నారాయణ మంత్రంతో పరిభ్రమించింది. జూన్ 21న ఆదివారం (రవివారం) కేతుగ్రస్త సూర్య గ్రహణం వేళ ప్రపంచం సుభిక్షంగా వుండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు అంటూ రుత్వీక్కులు జపయాజ్ఞాన్ని నిర్వహించారు.శ్రీవారి పుష్కరిణిలో జరిగిన కార్యక్రమంలో టిటిడి ఈ.ఓ.సింఘాల్.. టిటిడి సిబ్బంది పాల్గొనగా తిరుమల వేద పండితులు వేద పాఠశాలల విధ్యార్థులు నారాయణ నామలను ఉచ్ఛయరిస్తూ జప యజ్ఞం చేశారు. ఈ గ్రహణాన్ని ''చూడామణి - సూర్య గ్రహణం'' అంటారు. ఈ గ్రహణ సమయం ఉదయం 10.18 గంటల నుండి మధ్యాహ్నం 1.38 గంటల మధ్య ప్రపంచ శాంతి, సృష్ఠిలోని సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ తిరుమల శ్రీవారి పుష్కరిణిలో టిటిడి జపయజ్ఞం నిర్వహించింది. ఈ జప యజ్ఞంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యర్స్వామి, ధర్మకర్తల మండలి సభ్యులు కృష్ణమూర్తి వైధ్యనాథన్, ఈవో అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, జెఈవో పి.బసంత్కుమార్, శ్రీవారి ఆలయ అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment