర్తి స్థాయిలో విధులకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, వారి పని తీరును ప్రతి రోజు పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. చెత్త వాహనాలకు జిపిఎస్ ట్రాకర్ ఏర్పాటు చేసి వాటి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, పట్టణాలలో ప్రజల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజల ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించే విధంగా వ్యవస్థ సిద్ధం చేసుకోవాలని అన్నారు.
మున్సిపాలిటీలో ఆస్తి పన్నుల వసూలు సమీక్షించుకొని వంద శాతం పన్ను వసూలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీలో ఇప్పటివరకు ఎంత పన్ను వసూలు జరిగింది, గత సంవత్సరం కంటే పెరిగిందా తగ్గిందా, పెండింగ్ ఉండటానికి గల కారణాలు, వాటి వసూళ్లకు చేపట్టే చర్యల గురించి చర్చించి అదనపు కలెక్టర్ పలు సూచనలు చేశారు. మున్సిపాలిటీ లలో చేపట్టిన రోడ్డు విస్తరణ, డ్రైయిన్ల నిర్మాణం, జంక్షన్ ల అభివృద్ధి వంటి అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. మున్సిపాలిటీలో మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరాకు సంబంధించి సరఫరాలో ఉన్న సమస్యలను ముందుగా గుర్తించి రాబోయే వేసవికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో వైరా, సత్తుపల్లి, మధిర మునిసిపల్ కమిషనర్ లు వేణు, సంపత్ కుమార్, నర్సింహ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment