Tuesday, 23 June 2020

ధీటుగా సుదర్శన పట్నాయక్ సైకత రధాలు

ఒరిస్సా/పూరీ :కరోనా కట్టను దాటి పూరిలో జగన్నాధ రధచక్రలు ముందుకు సాగాయి
1500 వందలమంది రధ నావికులు..కొద్దిమంది సిబ్బందితో శోభయమనంగా జగన్నాధ బలబద్రుల రధాలు గుండిచా మందిరంవైపు సాగాయి..
మరోవైపు సైకత శిల్పా చార్యుడు సుదర్శన పట్నాయక్ రధయాత్ర సందర్భంగా పూరీలోని రధాలను పోలిన సైకత రధాలను పూరి సముద్ర తీరంలో సుందరంగా తీర్చి దిద్దాడు.
.ఇవి చూపరులను ఇట్టే కట్టి పడేస్తున్నాయి...ఈ సందర్భంగా కరోనా విలయం తగ్గి ప్రపంచంలో శాంతి.. ఆరోగ్యయం చేేకూరాలని పట్నాయక్ ఆకాంక్ష వ్యక్తం చేశారు.

Sunday, 21 June 2020

సర్వేజన సుఖీనోభవంతు అంటూ శ్రీవారిపుష్కరిణిలో గ్రహణ కాల జపయజ్ఞం

తిరుమల కొండలు గోవింద నామ జపంతో మారుమ్రేగింది..
నారాయణ మంత్రంతో పరిభ్రమించింది. జూన్ 21న ఆదివారం (ర‌వివారం) కేతుగ్రస్త సూర్య గ్ర‌హ‌ణం వేళ ప్రపంచం సుభిక్షంగా వుండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు అంటూ రుత్వీక్కులు జపయాజ్ఞాన్ని నిర్వహించారు.శ్రీవారి పుష్కరిణిలో జరిగిన కార్యక్రమంలో టిటిడి ఈ.ఓ.సింఘాల్.. టిటిడి సిబ్బంది పాల్గొనగా తిరుమల వేద పండితులు వేద పాఠశాలల విధ్యార్థులు నారాయణ నామలను ఉచ్ఛయరిస్తూ జప యజ్ఞం చేశారు.  ఈ గ్ర‌హ‌ణాన్ని ''చూడామ‌ణి - సూర్య గ్రహణం'' అంటారు. ఈ గ్ర‌హ‌ణ స‌మ‌యం ఉదయం 10.18 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 1.38 గంట‌ల మ‌ధ్య ప్ర‌పంచ శాంతి, సృష్ఠిలోని స‌క‌‌ల జీవ‌రాశులు ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని కోరుతూ తిరుమ‌ల శ్రీ‌వారి పుష్క‌రిణిలో టిటిడి జ‌ప‌య‌జ్ఞం నిర్వ‌హించింది. ఈ జప యజ్ఞంలో   శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యర్స్వామి,  ధర్మకర్తల మండలి సభ్యులు  కృష్ణమూర్తి వైధ్యనాథన్,  ఈవో   అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో  ఏ.వి.ధర్మారెడ్డి, జెఈవో  పి.బసంత్కుమార్,  శ్రీవారి ఆలయ అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. 

Friday, 19 June 2020

డిజిపి గౌతమ్ సవాంగ్ ను కలసిన నూతన ఐ.పి.ఎస్ లు...మాస్కులు - సోషల్ డిస్టేన్సు లేకపోవడంతో నెటిజన్ల విమర్శలు..

*డీజీపీ కార్యాలయం*
*తేది: 19.06.2020*
..........ప్రచురుణార్ధం.......

2018 బ్యాచ్ కి చెందిన 12 మంది యువ ఐఏఎస్ అధికారుల బృందం శిక్షణ పూర్తి చేసుకుని విధులలో చేరుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపిఎస్ గారితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ లో  గ్రామ స్థాయి మహిళా సంరక్షణ పోలీస్ (MSP) మొదలుకొని ఉన్నతస్థాయి అధికారి వరకు ఏ రకంగా పోలీసు వ్య్వస్థ పనిచేస్తుంది, పోలీస్ ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్ళు, రాష్ట్రంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైన అన్ని  శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని, ప్రజాస్వామ్య భారతదేశంలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం సమానంగా ఉంటుందని వాటిని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకొని వెళ్తూ, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే పరిస్థితులు,  వాటిని ఏ రకంగా ఎదుర్కొనాలి అనే దానిపై గౌతమ్ సవాంగ్ IPS,  యువ IAS అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 
అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో మహిళలకు బరోసా కల్పించేందుకు, వారి రక్షణ కోసం ప్రవేశపెట్టిన దిశ చట్టం విధివిధానాలు, భారత దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులకు అమలుచేస్తున్న వీక్లీ ఆఫ్ విధానం, రాష్ట్రంలో అక్రమ ఇసుక రవాణా, మద్యాన్ని పూర్తిగా నివారించేందుకు ఏర్పాటుచేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పనితీరును యువ ఐఏఎస్ అధికారుల వారికి వివరించారు.
ఈ సందర్భంగా పలువురు ఐఏఎస్ అధికారులు తమకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ యువ  అధికారుల పైన  ప్రజలకు ఎక్కువ అంచనాలు ఉంటాయి అని, ప్రశ్నించే మనస్తత్వంతో వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఎప్పటికప్పుడు బాధ్యతలను గుర్తు చేసుకుంటూ ప్రధానంగా అట్టడుగు, బడుగు బలహీనవర్గాలకు  కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఎల్లవేళలా వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ముందుకు సాగాలని, ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన  ఈ అవకాశాన్ని బాధ్యతగా స్వీకరించి ప్రజల కోసం ప్రభుత్వాలు  చేపట్టే పథకాలు ప్రతిఒక్కరికీ చేరేవిధంగా సేవ భావంతో ముందుకు సాగాలని, ఐఏఎస్ అధికారుల బృందంలో మహిళలు 50% శాతం ఉండటం అభినందనీయమన్నారు. 
ఈ కార్యక్రమములొ  Addl.DG.
L&O శ్రీ రవిశంకర్ అయ్యన్నార్ ఐపిఎస్, డి‌.ఐ.జి L & O  శ్రీ రాజశేఖర్ బాబు ఐపిఎస్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గుడిగంటలు...స్వామి నామమే భక్తుల చేవిలో మారుమ్రోగాలి.. నో హరన్ జోన్ గా తిరుమల...

పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఓంకారం, గుడిగంటలు తప్ప రణ- గొణ ధ్వనులకు అవకాశం లేకుండా చూడాలి.
తిరుమల నో- హారన్ జోన్ గా పరిధి చెందాలి, అందుకు అందరి సహకారం కావాలి
తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి ఎ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్...
ఈ రోజు తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి  ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్  పవిత్రమైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి నామస్మరణం వినబడాలనే ఉద్దేశ్యంతో శ్రీవారి భక్తులు ఆ దేవదేవుడిపై లీనమై ఉంటారు. కావున వాహనాల యొక్క రణ-గణ ధ్వనులకు ఆస్కారం లేదు. తిరుమల క్షేత్రం మొత్తం నో-హారన్ జోన్ గా ప్రకటన చేశారు.
      ఈ సందర్భంగా జిల్లా యస్.పి గారు మాట్లాడుతూ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఓంకారం, గుడిగంటల మోతలు తప్ప రణ-గణ ధ్వనులకు అవకాశం లేకుండా చూడాలన్నారు. శ్రీవారి ఆకాంక్షతో కలియుగ వైకుంఠం తిరుమలను నో-హారన్ జోన్ గా చేయాలని ప్రయత్నిస్తున్నామన్నారు. తిరుమల ప్రాధాన్యత, పవిత్రత, కలియుగాన ఈ క్షేత్రానికి ఉన్న ఎనలేని విశిష్ట దృష్ట్యా ఈ ప్రాంతం మొత్తం నో-హారన్ జోన్ కావల్సిన ఆవశ్యకత ఉందని, అయితే ఇది అపరాదంతోనో, కఠినమైన నిబంధనలతోనో‌ కాకుండా అవగాహనతో మార్చాలి. "నో-హారన్ జోన్ విత్ నో ఫైన్స్ " ను సాకారం చేయాలని, భక్తులు, ఉద్యోగులు, స్థానికులు, వాహనదారులు ఇందుకు సహకరించాలని, ప్రపంచంలో ఎన్నో చోట్ల తిరిగోచ్చినా ఈ అనుభూతి ఎక్కడా లేదు, ఉండదు కూడా ఈ ప్రశాంత వాతావరణం మరెక్కడా కనబడదు. అందుకే ప్రశాంతతకు మారుపేరైన కలియుగ తిరుమల గిరుల్లో రణ-గణ ధ్వనులు శబ్దకాలుష్యాన్ని తెచ్చి పెట్టి భక్తిపారవశ్యానికి విఘాతం కలిగిస్తాయని నా అభిప్రాయం. అందుకు అందరు సహకారము అందిస్తే ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయవచ్చునని ఈ సందర్భంగా జిల్లా యస్.పి గారు తెలిపారు. అనంతరం వాహన దారులకు శబ్ద కాలుష్యంపై అవగాహన కల్పించారు.   
          ఈ సందర్భంగా అడ్మిన్ అడిషనల్ యస్.పి శ్రీమతి సుప్రజ మేడం గారు, తిరుమల అడిషనల్ యస్.పి శ్రీ మునిరామయ్య గారు, యస్.బి డి.యస్.పి గంగయ్య, తిరుమల డి.యస్.పి ప్రభాకర్ రావు, తిరుమల ట్రాఫిక్ డి.యస్.పి రమణ కుమార్, I టౌన్ సి.ఐ జగన్మోహన్ రెడ్డి, II సి.ఐ చంద్రశేఖర్ వారు పాల్గొన్నారు.

Friday, 5 June 2020

తిరుమల శ్రీవారి దర్శనానికి మార్గదర్శకాలు*


తిరుమల: 
తిరుమల శ్రీవారి దర్శనానికి అన్ని జాగ్రత్తలతో కూడిన ఏర్పాట్లు చేసాం... నిబంధనలను తప్పక పాటించాలని...TTD బోర్డ్ ఛైర్మన్, ఈవో అనిల్ సింఘాల్, జేఈవో ధర్మారెడ్డిలు పేర్కోన్నారు. శ్రీవారి దర్శనానికి తితిదే మార్గదర్శకాలను వారు వెల్లడించారు. శుక్రవారం తిరుమలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తితిదే ఉద్యోగులతో ప్రయోగాత్మకంగా శ్రీవారి దర్శనాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న లడ్డూల విక్రయం ఈనెల 8 నుంచి నిలిపివేస్తున్నట్టు చెప్పారు.
* ఈనెల 8, 9న కొంత మంది గుర్తింపు పొందిన తితిదే ఉద్యోగులకు స్వామివారి దర్శనం.
* 11 నుంచి దేశ వ్యాప్తంగా వచ్చే భక్తులకు అనుమతి. 
* రోజూ సుమారు 3వేల ఆన్‌లైన్‌ టికెట్లు అందుబాటులోకి. 
* కంటైన్‌మెంట్‌ జోన్ల నుంచి భక్తులు తిరుమలకు రావొద్దు. 
*  ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌చేసుకున్న వారికి అలిపిరిలో పరీక్షలు
* 65 ఏళ్లు పైబడిన వారు, పిల్లలకు అనుమతి నిరాకరణ 
* మాస్క్‌లు తప్పనిసరి, భౌతికదూరం పాటించాలి. 
* ప్రతి రోజు ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి.
* ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అలిపిరి నడకదారిలో భక్తులకు అనుమతి.
* వసతి గదుల్లో రెండో రోజు కొనసాగేందుకు అనుమతి ఉండదు.
* క్యూలైన్లను ప్రతి రెండు గంటలకోసారి శానిటైజ్‌ చేస్తారు.
* శ్రీవారి ఆలయంలోని ఉపాలయాల దర్శనం ఉండదు.
* వైరస్‌ ప్రబలే అవకాశం ఉన్నందున శఠారి, తీర్థం ఇవ్వరు.
* శ్రీవారి పుష్కరిణిలో స్నానాలకు భక్తులను అనుమతించరు.
* ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్నా... వైద్య పరీక్షలు నిర్వహించాకే అనుమతి.
* శ్రీవారి హుండీ వద్దకు వెళ్లే వారికి హెర్బల్‌ శానిటైజేషన్‌ ప్రక్రియ.
* శ్రీవారి హుండీలో కానుకలు వేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.
* తిరుమలలో ప్రైవేటు హోటళ్లకు అనుమతి  నిరాకరణ

Thursday, 4 June 2020

8 నుంచి శ్రీ‌వారి ద‌ర్శ‌నం ట్రయల్ : ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌


 
     ప్రభుత్వ అనుమతి మేరకు ఈ నెల 8 వ తేదీ నుంచి  ప్రయోగాత్మకంగా తిరుమ‌ల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ద‌ర్శ‌నాన్ని ప్రారంభిస్తున్నామని   ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో గురువారం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌నపు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సివి ఎస్ ఓ శ్రీ గోపినాథ్ జెట్టి, సి ఈ శ్రీ రామచంద్రారెడ్డి, ఆలయ డిప్యూటి ఈ ఓ శ్రీ హరీంద్రనాథ్ ఇతర  సీనియ‌ర్ అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. 
 అనంత‌రం  ఈవో  అన్నమయ్య భవన్ ఎదుట తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ‌ల ఆదేశాల మేర‌కు దాదాపు 75 రోజులుగా భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం నిలిపి వేశామ‌న్నారు.  ఆల‌యంలో  స్వామివారి కైంక‌ర్యాలు ఆగ‌మోక్తంగా అర్చ‌క స్వాములు ఏకాంతంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.  కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల  అనుమ‌తి మేర‌కు ముందు జాగ్రత్త చర్యలు అమలు చేస్తూ జూన్ 8వ తేదీ నుండి తిరుమ‌లలో  ప్రయోగాత్మకంగా ద‌ర్శ‌నం ప్రారంభిచాలని నిర్ణయించామన్నారు. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, తాను, అదనపు ఈ ఓ శ్రీ ఏవి ధర్మారెడ్డి ఈ విషయం గురించి కూలంకషంగా చర్చించామని, అధికారుల అభిప్రాయాలు కూడా తెలుసుకుని అనేక సూచనలు ఇచ్చామన్నారు.
తిరుమ‌ల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు ఏ విధంగా ద‌ర్శ‌నం క‌ల్పించాలి, ర‌వాణా, వ‌స‌తి, ల‌డ్డూ ప్ర‌సాదాలు, త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ, శానిటైజేష‌న్ త‌దిత‌ర అంశాల‌పై విభాగాల వారిగా అధికారుల‌తో చ‌ర్చించిన‌ట్లు తెలిపారు.   భౌతిక దూరం పాటిస్తూ గంట‌కి ఎంత మందికి ద‌ర్శ‌నం క‌ల్పించ‌వ‌చ్చు, భ‌క్తులు తీసుకోవాల‌సిన జాగ్ర‌త్త‌లు త‌దిత‌ర అంశాలను అధికారుల‌తో చ‌ర్చించామన్నారు.కాగ దుకాణాలు తేరవడానికి టిటిడి అనుమతి ఇచ్ఛింది.
ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అనుమతి.
ఒక్కో దుకాణంలో ఇద్దరికి మాత్రమే అనుమతి
దుకాణాల వద్ద భక్తులు ఆరడుగుల భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించిన టీటీడీ
శానిటైజర్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ఆదేశం.