Friday, 8 October 2021

దేవుడా ఓ మంచి దేవుడా....

October 8, 2021 : అక్రమ వ్యాపారానికి ఫోటోలను వాడుకున్నారు కొందరు కేటుగాళ్లు. దేవుళ్ల ఫొటోల ఫ్రేముల్లో గంజాయి ప్యాక్‌ చేసి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించి చివరకు అడ్డంగా బుక్కయ్యారు. ఈ ముఠాలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరొకడు పరారయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం… బూరుగుపూడిలో జాతీయరహదారిపై తనిఖీలు చేస్తుండగా ఓ ఆటోలో వెళుతున్న ఇద్దరు వ్యక్తుల వద్ద ఫొటో ఫ్రేముల తరహాలో ఉన్న 5 బాక్సులను పోలీసులు గుర్తించారు. వాటిని తెరిచి చూడగా మొత్తంగా 122 కిలోల గంజాయి బయటపడింది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.30వేల నగదు, మొబైల్‌ఫోను స్వాధీనం చేసుకొని ఆటోను సీజ్‌ చేశారు.

No comments:

Post a Comment