**కలెక్టరేట్ లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దంపతులు*
ఖమ్మం : తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించే బతుకమ్మ, ప్రకృతిని పూజించే గొప్ప పండుగ అని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
మూడవ రోజు మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లో వైద్య శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
బతుకమ్మ వేడుకలలో కలెక్టర్ సతీమణితో కలిసి ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ వేడుకలలో కలెక్టరేట్లోని వివిధ శాఖలలో ఉన్న మహిళలంతా కలిసికట్టుగా పాల్గొన్నారు. కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ, బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో.... అంటూ ఆట, పాటలతో సందడి చేసిన మహిళలు, ఉద్యోగులతో కలిసి జిల్లా కలెక్టర్ కలిసి ఆడి వారిని ఉత్తేజపరిచారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించుకుంటున్న బతుకమ్మ పండుగలో తొమ్మిది రోజులు రకరకాలుగా గౌరమ్మను కొలుచుకొంటూ, కలిసి కట్టుగా అందరూ ఒకేచోట చేరి ఆడుతూ, పాడుతూ బతుకమ్మను పూజించుకొంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా ప్రాంగణం విద్యార్థినులు, వైద్య శాఖ ఉద్యోగినులు, సిబ్బంది, అందరూ పాల్గొని గౌరమ్మను కొలిచి ఆట, పాటలతో సందడి చేసారు.
No comments:
Post a Comment