Saturday, 26 December 2020

పందళ రాజు ప్రతినిధిగా మూలంతిరునాల్ ఎన్.శంకర్..

కేరళ/పందళం : శబరిమల అయ్యప్పకు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే మకరజ్యోతి కార్యక్రమానికి ముందుగా అయ్యప్పకు పందళరాజు చేయించిన తిరువాభరణాలను అలకరించే అనావాయితి.ఈ అభరణాలు పందళం నుండి శబరిమాలకు కాలినడకన చెట్టు..పుట్ట..కొండాకోన దాటి దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి అయ్యప్పను చేరుతాయి.దారిపొడవునా ఈ అభరణాలు ప్రయాణం చేసినంత దూరం ఆలయ సిబ్బంది, డోలీలతో పాటు..కేరళ పోలీసులు వెంట వుంటారు.ఈ ఏడాది ఈ అనవాయితి కొనసాగించేందుకు అభరణాల వెంట  పందళ రాజు ప్రతినిధిగా మూలంతిరునాల్ ఎన్.శంకర్ వుంటారు. ఈ మేరకు పందళరాజ వంశీకులు ఓ లేఖను విడుదల చేశారు.
 అసలు ఈ తిరువాభరణాలు ఏమిటి ? 

అంటే వీటిని పందళ రాజు కొన్ని వేల సంవత్సరాల క్రిందట చేయించారు అని తెలుస్తోంది.

 సంవత్సరకాలం అంతా పందళ రాజ ప్రసాదంలోని "స్రంపికల్ భవనం"లో  అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచబడతాయి.మకర జ్యోతి కి వెళ్ళలేని భక్తులు ఈ ఆభరణాలను మండలపూజా  సమయంలో ఇక్కడ  దర్శించుకోవచ్చును. 
మళయాళ పంచాగం(కొల్ల వర్షం) లోని ధనుర్మాసం ఇరవై ఎనిమిదో రోజున అంటే జనవరి పన్నెండో తారీఖున తిరువాభరణ మూడు పెట్టెలకు ప్రత్యేక పూజల చేస్తారు. ఈ మూడు పెట్టెలలో అన్నిటికన్నా పెద్దది  అయిన  తిరువాభరణం పెట్టిలో బంగారు కిరీటాలు, కవచం, హారాలు, ఉంగరం, లక్ష్మీ రూపు, పెద్ద, చిన్న ఖడ్గాలు, పూలు ఉంచడానికి వాడే పళ్ళెము, స్వామి వాహనాలైన గజము, పులి బంగారు బొమ్మలు ఉంటాయి. 
రెండోది  అయిన కొడి పెట్టిలో  స్వామి వారి ధ్వజాలు, అన్నిటికన్నా చిన్నదైనా "వెళ్లి పెట్టి"లో వెండి పూజా సామాగ్రి ఉంటాయి.
అనంతరం తెల్లవారు జాము నాలుగు గంటలకు పందళ రాజు నియమించిన అధికారి ఆధ్వర్యంలో మూడు తిరువాభరణ  పెట్టెలను దీక్షలో ఉన్న స్వాములు శిరస్సున ధరించి నడుచుకొంటూ శబరిమల బయలు దేరుతారు.వీరిని అనుసరిస్తూ వేలాది మంది భక్తులు, కాపలాగా రక్షక భటులు ! 
వారి తొలి మజిలీ ఆరన్ముల శ్రీ పార్ధసారధి ఆలయం. తిరువాభరణ యాత్ర అక్కడికి చేరుకొనే సరికి మధ్యాహన్నం అవుతుంది. సరిగ్గా అదే సమయానికి సన్నిధానం పైన ఒక "కృష్ణ పక్షి" (గరుడ)ఎగురుతుంది. పక్షి రాకతో తిరువాభరణాలు బయలుదేరాయి అన్న సంకేతం ఆలయం వద్ద ఉన్న వారికి అందుతుంది. ఈ ఎనభై మూడు కిలోమీటర్ల దారిలో వచ్చే గ్రామస్థులు మహదానంతో స్వామి వారి ఆభరణాలకు ఘన స్వాగతం పలుకుతారు. 
మార్గ మధ్యలో విశ్రాంతికి, భోజనాదులకు ఆలయాలలో విడిది చేస్తారు. ఇలా తిరువాభరణ యాత్ర మకర సంక్రాంతి నాటి మధ్యాహన్నం పంబా తీరం చేరుతుంది. అక్కడ స్నానాదులు, పూజలు పూర్తి చేసుకొని సాయంత్రం అయిదు గంటలకు సన్నిధానం చేరుకొంటాయి. తిరువాభరణాలు ఆలయం చేరిన దగ్గర నుండి భక్తులలో  మరి కొద్దీ సేపట్లో మకర జ్యోతి దర్శనం, అనంతరం తిరువాభరణ దారి అయిన శ్రీ ధర్మశాస్త దర్శనం చేసుకోబోతున్నామన్నసంతోషం మొదలవుతుంది. సంధ్యా చీకట్లు ఆవరించుకొంటున్న సమయంలో స్వర్ణాభరణ భూషితులైన శ్రీ మణికంఠ స్వామికి మేల్ సంతి హారతి ఇస్తారు. వెంటనే పొన్నాంబల మేడు నుండి మకర జ్యోతి కనిపిస్తుంది. అవధులు దాటిన ఆనందంతో లక్షలాది మంది భక్తులు "స్వామి శరణం!అయ్యప్ప శరణం!" అంటూ చేసే శరణ ఘోషతో శబరి కొండలు మారు మోగుతాయి. 
శ్రీ ధర్మశాస్త ఈ ఆభరణాలను ధరించి ఐదు రోజుల పాటు దర్శనమిస్తారు. చివరి రోజున పందళ రాజు పూజ చేసుకొన్న తరువాత ఆలయాన్ని మరుసటి నెల పూజల దాకా మూసివేస్తారు.పందళ రాజు తిరువాభరణాలతో తిరుగు ప్రయాణం మొదలుపెడతారు.మార్గ మధ్యలో వచ్చే రేణి పేరునాడ్  గ్రామంలో ఉన్న శ్రీ ధర్మశాస్త కి తిరువాభరణాలను ఒక రోజు అలంకరిస్తారు. ఇక్కడి ఆలయం శబరిమల ఆలయం ఒక్కసారే నిర్మించారని అంటారు. జనవరి ఇరవై మూడో తారీఖు నాటికి తిరువాభరణాలు పందళ రాజా భవనం లోని "స్రంపికల్ భవనం". చేరుకొంటాయి. తిరిగి వీక్షించాలంటే సంవత్సరం పాటు ఎదురు చూడాల్సినదే!!

Friday, 25 December 2020

తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి సందడి... బంగారు రధంపై మలయప్ప... ఉత్తరద్వారాన కొలువు తీరిన భద్రాద్రి రాముడు...

తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి భక్తి శ్రద్దాలతో నిర్వహించారు.. తిరుమలలో ఉత్తర ద్వారం లో నుండి శ్రీనివాసుని భక్తులు దర్శించుకున్నారు.. మరోవైపు మలయప్ప శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ విధుల్లో బంగారు రధంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్ఛారు... అంధ్రుల ఆయోధ్య భధ్రాచలంలో సీతారాములు లక్షమణ హనుమంత..గరుడ పరివారంతో ఉత్తరద్వారంలో కోలుతీరి..భక్తులకు దర్శనం ఇచ్ఛారు..ద్వారకాతిరుమలలో వెంకన్న..మంగళగిరి పానకాల నరసింహుడు.. వేములవాడ రాజన్న .యాదాద్రి గుట్టపై లక్ష్మీ నరసింహుడు అందుగలడిందులేడన్న చందంగా తెలుగు రాష్ట్రాల లో అన్ని దేవాలయాలలో ఉత్తర ద్వారంలో దేవేరులతోకూడి స్వాములు దర్శనం ఇచ్ఛారు... 

Sunday, 20 December 2020

ముందు రొడ్డు వేసేద్దాం... తరువాత తవ్వి పొద్దాం...

ఖమ్మంలో.. రోడ్డు డివైడయర్స్ పనులు నిర్మాణం చక చక సాగుతున్నాయి.. రాపర్తి నగర్ నుండి టి.ఎన్ జివో వైపు కొద్ది రోజుల క్రితమే చక్కగా సిమెంట్ రోడ్డు నిర్మాణం చేశారు.. చాలా బాగుంది ఆ ప్రాంత  ముచ్ఛట పడేలోపే రెండు మూడు కాలువ ల కోసం అంటూ రెండు.. మూడు చోట్ల సిమెంట్ గొట్టాలు వేసేందుకు తవ్వి పోశారు... చాలి చాలకుండా మట్టి పోసి వదిలేయడం వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. దీంతో ఆదే రోడ్డులో నివాసం ఉంటున్న కొందరు శ్రమదానం చేసి..కొంత మట్టి పోసి రోడ్డుకు సమం చేశారు.. కాగా గత మూడు రోజులుగా..డివైడర్ల కోసం రోడ్డు మధ్యలో తవ్వకాలు మోదలు పెట్టారు..ఈసారి డివైడర్ల నిర్మాణం లేని రోడ్డు డైవర్షన్ల దగ్గర కూడా డ్రిల్లింగ్ చేయడం కొసమెరుపు.. ఇదేంటి ఇలా తవ్వకాలు చేస్తున్నారు అని అడిగితే లైను తప్పకుండా వుండాటానికి తవ్వకాలు చేస్తున్నామంటూ సమాధానం.. బస్ డిపో రోడ్డులో కూడా ఇలాగే తవ్వేసి వదిలి వేయడంతో అక్కడ రోడ్డు డైవర్షన్ల దగ్గర పెచ్ఛులతో రోడ్డుకనిపిస్తోంది..ప్రణాలిక లేకుండా తవ్వి పోయడం పట్ల ఆ ప్రాంత వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.....  

Tuesday, 15 December 2020

ఆల్లం టీ ముందు అన్ని బలాదూరే అంటున్న కల్వకుంట్ల కవిత...

MLC కల్వకుంట్ల కవిత ఓ టీ కప్పుతో కనిపించారు.. International TEA Day సందర్భంగా ఆమే  టీ ని ఇష్టపడేవారికి శుభాకాంక్షలు తెలిపారు. ఓ కప్పు అల్లం టీ తాగడం వల్ల ఉత్సాహం.. ఉల్లాసం...ఆనందం వుంటుందని పేర్కొన్నారు..
Nothing feels better than a piping hot cup of Ginger Tea or what we fondly call Allam Chai in the middle of a super hectic day! 
Here, I share my selfie with my cup of tea, would absolutely enjoy looking at your selfie with a cup of tea too! 
#InternationalTeaDay

Friday, 11 December 2020

శ్రీ‌నివాస‌మంగాపురంలో ఏకాంతంగా కార్తీక వ‌న‌భోజ‌నం


టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం కార్తీక వనభోజన కార్యక్రమం జ‌రిగింది. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.
ఇందులో భాగంగా శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులను ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పానికి వేంచేపు చేశారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తరువాత అలంకారం, వ‌న‌భోజ‌నం, అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం నిర్వహించారు.
ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సూప‌రింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయ‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Thursday, 3 December 2020

క్లాస్ రూమ్‎లో పెళ్లి చేసుకున్న టీనేజ్ ప్రేమికులు


కాకినాడ :  గోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పెళ్లి కలకలం సృష్టించింది. కాలేజీ నడుస్తున్న సమయంలో క్లాస్ రూమ్‎లోనే పెళ్లి చేసుకున్నారు మైనర్లు. క్లాస్ రూమ్ లోనే అమ్మాయికి పసుపుతాడు కట్టి, నుదిటిపై బొట్టు పెట్టాడు అబ్బాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  మైనర్లు వివాహం నవంబర్ 17న జరిగినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో కాలేజీలో పెళ్లి జరిగిన వీడియోలు వైరల్‎గా మారాయి. వైరల్ అయిన వీడియో, ఫోటోలు కాలేజీ ప్రిన్సిపాల్ వరకు వెళ్లాయి. విషయం తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ ఇద్దరు విద్యార్థులకు గట్టి వార్నింగ్‎ ఇచ్చాడు. అంతేకాదు వీరికి సహాయం చేసిన మరో విద్యార్థికి కూడా టీసీ ఇచ్చి కాలేజీ నుంచి ముగ్గురిని పంపిచారు.

Wednesday, 2 December 2020

తిరుమల‌వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా అచ్యుతార్చ‌న‌..గోపూజ‌...

 కార్తీక మాసంలో టిటిడి త‌లపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా బుధ‌వారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో అచ్యుతార్చ‌న‌, గోపూజ శాస్త్రోక్తంగా జ‌రిగాయి. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.
ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని వ‌సంత మండ‌పానికి వేంచేపు చేశారు. ఈ సంద‌ర్భంగా వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ గోవు స‌క‌ల దేవ‌తా స్వ‌రూప‌మ‌న్నారు. గోధూళిని తాకితే వాయువ్య స్నానం చేసిన ఫ‌లితం ద‌క్కుతుంద‌ని, గోదానం వ‌ల్ల 14 లోకాల్లోని దేవ‌త‌ల ఆశీర్వాదం ల‌భిస్తుంద‌ని పురాణాల ద్వారా తెలుస్తోంద‌న్నారు.ముందుగా కార్తీక విష్ణుపూజా సంక‌ల్పం చేసి ప్రార్థ‌నా సూక్తం, విష్ణుపూజా మంత్ర ప‌ఠ‌నం చేశారు. ఆ త‌రువాత స్వామి, అమ్మ‌వార్ల‌కు తిరువారాధ‌న చేశారు. అనంతరం క‌పిల గోవుకు, దూడకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హార‌తి స‌మ‌ర్పించారు. గోప్ర‌ద‌క్షిణ చేశారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది.

ఉద్యమనేత వారసుణ్ణి.. ప్రతిపక్షాలకు భయపడను.. మంత్రి అజయ్ కుమార్ వెల్లడి.


ఖమ్మం :  తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు ఉధ్యమాల నేత అని ఆయన వారసునిగా ఖమ్మం జిల్లా   అభివృద్ధిని  ఉధ్యమంగా చేపట్టి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు  తెలంగాణ రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలో నిర్మాణంలో నూతన ఐ.టి.హబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు..
ఖమ్మం నగరం చుట్టు 11 కిలోమీటర్ల మేరకు పలు రకాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని..కొన్ని పూర్తి  కావడంతో ఆయా ప్రాంతాల్లో చక్కటి వాతావరణం నెలకొన్నదని. చెప్పారు.
ఆహ్లాదకరమైన ఖమ్మం లక్ష్యంగా ముందుకు సాగుదామని ఆయన పిలుపు నిచ్చారు..
GHMC ఎన్నికల్లో తనపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని..
పోలింగ్ తేదీ నాడు తను ఎం.ఎల్.ఏ క్యార్టర్సుకు పరిమితమైనట్లు చెప్పారు..
GHMC ఎన్నికల్లో తెరాస విజయం తధ్యమని ఆయన నొక్కి చెప్పారు..

Tuesday, 1 December 2020

ఓటర్ల తీరుపై సజ్జనార్ అసంతృప్తి...సపరేట్ ట్రీట్మెంట్ వుండాలని వ్యాఖ్య...


జి.హెచ్.ఎం.సి. ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడంపై సీపీ సీరియస్ అయ్యారు. ఓటు వేసిన వారిని వేయనవారికి వేరే వేరేగా ట్రీట్ చేయాలన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పోలీంగ్ భారీగా తగ్గిన విషయం తెలిసిందే.


గ్రేటర్ ఎన్నికల పోలింగ్ పై సైబరాబాద్ సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ శాతం తగ్గడం బాధాకరమన్నారు. దీనిపై సమాజం ఆలోచించాలన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కేవలం 30 నుంచి 35 శాతం పోలింగ్ శాతం మాత్రమే నమోదయ్యిందని ఆయన భావించారు. కోట్లు ఖర్చు పెట్టి, ప్రజల సొమ్ముతో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఓటు వేసిన వారికి ఓ రకంగా ఓటు వేయని వారికి మరోరకంగా ట్రీట్ చేయాలన్నారు. ఓటు వేసిన వారికి ప్రొత్సాహకాలు అందించాలన్నారు. స్పెషల్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు. ఓటు వేసిన వారికి అన్నిరకాల సదుపాయాలు కల్పించాలన్నారు.

మరోవైపు ఓటు వేయని వారికి పథకాలు ఇవ్వకుండా నిబంధన తేవాలన్నారు. విద్యార్థులు సీట్లు పొందకుండా నిబంధన పెట్టాలన్నారు. జాబ్‌ అవకాశాలు విషయంలో కూడా ఈ వ్యత్సాసం చూపించాలన్నారు. దీనిపై యంత్రాంగంతో పాటు, ఎన్నికల కమిషన్ కూడా ఆలోచించాలన్నారు. దీనిపై రాజకీయ పార్టీలు, సీనియర్ ఐపీఎస్ అధికారులతో కమిటీ వేసి ఓ నిర్ణయం తీసుకుంటే బావుంటుందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఓటు హక్కుపై ఈసీ మరింత అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల సందర్భంగా నగరంలో పలుచోట్ల పర్యటనలు చేశామన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో ఎప్పుడూ లేనంతగా పోలింగ్ శాతం తగ్గడంపై రాజకీయ నిపుణులు సైతం అసహనం వ్యక్తంచేస్తున్నారు. యువత
ఓట్లు వేయకపోవడం చాలా బాధాకరమన్నారు. ఐటీ సెక్టార్ వాళ్లు సెలవులు వస్తే వెళ్లిపోతున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, మీడియా ముందు చర్చల్లో మాట్లాడటానికి చదువుకున్నవాళ్లు ఆసక్తి చూపుతున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతే తప్పా ఓటు వేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదన్నారు. గతఎన్నికలతో పోలిస్తే భారీగా ఓటింగ్ తగ్గడంపై విస్మయం చెందుతున్నారు. 2009లో 45. 27 శాతం, 2014లో 50.86 శాతం పోలింగ్ నమోదు అయ్యింది