Sunday, 31 October 2021

తెలంగాణలోని పలు జిల్లాలో భూ ప్రకంపనలు.. ఇండ్ల నుండి జనం పరుగులు... ఇంద్రవెల్లిలో ఉద్రిక్తత...

:తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. మంచిర్యాల, కొమురం భీం, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసారు. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల పట్టణంలో గల రహమత్‌పురాలో ప్రకంపనలు వచ్చాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు, సలుగుపల్లి గ్రామాల్లో భూమి కంపించింది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా స్వల్పంగా భూమి కంపించింది. ఒక సెకను పాటు కంపించిన భూమి కంపించింది. సాయంత్రం 6.48 గంటల సమయంలో భూప్రకంపనలు వచ్చాయి. బెల్లంపల్లి, వేమనపల్లి, మందమర్రి మండలాల్లో భూమి కంపించింది. లక్సెట్టిపేటలో స్వల్ప భూప్రకంపనలు ఏర్పడ్డాయి. ఈ రోజు సాయంత్రం సమయం 6-48 నిమిషాలకు లక్షెటిపేట‌తో పాటు సమీప ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది.  ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండం, ముత్తారం మండలాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి.
##################################

*కాగజ్‌నగర్‌లో పెద్దపులి చర్మం పట్టివేత*

కుమురం భీం: జిల్లాలోని కాగజ్‌నగర్‌లో పెద్దపులి చర్మాన్ని పోలీసులు పట్టుకున్నారు. 10 మంది నిందితులను అరెస్టు చేసారు.  పెద్దపులి చర్మాన్ని మహారాష్ట్రకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండంలోని  హీరాపూర్ అటవీ ప్రాంతంలో కొన్నాళ్ల క్రితం పులిని చంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులతో కలిసి అటవీ ప్రాంతాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

ఇంద్రవెల్లిలో ఉద్రిక్తత
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
 పులి చర్మం కేసులో అరెస్టులపై ఆదివాసీల ఆగ్రహించారు. అటవీశాఖ అధికారులపై దాడికి యత్నించారు. అధికారుల వాహనాల్లో గాలి తీసి నిరసన వ్యక్తం చేశారు. దండారి పర్వదినాల్లో బూట్లు వేసుకుని ఇళ్లల్లో తనిఖీలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులపై అట్రాసిటీ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు

Friday, 8 October 2021

దేవుడా ఓ మంచి దేవుడా....

October 8, 2021 : అక్రమ వ్యాపారానికి ఫోటోలను వాడుకున్నారు కొందరు కేటుగాళ్లు. దేవుళ్ల ఫొటోల ఫ్రేముల్లో గంజాయి ప్యాక్‌ చేసి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించి చివరకు అడ్డంగా బుక్కయ్యారు. ఈ ముఠాలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరొకడు పరారయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం… బూరుగుపూడిలో జాతీయరహదారిపై తనిఖీలు చేస్తుండగా ఓ ఆటోలో వెళుతున్న ఇద్దరు వ్యక్తుల వద్ద ఫొటో ఫ్రేముల తరహాలో ఉన్న 5 బాక్సులను పోలీసులు గుర్తించారు. వాటిని తెరిచి చూడగా మొత్తంగా 122 కిలోల గంజాయి బయటపడింది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.30వేల నగదు, మొబైల్‌ఫోను స్వాధీనం చేసుకొని ఆటోను సీజ్‌ చేశారు.

Thursday, 7 October 2021

SACRED FLAG HOISTED ON TEMPLE PILLAR MARKING THE BEGINNING OF ANNUAL BRAHMOTSAVAMS AT TIRUMALA _ ధ్వజారోహణంతో శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

Tirumala/తిరుమల :
The nine-day annual Brahmotsavams off to a colourful and spiritual start with Dwajarohanam ceremony held in the auspicious Meena Lagnam between 5:10pm and 5:30pm on Thursday in Tirumala temple.
Earlier, the Dhwajapatam with the image of Garudalwar was rendered special pujas in temple. This was followed by procession of processional deities accompanied by Parivara deities within the temple complex circumambulating Vimana Prakaram.
Later in the evening, the Garuda Dhwajapatham was hoisted on the Dwajasthambham-the temple pillar, amidst chanting of Vedic hymns by Vedic scholars.
The significance behind this ceremony is that Garuda, the ardent disciple of Sri Maha Vishnu (Sri Venkateswara Swamy) goes to all Lokas to invite all the three crore deities mentioned in ancient Hindu scriptures, Saptharshis and representatives of different worlds to take part in the Navahnika Brahmotsavam of His Master and make it a grand success.
శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు గురువారం సాయంత్రం 5.10 నుండి 5.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభమయ్యాయి.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేద‌మంత్రోచ్ఛార‌ణ‌ మధ్య మంగళవాయిద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు. శ్రీ వాసుదేవ బ‌ట్టాచార్యులు కంక‌ణ‌భ‌ట్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను, స‌ప్త‌మ‌రుత్తులను (దేవ‌తాపురుషులు), రుషిగ‌ణాన్ని, స‌క‌ల ప్రాణికోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ గ‌రుడాళ్వార్ ధ్వ‌జ‌స్తంభాన్ని అధిరోహిస్తార‌ని ప్రాశస్త్యం.
విశ్వ‌మంతా గ‌రుడుడు వ్యాపించి ఉంటారు. ఆయ‌న్ను శ్రీ‌నివాసుడు వాహ‌నంగా చేసుకోవ‌డంతో స‌ర్వాంత‌ర్యామిగా స్వామివారు కీర్తించ‌బ‌డుతున్నారు. 
కాగా, ధ్వ‌జ‌ప‌టంపై గ‌రుడునితోపాటు సూర్య‌చంద్రులకు కూడా స్థానం క‌ల్పించ‌డం సంప్ర‌దాయం. ఈ సంద‌ర్భంగా పెస‌ర‌ప‌ప్పు అన్నం (పొంగ‌లి) ప్ర‌సాద వినియోగం జ‌రిగింది. ఈ ప్ర‌సాదం స్వీక‌రించిన వారికి సంతాన ప్రాప్తి, దీర్ఘాయుష్షు, సిరిసంప‌ద‌లు స‌మ‌కూరుతాయ‌ని విశ్వాసం. అదేవిధంగా, ధ్వ‌జ‌స్తంభానికి క‌ట్టిన ద‌ర్భ అమృత‌త్వానికి ప్ర‌తీక‌. పంచ‌భూతాలు, స‌ప్త‌మ‌రుత్తులు క‌లిపి 12 మంది దీనికి అధిష్టాన దేవ‌త‌లు. ఇది స‌క‌లదోషాల‌ను హ‌రిస్తుంది. ద‌ర్భ‌ను కోసేట‌ప్పుడు, కైంకర్యాల్లో వినియోగించేట‌పుడు ధ‌న్వంత‌రి మంత్ర పారాయ‌ణం చేస్తారు. ధ్వ‌జారోహ‌ణం అనంత‌రం తిరుమ‌ల‌రాయ మండ‌పంలో ఆస్థానం చేప‌ట్టారు.
ధ్వ‌జారోహ‌ణ ఘ‌ట్టానికి ముందు సాయంత్రం 3 నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగించారు.

Friday, 1 October 2021

నాది అల్లు రామలింగయ్యది గురు శిష్యుల సంబంధం: రాజమండ్రిలో మెగస్టార్ చిరంజీవి వెల్లడి...


రాజమహేంద్రవరం 
అక్టోబర్ 01 : నటుడిగా నేను జన్మించినది రాజమండ్రిలోనే  అని, రాజమండ్రి- తో నాకు విడదీయరాని బంధం వుంది
 కేంద్ర మంత్రి, ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలు సందర్భంగా శుక్రవారం  రాజమహేంద్రవరం వై-జంక్షన్ లోని అల్లు రామలింగయ్య హోమియో పతి కళాశాల, వైద్య శాల వ్యవస్థాపకులు అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ కొణిదెల చిరంజీవి, ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించారు.


ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో అల్లు రామలింగయ్య కళాశాల ఆవరణలో రూ.2 కోట్ల రాజ్యసభ నిధులతో నిర్మాణం చేసిన కళాశాల నూతన భవనాన్ని ఆయన  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటుడిగా నేను జన్మించింది రాజమండ్రిలోనేనని అన్నారు.నా మొదటి మూడు సినిమాలు  పునాది రాళ్ళు, ప్రాణం ఖరీదు, మన ఊరి పాండవులు ఈ ప్రాంతంలో చిత్రీకరణ జరిగాయన్నారు. నాది అల్లు రామలింగయ్యది గురు - - శిష్యుల సంబంధం వంటి దన్నారు. బిజీగా  ఘాటింగ్ లో ఉండడం వలన  సమయానికి భోజనం చేయకపోవడం వల్ల కడుపులో మంట వచ్చేదని, ఎన్ని యాంటాసిడ్లు వాడినా కడుపులో మంట తగ్గలేదని అన్నారు.అల్లు రామలింగయ్య ఒకసారి ఇచ్చిన హెూమియో మందుతో నొప్పి తీసినట్లు పోయిందని గుర్తుచేసుకున్నారు. ఇవాల్టికీ మా ఫ్యామిలీ హెూమియోపతి మందులే వాడతామని, హెూమియోపతిలో తగ్గని జబ్బు లేదన్నారు. రాజ్యసభ ఎం.పి.గా ఉండటం వల్లే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి నిధులు ఇవ్వగలిగానని, అన్నారు. సంజీవని లాంటి హెూమియోపతి వైద్యమని కొనియాడారు.  హెూమియోపతి సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యమని, హెూమియోపతి వైద్యానికి మరింత ప్రాచుర్యం రావాలని చిరంజీవి ఆకాంక్షించారు. అల్లు రామలింగయ్య స్పూర్తి ప్రదాత అని అన్నారు.  తన చిన్న తనం లో హోమియో పతి ని ఉమాపతిగా పలికేవాడ్ని చిన్న నాటి సంఘటన లు గుర్తు చేసుకున్నారు. మనఊరి పాండవులు చిత్రం ఘాటింగ్ సందర్భంగా తిరిగి రైల్లో వెళ్తున్న సమయంలోనే నాకు అల్లు రామలింగయ్యతో పరిచయం ఏర్పడిందని అన్నారు. అప్పుడే నన్ను వలలో (అల్లుడుగా ) వేసుకున్నారనిపిస్తుందని అన్నారు. వానాకాల చదువులు చదివిన రామలింగయ్య గారు బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆయన అనుకుంటే ఏదైనా,సాధించేవారని వివరించారు. నిత్యవిద్యార్ధిగా అల్లు గారు వుండేవారని తెలిపారు. హోమియో పతి వైద్యం అల్లుగారితోనే కాదు మా అమ్మగారితోనే నాకు అలవాటు ఉందన్నారు. గ్యాంగ్రెన్ వ్యాధులను కూడా రామలింగయ్యగారు నయం చేసేవారని అన్నారు. హొమియోపతి వైద్యం లో ఏ రోగానికి అయినా మందు వుంటుందని తెలిపారు.
కాలేజీ భవనానికి నిధులు కేటాయించినది నా డబ్బులు కాదు అని అన్నారు. నా రాజ్యసభ నిధుల నుంచి కాలేజీకి 2 కోట్లు ఇచ్చానంతే వివరించారు. మెగా స్టార్ చిరంజీవి గా రాజమహేంద్రవరం (మధురపూడి) ఎయిర్పోర్టులో దిగిన చిరంజీవికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్, అల్లు అరవింద్, ఆయన  బావ  డాక్టర్ వెంకట్రావు, కళాశాల ప్రిన్సిపాల్ టి.సూర్యభగవాన్ తదితరులు పాల్గొన్నారు.

ఇక TS ఆర్టీసీలో ఒకటో తేదీనే జీతాలు..


*హైదరాబాద్‌:* ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. మూడేళ్ల తర్వాత ఒకటో తేదీన టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులంతా జీతాలు అందుకోనున్నారు. ఇకపైనా ప్రతి నెలా ఒకటిన జీతాలు చెల్లించాలని సంస్థ ఎండీ సజ్జనార్‌ ఉన్నతాధికారులకు సూచించినట్లు సమాచారం. తీవ్ర నష్టాలతో ప్రతి నెలా 7 నుంచి 14 లోపు విడతలు, జోన్ల వారీగా జీతాలు చెల్లించడానికి అవస్థలు పడుతున్న సంస్థ.. దసరా పండగ వేళ అక్టోబరు 1న అందరికీ జీతాలు చెల్లించాలని నిర్ణయించింది. ఇటీవల ఆర్టీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డి గోవర్ధన్‌.. ప్రతి నెలా 1న జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. దాదాపు 48 వేల మంది ఉద్యోగులు, పింఛనుదారులు ఒకటో తేదీన వేతనాలు అందుకోనున్నారు.

*దీర్ఘకాలిక సెలవులిస్తాం.. దరఖాస్తు చేసుకోండి*

టీఎస్‌ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లకు దీర్ఘకాలిక సెలవులు ఇచ్చేందుకు సంస్థ ముందుకు వచ్చింది. ఇప్పటివరకు ఈ సెలవులపై అప్రకటిత ఆంక్షలున్నాయి. తాజాగా వాటిని సడలిస్తూ దరఖాస్తు చేసుకుంటే ఏడాది *సెలవులు ఇస్తామంటూ ఉత్తర్వులు జారీచేసింది.*