Sunday, 31 January 2021
అస్తమించిన ఈ సూర్య ''ప్రకాశం''.... ఆశయానికి ఆసరాగా నిలబడిన దేహం ఇప్పుడు లేదు....
Saturday, 16 January 2021
ఊపిరిలూదే వైధ్యుల ఉసురు తీసిన ప్రమాదం.. సంతాపం వ్యక్తం చేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్...
Friday, 15 January 2021
ఘనంగా అయ్యప్ప పార్వేట ఉత్సవం
Tuesday, 12 January 2021
మకరవిళక్కుకు సిద్దమైన శబరిమలై... మొదలైన తిరువభరణ యాత్ర...
Sunday, 10 January 2021
హిందూ ఆలయాలపై దాడి బాధాకరం : శృంగేరి జగద్గురు భారతితీర్థ
ఆంధ్రప్రదేశ్‌లో గత కొంతకాలంగా ఆలయాలపై జరుగుతున్న దాడులపై దక్షిణామ్నాయ శృంగేరీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. ఆంధ్రరాష్ట్రంలో ఆస్తిక మహాజనులందరకు శ్రద్దాకేంద్రాలైన కొన్ని దేవాలయములపై గత కొన్ని నెలలుగా దాడులు జరుగుతుండడం తీవ్రమైన వేదనను కలిగిస్తోందని, ఇటువంటి దాడులు రాజ్యాంగవిరుద్ధమని, వీటివల్ల దేశ ప్రజల సామరస్యానికి భంగమేర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేసారు.
ఇలాంటి దుశ్చర్యలను ఆరంభదశలోనే నివారించి ఇలాంటివి పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి సూచించారు.
స్వామివారి ప్రసంగం పూర్తిపాఠం:
శృంగేరి 09.01.2021
సనాతనహిందూధర్మము ఈ ప్రపంచములో అన్ని ధర్మములకంటెను అత్యంత ప్రాచీనమైనదను విషయము సర్వవిదితము. మనుష్యునకు ఇహపరలోకములలో శ్రేయోదాయకమయిన ఈ ధర్మమును స్వయముగా భగవంతుడే ప్రతియొక్క యుగమునందవతరించి ఉద్దరింతునని భగవద్గీతయందు శెలవిచ్చియున్నాడు. అట్టి ఈ ధర్మమునకు మూలములైన వేద శాస్త్రములలో సకలమానవుల శ్రేయస్సు కొరకు భగవదుపాసన చెప్పబడియున్నది. మన పవిత్ర భారతదేశంలో విలసిల్లుచున్న అనేక పుణ్యక్షేత్రములలో మరియు ప్రాచీన దేవాలయములలో అనేకరూపములలో అనేకనామములతో భగవదుపాసన అనాదికాలముగ విశేషముగా ఆచరింపబడుచున్నది. ప్రస్తుతము ఆంధ్రరాష్ట్రంలో ఆస్తిక మహాజనులందరకు శ్రద్దాకేంద్రములైన కొన్ని దేవాలయములపై గత కొన్ని నెలలుగా అవిరతముగా దాడులు జరుగుచుండుట వీటికి కారకులైన వారిని గుర్తించి వారికి కఠినమైన శిక్షను విధింపకుండుట మా మనస్సుకు అత్యంత దుఃఖమును కలిగించినవి. ఇది అత్యంత ఖండనీయమైన విషయము. భగవంతుని విషయమున జరిగిన ఇట్టి అక్షమ్యమైన అపరాధములు వాటినొనర్చినవారిని జన్మ జన్మలకు ఎెంటాడి అపరిమితమైన దుఃఖమును కలిగించును. దాడులు మహాపాపములే కాక రాజ్యాంగమునకు కూడా అత్యంత విరుద్ధములు. వీటవలన దేశ ప్రజల సామరస్యమునకు భంగమేర్పడుటయే కాక అనేకవిధములైన అనిష్టములను ఎదుర్కొనవలసిన దుస్థితి కూడా రాగలదు. ఇట్టి దుశ్చర్యలను ఆరంభదశలోనే నివారించి ఇవి పునరావృత్తము కాకుండుటకు కఠినమైన చర్యలను తీసుకొనవలసిన బాధ్యత ప్రభుత్వమునకున్నది. హిందూధర్మములో అనేక సంప్రదాయ భేదములు ఉన్నప్పటికీ అవి ధర్మసంరక్షణకు విఘాతకములు కాకూడదను విషయమును చక్కగా ఆకళింపు చేసికొని ఆస్తికులందరూ ఇట్టి సందర్భమున ఐకమత్యమును ప్రదర్శించి ధర్మమును కాపాడి భగవదనుగ్రహపాత్రులై కృతార్థులగుదురుగాకయని మేమాశించుచున్నాము.
Friday, 1 January 2021
తల్లిదండ్రులు కనిపించే దైవాలు': సైబరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనార్,
*
‘’వృధ్ధశ్రమాలు అవసరంలేని సమాజం కోరుకుందాం అని సైబరాబాద్త సి.పి. సజ్జానర్ సూచించారు. నూతన సంవత్సరం 2021’’ సందర్భంగా కార్ఖానాలోని జనక్ పూరి కాలనీ ఏబీఎం ప్లాజా లోని ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ వృద్ధాశ్రమానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ వారి సతీమణి అనుప వీ సజ్జనార్, కుమార్తెలు అధితి, నియతి, సీపీ తమ్ముడి పిల్లలు చిన్నారులు సమర్థ్, సమృధ్ తో కలిసి ఈ ఉదయం వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్స్ తో కలిసి కేక్ కట చేసి, వారికి అల్పాహారం తినిపించి వారిలో ఆనందంని నింపారు. ముందుగా అందరికీ నూతన సంవత్సర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి సంతోషాన్ని పంచారు.
ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ ని సందర్శించడం సంతోషంగా ఉందన్నారు.
*తల్లిదండ్రులు కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాలన్నారు.* పిల్లలు వారి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. మనం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వారి బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదేనన్నారు. తల్లిదండ్రులు సంతోషంగా ఉంటేనే వారి ఆశీస్సులతో జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలమన్నారు.
వృద్ధుల ఆశ్రయం కోసం, వారి వైద్య సాయనికై ఇంత మంచి మెడికల్ హోమ్ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది.. అదే సమయంలో వృద్ధాశ్రమాల అవసరం లేని సమాజాన్ని నిర్మించాలన్నారు.
రానున్న రోజుల్లో వృద్ధాశ్రమాలు అవసరం లేని సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేశ నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ పాటుపడాలన్నారు. ప్రతీఒక్కరూ దేశ భద్రత, సురక్షిత కోసం, అభివృద్ధి కోసం పునరంకితం కావాలన్నారు.
అనంతరం డాక్టర్ రామకృష్ణ ను సమాజం కోసం ఆయన చేస్తున్న సేవకు గాను సీపీ గారు అభినందించారు. తన వంతుగా వారికున్న పరిమితుల్లో డాక్టర్ రామకృష్ణ సమాజానికి సేవ చేస్తున్నారని.. ప్రతీ ఒక్కరూ సమాజానికి తమవంతుగా సేవ చేయాలన్నారు. సైబరాబాద్ పోలీసులు తరుపున ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ కు ఏదైనా సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధమన్నారు.
ఈ సందర్భంగా ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ పోలీస్ వృత్తిపరంగా నిత్యం బిజీ గా ఉన్నప్పటికీ సీనియర్ సిటిజన్ల కళ్లలో ఆనందాన్ని నింపేందుకు ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ కు కుటుంబ సమేతంగా విచ్చేసిన సీపీ సజ్జనార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధాశ్రమంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకొని సీపీ గారు నూతన ఒరవడికి నాంది పలికారన్నారు.
సరైన సమయానికి సరైన వైద్య సాయం అందక/ అందించలేక దురదృష్టవశాత్తూ తన తల్లి గారైన రాములమ్మ చనిపోయారన్నారు.. తనలా మరెవరికీ అలాంటి పరిస్థితి రావద్దని సదుద్దేశంతో 12 సంవత్సరాల క్రితం ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ ను నెలకొల్పామన్నారు.
నూతన సంవత్సర వేడుకలకు విచ్చేసి.. వయో వృద్ధులలో నూతనోత్సాహాని నింపిన సీపీ సజ్జనార్ గారి మరియు వారి కుటుంబ సభ్యులకు డాక్టర్ రామకృష్ణ గారు మరియు సీనియర్ సిటిజన్లు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్, ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ డాక్టర్ రామకృష్ణ, ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ మేనేజర్ నాగబూషణం, డాక్టర్ ఛత్రి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ప్రమోద్, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఆనంద్, కృష్ణ చౌదరీ, జోష్ వెబ్ సైట్ వాలంటీర్లు మదన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


