Tuesday, 11 April 2023

ఉచిత షూ కీపింగ్ కౌంటర్లను ప్రారంభించిన ఈ.ఓ.ధర్మారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానాలు...


తిరుమల, 11 ఏప్రిల్ 2023: తిరుమలలో భక్తుల కోసం అన్నప్రసాదం కాంప్లెక్స్ , ప్రధాన కళ్యాణ కట్ట కాంప్లెక్స్ వద్ద మంగళవారం సాయంత్రం టిటిడి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి రెండు ఉచిత షూ కీపింగ్ కౌంటర్లను ప్రారంభించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలకు వచ్చే యాత్రికులు ఆలయ పరిసరాల్లో చెప్పులు,షూ వంటివి ధరించరాదనే నిబంధనల మేరకు   చెప్పుల కౌంటర్లు తెరవడం జరిగిందన్నారు. తిరుమలలో పలుప్రాంతాల్లో గతంలో ఏర్పాటు చేసిన చెప్పుల స్టాండ్లను  భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు
భక్తుల పాదరక్షల కోసం టిటిడి పది ప్రాంతాల్లో షూ కీపింగ్ కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు వాటిలో రెండు ఈ రోజు ప్రారంభించామని తెలిపారు.
భక్తులు నంబర్ ఉన్న బ్యాగ్‌లను తీసుకొని పాదరక్షలను ఉంచి, సరిగ్గా కట్టి, అదే నంబర్ ఉన్న రాక్‌లో తిరిగి ఉంచాలి. భక్తుడికి ర్యాక్,  బ్యాగ్‌తో సమానమైన నంబర్‌తో టోకెన్ జారీ చేయబడుతుందని.  తిరిగి వచ్చిన తర్వాత, భక్తులు టోకెన్ ఇచ్చి పాదరక్షలు.బూట్లు తిరిగి తీసుకోవాలని. ఇక్కడ భక్తుల బాధ్యత ఎక్కువగా ఉంటుందని, శ్రీవారి సేవకుల ద్వారా టోకెన్లు జారీ చేస్తామని ఈఓ తెలిపారు.
ఎంటీవీఏసీలో 1187 ర్యాక్‌లతో షూ కీపింగ్ సెంటర్, మెయిన్ కేకేసీలో 4000 ర్యాక్‌లను భక్తుల కోసం ఏర్పాటు చేసినట్లు. త్వరలో పీఏసీ 1,2,3, నారాయణ గిరి క్యూలు, రాంభాగీచా, సుపాదం, ఏటీసీ సర్కిల్, వీక్యూసీలో షూ కీపింగ్ కేంద్రాలను కూడా ప్రారంభించనున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సీఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఈ2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, కల్యాణకట్ట, అన్నప్రసాదం డిప్యూటీ ఈవో శ్రీ సెల్వం, హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీదేవి, వీజీఓ శ్రీ బాలిరెడ్డి, క్యాటరింగ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ శ్రీ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment