Friday, 31 October 2025

జాతీయ సమైక్యత లక్ష్యం కావాలి : సిపి సునీల్ దత్


ఖమ్మం: జాతీయ సమైక్యతా ..సమరాస్య భావం అందరిలో వుండాలని..జాతీయ ఐక్యత, సామరస్యం, దేశభక్తి, సమైక్యతా భావం పట్ల అవగాహన కల్పించడమే రన్ ఫర్ యూనిటీ లక్ష్యం అని సీపీ సునీల్ దత్ అన్నారు భారత ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభభాయి పటేల్  150వ జయంతి పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవ పరుగు *రన్ ఫర్ యూనిటీ* నిర్వహించారు.
కార్యక్రమంలో ఖమ్మం సి.పి సునీల్ దత్ పాల్గొన్నారు..
సత్తుపల్లిలో...
భారత ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభభాయి పటేల్  150వ జయంతి పురస్కరించుకొని జాతీయ  సమైక్యతా భావం పట్ల అవగాహన కల్పించడంలో భాగంగా ఆరవ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్,కల్లూరు ఏసీపీ రఘు,కల్లూరు డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో సత్తుపల్లి లో జాతీయ ఐక్యత దినోత్సవ పరుగు *రన్ ఫర్ యూనిటీ* నిర్వహించారు.

Thursday, 30 October 2025

బట్టి పట్టు వద్దు.... సృజనాత్మక చదువులు నేర్పండి.... కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి


*బట్టిపట్టే చదువుకు స్వస్తి పలికి స్కిల్స్ పెరిగేలా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అమలు.. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*

**నెల రోజుల పాటు ఎవ్రీ చైల్డ్ రీడ్స్  కార్యక్రమం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అమలు*

**1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు రీడింగ్ స్కిల్స్ పెంపుపై ప్రతిరోజు గంట సమయం కేటాయింపు*

*ఖమ్మం ఎన్ఎస్సీ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలును తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్*
------------------------------------------------------------------------
ప్రతి విద్యార్థి బట్టిపట్టి చదివే విధానాన్నికి స్వస్తి పలికి రీడింగ్ స్కిల్స్ పెరిగేలా ఉపాధ్యాయులు బోధన పద్దతిని మెరుగుపర్చేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
ఖమ్మం నగరం ఎన్ఎస్పీ రోడ్ లోని ఎన్ఎస్సీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లలో మధ్యాహ్నం 3.00 గంటల నుండి 4.00 గంటల వరకు నిర్వహించే ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలును జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను తిరుగు విద్యా భోదనను గమనించారు. రెండు, మూడవ తరగతి గదిలో విద్యార్థులను ఎలావున్నాయి రైమ్స్ అని అడిగారు. బోర్డు పై అక్షరాలను వ్రాసి వాటియొక్క ఉచ్చారణ ను విద్యార్ధులను అడిగి కలెక్టర్ సామర్థ్యాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* జిల్లాలోని ప్రతి విద్యార్థికి చదివే సామర్థ్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. విద్యా ప్రమాణాల పెంపుదలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు లభిస్తుందన్నారు.  విద్యార్థులకు ముందుగా చదవడం, చదివింది అర్థం చేసుకోవడం అనే నైపుణ్యాలు రావడం చాలా కీలకమని అన్నారు.  
ఒక విద్యార్థికి చదివే సామర్థ్యం అందిస్తే జీవితాంతం ఉపయోగ పడుతుందని, విద్యార్థుల చదివే సామర్థ్యం పెంపు చేయడం కోసం చేపట్టిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్ ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్దపెట్టి భోదన చేయాలన్నారు.
30 రోజుల పాటు ప్రతి రోజు విద్యార్థి గంట సేపు చదివే సామర్థ్యంపై అభ్యాసన చేసేలా సాంకేతిక పరిజ్ఞానంతో ఒక బుక్ లెట్ తయారు చేయడం జరిగిందని అన్నారు. బుక్లెట్ లో ఉన్న అంశాలను తూ.చ. తప్పకుండా ఉపాధ్యాయులు ఫాలో అవుతూ పిల్లలు చదివే సామర్థ్యం పెంపొందేలా కృషి చేయాలని అన్నారు.
ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమ పర్యవేక్షణకు ఒక యాప్ తయారు చేశామని, దీనిని యూ.డి.ఐ.ఎస్. తో అనుసంధానం చేయడం వల్ల ఎటువంటి డాటా ఎంట్రీ అవసరం ఉండదని, ప్రతి బుధవారం విద్యార్థి రీడింగ్ స్కిల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో (అక్షరాలు, పదాలు, వ్యాఖ్యలు) అప్ డేట్ మాత్రం చేయాలని అన్నారు. ఆంగ్ల అక్షరాలను ఫోనెటిక్ సౌండ్ తో సహా నేర్పేలా  కోర్సు డిజైన్ చేశామని అన్నారు. 
ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెడితే ఎవ్రీ చైల్డ్ రీడ్స్  కార్యక్రమం పరిపూర్ణంగా అమలు చేయవచ్చని, నెల రోజుల తర్వాత ప్రతి విద్యార్థి కనీసం ఒక పేరాగ్రాఫ్ చదివి అర్థం చేసుకునే స్థాయికి చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం ప్రతి రోజు పాఠశాల సమయాల్లోనే ప్రాథమిక తరగతి విద్యార్థులకు అమలు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఎంఓ ప్రవీణ్, హెడ్ మాస్టర్ లు, సంబంధిత టీచర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
*#మణికుమార్ కొమ్మమూరు, మోబైల్:9032075966#*

కమాండ్ కంట్రోల్ సెంటర్ కు డిజిపి. శివధర్ రెడ్డి... డాటా సెంటర్..హెలీపాడ్‌ పరిశీలన...



*ఐసిసిసి భవనాన్ని పరిశీలించిన డిజిపి*

 హైదరాబాద్ : తెలంగాణ  డిజిపిగా బి.శివధర్ రెడ్డి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా నగరంలోని  ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసిసిసి)భవనాన్ని సందర్శించారు.
 భవనంలోని వివిధ అంతస్తులను , కార్యాలయాలను పరిశీలించారు.
• 4వ అంతస్తులో ఉన్న డాటా సెంటర్‌.
• ఇతర అధికారుల చాంబర్‌లు.
• 8వ అంతస్తులో గల స్టేట్ కాన్ఫరెన్స్ హాల్.
• 18వ అంతస్తులో ఉన్న హైదరాబాద్ పోలీసు కమిషనర్  కార్యాలయం.
• 19వ అంతస్తులో ఉన్న హెలిపాడ్ వంటివి పరిశీలించారు.
ఈ పర్యటనలో డిజిపి తో  పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వి.సి. సజ్జనార్ , డైరెక్టర్‌ ఐసిసిసి శ్రీ వి. బి. కమలాసన్ రెడ్డి,  డిసిపి  శ్రీమతి పుష్ప మరియు శ్రీమతి కె. అపూర్వా రావు డిసిపి, స్పెషల్ బ్రాంచ్ తదితరులు పాల్గొన్నారు .
"#మణికుమార్ కొమ్మమూరు, మోబైల్ : 9032075966#"

Tuesday, 28 October 2025

వెంటిలేటర్ పై ఉన్న హెచ్.సి.ఏ ను వెంటనే రద్దు చేయాలి : టీసీఏ డిమాండ్



హైదరాబాద్‌ :  వెంటిలేటర్ పై ఉన్న హైదరాబాద్ క్రికెటర్ అసోసియేషన్ను బీసీసీఐ రద్దు చేయాలని. తెలంగాణలో క్రికెట్  క్రీడా యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టి సి ఏ కు పూర్తి బాధ్యతలను అప్పగించాలని తెలంగాణ క్రికెటర్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. 
హైదరాబాద్ SD రోడ్ లోని తాజ్ ట్రై స్టార్' హోటల్ లో జరిగిన  తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సమావేశంలో )  జిల్లా కమిటీల ప్రతినిధుల గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు  పాల్గోని పలు సమస్యలపై చర్చించారు.. సమావేశం అనంతరం టీసీఏ ప్రధాన కార్యదర్శి ధారం గురువా రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు డా. జి. ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)ని పూర్తిగా రద్దు చేయాలని, బీసీసీఐ రాజ్యాంగం అలాగే జాతీయ క్రీడా పాలనా చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పూర్తి సభ్యత్వ గుర్తింపును టీసీఏకే ఇవ్వాలని డిమాండ్ చేశారు..హెచ్‌సీఏ చట్ట విరుద్ధంగా అక్రమంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ “వెంటిలేటర్‌ దశకు చేరిందని విమర్శించారు. హెచ్.సి.ఏ కు రాజ్యాంగ ఎటువంటి అనుమతి లేదని, పరిపాలనా కోరం,  
 జిల్లా స్థాయిలో ప్రతినిత్వం వంటివి లేవని
హెచ్‌సీఏ హైదరాబాద్ నగరానికి వెలుపల ఎటువంటి మౌలిక సదుపాయాలు లేదా క్రికెట్ కార్యక్రమాలు లేకపోయినా, నకిలీ “డిస్ట్రిక్ట్ క్రికెట్ కాన్సెప్ట్”తో ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని టీసీఏ పేర్కొంది.
హైకోర్టు నియమించిన సింగిల్ మెన్ కమిటీ ఉన్నప్పటికీ, హెచ్‌సీఏ ఎలా కొనసాగుతోందో అర్థం కావడం లేదని టీసీఏ ప్రశ్నించింది. “హెచ్‌సీఏలో ఉన్న చాలా మంది సభ్యులు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని”  టీసీఏ వ్యాఖ్యానించింది.
“తెలంగాణ యువత ఇక హెచ్‌సీఏ జోక్యం భరించే  స్థితిలో లేదని ధారం గురువా రెడ్డి అన్నారు. టి సి ఎ ఇప్పటికే చట్టపరమైన చర్యలు చేపట్టిందని: జిల్లా టీసీఏ కమిటీలు  సైతం  ఆయా జిల్లాల పరిధిలో పోలీసు అధికారులకు ఫిర్యాదులు సమర్పించాయన్నారు.
గత 10 సంవత్సరాల హెచ్‌సీఏ ఆర్థిక అవకతవకల వివరాలను సిఐడికి టి సి ఏ అందజేసిందని తెలిపారు.
ప్రస్తుతం సీఐడీ విచారణలు కొనసాగుతున్నట్లు
33 జిల్లాల ప్రాతినిధ్యం కలిగిన కొత్త టీసీఏ నేతృత్వం
టీసీఏ ఇటీవల కొత్త గవర్నింగ్ బోర్డును ఎన్నుకుందని, ఇది తెలంగాణ రాష్ట్రంలోని అన్ని 33 జిల్లాలకు సమగ్ర ప్రాతినిధ్యం కలిగిన కొత్త యాజమాన్య నిర్మాణంగా నిలుస్తోందన్నారు. ఈ సందర్భంగా టి సి ఏ   రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లను ప్రకటించింది:

1. తెలంగాణ గోల్డ్ కప్ 2025:
నవంబర్ 15, 2025న ప్రారంభం
రాష్ట్రంలోని 33 జిల్లాలు పాల్గొనే ప్రీమియర్ లీగ్ ఫార్మాట్, 5 జోన్లలో నిర్వహణ.

2. టీసీఏ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్:
డిసెంబర్ 2025లో నిర్వహణ.

 గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల క్రికెటర్లకు సమాన అవకాశాలు కల్పించడమే. లక్ష్యంగా టిసిఏ పేర్కొంది

టీసీఏ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు డా. జి. ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ

“బీసీసీఐ గత దశాబ్ద కాలంగా జిల్లాల స్థాయిలో క్రికెట్ అభివృద్ధి కోసం పనిచేసిన టీసీఏ కృషిని గుర్తించాలి. హెచ్‌సీఏని పూర్తిగా రద్దు చేయాలి లేదా కేవలం హైదరాబాద్ నగర పరిమితులకే పరిమితం చేయాలి.”
“రాష్ట్ర స్థాపన ఉద్యమంలో తెలంగాణ యువత పోరాటం సమాన అవకాశాల కోసం జరిగింది. ఇప్పుడు బీసీసీఐ మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి, అవినీతి చేసిన వారిని శిక్షించి, టీసీఏకి సరైన గుర్తింపు ఇవ్వాలి.”
బోర్డ్ సమావేశంలో గవర్నింగ్ సభ్యులు 
కపిలవాయి రవీందర్,
చిత్తరంజన్ కుమార్,
డాక్టర్ కూరపాటి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
*Manikumar Kommamuru,  📱 9032075966*

Wednesday, 15 October 2025

కర్నూలు - ప్రధాని మోడీ పర్యటనకు భారీ ఏర్పాట్లు.. శ్రీశైలంలో పారాహుషార్..

*
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కర్నూలు పర్యటన సందర్భంగా జరుగుతున్న “సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్” భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, గుమ్మడి సంధ్యారాణి,' కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ  ప్రధాని పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అత్యంత శ్రద్ధగా, సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలు, కార్యకర్తలు ఒకే బృందంలా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ నియంత్రణ నుండి సభా ప్రాంగణం వరకు అన్ని అంశాలను సమగ్రంగా పర్యవేక్షించాలన్నారు. సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ సభ దేశ ఆర్థికాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను ప్రజల ముందుంచే వేదిక. ప్రధానమంత్రి  ప్రజలతో నేరుగా మమేకమవుతారు. అందువల్ల ఈ సభను చారిత్రాత్మకంగా మార్చాలన్నారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్లి సభ విజయవంతం కావడంలో పాత్ర వహించాలని మంత్రి సూచించారు. ప్రతి గ్రామం, ప్రతి మండలంలో ప్రజల్లో ఉత్సాహం నింపి, ప్రధానమంత్రిని అద్భుత స్వాగతం పలుకుదాం. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే సభగా నిలవాలని అన్నారు.
తదుపరి, సభా ప్రాంగణం, వేదిక, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, నీటి సదుపాయం, మీడియా సౌకర్యాలు, వాలంటీర్ వ్యవస్థ వంటి అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ప్రధాని పర్యటన రాష్ట్రానికి మరో కొత్త అవకాశాల ద్వారాలు తెరుస్తుంది. ఈ కార్యక్రమం కేవలం ఒక సభ కాదు, ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి యాత్రకు నూతన దిశా నిర్దేశం చేసే ఘట్టం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సభ విజయవంతం కోసం అందరూ ఒకే తాటిపై నిలిచి, సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు
కాగా ప్రధాని గురువారం శ్రీశైలం సందర్శించి జ్యోతిర్లింగ స్వరూపం మల్లికార్జునస్వామికి అభిషేకం,  శక్తిపీఠం బ్రహ్మారాంబికా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాట్లు ఆలయం పరిసరాల్లో చేపట్టారు బుధవారం ప్రధాని ఆలయ సందర్శన సంబంధించి మాక్ డ్రిల్ నిర్వహించారు
శ్రీశైలం ఆలయం చుట్టూ మూడు గంటల పాటు అన్ని వైపులా దిగ్బంధం చేసి ప్రధాని వచ్చినప్పుడు బందోబస్తు సెక్యూరిటీ చర్యలు ఎలా ఉండాలి అనే దానిమీద మాక్ డ్రిల్ పోలీస్ శాఖ నిర్వహించింది..
@ *మణికుమార్ కొమ్మమూరు, 
*మోబైల్ : 9032075966*

Friday, 3 October 2025

తమిళనాడు గవర్నర్ సహా పలువురు ప్రముఖులకు బాంబు బెదిరింపులు


*చెన్నై: తమిళనాడు సీఎం స్టాలిన్,సినీ నటి త్రిష,గవర్నర్ భవనం,రాష్ట్ర బీజేపీ కార్యాలయాలకు బాంబు బెదిరింపు కాల్స్ చేసిన దుండగులు..వెంటనే అప్రమత్తమై డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు చేసిన పోలీసులు..ఫోన్ నెంబర్ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులు.తమిళనాడు చెన్నై ఎయిర్పోర్ట్ 
మరియు జన సమర్థ స్థలాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టింది.. బెదిరింపులకు పాల్పడిన వారి ఐడీలను కనిపెట్టే పనిలో ఫైబర్ సెక్యూరిటీ విభాగం.

తిరుపతికి బాంబు బెదిరింపు‌‌... అప్రమత్తమైన యంత్రాంగం.‌..‌


తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపుల మెయిల్స్ 
నగరంలో పలు ప్రాంతాలను టార్గెట్ చేసినట్లు మెయిల్స్
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటితో పాటు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ జగన్ ఇంటిని  కూడా టార్గెట్ చేసినట్లు  మెయిల్ ..
వెంటనే అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం ఇంటెలిజెన్స్ నిఘా విభాగాలు.. తిరుపతి తిరుమల తో పటు పలుచోట్ల తనిఖీలు
 నిర్వహించారు  కాగా “హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్” పేరిట ఆపరేషన్ ప్లాన్.. చేసినట్టు మెయిల్లో సమాచారం ఉన్నట్లు తెలియ వస్తోంది..

తమిళనాడులోను పలువురు ప్రముఖులకు బాంబు బెదిరింపు