*****శ్రీరామ జయం****
శ్రీరామ నవమి అనగానే మొదట గుర్తొచ్చేది భద్రాచలం లోని రాముని కళ్యాణం, వాటి తర్వాత వీధి వీధి నా వెలసే నవమి పందిళ్ళు.
ఆ పందిళ్ళ లో దొరికే బెల్లం పానకమూ, వడపప్పూ.
ఆ వైభవానికి తగ్గట్టుగా పందిట్లో పోసే ముత్యాల తలంబ్రాలు, దేనికవే సాటి. కరోనా కారణంగా ఈ ఆనందం అందరికీ దూరం కాగా...
భద్రాచలంలో శ్రీ రామనవమి వేడుకలు బుధవారం నిరాడంబరంగా జరిగాయి.
కరోనా వైరస్ కారణంగా ఈ సారి కూడా భక్తజనం లేకుండానే సీతారామ కళ్యాణం, పట్టాభిషేకం నిర్వహించారు.
ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లు శ్రీ సీతారాముల స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.
వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో స్వామివారి కళ్యాణం జరిగింది దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, వేదపండితులు, అర్చకులు, ఆలయ, ఇతర శాఖల అధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు.
No comments:
Post a Comment