హైదరాబాద్: హబ్సిగూడలో డెంటల్ డాక్టర్ సైబర్ మోసగాళ్ల చేతుల్లో రూ.14 కోట్లు రూపాయలు కోల్పోయారు.. ఫేస్‌బుక్‌లో మౌనిక పేరుతో మెసేంజర్‌కి రియాక్ట్ అయిన డాక్టర్.. తాను కష్టాల్లో ఉన్నానని ఆదుకోవాలని రిక్వెస్ట్ పెట్టిన మౌనిక..
మాయమాటలతో డాక్టర్ నుంచి రూ.14 కోట్లు కొట్టేసిన మౌనిక.. క్రిప్టో కరెన్సీ పేరుతో ట్రేడింగ్ అకౌంట్ ఓపన్ చేయించి..
లావాదేవీలు నిర్వహించి లాభాలు చూపెట్టిన మౌనిక..
డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్ చెల్లించాలని నమ్మించి మోసం చేసినట్లు డాక్టర్ ఆవేదన.
***********************************************
*ఇంటర్ స్టేట్ ట్రేడింగ్ ఫ్రాడ్ సిండికేట్ బస్ట్మ్యూల్ అకౌంట్ & సిమ్ సప్లై రాకెట్‌లో గుట్టురట్టు....* *ఆరుగురు నిందితుల అరెస్ట్...*
మెట్రో న్యూస్ క్రైమ్ ప్రతినిధి, సైబరాబాద్:
సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు, బహిరంగంగా ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్‌లకు సహకరిస్తున్న, బ్యాంక్ అకౌంట్లు, చెక్ బుక్స్ మరియు సిమ్ కార్డులు సరఫరా చేసే ఒక వ్యవస్థీకృత సైబర్ మోసగాళ్ల నెట్‌వర్క్‌లో భాగమైన ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ నెట్‌వర్క్ పలు రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహించారు.
ఈ కేసు భారతీయ న్యాయ సంహిత (BNS) Sections 318(4), 319(2), 336(3), 338, 340(2) r/w Section 3(5) అలాగే ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్ 66-D కింద రిజిస్టర్ చేయబడింది.మోడస్ ఆపరెండీ (నేర పద్ధతి)అప్పగించబడిన బ్యాంక్ అకౌంట్లు, సిమ్ కార్డులను నేరస్థులు ఫేక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లను నడపడానికి ఉపయోగించారు. బాధితులకు నకిలీ లాభాల స్క్రీన్‌షాట్లు, డ్యాష్‌బోర్డ్‌లు చూపించి, భారీ మొత్తాలు మ్యూల్ అకౌంట్లలో జమ చేయించారు. ఈ అకౌంట్ల ద్వారా భారీ మొత్తాల మనీ ట్రాఫికింగ్ జరిపి, కమీషన్ ద్వారా లాభాలు పొందారు.
అరెస్ట్ అయిన వ్యక్తులు..వెనిగల్ల శ్రీనివాసరావు, 52 ఏళ్లు, NTR జిల్లా, చిట్ట గణేష్, 45 ఏళ్లు, పశ్చిమ గోదావరి జిల్లా, గండ్లూరు నవీన్ కుమార్ రెడ్డి, 33 ఏళ్లు, అనంతపురం జిల్లా, సత్తూరి రాజేష్, 41 ఏళ్లు, మెడ్చల్ జిల్లా మడ్డిరల్ల సుధీర్, 50 ఏళ్లు, కృష్ణా జిల్లా
మొహమ్మద్ అష్రఫ్, 39 ఏళ్లు, హైదరాబాద్
వివరాలు
వెనిగల్ల శ్రీనివాసరావు, చిట్ట గణేష్ – బ్యాంక్ అకౌంట్లు మరియు సిమ్ కార్డులు సేకరించేవారు.
గండ్లూరు నవీన్ కుమార్ రెడ్డి – అకౌంట్ హోల్డర్లను గుర్తించి, డాక్యుమెంటేషన్ నిర్వహించేవారు.
సీజ్ చేసిన మొబైల్ ఫోన్ల ఫోరెన్సిక్ విశ్లేషణలో 60 చెక్ లీఫ్ ఇమేజ్‌లు, దేశవ్యాప్తంగా 400 సైబర్ ఫ్రాడ్ కేసులకు సంబంధించిన వివరాలు బయటపడ్డాయి.
బాధితుల ఆర్థిక నష్టం: ₹1,09,50,000/-
సీజ్ చేసిన వస్తువులు..
7 మొబైల్ ఫోన్లు
3 చెక్ బుక్స్
11 సిమ్ కార్డులు
దర్యాప్తు స్థితి..
అరెస్ట్ చేసిన ఆరుగురిని పోలీస్ కస్టడీకి తీసుకుని, కేసు తదుపరి దర్యాప్తు సాగుతోంది. ఇంకా పరారీలో ఉన్న నిందితులను పట్టుకునే పనులు కొనసాగుతున్నాయి.
కేసును ఇన్‌స్పెక్టర్ జి. విజయ్ కుమార్,ఇన్‌స్పెక్టర్లు దుర్గ, డి. పళవెల్లి, సందీప్,సీసీపీ ఎస్ సిబ్బంది..
ఏసీపీ (సైబర్ క్రైమ్స్) ఎ. రవీంద్ర రెడ్డి డి.ఎస్.పి పర్యవేక్షణలో,
డి.సి.పి (సైబర్ క్రైమ్స్) వై.వి.ఎస్. సుదీందర్ పర్యవేక్షణలో చేస్తున్నారు..
********************************************** *ట్రాఫిక్ చలానాలపై హైకోర్టు సీరియస్.. ఆ హక్కు మీకు లేదంటూ..*
**********************************************
తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఈ-చలాన్లు విధించే విధానంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చలాన్ల అమలులో పారదర్శకత లేదంటూ వి.రాఘవేంద్ర చారి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఈ అంశంపై పూర్తి వివరణ ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.పిటిషనర్ రాఘవేంద్ర చారి, ట్రాఫిక్ పోలీసుల అమలు పద్ధతుల చట్టబద్ధతను ప్రశ్నించారు. ఈ పిటిషన్‌లో ఆయన ప్రధానంగా లేవనెత్తిన అంశాలు ఇలా ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు తమకు కేటాయించిన అధికారిక పరికరాలకు బదులుగా.. సొంత మొబైల్ ఫోన్లతో వాహనాల ఫోటోలు తీసి చలాన్లు జారీ చేస్తున్నారు. తనపై కూడా ఇలాగే మూడు చలాన్లు విధించారని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు. వ్యక్తిగత మొబైల్ ఫోన్లు లేదా ధృవీకరించబడని పరికరాల ద్వారా తీసిన ఫోటోలు చట్టపరమైన సాక్ష్యంగా చెల్లవని, ప్రభుత్వం ఆమోదించిన నిఘా కెమెరాల ద్వారా మాత్రమే ట్రాఫిక్ ఉల్లంఘనలను రికార్డు చేయాలని పిటిషనర్ వాదించారు.చట్టబద్ధత లేని పద్ధతిలో చలాన్లు వేయడం వల్ల వాహనదారుల హక్కులు దెబ్బతింటాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ట్రాఫిక్ పోలీసు సిబ్బంది చట్టవిరుద్ధంగా జరిమానా మొత్తాలను నిర్ణయించడం.. న్యాయ పర్యవేక్షణ లేకుండా డబ్బు వసూలు చేయడంపై కూడా పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. శిక్షను నిర్ణయించే అధికారం కేవలం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు మాత్రమే ఉంటుందని.. క్షేత్రస్థాయిలోని కానిస్టేబుళ్లు లేదా ఇన్‌స్పెక్టర్లకు ఆ హక్కు ఉండదని పిటిషనర్ స్పష్టం చేశారు. ఈ రిట్ పిటిషన్ 2011 నాటి ప్రభుత్వ ఉత్తర్వు (జీవో) నెం. 108ని కూడా సవాలు చేసింది. ఈ జీవో పోలీసులకు వాహనాలను ఆపి, కాంపౌండ్ జరిమానాలు అక్కడికక్కడే వసూలు చేయడానికి అధికారం ఇస్తుంది.
అయితే ఈ జీవో 108 చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం , ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేది అని పిటిషనర్ ఆరోపించారు. ఇది న్యాయవ్యవస్థకు ఉన్న అధికారాలను పోలీసులు వినియోగించుకోవడానికి అవకాశం ఇస్తుందని ఆయన ఆరోపించారు. పిటిషనర్ తరపు న్యాయవాది విజయ్ గోపాల్, పోలీసులు దశాబ్దాలుగా చట్టాలను ఉల్లంఘిస్తూ డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. హోం శాఖ తరపున ఏజీపీ లక్ష్మీకాంత్ హాజరుకాగా.. జస్టిస్ మాధవి దేవి ప్రాథమిక వాదనలు విన్న తర్వాత.. చలాన్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానంపై పూర్తి నివేదిక దాఖలు చేయడానికి రాష్ట్ర హోం శాఖకు నాలుగు వారాల సమయం ఇచ్చారు.ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం జరిగిన విచారణలోనూ హైకోర్టు ట్రాఫిక్ అమలు తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలాన్లు విధించిన తర్వాత.. వాటిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాయితీలు ప్రకటించడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాయితీలు ఇవ్వడం వలన చట్టపరమైన పరిణామాలపై ప్రజల్లోని భయం బలహీనపడి, మరింత ట్రాఫిక్ క్రమశిక్షణ రాహిత్యాన్ని పెంచుతుందని హైకోర్టు పేర్కొంది.
***********************************************
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ చైతన్య స్కూల్ నిజాంపేట్ రోడ్డు బ్రాంచ్ వారు నిర్వహించిన "ఫిట్ ఇండియా మూవ్మెంట్" 2K రన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, స్కూల్ ఆవరణలో జ్యోతి ప్రజ్వలన చేసి, కిందికుంట పార్క్ వరకు జరిగిన 2K రన్ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ, స్కూల్ విద్యార్థుల కోసం నిర్వహించే 2K రన్ శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించే మంచి కార్యక్రమం. ఈ కార్యక్ర లో లోమం ద్వారా విద్యార్థులు వ్యాయామానికి అలవాటు పడతారు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడానికి ప్రేరణ పొందుతారు. అలాగే, క్రమం, క్రమశిక్షణ, జట్టుగా పనిచేయడం వంటి విలువలు నేర్చుకుంటారు. పాఠశాలలు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా పిల్లల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించి, శారీరక–మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, అలానే ఇలాంటి మంచి కార్యక్రమం పాఠశాలల్లో పిల్లల్లు తల్లిదండ్రుల సమక్షంలో చేసిన శ్రీ చైతన్య స్కూల్ సిబ్బంది వారిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైతన్య స్కూల్ AGM శివరామకృష్ణ, RI పద్మజా, RI శ్రీనివాస రెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ మురళి కృష్ణ, ప్రిన్సిపల్ సిందూష, డీన్ సునీల్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------
*తిరుమలలో రికార్డు స్థాయిలో నమోదు*
------------------------------------------------------------------
వైకుంఠ ద్వార దర్శనం – eDIP
eDIP వ్యవస్థలో ఇప్పటివరకు 6 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. మొత్తం 15.50 లక్షల సభ్యులు (1+3) చేరుకున్నారు.
TTD ఈ ఐదు రోజుల వ్యవధిలో 60–70 లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
1.76 లక్షల స్లోటెడ్ టోకెన్లు మూడు రోజుల పాటు ఎంపికైన భక్తులకు జారీ చేయబడతాయి.
ప్లాట్‌ఫారమ్ వారీగా రిజిస్ట్రేషన్లు 📱💻
👉 మొబైల్ యాప్: 3.40 లక్షల రిజిస్ట్రేషన్లు (8.51 లక్షల సభ్యులు)
👉 వెబ్‌సైట్: 2.21 లక్షల రిజిస్ట్రేషన్లు (5.75 లక్షల సభ్యులు)
👉 వాట్సాప్: 39 వేల రిజిస్ట్రేషన్లు (98 వేల సభ్యులు)
e-DIP రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.
------------------------------------------------------------------
*24 గంటల పాటు త్రాగునీటి సరఫరాకు చర్యలు.... రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు*
**220 కోట్లతో త్రాగునీటి పనులు*
**నగరాన్ని ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి*
**ఖమ్మం నగరం 35వ డివిజన్ లో పర్యటించి 50.25 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల*
------------------------------------------------------------------
ఖమ్మం :ఖమ్మం నగరంలో 24 గంటల పాటు త్రాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.మంత్రివర్యులు, శనివారం ఖమ్మం నగరం 35వ డివిజన్ లో పర్యటించి 50.25 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా *మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ* నగరంలో చేపట్టే అభివృద్ధి పనులు నాలుగు కాలాల పాటు స్థిరంగా ఉండే విధంగా పూర్తి చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు.కార్పొరేటర్లు, ప్రజలు మున్సిపల్ కమీషనర్ కు సహకరిస్తూ పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా ఉండేలా చూడాలని అన్నారు. అమృత్ పథకం క్రింద ఖమ్మం మున్సిపాలిటీకి 220 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, అధికారులు, ప్రజా ప్రతినిధులు కూర్చొని చేపట్టాల్సిన పనుల యొక్క డిపిఆర్ తయారు చేయాలని అన్నారు. డిసెంబర్ నెలలో అమృత్ పనులకు టెండర్ పిలిచి రాబోయే వేసవి కాలం నాటికి పనులు పూర్తి చేయాలని, నగర వ్యాప్తంగా 24 గంటల పాటు త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో డ్రైయిన్ నిర్మాణం కోసం మరో 200 కోట్ల పనులు జరుగుతున్నాయని అన్నారు. ఖమ్మం ఖిల్లాకు రోప్ వే సౌకర్యం కల్పించి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని, లకారం ప్రక్కన శిల్పారామం నిర్మిస్తున్నామని, వెలుగు మట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి చర్యలు చేపట్టామని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------------------------------------------------------
*భక్త రామదాసు కళాక్షేత్రాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి ... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*
*భక్త రామదాసు కళా క్షేత్రాన్ని సందర్శించి, చేపట్టవలసిన ఆధునీకరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్*
ఖమ్మం : ఖమ్మం నగరంలో సాంస్కృతిక ప్రదర్శనలకు వేదికగా ఉన్న భక్త రామదాసు కళాక్షేత్రం ఆధునీకరణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
శనివారం భక్త రామదాసు కళాక్షేత్రాన్ని మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించారు. కళాక్షేత్రం మొత్తం కలియతిరుగుతూ చేయవలసిన పనులను పరిశీలించారు. కళా క్షేత్రంలో చేపట్టవలసిన ఆధునీకరణ పనులపై టాప్ ప్రూఫ్ లీకేజీ, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్, పార్కింగ్, కలర్ వాష్, పరిసరాలలో పచ్చదనం కోసం మొక్కల పెంపు, నిర్వాహణ, మరమ్మత్తు పనులపై అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* కళలకు, కళాకారులకు పుట్టినిల్లయిన ఖమ్మం జిల్లాలో ఉన్న భక్త రామదాసు కళాక్షేత్రాన్ని ఆధునీకరించి, మౌళిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. భక్తరామదాసు కళాక్షేత్రం ఆకర్షణీయంగా తయారు చేయడం, సౌండ్, ఆడియో వ్యవస్థను మెరుగు పర్చడం, పూర్తి స్థాయిలో లైటింగ్ ఏర్పాటుకు చర్యలు, గోడలకు సంప్రదాయక వాల్ పెయిటింగ్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, టాప్ ప్రూఫ్ వాటర్ లీకేజీ, కళాక్షేత్రం బయట పరిసరాల్లో గ్రీనరికి చర్యలు, పూర్తి స్థాయి మరమ్మత్తు పనులకు ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఇంటీరియర్ మరింత ఆకర్షణీయంగా తయారు చేయడం, కళాక్షేత్రంలో ఏసి ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, వెనుక ఉన్న ప్రేక్షకులకు డయాస్ స్పష్టంగా కనిపించేలా రూపొందిచాలని అన్నారు. కళాక్షేత్రం సౌండ్ ప్రూఫ్, లోపల ఆడియో మైక్ వ్యవస్థ పక్కాగా ఉండేలా చూడాలని తెలిపారు. ముందు సీట్లలో కూర్చునే ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా స్టేజీ ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ అన్నారు.ఇంజనీరింగ్ అధికారులు తయారుచేసిన మోడల్ డిజైన్ మ్యాప్ లు, ఆర్కిటెక్చర్ రూపొందించి నమూనా వీడియోను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంట జెడ్పి సీఈఓ దీక్షా రైనా, పంచాయతీరాజ్ ఇఇ మహేష్ బాబు, మున్సిపల్ డిప్యూటీ కమీషనర్ శ్రీనివాస్, అసిస్టెంట్ కమీషనర్ అనిల్, ఖమ్మం అర్బన్ తహసీల్దారు సైదులు, మునిసిపల్ డిఇ ధరణి కుమార్, ట్లౌన్ ఫ్లానింగ్ అధికారి సంతోష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------------
*కటుదిట్టమైన ఏర్పాట్లతో గ్రామ పంచాయతీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ... సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు*
ఎన్నికల విధులు కట్టుదిట్టంగా నిర్వహించండి :
ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ
ఖమ్మం : ఎన్నికల నిబంధనల ప్రకారం అప్రమత్తంగా ఉంటూ విధులు కట్టుదిట్టంగా నిర్వహించాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు అన్నారు.
శుక్రవారం రఘునాథపాలెం మండలంలో మొదటి విడత గ్రామ పంచాయతి ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి ఎన్నికల సాధారణ పరిశీలకులు పరిశీలించారు. చిమ్మపూడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కోటపాడు, చిమ్మపూడి, కోయచెలక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రేగులచెలక, కోయచెలక, శివాయిగూడెం గ్రామాల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు. అభ్యర్ధులు దాఖలు చేసిన నామినేషన్ ప్రతాలను పరిశీలించారు. ఎన్నికల విధులు, బాధ్యతల పట్ల సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా *సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు మాట్లాడుతూ* ఎన్నికల నిర్వహణలో నామినేషన్లు చాలా ముఖ్యమైన ఘట్టమని, నామినేషన్ పత్రాలలో ప్రతి అంశం సరిగా ఉన్నాయో, లేవో జాగ్రత్తగా నిబంధనల ప్రకారం చూడాలని తెలిపారు. *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ కు విధిగా కొత్త బ్యాంక్ ఖాతా తీసుకునే విధంగా వారికి తెలియజేయాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ఒరిజినల్ పత్రాలను సంబంధిత గ్రామ పంచాయతీలలోని ఆర్వో ల వద్ద పొందవచ్చని తెలిపారు. వార్డు సభ్యుడు పోటీ కోసం అదే వార్డు సభ్యుడు ప్రపోజర్ గా ఉండాలని అన్నారు. సర్పంచ్ గా పోటీచేసే అభ్యర్థి డిపాజిట్ క్రింద కేటగిరి వారిగా చెల్లించాలని, ఏమైనా అప్పీల్ ఉంటే ఆర్డీవోను సంప్రదించాలని సూచించారు.నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులకు సంబంధించిన కర పత్రాలు, గోడపత్రాలు, ప్రచార వాహనాల అనుమతులను తీసుకోవాలంటే సంబంధిత మండల అధికారులను సంప్రదించాలని తెలిపారు. గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థి, వార్డు సభ్యుల నామినేషన్ దాఖలును రోజు వారిగా ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. అభ్యర్థుల యొక్క అన్ని వివరాలు నామినేషన్ పత్రాలలో పూర్తిగా నమోదు చేసేందుకు అవగాహకు హెల్ప్ డెన్స్ లో నివృత్తి చేసుకోవచ్చని, ప్రతి చిన్న అంశాన్ని, అనుమానాలకు తావులేకుండా పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించుటకు అధికారులు సమన్వయంతో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.సాధారణ ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్ వెంట రఘునాథపాలెం మండల తహసీల్దారు శ్వేత, లింగనాయక్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------------
Another Indian Air Force IL-76 aircraft lands in Colombo with:
➡️9 Tons Relief Material
➡️2 Urban Search & Rescue Teams comprising 80 National Disaster Response Force Personnel
A total of around 27 tons of relief material delivered by air and sea. More is on the way!