Tuesday, 25 April 2023

తిరుమల వార్తలు... శ్రీవారిని దర్శించుకున్న ఆంధులు - అనాధాలు... శ్రీవారిఆలయంలోఘనంగాభాష్యకారులసాత్తుమొర

#శ్రీవారినిదర్శించున్నఅనాథలు
అంధులుదివ్యాంగులు......
శ్రీవారి దర్శనంతో వందలాది మంది అనాథలు, అంధులు, దివ్యాంగులు పులకించిపోయారు. చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శేఖర్ రెడ్డి చొరవతో రాజస్థాన్ యూత్ అసోసియేషన్, చెన్నై ఫుడ్ బ్యాంకు ఆధ్వర్యంలో 1008 మంది అనాథలు, అంధులు, దివ్యాంగులు మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో  లోకనాధం, విజివో శ్రీ బాలిరెడ్డి కలిసి వృద్ధులు, దివ్యాంగుల క్యూలైన్ ద్వారా వీరికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో 160 మంది అంధులు, 100 మంది దివ్యాంగులు, 108 మంది వృద్ధులు, 50 మంది మానసిక వికలాంగులు, ఆనాథలు కలిపి మొత్తం 1,008 మంది ఉన్నారు. వీరిలో ఐదేళ్ల  చిన్నారుల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది మొదటిసారి శ్రీవారిని దర్శించుకున్న వారే కావడం విశేషం. శ్రీవారి దర్శనంతో వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తమ మనోనేత్రంతో స్వామివారిని దర్శించుకున్నామని పలువురు అంధులు సంతోషం వ్యక్తం చేశారు. చక్కటి స్వామి వారి దర్శనం కల్పించినందుకు వీరు నిర్వాహకులకు, టీటీడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. దర్శనానంతరం తరిగొండ వెంగమాంబ కాంప్లెక్స్ లో అన్నప్రసాదాలు స్వీకరించారు.


#శ్రీవారిఆలయంలోఘనంగాభాష్యకారులసాత్తుమొర

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం భాష్యకార్ల సాత్తుమొర ఘనంగా జరిగింది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.ఈ సందర్భంగా ఉదయం శ్రీ భాష్యకార్ల వారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత నడకదారిలోని శ్రీ భాష్యకార్ల సన్నిధిలో ప్రత్యేక పూజలు చేపట్టారు.సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీభాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంత‌రం ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణగా విచ్చేసి భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహించారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు జ‌రిగింది.

No comments:

Post a Comment