నిజామాబాద్ : - ఆంధ్రప్రదేశ్ లో కలిసిన భద్రాచలం చుట్టుపక్క గ్రామాలైన యాటపాక, కన్నాయిగూడం, పిచుకలపాడు మరియు పురుషోత్తపట్నం లను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి .. కేంద్ర మంత్రి అమిత్ షా కు విజ్ఞప్తి చేశారు.నిజామాబాద్ వాసుల సుదీర్ఘ కాలం పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆదివారం కేంద్రమంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభించారు. ఇది వరకే రాష్ట్రంలోని నిజామాబాద్ కి పసుపు బోర్డు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, ఆదివారం దాని ప్రధాన కార్యాలయాన్ని నిజామాబాద్ లో ప్రారంభించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు మరియు నిజామాబాద్ ఇంచార్జీ మంత్రి సీతక్క గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. నిజామాబాద్ కి పసుపు బోర్డు ప్రకటించి, దాని కార్యాలయాన్ని కూడా ప్రారంభించినందుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ తరపున కృతజ్ఙతలు తెలిపారు. అలాగే పసుపు రైతుల సంక్షేమం కోసం మరిన్ని పధకాలను అమలు చేయాలని ఆయన కేంద్ర మంత్రి కి విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment