Thursday, 25 November 2021

కొండకోనల్లో మోగిన పెళ్లి బాజాలు.... వనం పూలన్ని తలంబ్రాలుగా 140 జంటలు ఒక్కటయ్యాయి..

నల్లమల్లకు పెళ్లి కళ వచ్ఛింది.. కొనంత సందడి నెలకొంది..అడవి బిడ్డల పెళ్లి సంబురం నల్లమల్ల సీమలో అంబరాన్ని అంటింది... వనవాసి కళ్యాణ పరిషత్  ఆధ్వర్యంలో  శ్రీశైలం నల్లమల అడవుల్లో నివసించు అతి ప్రాచీన పురాతన తెగ అయిన చెంచులు. (అంటే శ్రీ శ్రీ శ్రీ చెంచులక్ష్మి నరసింహ స్వామి శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి చెంచుల అల్లుళ్లు గా భావిస్తారు). వీరు ఎక్కువ శాతం అడవులలో  నివసించడం వలన పేదరికం వల్ల పెళ్లిళ్లు కావడం కష్టం.  కావున సహజీవనం చేస్తారు, పిల్లలు కూడా ఉంటారు.  అందుకని మన హిందూ పద్ధతిలో ఈ చెంచులకు సామూహిక వివాహాలు చేయాలనే నిర్ణయించడం జరిగింది.
 సుమారు రెండు జిల్లాలు ఆరు మండలాలు 31 చెంచుగూడెం లు నుండి 140 కుటుంబాలు ఎంపిక చేసారు.  దీనికోసం ఒక్కో జంట కూ పెళ్లి కోసం తాళి బొట్టు,మెట్టెలు పెండ్లి బట్టలు ఇద్దరికీ కలిపి,15.000రూపాయలు ఖర్చు అని అంచనా వేసి  దాతల వద్ద నుండి ధన, వస్తు రూపేనా నిధులు సేకరించారు.
 కన్నుల పండుగగా ఈ 140 ఆదివాసీ (చెంచులు) జంటల సామూహిక కళ్యాణ మహోత్సవం గత నెల అక్టోబర్ 31 వ తేదీన నల్గొండ మరియు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా లో గల అచ్చంపేట పట్టణంలో జరిగింది.
వధూ వరులకు, వారి బంధువులకు, స్నేహితులకు ఘనంగా సామూహిక విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు శ్రీ గరికపాటి నరసింహారావు గారు ఈ కార్యక్రమానికి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు.

No comments:

Post a Comment