Tuesday, 20 April 2021
ప్రయాణ సమయం కుదించిన..ఆర్టీసీ.. రాత్రి 9గంటలకు డిపోకు చేరాలని సూచన...
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో బస్సుల ప్రయాణ సమయాన్ని ఆర్టీసీ కుదించింది. రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే బస్సులను నడుపుతామని ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ యాదగిరి తెలిపారు. సిటీ బస్సులు రాత్రి 9 గంటలలోపు ఆయా డిపోలకు చేరుకుంటాయని వెల్లడించారు. ఇతర జిల్లాలకు రాత్రి 9 తర్వాత బయలుదేరాల్సిన బస్సుల సమయాన్ని తొమ్మిదిలోపు వెళ్లేలా ఆయా డిపో మేనేజర్లు సమన్వయం చేసుకుంటారన్నారు. ప్రయాణికులందరూ విధిగా మాస్కులు ధరించాలన్నారు. మాస్కులు ధరించిన వారినే బస్సుల్లో ప్రయాణానికి అనుమతిస్తామని ఈడీ యాదగిరి పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment