:తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. మంచిర్యాల, కొమురం భీం, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసారు. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల పట్టణంలో గల రహమత్‌పురాలో ప్రకంపనలు వచ్చాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు, సలుగుపల్లి గ్రామాల్లో భూమి కంపించింది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా స్వల్పంగా భూమి కంపించింది. ఒక సెకను పాటు కంపించిన భూమి కంపించింది. సాయంత్రం 6.48 గంటల సమయంలో భూప్రకంపనలు వచ్చాయి. బెల్లంపల్లి, వేమనపల్లి, మందమర్రి మండలాల్లో భూమి కంపించింది. లక్సెట్టిపేటలో స్వల్ప భూప్రకంపనలు ఏర్పడ్డాయి. ఈ రోజు సాయంత్రం సమయం 6-48 నిమిషాలకు లక్షెటిపేటతో పాటు సమీప ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండం, ముత్తారం మండలాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి.
##################################
*కాగజ్‌నగర్‌లో పెద్దపులి చర్మం పట్టివేత*
కుమురం భీం: జిల్లాలోని కాగజ్‌నగర్‌లో పెద్దపులి చర్మాన్ని పోలీసులు పట్టుకున్నారు. 10 మంది నిందితులను అరెస్టు చేసారు. పెద్దపులి చర్మాన్ని మహారాష్ట్రకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండంలోని హీరాపూర్ అటవీ ప్రాంతంలో కొన్నాళ్ల క్రితం పులిని చంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులతో కలిసి అటవీ ప్రాంతాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇంద్రవెల్లిలో ఉద్రిక్తత
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పులి చర్మం కేసులో అరెస్టులపై ఆదివాసీల ఆగ్రహించారు. అటవీశాఖ అధికారులపై దాడికి యత్నించారు. అధికారుల వాహనాల్లో గాలి తీసి నిరసన వ్యక్తం చేశారు. దండారి పర్వదినాల్లో బూట్లు వేసుకుని ఇళ్లల్లో తనిఖీలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులపై అట్రాసిటీ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు
No comments:
Post a Comment