ఢిల్లీ : ప్రత్యేక రైళ్లను ఇక కొవిడ్‌కు ముందు మాదిరిగానే నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. ‘ప్రత్యేక’ నంబర్లను తొలగించి పాత నంబర్లను కేటాయించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ‘రైల్వే కాలపట్టిక- 2021’లో సెంటర్ ఫర్ రైల్వే ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ అప్‌లోడ్ చేసింది. ఇప్పటికే టికెట్లు రిజర్వు చేసుకున్న ప్రయాణికులకు మారిన రైలు నంబర్ల వివరాల్ని ఎస్‌ఎంఎస్‌ల రూపంలో పంపించింది. 76 రైళ్లకు ప్రత్యేక నంబర్లకు ముగింపు పలికి రెగ్యులర్ రైళ్లుగా మార్చింది. ఈ మేరకు ఆయా రైళ్ల జాబితాను విడుదల చేసింది.*
No comments:
Post a Comment