Friday, 1 October 2021

ఇక TS ఆర్టీసీలో ఒకటో తేదీనే జీతాలు..


*హైదరాబాద్‌:* ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. మూడేళ్ల తర్వాత ఒకటో తేదీన టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులంతా జీతాలు అందుకోనున్నారు. ఇకపైనా ప్రతి నెలా ఒకటిన జీతాలు చెల్లించాలని సంస్థ ఎండీ సజ్జనార్‌ ఉన్నతాధికారులకు సూచించినట్లు సమాచారం. తీవ్ర నష్టాలతో ప్రతి నెలా 7 నుంచి 14 లోపు విడతలు, జోన్ల వారీగా జీతాలు చెల్లించడానికి అవస్థలు పడుతున్న సంస్థ.. దసరా పండగ వేళ అక్టోబరు 1న అందరికీ జీతాలు చెల్లించాలని నిర్ణయించింది. ఇటీవల ఆర్టీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డి గోవర్ధన్‌.. ప్రతి నెలా 1న జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. దాదాపు 48 వేల మంది ఉద్యోగులు, పింఛనుదారులు ఒకటో తేదీన వేతనాలు అందుకోనున్నారు.

*దీర్ఘకాలిక సెలవులిస్తాం.. దరఖాస్తు చేసుకోండి*

టీఎస్‌ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లకు దీర్ఘకాలిక సెలవులు ఇచ్చేందుకు సంస్థ ముందుకు వచ్చింది. ఇప్పటివరకు ఈ సెలవులపై అప్రకటిత ఆంక్షలున్నాయి. తాజాగా వాటిని సడలిస్తూ దరఖాస్తు చేసుకుంటే ఏడాది *సెలవులు ఇస్తామంటూ ఉత్తర్వులు జారీచేసింది.*

No comments:

Post a Comment