Saturday, 29 April 2023

అష్టలక్ష్మీ, ద‌శావ‌తార‌ మండపంలో వేడుకగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు ప్రారంభం

PADMAVATHI PARINAYOTSAVAM HELD WITH RELIGIOUS FERVOUR

అష్టలక్ష్మీ, ద‌శావ‌తార‌ మండపంలో వేడుకగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు ప్రారంభం
తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో స్వర్ణకాంతులు విరజిమ్మేలా ఏర్పాటు చేసిన అష్టలక్ష్మీ, ద‌శావ‌తార మండపంలో శనివారం శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. మే 1వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. 
శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటిరోజు అంటే వైశాఖశుద్ధ నవమిరోజైన శనివారం శ్రీమలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా, ఉభయనాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి సాయంత్రం 5.30 గంటలకు వేంచేపు చేశారు. శోభాయమానంగా తీర్చిదిద్దిన పెండ్లిమండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీస్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవటం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తరువాత స్వామివారికి కొలువు (ఆస్థానం) జరిగింది. ఈ కొలువులో సర్వజగత్ప్రభువైన శ్రీవేంకటేశ్వరస్వామి వారికి వేదాలు, పురాణాలు, సంగీతరాగాలు, కవితలు, నృత్యాలు నివేదించారు.
 
       మంగళ వాయిద్యాల నడుమ  స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి బంగారుతిరుచ్చిపై అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలిరోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది.

#ప్రత్యేకఆకర్షణగాఅష్టలక్ష్మీమండపం :  

శ్రీ పద్మావతి పరిణయ మండపాన్ని ఆపిల్‌, ఫైనాపిల్,  మొక్కజొన్న కంకులు, ఆస్ట్రేలియా ఆరంజ్, నారింజ, ద్రాక్ష, అరటి, మామిడి కొమ్మలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. మండపం అలంకరణకు బంతి, చామంతి, వట్టివేరు, వాడామల్లి, నాలుగు రంగుల రోజాలు, కార్నస్‌ తదితర పుష్పాలను వినియోగించారు. మొత్తం 3 టన్నుల ఫలాలు, 1.5 టన్నుల‌ సంప్రదాయ పుష్పాలు, 30 వేల కట్‌ ఫ్లవర్లు ఉపయోగించారు. మధ్యమధ్యలో క్రిస్టల్‌ బాల్స్‌, షాండ్లియర్లు వేలాడదీశారు. చిన్ని కృష్ణుడు, వెన్న కుండలు, ఎనుగులు, నెమళ్ళు సెట్టింగ్ భక్తులను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి.      
కాగా ఈ మండప అలంకరణకు పుణెకి చెందిన శ్రీ వేంక‌టేశ్వ‌ర ఛారిట‌బుల్ ట్ర‌స్టు 24 లక్షలు టీటీడీకి విరాళం అందించింది. 15 రోజులుగా 30 మంది చెన్నైకి చెందిన నిపుణులు, రెండు రోజులుగా 100 మంది టీటీడీ గార్డెన్ సిబ్బంది   డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు ఆధ్వ‌ర్యంలో ఈ ప్రాంగణాన్నిఅత్యంత మనోహరంగా అలంకరించారు.

Tuesday, 25 April 2023

తిరుమల వార్తలు... శ్రీవారిని దర్శించుకున్న ఆంధులు - అనాధాలు... శ్రీవారిఆలయంలోఘనంగాభాష్యకారులసాత్తుమొర

#శ్రీవారినిదర్శించున్నఅనాథలు
అంధులుదివ్యాంగులు......
శ్రీవారి దర్శనంతో వందలాది మంది అనాథలు, అంధులు, దివ్యాంగులు పులకించిపోయారు. చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శేఖర్ రెడ్డి చొరవతో రాజస్థాన్ యూత్ అసోసియేషన్, చెన్నై ఫుడ్ బ్యాంకు ఆధ్వర్యంలో 1008 మంది అనాథలు, అంధులు, దివ్యాంగులు మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో  లోకనాధం, విజివో శ్రీ బాలిరెడ్డి కలిసి వృద్ధులు, దివ్యాంగుల క్యూలైన్ ద్వారా వీరికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో 160 మంది అంధులు, 100 మంది దివ్యాంగులు, 108 మంది వృద్ధులు, 50 మంది మానసిక వికలాంగులు, ఆనాథలు కలిపి మొత్తం 1,008 మంది ఉన్నారు. వీరిలో ఐదేళ్ల  చిన్నారుల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది మొదటిసారి శ్రీవారిని దర్శించుకున్న వారే కావడం విశేషం. శ్రీవారి దర్శనంతో వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తమ మనోనేత్రంతో స్వామివారిని దర్శించుకున్నామని పలువురు అంధులు సంతోషం వ్యక్తం చేశారు. చక్కటి స్వామి వారి దర్శనం కల్పించినందుకు వీరు నిర్వాహకులకు, టీటీడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. దర్శనానంతరం తరిగొండ వెంగమాంబ కాంప్లెక్స్ లో అన్నప్రసాదాలు స్వీకరించారు.


#శ్రీవారిఆలయంలోఘనంగాభాష్యకారులసాత్తుమొర

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం భాష్యకార్ల సాత్తుమొర ఘనంగా జరిగింది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.ఈ సందర్భంగా ఉదయం శ్రీ భాష్యకార్ల వారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత నడకదారిలోని శ్రీ భాష్యకార్ల సన్నిధిలో ప్రత్యేక పూజలు చేపట్టారు.సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీభాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంత‌రం ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణగా విచ్చేసి భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహించారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు జ‌రిగింది.

Sunday, 23 April 2023

FIR REGISTERED AGAINST FAKE WEBSITE ON TTD



TIRUMALA, 23 APRIL 2023: One more fake website has been identified by TTD IT wing and upon their complaint a case has been registered in Tirumala 1 Town Police Station.
as FIR 19/2023 u/s 420,468,471 IPC.
Based on the complaint the AP Forensic Cyber Cell has also plunged into action to investigate the fake website. So far cases have been registered against 40 fake websites and the new one is enlisted as 41st under the Cyber Crime.
The fake website was developed by the miscreants almost similar to TTD official website with negligible modifications. The address of the Fake Website URL is https://tirupatibalaji-ap-gov.org/ 

While the official website URL is https://tirupatibalaji.ap.gov.in/

TTD once again appeals and cautions the devotees not to fall prey to such fake websites. The devotees are requested to make note of the URL address of TTD Official website and be cautious verifying the credentials of the correct website before booking the online tickets. The devotees shall book tickets through the TTD official Mobile App also. The TTD official Mobile App is TTDevasthanams.
మరో నకిలీ వెబ్సైట్ పై ఎఫ్ఐఆర్ నమోదు

- ఎపి ఫోరెన్సిక్ సైబర్ సెల్ విచారణ

- నకిలీ వెబ్సైట్లను నమ్మవద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

        తిరుమల తిరుపతి దేవస్థానముల పేరుతో గల మరో నకిలీ వెబ్సైట్ ను టీటీడీ ఐటీ విభాగం గుర్తించి తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ 19/2023 యు/ఎస్ 420, 468, 471 ఐపిసి ప్రకారం పోలీసులు నమోదు చేసి ఎపి ఫోరెన్సిక్ సైబర్ సెల్ కు అప్పగించారు. ఈ మేరకు సైబర్ సెల్ అధికారులు నకిలీ వెబ్సైట్ పై విచారణ ప్రారంభించారు.

       ఇదివరకే 40 నకిలీ వెబ్సైట్లపై కేసులు నమోదు కాగా, దీంతో కలిపి కేసుల సంఖ్య 41కి చేరింది.

       అధికారిక వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in/ ఇలా ఉండగా, చిన్న మార్పులతో కొందరు వ్యక్తులు రూపొందించిన https://tirupatibalaji-ap-gov.org/ వెబ్సైట్ ను టిటిడి గుర్తించింది. టీటీడీ అధికారిక వెబ్సైట్లోనే శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని కోరడమైనది. దీంతో పాటు టీటీడీ అధికారిక మొబైల్ యాప్ ను TTDevasthanams కూడా వినియోగించవచ్చు.

Wednesday, 19 April 2023

గుండెగుభేల్కు స్టంట్ పేరిట మెడికల్ మాఫియా దోపిడి.. ప్రత్యామ్నాయాల వైపు చూద్ధాం రండి...

భారతదేశంలో గుండెపోటుమరణాలు   కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా  ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తుంచుకోండి.
 అమెరికాలోని చాలా పెద్ద కంపెనీలు భారతదేశంలోని హృద్రోగులకు వేలకోట్ల విలువైన మందులను విక్రయిస్తున్నాయి.
 కానీ మీకు ఏదైనా గుండె సంభందించి సమస్య ఉంటే, డాక్టర్ యాంజియోప్లాస్టీ చేయించుకోమని చెబుతారు.
 ఈ ఆపరేషన్‌లో, డాక్టర్ గుండె ట్యూబ్‌లో *స్టంట్* అని పిలువబడే స్ప్రింగ్‌ను చొప్పిస్తారు.
 ఈ స్టంట్ అమెరికాలో తయారు చేయబడుతుంది. మరియు దీని ఉత్పత్తి ధర కేవలం రూ.150-180.
 ఈ స్టంట్‌ను ఇండియాకు తీసుకొచ్చి 3నుంచి5 లక్షల రూపాయలకు విక్రయించి దోచుకుంటున్నారు.
 డాక్టర్లకు లక్షల రూపాయల కమీషన్ వస్తుంది. అందుకే యాంజియోప్లాస్టీ చేయించుకోమని పదే పదే అడుగుతారు.
 కొలెస్ట్రాల్, *బిపి* లేదా గుండెపోటుకు యాంజియోప్లాస్టీ ఆపరేషన్ ప్రధాన కారణం.
 ఇది ఎవరికీ ఎప్పుడూ విజయవంతం కాదు.
 ఎందుకంటే డాక్టర్ హార్ట్ ట్యూబ్ లో పెట్టే స్ప్రింగ్ బాల్ పాయింట్ పెన్ను స్ప్రింగ్ లాంటిది.
 అయితే కొన్ని నెలల్లోనే ఆ స్ప్రింగ్‌కి రెండు వైపులా  కొలెస్ట్రాల్ మరియు కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.
 దీని కారణంగానే రెండోసారి గుండెపోటు వస్తుంది.
 మళ్లీ యాంజియోప్లాస్టీ చేయించుకోవాలని డాక్టర్‌ చెపుతారు.
 లక్షల రూపాయలు దోచుకుని నీ ప్రాణం తీస్తారు.
 ●●●●●●●●●●●●●●●●
 ఆయుర్వేద చికిత్స
●●●●●●●●●●●●●●●●
 *అల్లం రసం -* 
 ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది.
 ఇది సహజ పద్ధతిలో నొప్పిని 90% తగ్గిస్తుంది.
 ●●●●●●●●●●●●●●●●
 *వెల్లుల్లి రసం* 
 ●●●●●●●●●●●●●●
 ఇందులో ఉండే *అల్లిసిన్* మూలకం కొలెస్ట్రాల్ మరియు బీపీని తగ్గిస్తుంది.
 దాంతో హార్ట్ బ్లాక్స్ ఓపెన్ అవుతాయి.
 ●●●●●●●●●●●●●●●●
 *నిమ్మరసం* 
 ●●●●●●●●●●●●●●●●
 ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం రక్తాన్ని శుభ్రపరుస్తాయి.
 ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
 ●●●●●●●●●●●●
 *ఆపిల్ సైడర్ వెనిగర్* 
 ●●●●●●●●●●●●●●●●
 ఇందులో 90 రకాల మూలకాలు ఉన్నాయి, ఇవి శరీరంలోని అన్ని నరాల *బ్లాక్సు* ను తెరుస్తాయి, కడుపుని శుభ్రపరుస్తాయి. మరియు అలసటను తొలగిస్తాయి.
 ●●●●●●●●●●●●●●●●ఈ దేశీయ ఔషధాలు
        ఇలా ఉపయోగించండి ●●●●●●●●●●●●●●●●
 1- ఒక కప్పు నిమ్మరసం తీసుకోండి;
 2- ఒక కప్పు అల్లం రసం తీసుకోండి;
 3- ఒక కప్పు వెల్లుల్లి రసం తీసుకోండి;
 4-ఒక కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి; ●●●●●●●●●●●●●●●●
 నాలుగింటినీ కలపండి. మరియు తక్కువ మంట మీద వేడి చేయండి, 3 కప్పులు మిగిలి ఉన్నప్పుడు, దానిని చల్లబరచండి;
 ఇప్పుడు మీరు
 దానికి 3 కప్పుల తేనె కలపండి.
 ●●●●●●●●●●●●●●●●
 ఈ ఔషధం 3 స్పూన్లు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి.
 అన్ని బ్లాక్సు open అయిపోతాయి.
 ●●●●●●●●●●●●●●●●
 ప్రతి ఒక్కరూ ఈ ఔషధంతో తమను తాము  రక్షించుకోండి.
 ●●●●●●●●●●●●●●●●
 గుండెపోటును ఎలా నివారించాలలి?          ●●●●●●●●●●●
 గుండెపోటు సమయంలో చాలా మంది ఒంటరిగా ఉంటారు కాబట్టి, వారికి ఎటువంటి సహాయం లేకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.
 గుండె పోటురాగానే మూర్ఛపోవడం ప్రారంభమవుతుంది. కేవలం 10 సెకన్లు మాత్రమే ఉంటాయి.
 అటువంటి స్థితిలో, బాధితుడు తీవ్రంగా దగ్గాలి. దగ్గు చాలా బలంగా ఉండాలి.
 ఛాతీలోంచి ఉమ్మి వచ్చేంతవరకు దగ్గాలి.
 సహాయం వచ్చే వరకు
  ప్రక్రియ పునరావృతం చేయాలి.
 తద్వారా హార్ట్ బీట్ సాధారణంగా ఉంటుంది
 ,.................................
గట్టిగా దగ్గడంవలన ఊపిరితిత్తులు శ్వాస
 ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది
బిగ్గరగా దగ్గడం వల్ల
 గుండె కుంచించుకుపోయి
 రక్త ప్రసరణ క్రమం తప్పకుండా
 నడుస్తుంది.
 ●●●●●●●●●●●●●●●●●
 ●●●●●●●●●●●●●●●●●●●●
         మీరు చాలా అభ్యర్థించబడ్డారు
   జోక్ ఫోటోలు పంపే బదులు
        ఈ సందేశాన్ని అందరికీ పంపండి
    ప్రాణాలను కాపాడటానికి
 ఒక స్నేహితుడు నాకు పంపాడు. 
ఇప్పుడు మీ వంతు
ప్రజా ప్రయోజనం కోసం ఫార్వర్డ్ చేయండి....✍️🙏🙏🙏గౌతమ్ కాశ్యప్, పూర్వం పాత్రికేయులు..సినీ రచయిత, టెక్నీషియన్ హైదరాబాద్.

Tuesday, 18 April 2023

ANNUAL VASANTHOTSAVAMS AT TIRUCHANOOR


TIRUPATI, 18 APRIL 2023: The annual Vasanthotsavams in Tiruchanoor Sri Padmavathi temple will be observed between May 4 and 6

Everyday this religious spring festival takes place between 2.30pm and 4:30pm in the Friday Gardens.

On May 2, Koil Alwar Tirumanjanam will be performed. TTD has cancelled Kalyanotsavam and Sahasra Deepalankara Seva in connection with this three-day annual fete from May 2-6.

On May 3, TTD has cancelled Astottara Sata Kalasabhishekam and on May 5, Lakshmi Puja

Friday, 14 April 2023

ఉత్తర భారత దేశంలోనూ వేద విశ్వవిద్యాలయం సేవలు - ఏప్రిల్ 28న వేద విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం టీటీడీ చైర్మన్ శ్రీవైవి సుబ్బారెడ్డి


తిరుమల : దేశంలో యూజిసి గుర్తింపు ఉన్న ఏకైక  వేద విశ్వవిద్యాలయమైన శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సేవలు ఉత్తర భారత దేశంలోనూ విస్తరించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ శ్రీవైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఏప్రిల్ 28వ తేదీ వేద విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం నిర్వహించాలని నిర్ణయించామన్నారు తిరుపతి శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం సాయంత్రం టీటీడీ చైర్మన్  శ్రీవైవి  సుబ్బారెడ్డి అధ్యక్షతన వేద విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, హిందూ ధర్మప్రచార పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు నిర్వహించారు. అనంతరం చైర్మన్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. రుషికేష్ లో వేద విశ్వవిద్యాలయం సేవలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
 ఇప్పటికే ఉన్న వేద పాఠశాలల్లో  విద్యార్థుల సంఖ్య పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. వేద వర్సిటీలో పురాణ ప్రవచనం, యోగ, ధ్యానం అంశాల్లో ప్రత్యేకంగా సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు చైర్మన్ వివరించారు.   కరోనా కారణంగా వర్శిటీలో నిలిపి వేసిన ఆదర్శ వేద  గురుకుల విద్యను పునః ప్రారంభించనున్నామన్నారు.  టీటీడీ ఉద్యోగుల లాగే వేదిక్ వర్సిటీ రెగ్యులర్ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ అమలు చేయనున్నట్లు చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో 40 మంది విద్యార్థులకు పిహెచ్ డి ప్రవేశాలు కల్పించడానికి అనుమతించినట్లు ఆయన తెలిపారు. వర్సిటీ స్నాతకోత్సవం సందర్బంగా ఇద్దరికి  మహా మహోపాధ్యాయ, ఇద్దరికి వాచస్పతి అవార్డులు ఇవ్వాలని కౌన్సిల్ సమావేశం నిర్ణయం తీసుకుందన్నారు.   ప్రతి పౌర్ణమి రోజు తెలుగురాష్ట్రాలోని 59 ముఖ్య ఆలయాల్లో శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని నిర్ణయించామన్నారు. అలాగే శ్రీనివాస వ్రతం ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు చైర్మన్ తెలిపారు.టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, జేఈవో శ్రీమతి సదా భార్గవి, టీటీడీ బోర్డు సభ్యులు  శ్రీ రాములు, శ్రీమతి మల్లేశ్వరి, వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివ మూర్తి, సివి ఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ ఆఫీసర్ శ్రీ రాజగోపాల్, డిఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి, డిపిపి కార్యదర్శి శ్రీ శ్రీనివాసులు, ఈసీ సభ్యులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.

TTD TO COMMENCE VEDIC UNIVERSITY SERVICES IN NORTHERN INDIA SOON- CHAIRMANSVVU SEVENTH CONVOCATION ON APRIL 28


TIRUPATI, 14 APRIL 20233: The TTD-run Sri Venkateswara Vedic University is the only varsity which has UGC recognition among Vedic universities in the entire country, and we need to extend our services in the Northern belt of India apart from Telugu and southern states, said TTD Trust Board Chairman Sri YV Subba Reddy.
Under his chairmanship the Executive Committee Meetings of SV Vedic University and HDPP were held at Sri Padmavathi Rest House in Tirupati on Friday evening.
Later briefing the media on the same, he said, the EC meeting has decided to conduct the Seventh Convocation of SVVU on April 28. He said TTD is contemplating to commence the services of Vedic Varsity in Rushikesh soon.  With an aim to enhance the strength of students in Vedic studies, TTD has decided to commence Purana Pravachanam, Yoga, Dhyanam and other occult sciences as certificate courses in the institution. 
The Adarsha Veda Gurukula Education resumed in the varsity which was closed during the Covid pandemic. Akin to TTD regular employees, the health scheme will be henceforth implied to the regular employees of Vedic Varsity also, he added. In an academic year, 40 Vedic students shall be given entry to do research. During the convocation, two exponents will be awarded Maha Mahopadhyaya and another two with Vachaspathi titles, he maintained.



In the HDPP EC meeting has decided to perform Sri Satyanarayana Swamy Vratam in 59 important and major temples located in AP and TS on every Pournami day in a month. Similarly, we also want to commence Srinivasa Vratam soon, he added.TTD EO Sri AV Dharma Reddy, board members Sri Ramulu, Smt Malleswari, Varsity Vice-Chancellor Prof.Rani Sadasiva Murty, JEO for Health and Education Smt Sada Bhargavi, CVSO Sri Narasimha Kishore, HDPP Secretary Sri Srinivasulu, All Projects Officer Sri Rajagopal, DEO Sri Bhaskar Reddy and others were present.

Tuesday, 11 April 2023

ఉచిత షూ కీపింగ్ కౌంటర్లను ప్రారంభించిన ఈ.ఓ.ధర్మారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానాలు...


తిరుమల, 11 ఏప్రిల్ 2023: తిరుమలలో భక్తుల కోసం అన్నప్రసాదం కాంప్లెక్స్ , ప్రధాన కళ్యాణ కట్ట కాంప్లెక్స్ వద్ద మంగళవారం సాయంత్రం టిటిడి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి రెండు ఉచిత షూ కీపింగ్ కౌంటర్లను ప్రారంభించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలకు వచ్చే యాత్రికులు ఆలయ పరిసరాల్లో చెప్పులు,షూ వంటివి ధరించరాదనే నిబంధనల మేరకు   చెప్పుల కౌంటర్లు తెరవడం జరిగిందన్నారు. తిరుమలలో పలుప్రాంతాల్లో గతంలో ఏర్పాటు చేసిన చెప్పుల స్టాండ్లను  భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు
భక్తుల పాదరక్షల కోసం టిటిడి పది ప్రాంతాల్లో షూ కీపింగ్ కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు వాటిలో రెండు ఈ రోజు ప్రారంభించామని తెలిపారు.
భక్తులు నంబర్ ఉన్న బ్యాగ్‌లను తీసుకొని పాదరక్షలను ఉంచి, సరిగ్గా కట్టి, అదే నంబర్ ఉన్న రాక్‌లో తిరిగి ఉంచాలి. భక్తుడికి ర్యాక్,  బ్యాగ్‌తో సమానమైన నంబర్‌తో టోకెన్ జారీ చేయబడుతుందని.  తిరిగి వచ్చిన తర్వాత, భక్తులు టోకెన్ ఇచ్చి పాదరక్షలు.బూట్లు తిరిగి తీసుకోవాలని. ఇక్కడ భక్తుల బాధ్యత ఎక్కువగా ఉంటుందని, శ్రీవారి సేవకుల ద్వారా టోకెన్లు జారీ చేస్తామని ఈఓ తెలిపారు.
ఎంటీవీఏసీలో 1187 ర్యాక్‌లతో షూ కీపింగ్ సెంటర్, మెయిన్ కేకేసీలో 4000 ర్యాక్‌లను భక్తుల కోసం ఏర్పాటు చేసినట్లు. త్వరలో పీఏసీ 1,2,3, నారాయణ గిరి క్యూలు, రాంభాగీచా, సుపాదం, ఏటీసీ సర్కిల్, వీక్యూసీలో షూ కీపింగ్ కేంద్రాలను కూడా ప్రారంభించనున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సీఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఈ2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, కల్యాణకట్ట, అన్నప్రసాదం డిప్యూటీ ఈవో శ్రీ సెల్వం, హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీదేవి, వీజీఓ శ్రీ బాలిరెడ్డి, క్యాటరింగ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ శ్రీ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

మొబైల్ అనుమతించకండి : కలెక్టర్ వి.పి.గౌతమ్ తనిఖీ చేయించుకుని పరీక్ష కేంద్రంలోకి కలెక్టర్


ఖమ్మం, ఏప్రిల్ 11: పదవ తరగతి పరీక్షల నిర్వహణ సరళిని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నగరంలోని మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శ్రీ వివేకానంద విద్యానికేతన్ లలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో కనీస మౌళిక సదుపాయాల కల్పన, ప్రహారీ గోడ భద్రత అంశాలను ఆయన పరిశీలించారు. వైద్య శిబిరాన్ని పరిశీలించి, వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు.  సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. చీఫ్ సూపరింటెండెంట్ తో సహా ఇన్విజిలేటర్లు, పరీక్షా నిర్వహణ విధులకు కేటాయించిన ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి, లోనికి అనుమతించాలని, సెల్ ఫోన్ ను అనుమతించకూడదని కలెక్టర్ భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ప్రహారి గోడ సరిగా లేనిచోట భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.  ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, అధికారులు తదితరులు ఉన్నారు.
-