Friday, 30 April 2021
జర్నలిస్టులకు హెల్ప్ డెస్క్ ... రేపటి నుండి ప్రత్యేక వాట్సాప్ నెంబర్..
లాక్ డౌన్ ఆలోచన లేదు..!! ప్రదాని మోదీ
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. దేశంలోని కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ కార్యక్రమం, చర్యలపై చర్చిస్తున్నారు. కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో వర్చుపల్ పద్దతిలో ఈ సమావేశం జరుగుతోంది.
ఈ సందర్భంగా *దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు.* కరోనా కేసుల ఆధారంగా లాక్‌డౌన్‌పై *ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని మోదీ తెలిపారు.* కంటైన్‌మెంట్ జోన్లను గుర్తించి కఠిన ఆంక్షలు అమలు చేయాలని, టెస్టుల సంఖ్యను పెంచాలని మోదీ సూచించారు.
Thursday, 29 April 2021
లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదు : మంత్రి ఈటల స్పష్టీకరణ
తెలంగాణలో లాక్డ్ డౌన్ ఆలోచన లేదు..
Tuesday, 27 April 2021
కాళేశ్వరునికి ఏకాంతంగా పూజలు.. దర్శనలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన....
Wednesday, 21 April 2021
సీఎం కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు : వైద్యులు
*హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు.సీఎంకు కొవిడ్ లక్షణాలు పూర్తిగా పోయాయని, ఆక్సిజన్ లెవల్స్ బాగానే ఉన్నాయని ఆయన వెల్లడించారు. *ఆరు రకాల వైద్యపరీక్షలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిర్వహించారు.
సి రియాక్టివ్ ప్రోటీన్ (సీఆర్ పీ) డైమర్
ఐఎల్ 6
లివర్ ఫంక్షన్ టెస్ట్,
కంప్లీట్ బ్లాక్ పిక్చర్,
సిటీ స్కాన్, చెస్ట్ ఎక్స్ రే కూడా తీశారు. 40 నిమిషాల పాటు వివిధ పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్కు బయలుదేరారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన వ్యక్తిగత డాక్టర్ ఎమ్‌వీ రావు తెలిపారు. జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో సీఎం కేసీఆర్‌కు రాపిడ్ టెస్టులు చేశామని, కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన చెప్పారు. ఫామ్ హౌస్‌లో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారన్నారు. ఒక వైద్య బృందం కేసీఆర్ ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షిస్తోందని డాక్టర్ ఎమ్‌వీ రావు తెలిపారు.
సీఎం కేసీఆర్‌కు బుధవారం సాధారణ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. సిటీ స్కానింగ్‌లోనూ ఎలాంటి సమస్య కనిపించలేదని తెలిపారు.
త్వరలోనే ఆయన విధులకుహాజరయ్యే అవకాశం ఉందని ఎంపీ రావు పేర్కొన్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటవ్ నిర్ధారణ కావడంతో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో హోంఐసోలేషన్‌లో ఉన్నారు.
ఇవాళ సాయంత్రం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం సిటీ స్కానింగ్‌తోపాటు మరికొన్ని సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు.
TN GOVERNOR OFFERS PRAYERS TO HILL LORD_________!!
అంజనాద్రే హనుమ పుట్టిన నెలవు...టిటిడి వెల్లడీ..
*ఓం నమో వేంకటేశాయ🙏*
*తిరుమల :
*హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ అధికారిక ప్రకటన*విడుదల చేసింది.
అంజనాద్రి కొండలో హనుమంతుడు జన్మించాడని ఆధారాలతో నిరూపించేందుకు 2020 డిసెంబరులో టీటీడీ ఓ కమిటీని నియమించింది. అంజనాద్రిలోనే హనుమంతుడు జన్మించాడని రుజువు చేసేందుకు బలమైన ఆధారాలు సేకరించినట్లు కమిటీ సభ్యులు ఈవోకు తెలిపారు.అనంతరం
*తిరుమల అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని పేర్కొంది.. ఈ మేరకు..జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ మురళీధర్ శర్మ* ఓ ప్రకటన విడుదల చేశారు.
*మల సప్తగిరుల్లోని అంజనాద్రి హనుమంతుడి జన్మస్థలంగా టీటీడీ వివరణ*
*ఆకాశ గంగా తీర్థం లో పన్నెండేళ్ళపాటు అంజనాదేవి తపస్సు*చేసినట్లు పురణాల ద్వారా వెల్లడి అవుతోంది అన్న కమిటీ సభ్యులు
*నాలుగు నెలలుగా పండితులంతా కలిసి ఆధారాలు సేకరించారని తెలిపారు.
*అంజనాద్రి పై వెలసిన జపాలి తీర్థం హనుమంతుని జన్మ స్థలంగా పరిశోధన లు చెబుతున్నాయన్నారు.
*పౌరాణిక వాజ్మయ శాసన చారిత్రిక ఆధారాలను సేకరించిన ఆనంతరం తాము నిర్థారణకు వచ్ఛినట్లు కమిటీ వెల్లడి.
రామ భక్త హనుమాన్...
ఆయన భక్తులకి దేవుడు! అదే సమయంలో తానే స్వయంగా మహాభక్తుడు! ఒక భక్తుడే.. దేవుడై పూజలందుకోవటం.. కేవలం హనుమంతుడి విషయంలోనే సాధ్యం!
ఆంజనేయుడనగానే మనకు శ్రీరామ భక్తుడు గుర్తుకు వస్తాడు. ఎక్కడెక్కడ రామ నామం వినిపిస్తుందో అక్కడక్కడ మారుతి ఇప్పటికీ, ఎప్పటికీ ఆనందబాష్పాలు రాలుస్తూ కూర్చుంటాడట! అంటే, మనకు రామదూత రక్షణ, అనుగ్రహం కావాలంటే ‘’రామ’’ అని పలకటమే మార్గం. ఆయన అమాంతం వచ్చి మన వద్ద వాలిపోతాడు. అటువంటి చిరంజీవి అయిన భవిష్యత్ బ్రహ్మ.. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు! చైత్ర మాసంలో రామ నవమి తరువాత వచ్చే పౌర్ణమి నాడు కొన్ని చోట్ల హనుమాన్ జయంతి జరుపుతుంటారు. అయితే, చైత్ర పౌర్ణమి ఆంజనేయుని పుట్టిన రోజు కాదు. అది హనుమద్ విజయయాత్ర. సీతమ్మను దర్శించి తిరిగి వచ్చిన మారుతిని శ్రీరామచంద్రుడు గౌరవించిన రోజని పండితులు చెబుతుంటారు. అసలు హనుమద్ జయంతి మాత్రం వైశాఖ బహుళ దశమి రోజున.
హనుమంతుడ్ని రామాయణంలో ఒక పాత్రలా కాక ఒక పరబ్రహ్మ స్వరూపంగా దర్శించిన మహర్షి పరాశరుడు. ఆయన వ్యాస భగవానుని తండ్రి. అతడు అందించిన మహా పవిత్ర గ్రంథం పరాశర సంహిత. అందులో చెప్పిన శ్లోకమే మనకు ఆంజనేయ జయంతి జరుపుకోవడానికి ప్రమాణం. ఇక పరాశర సంహిత ప్రకారం వైశాఖ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే దశమి నాడు హనుమాన్ జయంతి జరుపుకోవటం తెలుగు ప్రాంతంలో తరతరాలుగా వస్తోంది. మన రామాలయాలు, హనుమదాలయాలు వైశాఖ బహుళ దశమినాడు మహోత్సవాలకు కేంద్రాలవుతాయి.
ఒక్కసారి ఆంజనేయ అవతరణంలోకి తొంగిచూస్తే హనుమ రుద్రాంశ సంభూతుడు. ఆయన శివుడే! ఒకానొక సమయంలో గార్ధభాసురుడు అనే రాక్షసుడ్ని సంహరించాల్సి వస్తే విష్ణువు ఆ పనికి పూనుకున్నాడట. కానీ, శంకరుడు ఆ పని నారాయణుడు చేయలేడని పందానికి దిగాడట. చివరకు, గార్ధభాసురుని గోవిందుడే హతమార్చాడు. పందెంలో తాను ఓడిపోయినందుకు కైలాసనాథుడు వైకుంఠధామునికి దాస్యం చేస్తానని అన్నాడు. కానీ, లక్ష్మీపతి ఆ అవసరం వచ్చినప్పుడు చేద్దువుగాని అని మహాదేవునికి చెప్పాడు.
రావణాసుర వధకి విష్ణువు రాముడై వచ్చే ముందు ఇతర దేవతలు అందరూ తమతమ అంశలతో భువిపై వానర, భల్లూకాలుగా జన్మించారు. వారిలో ఒకడిగా పరమ శివుడు తన అంశని అవతరింపజేశాడు. ఆ రుద్రాంశ స్వరూపుడే మన ఆంజనేయుడు! ఆయన పుత్రుడి కోసం తపమాచరించిన కేసరీ సతీ అయిన అంజనా దేవీ గర్భంలో వాయు దేవుని వరంగా ప్రభవించాడు. పైగా హనుమ జననం మన తిరుమల కొండల్లోనే జరిగింది. ఇప్పటికీ ఏడు కొండల్లో ఒక దానికి అంజనాద్రి అనటం అందుకే! అక్కడే ఆంజనేయుని తల్లి నిష్ఠగా తపస్సు చేసి వాయు దేవుని వరంతో మహావీరుడ్ని తనయుడుగా పొందింది.
హనుమంతుడు పెరిగి పెద్దవాడై వాలి తమ్ముడైన సుగ్రీవునికి మంత్రి అయ్యాడు. వాలి భయంతో భార్యని, రాజ్యాన్ని వదిలి కొండపై బ్రతుకుతోన్న సుగ్రీవుడికి మళ్లీ రాజ్యం, భార్య, మరీ ముఖ్యంగా, రామానుగ్రహం కలిగింది హనుమ కారణంగానే! ఆయన దేవుడుగా భావించే శ్రీరాముడికి కూడా సీతమ్మ జాడ వెదికి పెట్టాడు. ఇలా దేవుడికే సాయం చేసిన భక్తుడు ఆంజనేయుడు తప్ప మరొకరు ఎవరూ మనకు కనిపించరు! శ్రీరాముడంతటి వాడికి భార్యా వియోగం పోగొట్టిన వాడు, తమ్ముడైన లక్ష్మణునికి సంజీవని పర్వతం మోసుకొచ్చి ప్రాణదానం చేసిన వాడు మన సంజీవరాయుడు! రాముడి నుంచీ మోక్షం కూడా కోరని పరమ నిస్వార్థ, మహా పవిత్ర భక్త శిఖామణి ఆంజనేయుడు!
హనుమంతుని దేవుడుగా భావించి పూజించవచ్చు. ఆయన లంకకి వెళ్లి ఒంటరిగా సీతమ్మ జాడ తెలుసుకుని తిరిగొచ్చిన సుందర కథనంలో ఆయన ధైర్య, వీర్య, సాహసాల నుంచీ ప్రేరణ పొందవచ్చు. అలాగే, శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన కర్మఫల త్యాగం కూడా మారుతిలో ప్రత్యక్షంగా దర్శించవచ్చు. ఆయన ఏదీ చేయకుండా ఉండలేదు. అలాగని ఏదీ కూడా ప్రతిఫలంపై దృష్టితో చేయలేదు. రాముని కోసం కర్తవ్యంగా చేశాడు. ఆ కర్తవ్య దీక్ష మనమూ అలవర్చుకుంటే విజయాలు ఉప్పెనలా వస్తాయి. ఓటములు ఎన్నొచ్చినా మనల్ని పెకలించకుండా వాటి దారిన అవి పోతాయి. అందుకే, ఆంజనేయుడ్ని పూజించాలి. అంతకంటే ఎక్కువగా ఆయన గాథలు, వ్యక్తిత్వంలోంచి ఎంతో ఎంతెంతో నేర్చుకోవాలి…
జై శ్రీరామ్! జై హనుమాన్!
కరోనా నిబంధనల మధ్య భధ్రాద్రి రాముని కళ్యాణం.. పాల్గొన్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి..పువ్వాడ ఆజయ్ కుమార్
Tuesday, 20 April 2021
ప్రయాణ సమయం కుదించిన..ఆర్టీసీ.. రాత్రి 9గంటలకు డిపోకు చేరాలని సూచన...
Sunday, 18 April 2021
BHASHYAKARULA SATTUMORA PERFORMED AT TIRUMALA...
Saturday, 17 April 2021
మాస్కును ఛాలెంజ్ గా స్వీకరిధ్ధాం... వైకాపా మహిళా నేత శైలజఛరణ్ రెడ్డి పిలుపు...
Tuesday, 13 April 2021
భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రి వేడుకల ఆరంభం..
Sunday, 11 April 2021
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన మహిళ కానిస్టేబుళ్ల జరిమానా*.
Friday, 9 April 2021
తిరుమలలో 12 మంది అర్చకులకు కరోనా పాజిటివ్
తిరుమల తిరుపతి దేవస్థానం లో పనిచేస్తున్న 12 మంది అర్చకులు కరోనా బారినపడ్డారు. గత ఏడాదిలో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో కూడ అర్చకులు కరోనా బారినపడ్డారు. అప్పట్లో కరోనా భయానికి కొన్ని రోజుల పాటు ఆలయాలను కూడా మూసివేశారు.టీటీడీలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది.ఇప్పటికే 4 వేల మందికి కరోనా వ్యాక్సిన్ అందించారు.మిగిలినవారికి కూడ వ్యాక్సినేషన్ చేయించనున్నారు.ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.బుధవారం నాడు రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకి కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడ పెరిగిపోతోంది. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు గాను వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వ్యాక్సినేషన్ అందిస్తున్నారు.రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే వ్యాక్సినేషన్ ను అందించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఇటీవలనే అధికారులను ఆదేశించారు.