లాక్‌డౌన్ సమయంలో కూడా అందరికీ ఒకటో తేదీనే పెన్షన్ డబ్బులు అందజేస్తున్న ఆంధ్ర రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి వారికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియచేస్తున్నారని, పెన్షన్ పంపిణీ ప్రారంభించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజనల్ కోఆర్డినేటర్, పూతలపట్టు నియోజకవర్గ ఇన్చార్జ్ శైలజ చరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గ్రామ వాలంటీర్ గీతతో కలిసి ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .
👉 ఎక్కడ ఉంటే అక్కడే పింఛన్
👉 58.22 లక్షల మంది పింఛన్ దారుల కోసం రూ.1,421.20 కోట్లు జమ చేసిన ప్రభుత్వం
👉 2,37,615 మంది గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ
👉 లాక్‌డౌన్‌తో సొంత ఊరికి దూరంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 13,158 మందికి ప్రస్తుతం వారు ఉన్న ప్రాంతాల్లోనే పింఛన్ డబ్బులు పోర్టబులిటీ ఆప్షన్ ద్వారా పింఛన్ దారులకు ఇబ్బంది కలగకుండా పెన్షన్ అందిస్తున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుకు అందరూ ఆకర్షితులవుతున్నారు అని ఆమె తెలిపారు
గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లో బ్యాంకుల ముందు క్యూ కట్టిన కానీ పింఛన్ వస్తుందో రాదు అని భయంగా ఎదురుచూసే వాళ్ళము అని ఏ తారీఖున వస్తుందో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో గడ్డు కాలాన్ని గడిపాము అని అవ్వలు గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నారు అని అందుకే చంద్రబాబు నాయుడు గారిని సాగనంపాo అని ప్రజలు వ్యక్తం చేసే విధానాన్ని చూస్తుంటే ఆశ్చర్యం వేసింది అని శైలజ చరణ్ రెడ్డి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు
గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసి డబ్బులను దండుకున్న ప్రభుత్వమని ఆమె మండిపడ్డారు జగన్ ప్రభుత్వం పండువెన్నెల్లో ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మండుటెండల పాలన జరిగిందని శైలజ చరణ్ రెడ్డి చెప్పారు
No comments:
Post a Comment