Thursday, 7 May 2020

దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో ప్రమాదాలు.. వైజాగ్ సంఘటనలో బారీగా బాధితులు... విషవాయువుకు పశు పక్షాలు సైతం మృత్యువాత



దేశ వ్యాప్తంగా చత్తీస్ ఘడ్,ఆంధ్రప్రదేశ్, తమిళ నాడు లలోని మూడు పరిశ్రమలలో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి...
దాదాపు 40 రోజుల పైగా పరిశ్రమలు మూతపడి వుండటం ప్రధాన కారణం కాగా.. విపరీతంగా వేసవి వేడిమీ వున్న సమయంలో తిరిగి ప్రారంభించేముందు సరైన భధ్రతా ప్రమాణాలు పాటించకపోవడం కూడా కారణంగా తెలుస్తోంది.

 👉గురువారం తెల్లవారు ఝామున వైజాగ్‌లో గ్యాస్ లీకేజ్  ఘటనలో 
వైజాగ్ లో ఎల్.జి.పాలిమర్సు లో ఉత్పత్తి ప్రారంభించడానికి కంపేనీ సన్నధంకాగా అర్ధరాత్రి 2 గంటల నుంచి గ్యాస్ లీకైంది. రాత్రి 2 గంటల ప్రాంతంలో ప్రారంభం అయ్యిందని ప్రజలందరూ నిద్రలో ఉన్నారని. లీకైనట్టు కనీసం సైరెన్ కూడా వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులు వచ్ఛిన తరువాతే సైరన్ మొగిందని స్థానికులు చెబుతున్నారు.  8మంది మృతి చెందగా..300 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ..అధిక సంఖ్యలో నే బాధితులు స్వల్ప అనారోగ్య ఇబ్బందికి గురైనట్లు వెల్లడించారు.వెంటనే సైరెన్ వేసి, ప్రజలని అప్రమత్తం చేసి ఉంటే.. కొంతలో కొంత ఊరట ఉండేదని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు..కాగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్.జి.పాలిమర్సుపై కేసు నమోదు చేశారు.

👉  చత్తీస్ ఘడ్ లో మరొక సంఘటన  చోటుచేసుకుంది రాష్ట్రంలోని రాయ్ ఘఢ్ జిల్లా..టెట్ల గ్రామంలోని శక్తి  పేపర్ మిల్లులో టాక్సీక్ గ్యాస్ లీకైంది. మిల్లు క్లీనింగ్ పనిలో సంఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది.. దుర్ఘటనలో   ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురి కాగా  ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. రాయ్ఘఢ్ కలేక్టర్  ఎస్.పి.సంతోష్ సింగ్
యశ్వంత్ సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మిల్లు యజమాని సంఘటనను కప్పిపుచ్చుకునేందుకే ప్రయత్నం చేశారని పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని కలేక్టర్ తెలిపారు.. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

👉తమిళనాడు
కడలూరులోని # నీవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో బాయిలర్ పేలుడు సంభవించింది. పేలుడులో దాదాపు 8మంది గాయపడ్డారు

No comments:

Post a Comment