ఖమ్మం, జూలై 18: పరస్పరం సహకరించుకుంటూ విజయం వైపు అడుగులు వేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం కలెక్టర్ జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్న యువతీ, యువకులతో సమస్యలు, సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్య సాధనకు పట్టుదలతో కృషి చేయాలని. ఎప్పుడు శ్రమపై దృష్టి పెట్టాలని, ఖచ్చితంగా ఫలితం వస్తుందని పేర్కొన్నారు.. సిలబస్ ను అనుసరించాలని ఆయన అన్నారు. ఒకరినొకరు సహకరించుకోవాలని, తమకు తెలిసిన విషయాలు ఒకరినొకరు పంచుకోవాలని ఆయన అన్నారు. ఇంటిని, చదువును బ్యాలన్స్ చేరుకోవాలన్నారు. నిరాశ, నిస్పృహలకు లోనికావద్దని, ఆశావాహ దృక్పథంతో ముందుకు వెళ్లాలని అన్నారు. పరిస్థితులు లక్ష్య సాధనకు అడ్డంకులు కావని, అవకాశాలను విజయాలుగా మలచుకోవాలని అన్నారు. చదువుతో పాటు అరగంట ఆటలు, వ్యాయామానికి ఖచ్చితంగా కేటాయించాలన్నారు. మానసికంగా దృడంగా ఉండాలని, సమస్యలకు ఆందోళన చెందకుండా, పరిష్కారానికి యోచన చేయాలన్నారు. టాయిలెట్లు, త్రాగునీటి సమస్యతో పాటు ఇంకనూ కావలసిన సౌకర్యాల గురించి దృష్టికి తేవాలన్నారు. పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment