Friday, 15 May 2020
కన్నీటి కె..కన్నీరొచ్ఛే..వలస వెతలు
కన్నీటికే..కన్నీరొచ్ఛే అని రాసిన కవి రాతలు..ఈ వలస కూలీల విషయంలో నిజంగా నిజమనిపించక మానదు.దేశ వ్యాప్తంగా వలస కూలీలు.. కరోనా లాకౌట్ లో కడగండ్ల పాలయ్యారు..60రోజుల్లో....ప్రభుత్వ అధికారులు..స్వచ్ఛంద సంస్థలు.. వ్యాపారులు..ఇచ్ఛిన ఆహారం వారి ఊపిరి ని నిలబెట్టినప్పటికి వెన్నాడిన కష్టాలెన్నో...మొదట్లో దాతలు ఉరుకులు.. పరుగులు.. మీద చక్కగా ఆహారం అందించారు.. కాని ఎన్నిరోజులు సాధ్యం..ఇదే విషయాన్ని మెధావులు నొక్కి చెప్పారు.. లాకౌట్ ఎక్కువ రోజులు కొనసాగితే ఆకలి చావులు చూడాల్సిందే నంటూ డెంజర్ బెల్సు మోగించారు..మరోవైపు వలస కూలీలను కట్టడి చేయడం రాష్ట్రాలకు భారంగా మారింది...మేము స్వంత గ్రామాలకు వెళ్లిపోతామంటూ..వలస కూలీలు ఘర్షణ వాతావరణం సృష్టించారు.
దీంతో కేంద్రం వలస కూలీలు తమ ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తూ.. వారికోసం రైళ్లను నడపాలని రైల్వేస్ ను ఆదేశించింది. దీంతో వలస కూలీల కట్టు తెగింది..అందిన వారు రైలు మార్గం పట్టగా అవగాహన లేని వారు ఎర్రటి ఎండలు సైతం లెక్కచేయకుండా చంటి పిల్లలను చంక నేసుకుని ఎన్నో వేతలతో ప్రయాణం సాగిస్తున్నారు..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment