Monday, 25 May 2020

వృత్తి సబ్ రిజిస్ట్రార్.. ప్రవృత్తి మానవత్వం... ఆవిడే తస్లీమా మహ్మమద్...

    ఎవరూ పట్టించుకోని అభాగ్యులను ఆదుకునే లక్షణం ధైర్యమ్ పట్టుదల కలగలిసిన ఒక మాతృ హృదయంఆమే తస్లీమా మహమ్మద్    వృత్తి.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్ట్రార్ ప్రవృత్తి..

అపన్నులను చూడగానే స్పందించే గుణం. కరోనా  లాక్ డౌన్ లో ఎమ్మెల్యే సీతక్కతో మూటలెత్తుకొని అడవుల్లోకి నడుస్తూ కనిపించిన సెల్వార్ కమీజ్ స్త్రీమూర్తే ఈ తస్లీమా మహ్మమద్.. అధికారిగా ఎంతో ఆనందంగా గడపొచ్చు.. కానీ ఆమెను ఎక్కడ వెతికినా ఎవరికో సాయం చేస్తూనో ఎవరికో నీళ్లు అందిస్తునో అన్నం తినిపిస్తూనో పేద పసి పిల్లల్ని చూడగానే వళ్ళోకి తీసేసుకొని లోకాన్ని మరచి ఆత్మానందంలో కనిపిస్తుంది!తస్లీమా కు facebook ఐడీ కూడా లేదు! కానీ తస్లీమా సబ్ రిజిస్ట్రార్ ఫాలోవర్స్ గ్రూప్, పేజీ మాత్రం ఉన్నాయి! అది ఆమెను అభిమానించేవారే నడుపుతుంటారు.

వరంగల్ జిల్లా ములుగు మండల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా! వరంగల్ కు ములుగు 45 kms. ఆమె ఊరు రామచంద్రాపురం ములుగు నుంచి 12 kms. తన మండలానికే సబ్ రిజిస్ట్రార్ గా పని చేస్తుండడం ఆమె కార్యదక్షతకు మరింత ఉత్సాహాన్నిచ్చింది.

తన సొంత ప్రజలకు సేవ చేస్తున్న భావనతో ఆమె మరిన్ని మంచి పనులు చేస్తున్నారు.

*తండ్రి సర్వర్ ఎమ్ సీపీఐ నాయకుడు*. *ములుగు టైగర్ అని ఆయనకు పేరు*.తస్లీమా రెండేళ్ల వయసులో హత్యకు గురయ్యాడు.భర్తను కోల్పోయిన తల్లికి తాము ఐదుగురు పిల్లలు! నాలుగో సంతానం తస్లీమా.తల్లి వ్యవసాయం చేస్తూ పిల్లల్ని సాకింది. నాలుగో తరగతిలోనే తస్లీమాను కాజీపేట హాస్టల్లో వేసేశారు. హన్మకొండ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో ఎంపీసీ చేశారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశారు.గ్రూప్స్ రాయాలంటే కోచింగ్ కు పైసల్లేవు..ఊరి నుంచి వచ్చిన అమ్మ తన వ్యవసాయ కష్టార్జితం 13 వేల రూపాయలు తెచ్చి కాలేజీలో తన కళ్ళ ముందు కడుతుంటే చూస్తూ తల్లడిల్లిపోయింది తస్లీమా! తరువాత కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీకి పొద్దున 8 గంటలకు వెళ్లి రాత్రి ఎనిమిది వరకు చదువుతూ నోట్స్ రాసుకునేది.ఆ లైబ్రరీయే తన జీవితాన్ని మలుపు తిప్పిందని ఆమె చెప్తుంటుంది! అమ్మంటే ప్రాణం.. వ్యవసాయం అంటే ఇష్టం తస్లీమాకు! గ్రూప్స్ రాసేరోజు బోర్డు మీద హాల్ టికెట్ నంబర్ కనిపించక టెన్షన్! అరగంట లేటయిపోయింది.కానీ రిజల్ట్ రోజు పేపర్ లో ఆమె నంబర్ కనిపించింది. ఆమె ఆనందానికి అవధుల్లేవు! తన గురించి చెప్పమంటే ఉద్వేగానికి గురికాకుండా, దుఃఖంలో తడవకుండా, తల్లిని తలుచుకోకుండా మాట్లాడలేదు తస్లీమా!అలాంటి తస్లీమా మొన్న లాక్ డౌన్ కాలంలో తన మండలంలోని రోడ్డు మార్గం లేని గుత్తి కోయిల గూడేలకు ఎమ్మెల్యే సీతక్కతో పాటు, తన సిబ్బందితో కలిసి మూటలెత్తుకొని నడవడం చూశామ్! ఎండల్లో చెమటలు కారంగా నడుస్తూ చెట్ల కింద కూర్చొని ఆకుల్లో అన్నం తినడం, కోయలతో కూర్చొని తినడం, వారికి సాయం చేయడం చూసిన వారేవరూ ఆమెను అభినందించకుండా వుండలేరు ఇట్లా ఈ లాక్ డౌన్ కాలంలో ఎందరికో సాయం చేయడమే కాకుండా కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు చెప్పడం చేశారు తస్లీమా!ఛత్తీస్ గడ్ బయలుదేరిన ఐదు కుటుంబాల వలసకూలీలు దారితప్పి ములుగు చేరుకుంటే వారికి అన్నం వడ్డించి పెట్టి వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు.ఎందరో కూలీలకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందించడం, నీళ్లు సరఫరా చేయడం చేశారు.తండ్రులను కోల్పోయిన పిల్లల్ని చూస్తే తల్లడిల్లిపోతుంది తస్లీమా!ఐదుగురు పిల్లలున్న ఒక రాజస్తానీ చనిపోతే ఆ కుటుంబాన్ని దత్తతకు తీసుకున్నారు తస్లీమా!వారికి అన్నీ తానే! వారికి తగిన కార్డులు, ఒక ప్లాట్ ఇప్పించారు.వారి హిందూ పండుగల్ని వారితో కలిసి సెలబ్రేట్ చేస్తారు.11 ఏళ్ల నుంచి కొండగట్లలో నివసించే గుత్తికోయల గూడేలకు తిరుగుతూనే ఉన్నారు తస్లీమా!గుత్తికోయల పెద్దక్క అని పేరు తెచ్చుకున్నారు. ఈ లాక్ డౌన్ కాలంలో 15 రోజులకు సరిపడా బియ్యం, నిత్యావసరాలు వారికి అందజేశారు.తస్లీమా గురించి పత్రికల విమెన్ పేజెస్ లో చాలా ఆర్టికల్సే వచ్చాయి! ములుగు మండలంలో తస్లీమా అంటే అన్ని వర్గాల వారికి ఎంతో గౌరవం ఉంది! అభిమానులు ఎంతోమంది ఉన్నారు. అనాధలకు, దివ్యాoగులకుమతిస్థిమితం లేనివారికి, ఏ ఆసరా లేక చెట్ల కింద ఉండేవారికి ఇలా అందరికీ సహారా తస్లీమా  తన తండ్రి పేర సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో పిల్లల్ని చేర్చమని కౌన్సిలింగ్ ఇస్తుంటారు. తన మండలంలోని మజీదుల ఇమామ్ లకు కూడా ముస్లిం రెసిడెన్షియల్ స్కూళ్లలో పిల్లల్ని చేర్చమని చెప్పాలని సూచించారు. 'పే బ్యాక్ టు ద సొసైటీ' కాన్సెప్ట్ తెలిసిన హృదయం! పిల్లలకు ఇన్స్ పైరింగ్ స్పీచ్ లు ఇవ్వడంలో ఆసక్తి! ఏదేని కష్టం వస్తే  ఈ అక్కకు కాల్ చేయమని నంబర్ ఇచ్చే పెద్ద మనసు తస్లీమా సొంతం!ఇలా ఎంత చెప్పినా తక్కువే తస్లీమా గురించి! అన్నేసి పనులు చేసి ఉన్నారు.. చేస్తూనే ఉన్నారు! ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్న ఈ తల్లి కాస్త ముస్లిం ఆడపిల్లల బాగోగులపై, చదువుపై, చైతన్యంపై దృష్టి పెట్టాలని కోరుతూ...ఈ భూమి పుత్రికకు.. ఈ తెలుగు బేటీ కి.. తెలంగాణ బిడ్డకు.. ఎవరూ పట్టించుకోని వారిని ఆదరించడానికి ముందు వరుసలో నిలచే ఈ నవ లోక మహిళకు రంజాన్ శుభాకాంక్షలు మనఃపూర్వక అభినందనలు!

Thursday, 21 May 2020

చిరంజీవి ఇంట తలసానితో సినీ ప్రముఖుల భేటీ.. కరోనా కాటులో కుదేలైన సినీ పరిశ్రమపై చర్చ...

*హైదరాబాద్ :  కరోనా నియంత్రణ కోసం అమలుచేస్తున్న లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమస్యలను ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని  పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ సినీ ప్రముఖులకు హామీ ఇచ్చారు. గురువారం జూబ్లీహిల్స్ లోని ప్రముఖ సినీనటులు, పద్మభూషణ్ చిరంజీవి నివాసంలో చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమలోని 14 వేల మంది కార్మికులకు తన సొంత నిధులతో నిత్యావసర సరుకులను అందజేస్తానని మంత్రి ఈ సందర్భంగా  ప్రకటించారు.  ఈ సమావేశంలో పలువురు నిర్మాతలు, దర్శకులు మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు నిలిచిపోయి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న లక్షలాది మంది ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అందరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొనే షూటింగ్ లను నిలిపివేయడం జరిగిందని అన్నారు. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న పరిశ్రమలోని 14 వేల మందికి కరోనా క్రైసిస్ చారిటీ (CCC) ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పరిశ్రమలోని అన్ని వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని సినీమా ప్రొడక్షన్,  పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహించుకునేందుకు, సినిమా దియేటర్ లను తెరిచేందుకు ప్రభుత్వం  అనుమతించాలని కోరారు. లాక్ డౌన్ సమయంలో షూటింగ్ లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో వివరిస్తూ అవుట్ డోర్, ఇండోర్ షూటింగ్ లకు సంబంధించిన మాక్ వీడియో ను ప్రభుత్వానికి సమర్పిస్తామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు వివరించారు. స్పందించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తెలుగు చలనచిత్ర పరిశ్రమ పట్ల ఎప్పుడు సానుకూడా ధోరణితో ఉంటుందని చెప్పారు. దేశంలోనే హైదరాబాద్ నగరం చిత్రరంగానికి హబ్ గా నిలిచిందని అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునేందుకు అనుమతించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. తప్పని సరిగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాస్క్ లను ధరించాలని, శానిటైజేషన్ ఉపయోగించాలని, బౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మాక్ షూటింగ్ నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు. షూటింగ్ ల నిర్వహణకు, దియేటర్ లను తెరిచేందుకు ముఖ్యమంత్రి తో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో పద్మభూషణ్ చిరంజీవి, సేనియర్ నటులు అక్కినేని నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్, C.కళ్యాణ్, దిల్ రాజు, శ్యాం ప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్, దర్శకులు VV,వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, N.శంకర్, FDC మాజీ చైర్మన్ రాం మోహన్ రావు.

Sunday, 17 May 2020

బిజీ.. బిజీగా..ఆర్థికమంత్రి.... పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన హారిష్ రావ్

- ఈ ఆదివారం తెలంగాణ ఆర్థిక మంత్రి బిజీ బిజీగా గడిపారు...పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. సిద్ధిపేట జిల్లా ఇర్కోడ్ గ్రామ శివారులో ఆదివారం సామూహిక గొర్రెల షెడ్లను జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ లతో కలిసి హరీష్ రావు ప్రారంభించారు..కాగా అంతకు ముందు నియోజకవర్గ పరిధిలోని రావురూకుల, తోర్నాల గ్రామాల్లో  50 డబుల్ బెడ్ రూమ్ గృహా ప్రవేశాలు.
- జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గృహ సముదాయ ఫలక ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా విపత్తు లోను తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి - సంక్షేమం లక్ష్యం తో సాగుతోందన్నారు.. ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నా నేరుగా తనను సంప్రదించాలని..వారి సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందజేస్తానని హారిష్ రావు పేర్కొన్నారు.

Friday, 15 May 2020

కన్నీటి కె..కన్నీరొచ్ఛే..వలస వెతలు

కన్నీటికే..కన్నీరొచ్ఛే అని రాసిన కవి రాతలు..ఈ వలస కూలీల విషయంలో నిజంగా నిజమనిపించక మానదు.దేశ వ్యాప్తంగా  వలస  కూలీలు.. కరోనా లాకౌట్ లో కడగండ్ల పాలయ్యారు..60రోజుల్లో....ప్రభుత్వ అధికారులు..స్వచ్ఛంద సంస్థలు.. వ్యాపారులు..ఇచ్ఛిన ఆహారం వారి ఊపిరి ని నిలబెట్టినప్పటికి వెన్నాడిన కష్టాలెన్నో...మొదట్లో దాతలు ఉరుకులు.. పరుగులు.. మీద చక్కగా ఆహారం అందించారు.. కాని ఎన్నిరోజులు సాధ్యం..ఇదే విషయాన్ని మెధావులు నొక్కి చెప్పారు.. లాకౌట్ ఎక్కువ రోజులు కొనసాగితే ఆకలి చావులు చూడాల్సిందే నంటూ డెంజర్ బెల్సు మోగించారు..మరోవైపు వలస కూలీలను కట్టడి చేయడం రాష్ట్రాలకు భారంగా మారింది...మేము స్వంత గ్రామాలకు వెళ్లిపోతామంటూ..వలస కూలీలు ఘర్షణ వాతావరణం సృష్టించారు.
దీంతో కేంద్రం వలస కూలీలు తమ ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తూ.. వారికోసం రైళ్లను నడపాలని రైల్వేస్ ను ఆదేశించింది. దీంతో వలస కూలీల కట్టు తెగింది..అందిన వారు రైలు మార్గం పట్టగా అవగాహన లేని వారు ఎర్రటి ఎండలు సైతం లెక్కచేయకుండా చంటి పిల్లలను చంక నేసుకుని   ఎన్నో వేతలతో ప్రయాణం సాగిస్తున్నారు..

Thursday, 7 May 2020

దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో ప్రమాదాలు.. వైజాగ్ సంఘటనలో బారీగా బాధితులు... విషవాయువుకు పశు పక్షాలు సైతం మృత్యువాత



దేశ వ్యాప్తంగా చత్తీస్ ఘడ్,ఆంధ్రప్రదేశ్, తమిళ నాడు లలోని మూడు పరిశ్రమలలో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి...
దాదాపు 40 రోజుల పైగా పరిశ్రమలు మూతపడి వుండటం ప్రధాన కారణం కాగా.. విపరీతంగా వేసవి వేడిమీ వున్న సమయంలో తిరిగి ప్రారంభించేముందు సరైన భధ్రతా ప్రమాణాలు పాటించకపోవడం కూడా కారణంగా తెలుస్తోంది.

 👉గురువారం తెల్లవారు ఝామున వైజాగ్‌లో గ్యాస్ లీకేజ్  ఘటనలో 
వైజాగ్ లో ఎల్.జి.పాలిమర్సు లో ఉత్పత్తి ప్రారంభించడానికి కంపేనీ సన్నధంకాగా అర్ధరాత్రి 2 గంటల నుంచి గ్యాస్ లీకైంది. రాత్రి 2 గంటల ప్రాంతంలో ప్రారంభం అయ్యిందని ప్రజలందరూ నిద్రలో ఉన్నారని. లీకైనట్టు కనీసం సైరెన్ కూడా వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులు వచ్ఛిన తరువాతే సైరన్ మొగిందని స్థానికులు చెబుతున్నారు.  8మంది మృతి చెందగా..300 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ..అధిక సంఖ్యలో నే బాధితులు స్వల్ప అనారోగ్య ఇబ్బందికి గురైనట్లు వెల్లడించారు.వెంటనే సైరెన్ వేసి, ప్రజలని అప్రమత్తం చేసి ఉంటే.. కొంతలో కొంత ఊరట ఉండేదని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు..కాగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్.జి.పాలిమర్సుపై కేసు నమోదు చేశారు.

👉  చత్తీస్ ఘడ్ లో మరొక సంఘటన  చోటుచేసుకుంది రాష్ట్రంలోని రాయ్ ఘఢ్ జిల్లా..టెట్ల గ్రామంలోని శక్తి  పేపర్ మిల్లులో టాక్సీక్ గ్యాస్ లీకైంది. మిల్లు క్లీనింగ్ పనిలో సంఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది.. దుర్ఘటనలో   ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురి కాగా  ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. రాయ్ఘఢ్ కలేక్టర్  ఎస్.పి.సంతోష్ సింగ్
యశ్వంత్ సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మిల్లు యజమాని సంఘటనను కప్పిపుచ్చుకునేందుకే ప్రయత్నం చేశారని పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని కలేక్టర్ తెలిపారు.. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

👉తమిళనాడు
కడలూరులోని # నీవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో బాయిలర్ పేలుడు సంభవించింది. పేలుడులో దాదాపు 8మంది గాయపడ్డారు

విశాఖ గ్యాస్ లీక్ ఆంశంలో... వేగంగా స్పందించిన ఎ.పి.సి.ఎం వై.ఎస్.జగన్ .... హుటాహుటిన వైజాగ్ పర్యటన.... బాదితులకు పరమార్శ..మృతులకు కోటి పరిహారం.. .

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన తెలిసిన వెంటనే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అధికారులను అప్రమత్తం చేశారు.. అనంతరం ఆయన తన ఛాంబర్ లో ఉన్నతాధికారులతో సమావేశమై ..సంఘటన పూర్వపరాలపై అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం ఆయన హుటాహుటిన విశాఖ వెళ్లారు.. కెజిహెచ్ లో బాధితులను పరమార్శించి వారికి ధైర్యం చెప్పారు.. 

గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం*
*తీవ్రంగా అస్వస్థతకు గురైన వారికి రూ.10లక్షలు*
*స్వల్పంగా అస్వస్థతకు గురైన వారికి రూ. 1 లక్ష*
*ప్రాథమిక చికిత్స తీసుకున్న వారికి రూ.25వేలు*
*ప్రభావిత గ్రామాల్లోని వారికి రూ.10వేలు*
*మరణించిన పశువులకు పూర్తి పరిహారం ప్రకటించారు ప్రమాద ఘటనపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ వేసిన వై.ఎస్.జగన్. మంత్రులను విశాఖలోనే ఉండమని ఆదేశించారు సహాయ కార్యక్రమాలకోసం రెండు రోజులపాటు విశాఖలోనే సీఎస్‌
*అన్నిరకాలుగా ఆదుకుంటామన్న సీఎం తర్వాత అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. వివరాలలోకి వెళితే
హెలికాప్టర్‌లో విశాఖ వెళ్లిన సీఎం
కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.
అందుతున్న వైద్య సౌకర్యాలు, చికిత్సపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం
ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో అధికారులతో సమీక్షా సమావేశం
సమీక్ష తర్వాత మాట్లాడిన సీఎం  ఫ్యాక్టరీ ఉపయోగించుకుంటున్న ముడిపదార్థం ఎక్కువరోజులు నిల్వ ఉంచుకోవడం వల్ల గ్యాస్‌ లీక్‌ అయ్యింది:
గ్యాస్ లీక్ దుర్ఘటన దురదృష్టకరం :
జరిగిన ప్రమాదానికి సంబంధించి లోతుగా అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేస్తాం:
ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్‌ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ, ఇండస్ట్రీస్‌ సెక్రటరీ
పీసీబీ సెక్రటరీ, విశాఖ జిల్లా కలెక్టర్, కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్, విశాఖపట్నం వీరితో కమిటీ :
కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం:
తెల్లవారు జామున ఘటన జరిగినప్పుడు ప్రమాద హెచ్చరిక ఎందుకు రాలేదు? :
హెచ్చరికలు లేకపోవడం అన్నది దృష్టిపెట్టాల్సిన అంశం:
నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం:
ఘటన జరిగిన వెంటనే అధికారులు చాలా బాగా స్పందించారు:
వారిని అభినందిస్తున్నా :
నాలుగున్నర గంటలకే ఏసీపీ కూడా ఘటనా స్థలానికి చేరారు:
అంబులెన్సులు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి, వాటిని తరలించి
దాదాపు 348 మందిని అన్ని ఆస్పత్రుల్లో చేర్పించారు:
పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నవారు కూడా ... ఇప్పుడు వెంటిలేటర్‌కూడా అవసరంలేని స్థాయికి చేరుకున్నారు:
ఇప్పటివరకూ 9 మంది మరణించారని అధికారులు చెప్తున్నారు:
ఈ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా:
మనుషులను వెనక్కి తీసుకురాలేకపోయినా మనసున్న మనిషిగా అన్నిరకాలుగా తోడుగా ఉంటాను:
మరణించినవారి కుటుంబాలకు కంపెనీ తరఫున ఎంత రాబట్టాలో అంత రాబట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం:
చనిపోయిన వారందరి కుటుంబాలకు 1 కోటి రూపాయల పరిహారం:
ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకుంటున్న వారందరికీ రూ. 25వేలు:
అస్వస్ధతతో ఆస్పత్రుల్లో కనీసం రెండు,మూడు రోజులు ఉండాల్సిన పరిస్థితి ఉన్నవారందరికీ కూడా రూ. 1 లక్ష  పరిహారం ఇస్తున్నాం:
తీవ్ర అస్వస్ధతకు గురై వెంటిలేటర్‌ పై చికిత్స పొందుతున్నవారికి రూ.10లక్షలు పరిహారం ఇస్తున్నాం:
ఏ ఒక్కరూ కూడా వైద్యంకోసం ఒక్కరూపాయి కూడా ఖర్చుచేయాల్సిన అవసరం లేదు:
అలాగే గ్యాస్‌ ప్రభావిత గ్రామాల్లో ప్రజలపై ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది:
గ్యాస్‌ కారణంగా
వెంకటాపురం–1, వెంకటాపురం–2, ఎస్సీ– ఎస్టీకాలనీ, నందమూరినగర్, పద్మనాభపురం గ్రామాల్లోని ప్రజలంతా ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరంలేదని అధికారులు పేర్కొన్నారు.
ఈ గ్రామాల్లోని దాదాపు 15వేలమంది ఉంటారని చెప్తున్నారు:
వీరందరికీ రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్ఛారు.
మెడికల్‌క్యాంపులు పెట్టమని కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్ఛారు.
గ్రామాలకు వెళ్లలేని వ్యక్తులకు షెల్టర్లు ఏర్పాటు చేసి మంచి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
కమిటీ రిపోర్టు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
చీఫ్‌ సెక్రటరీ కూడా వచ్చే 2 రోజులు ఇక్కడే ఉంటారని జగన్ పేర్కొన్నారు.
ఇన్‌ఛార్జి మంత్రి కన్నబాబు, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రులు అవంతి, బొత్సలు కూడా ఇక్కడే సహాయకార్యక్రమాలకు పర్యవేక్షణ చేస్తారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
ఈ గ్రామాలకు ఎలాంటి సమస్యరాకుండా చూసుకోమని అధికారులకు ఆదేశాలు ఇచ్ఛామని జగన్ అన్నారు.
ప్రభావిత గ్రామాల్లో కొన్ని పశువులు కూడా చనిపోయాయని చెప్తున్నారు:
దీనికి పూర్తి పరిహారం ఇవ్వాలనిచెప్పామన్నారు
దీనికి అదనంగా పశువుకు రూ.20 వేల చొప్పున ఇవ్వమని ఆదేశాలు ఇచ్ఛారు.
మరణించిన వారిని తీసుకురాలేకపోయినా... ఆయా కుటుంబాలకు తోడుగా ఉంటామన్నారు.
కమిటీ నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని జగన్ తెలిపారు.
తర్వాత బాధిత కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమాలు చేపడతాం:
అందర్నీ ఆదుకోవడానికి ప్రభుత్వం అన్నిరకాలుగా ముందు ఉంటుందని ఎ.పి.ముఖ్యమంత్రి స్పష్టం చేశారు..

Saturday, 2 May 2020

పుణ్య సలీల శ్రీవాత్సవా...సంయుక్త కార్యదర్శి : రక్షణ మంత్రిత్వశాఖ..


ప్రస్తుతం కొంత కాలంగా ప్రతిరోజూ టివిలో కనిపించి కరోనా వైరస్ కల్లోలం..ప్రభుత్వ చర్యలు ఇతరత్రా విషయలను మీడియా ముందు వుంచుతున్న పుణ్య సలీల శ్రీవాత్సవ  గురించి తెలుసుకుందాం
 Biodata
Name : Ms. Punya Salila Srivastava
Identity No. : 01UT022001
Service/ Cadre/ Allotment Year : Indian Administrative Service / A G M U T / 1993
Source of Recruitment : Direct Recruitment
Date of Birth : 25/09/1970
Gender : Female
Place of Domicile : Uttar Pradesh
Mother Tongue : Hindi
Languages Known : English Hindi

   # Date of Start of Central Deputation 23/05/2018
   - Expiry Date of tenure of Central Deputation 22/05/2023
 
S.No. Qualification/University/Institute Subject Division
1 P.G.
Delhi University
St.Stephens College Physics First
2 Graduate
Delhi University
St.Stephens College Physics (hons) First
3 B.Sc.
Delhi University
St Stephens College Delhi University Physics (hons) First
IV. Experience Details
S.No. Designation/Level Ministry/Department
/Office/Location Organisation Experience(major/minor) Period(From/To)
1 Joint Secretary
Joint Secretary M/o Home Affairs
D/o Home
New Delhi Centre Home / Home 23/05/2018 - 22/05/2023 Forenoon
2 Principal Secy
Joint Secretary Education Deptt
Govt. of Delhi
Delhi Cadre (AIS) Education / Human Resource Dev 01/01/2018 - 09/05/2018
3 Secretary
Joint Secretary Education Deptt
Govt of NCTD
Delhi Cadre (AIS) Education / Human Resource Dev 05/01/2015 - 31/12/2017
4 N.A.
Joint Secretary N C T of Delhi Cadre (AIS) / N.Applicable/N.Available 10/06/2014 - 04/01/2015
5 Commissioner-cum secy.
Joint Secretary Shipping, Power, Civil Aviation & PWD Revenue
Secretariat
Andaman & Nicobar Islands Cadre (AIS) Public Works / Public Works 20/10/2011 - 28/11/2014
6 Under Training
Director LBSNAA Mussoorie
Mussoorie Cadre (AIS) Public Administration / Public Administration 20/07/2011 - 20/10/2011
7 On Leave
Director Centre / 01/07/2011 - 15/07/2011
8 On Study Leave Abroad
Director M/o Shipping
U S A Centre Public Administration / Public Administration 26/08/2010 - 30/06/2011
9 On Foreign Training
Director M/o Shipping Centre (Foreign Training) Public Administration / Public Administration 26/08/2009 - 25/08/2010
10 Pvt Secy
Director Equivalent M/o Shipping, Road Tpt & Highways
D/o Shipping Centre Ministers Office / Staff Officers 09/05/2008 - 25/08/2009
11 Director
Director M/o Shipping, Road Tpt & Highways
D/o Shipping Centre Shipping / Transport 17/08/2007 - 08/05/2008
12 Deputy Secretary
Deputy Secretary M/o Shipping, Road Tpt & Highways
D/o Shipping Centre Shipping / Transport 04/07/2005 - 16/08/2007
13 Deputy Commissioner
Deputy Secretary South Delhi Cadre (AIS) District Admn / Land Revenue Mgmt & District Admn 07/12/2004 - 04/07/2005
14 Deputy Commissioner
Deputy Secretary Municipal Corporation of Delhi (MCD)
N C T of Delhi Cadre (AIS) Municipal Administration / Urban Development 12/07/2002 - 06/12/2004
15 Collector & D M
Under Secretary Daman Diu / Dadra Nagar Haveli Cadre (AIS) District Admn / Land Revenue Mgmt & District Admn 19/11/1999 - 30/06/2002
16 Secretary
Under Secretary Culture Deptt
Daman Diu / Dadra Nagar Haveli Cadre (AIS) Cultural Affairs / Culture 19/11/1999 - 30/06/2002
17 Secretary
Under Secretary Rural Dev Deptt
Daman Diu / Dadra Nagar Haveli Cadre (AIS) Rural Development / Rural Dev 19/11/1999 - 30/06/2002
18 Secy (Education)
Under Secretary Education Deptt
Daman Diu / Dadra Nagar Haveli Cadre (AIS) Education / Human Resource Dev 19/11/1999 - 30/06/2002
19 Spl Secy
Under Secretary Food & Civil Supplies Deptt Cadre (AIS) Food & Civil Supplies / Consumer Affairs, Food & PD 19/11/1999 - 30/06/2002
20 Spl Secy
Under Secretary Power Deptt Cadre (AIS) Power / Energy 19/11/1999 - 30/06/2002
21 Spl Secy
Under Secretary Social Welfare Deptt Cadre (AIS) Social Welfare / Social Justice & Empowerment 19/11/1999 - 30/06/2002
22 Spl Secy
Under Secretary Tourism Deptt Cadre (AIS) Tourism / Tourism 19/11/1999 - 30/06/2002
23 Spl Secy
Under Secretary Transport Deptt Cadre (AIS) Transport / Transport 19/11/1999 - 30/06/2002
24 Managing Director
Under Secretary Omnibus Indl Dev Corpn
Daman Diu / Dadra Nagar Haveli Cadre (AIS) Industries / Industries 17/12/1998 - 21/12/1999
25 Director
Under Secretary Industries & Mines
Goa Cadre (AIS) Industries / Industries 01/10/1998 - 11/12/1998
26 Managing Director
Under Secretary Goa Indl Dev Corpn Cadre (AIS) Industries / Industries 10/11/1997 - 30/09/1998
27 Deputy Collector
Junior Scale Goa Cadre (AIS) Sub Divisional Admn / Land Revenue Mgmt & District Admn 05/10/1995 - 09/11/1997
28 S D O
Junior Scale Goa Cadre (AIS) Sub Divisional Admn / Land Revenue Mgmt & District Admn 05/10/1995 - 09/11/1997
V. Mid Career Training Details
S.No. Year Training Name Date From Date To
1 2011 Mid Career Programme for IAS Officers - Phase IV 22/08/2011 14/10/2011
VI. In-Service Training Details
S.No. Year Training Name Institute City Duration (Weeks)
1 2001-2002 Junior Level - 1992 - 95 Batches Dr. Raghunanadan Singh Tolia Uttarakhand Academy of Administration Nainital 2
2 2008-2009 Infrastructure De-Regulation The Energy and Resources Institute (TERI) New Delhi 1
VII. Domestic Training Details
S.No. Year Name Subject Duration
1 2011 MANDATORY TRAINING IAS PHASE IV Public Administration 1Mn 23Days
VIII. Foreign Training Details
S.No. Year Name Subject Duration Country
1 2009 MASTER OF PUBLIC MANAGEMENT Public Administration 1Yr 8Mn 21Days USA

Friday, 1 May 2020

లాక్‌డౌన్‌లోనూ అంద‌రికీ 1వ తేదీనే పింఛ‌న్ డ‌బ్బులు - శైలజ చరణ్ రెడ్డి



లాక్‌డౌన్‌ సమయంలో కూడా అందరికీ ఒకటో తేదీనే పెన్షన్ డబ్బులు అందజేస్తున్న ఆంధ్ర రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి  వారికి ప్రతి ఒక్కరూ  కృతజ్ఞతలు తెలియచేస్తున్నారని, పెన్షన్ పంపిణీ ప్రారంభించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజనల్ కోఆర్డినేటర్, పూతలపట్టు నియోజకవర్గ ఇన్చార్జ్   శైలజ చరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గ్రామ వాలంటీర్ గీతతో కలిసి  ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .

👉 ఎక్క‌డ ఉంటే అక్క‌డే పింఛ‌న్‌
👉 58.22 ల‌క్ష‌ల మంది పింఛ‌న్ దారుల కోసం రూ.1,421.20 కోట్లు జ‌మ చేసిన ప్ర‌భుత్వం
👉 2,37,615 మంది గ్రామ‌, వార్డు వాలంటీర్ల ద్వారా పింఛ‌న్ పంపిణీ
👉 లాక్‌డౌన్‌తో సొంత ఊరికి దూరంగా ఇత‌ర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 13,158 మందికి ప్ర‌స్తుతం వారు ఉన్న ప్రాంతాల్లోనే పింఛ‌న్ డ‌బ్బులు  పోర్టబులిటీ ఆప్షన్ ద్వారా  పింఛ‌న్‌ దారులకు ఇబ్బంది కలగకుండా   పెన్షన్ అందిస్తున్న  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుకు  అందరూ ఆకర్షితులవుతున్నారు  అని ఆమె తెలిపారు
 గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లో బ్యాంకుల ముందు  క్యూ కట్టిన కానీ పింఛ‌న్‌  వస్తుందో  రాదు అని భయంగా ఎదురుచూసే  వాళ్ళము అని ఏ తారీఖున వస్తుందో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో గడ్డు కాలాన్ని  గడిపాము  అని అవ్వలు గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నారు అని  అందుకే చంద్రబాబు నాయుడు గారిని  సాగనంపాo  అని ప్రజలు వ్యక్తం చేసే విధానాన్ని  చూస్తుంటే ఆశ్చర్యం వేసింది అని  శైలజ చరణ్ రెడ్డి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు
  గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం  ప్రజలను గాలికి వదిలేసి  డబ్బులను దండుకున్న ప్రభుత్వమని  ఆమె మండిపడ్డారు  జగన్ ప్రభుత్వం పండువెన్నెల్లో ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం  మండుటెండల  పాలన జరిగిందని శైలజ చరణ్ రెడ్డి చెప్పారు