*NTA-NEET (UG) పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు*
*పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు, పరిసరాలలో పోలీస్ పెట్రోలింగ్*
*పోలీస్ కమిషనర్ సునీల్ దత్*
ఖమ్మం : నేడు (ఆదివారం) ఖమ్మం కమిషనరేట్ పరిధిలో నిర్వహించే NTA- NEET (UG) -2025 పరీక్షల సందర్భంగా అయా పరీక్ష కేంద్రాల వద్ద మధ్యాహ్నం 12.00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. అదేవిధంగా ఏలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, దర్నలు, ప్రచారాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు ముసివేయాలని సూచించారు. పరిక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు తో పాటు ట్రాఫిక్ ఆంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పకడ్బంది చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో పోలీస్ పెట్రోలింగ్ పార్టీలను నియమించినట్లు తెలిపారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు నిఘాను నియమించి సమాచారం సేకరించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలున తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
*NTA-NEET (UG) పరీక్ష కేంద్రాలు*
1) SR & BGNR డిగ్రీ కళాశాల, NTR సర్కిల్, ఇల్లందు రోడ్డు, ఖమ్మం.
2 ) ప్రభుత్వం హై స్కూల్, శాంతి నగర్, చర్చి కంపౌండ్, మిషన్ హాస్పిటల్ సమీపంలో, ఖమ్మం.
3) ప్రభుత్వ హై స్కూల్, ఎన్ఎస్సి కాలనీ, ఎన్ఎస్టి రోడ్, నిర్మల్ హృదయ్ స్కూల్ సమీపంలో, ఖమ్మం.
4) ప్రభుత్వం మహిళ డిగ్రీ కాలేజ్, రాధాకృష్ణ బ్లాక్, రైల్వే స్టేషన్, ఖమ్మం.
5) యూనివర్శిటీ పిజి కాలేజ్ ఫర్ ఉమెన్, ఎన్‌టిఆర్ సర్కిల్, ఇల్లందు రోడ్డు, ఖమ్మం.
6) కేంద్రీయ విద్యాలయం, కరుణగిరి సమీపంలో, పోలేపల్లి, ఖమ్మం రూరల్.
No comments:
Post a Comment