Friday, 11 December 2020

శ్రీ‌నివాస‌మంగాపురంలో ఏకాంతంగా కార్తీక వ‌న‌భోజ‌నం


టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం కార్తీక వనభోజన కార్యక్రమం జ‌రిగింది. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.
ఇందులో భాగంగా శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులను ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పానికి వేంచేపు చేశారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తరువాత అలంకారం, వ‌న‌భోజ‌నం, అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం నిర్వహించారు.
ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సూప‌రింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయ‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment