Sunday, 17 May 2020

బిజీ.. బిజీగా..ఆర్థికమంత్రి.... పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన హారిష్ రావ్

- ఈ ఆదివారం తెలంగాణ ఆర్థిక మంత్రి బిజీ బిజీగా గడిపారు...పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. సిద్ధిపేట జిల్లా ఇర్కోడ్ గ్రామ శివారులో ఆదివారం సామూహిక గొర్రెల షెడ్లను జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ లతో కలిసి హరీష్ రావు ప్రారంభించారు..కాగా అంతకు ముందు నియోజకవర్గ పరిధిలోని రావురూకుల, తోర్నాల గ్రామాల్లో  50 డబుల్ బెడ్ రూమ్ గృహా ప్రవేశాలు.
- జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గృహ సముదాయ ఫలక ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా విపత్తు లోను తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి - సంక్షేమం లక్ష్యం తో సాగుతోందన్నారు.. ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నా నేరుగా తనను సంప్రదించాలని..వారి సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందజేస్తానని హారిష్ రావు పేర్కొన్నారు.

No comments:

Post a Comment