ఈ రోజున శ్రీ సీతారాముల కల్యాణానికి కుమ్మరి కుంట్ల లక్షమ్మ( నల్గొండ జిల్లా రాయిన పాలెం) రాములవారి మీద ఉన్న భక్తి తో బియ్యపు గింజపై శ్రీ రామ అనే నామం తో లక్ష కి పైగా బియ్యపు గింజలపై శ్రీ రామ నామం వ్రాసింది.. ఆ పై స్వామి వారి సనిదిలో దేవస్థాన పండితులుసామవేద సన్యాసి శర్మ గారి ద్వారా AEO గారికి అందజేయడం జరిగినది .
Wednesday, 22 March 2023
Sunday, 19 March 2023
భద్రాద్రి రాముని పట్టాభిషేకానికి తరలివచ్చిన పుణ్య నదీ జలం...వైభవంగా శోభాయాత్ర.
భద్రాద్రి: భద్రాద్రి రామయ్య పుష్కర పట్టాభిషేకానికి నదీ జలాలు తరలివచ్చాయి భద్రాద్రి రాముని కళ్యాణ అనంతరం దశమి రోజు జరిగే మహా పుష్కర పట్టాభిషేకానికి రుత్వికులు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి పుణ్య నదీ జలాలను సేకరించి తిరిగి నిన్న శనివారం సాయంత్రం భద్రాచలం చేరుకున్నారు. నేటి ఉదయం శోభాయాత్ర నిర్వహించి భద్రాద్రి రాముని సన్నిధికి చేర్చారు వివరాల్లోకి వెళ్తే భద్రాచలంలో ఈ నెల 31న జరగనున్న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకమునకు దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్న పుణ్య జలాలు సేకరించిన భద్రాచలం అర్చక వైదిక కమిటీ.
9 మంది అర్చక , వైదిక సిబ్బంది రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న 12 పుణ్య నదీ జలాలు, 12 పుష్కరిణిల జలాలు, సముద్ర జలాలు తీర్ధాన్ని సేకరించిన అర్చక వైదిక సిబ్బంది శనివారం భద్రాచలం చేరుకొగా..ఆలయ అర్చకులు పుష్కర నది జలాలకు ప్రత్యేక పూజలు చేసి, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ శోభాయాత్ర నిర్వహిం చారు.... కార్యక్రమంలో భక్తులు భద్రాద్రివాసులు ఆలయ సిబ్బంది ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు
Saturday, 18 March 2023
సప్తవర్ణశోభితం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం
శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం వైభవంగా పుష్పయాగం జరిగింది.
ఆలయంలో ఫిబ్రవరి 14 నుండి 22వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకులు, అధికార అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.
ఇందులో భాగంగా ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.
అనంతరం మధ్యాహ్నం 2 నుండి 4.30 గంటల వరకు పుష్పయాగం నిర్వహించారు. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల పూలు, ఆరు రకాల ఆకులు కలిపి మొత్తం 3.5 టన్నుల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన
ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.
తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి దాతలు ఈ పుష్పాలు విరాళంగా అందించారు.
వైభవంగా మెట్లోత్సవం
తిరుపతి/అలిపిరి : శ్రీ తాళ్లపాక అన్నమయ్య 520వ వర్ధంతిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం అలిపిరి పాదాలమండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల.విభీషణ శర్మ మాట్లాడుతూ అన్నమయ్య తన సంకీర్తనలతో భక్తి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి సామాజిక చైత్యన్యాన్ని తీసుకువచ్చారని చెప్పారు.
అన్నమయ్య తన భక్తి సంకీర్తనలతో సామాజిక, మానసిక శాస్త్రావేత్తగా సమాజాన్ని నడిపించారన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకుంటారని వివరించారు.దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి పి.ఆర్.ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ మెట్లమార్గంలో నడచి వెళ్ళి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. పూర్వం శ్రీ పురందరదాసులు,
శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు.
ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తనల గోష్టిగానం చేపట్టారు. భక్తులు సైతం పరవశించి గోష్టిగానంలో పాలు పంచుకున్నారు.
Thursday, 16 March 2023
ఇద్దరు సూడో నక్సల్స్ అరెస్టు....*
*ఇద్దరు సూడో నక్సల్స్ అరెస్టు....*
*నక్సలైట్ పేరు చెప్పుకొని, ఎయిర్ గన్స్ తో బెదిరించి డబ్బులు వసూలు.*
*నేరము చేయడానికి ఉపయోగించిన రెండు ఎయిర్ గన్స్, ఒక మోటర్ సైకిల్, ఒక ఫోన్ స్వాధీనం*
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ డీసీపీ గారి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నక్షలైట్లం అని ఎయిర్ గన్స్ తో బెదిరించిన నిందితుల అరెస్టు వివరాలను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీమతి రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి ) గారు వెల్లడించడం జరిగింది.
మీడియాను ఉద్దేశించి శ్రీమతి రెమా రాజేశ్వరి, IPS., సిపి, రామగుండం గారు మాట్లాడుతూ...,మంచిర్యాల జోన్ సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై రవి కుమార్ గారు సిబ్బందితో కలిసి సిసిసి నస్పూర్ లోని తోళ్లవాగు సమీపంలో వాహన తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో పోలీస్ వారిని గమనించి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ద్విచక్రవాహనంపై పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు నిందితులని పట్టుకొని క్షుణ్ణంగా విచారించగా, నిందితులు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు.
*నిందితుల వివరాలు*
*మేడి.వెంకటేష్ s/0 రాజయ్య, 26 సం. బెస్త, ని. ఇటిక్యాల, మం. లక్షెట్టిపేట. మంచిర్యాల జిల్లా*.
*ఆరేందుల.రాజేష్ తండ్రి: మల్లయ్య, 31సం., నివాసం: పెద్దంపేట.*
*వివరాల్లోకి వెళితే....*
నిందితులు ఇద్దరు చిన్నపటి నుండి మిత్రులు. గత కొంత కాలంగా ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఈ మధ్య రియల్ ఎస్టేట్ సరిగా లేక ఇద్దరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో వెంకటేష్, రాజేష్ సులువుగా డబ్బులు సాధించాలని ఆలోచనతో ఎవరినైనా అమాయకులని నక్సలైట్ ల పేరు తో ఫోన్ లో బెదిరించి డబ్బులు వసూలు చేయాలనీ ఆలోచించి రాజేష్ తను చెప్పినట్లు వింటే నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానని వెంకటేష్ ని ఒప్పించి, గత కొంత కాలం నుండి ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకోకుండా, కలిసినపుడే మాట్లాడుకోవాలని నిర్ణయం తీసుకోన్నారు. గత కొన్ని రోజుల క్రితం రాజేష్ చెప్పిన ప్రకారం వెంకటేష్ హైదరాబాద్ నుండి రెండు ఎయిర్ గన్స్ కొనుగోలు చేసి, నక్సలైట్ పేరు తో మాట్లాడానికి గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుండి ఫోన్, సిమ్ కొనుగోలు చేసారు. తరువాత నస్పూర్ లో కాంతయ్య ఇంటి వద్ద రెక్కీ చేసి, గత నెల ఫిబ్రవరి 21 నాడు రాత్రి సమయంలో రాజేష్ చెప్పిన పథకం ప్రకారం వెంకటేష్ తన పల్సర్ బండి మీద రెండు ఎయిర్ గన్స్ ని సంచిలో పెట్టుకొని వచ్చి అర్దరాత్రి సమయంలో కాంతయ్య ఇంటి ఆవరణలో పడవేసి తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు తెల్లవారు జామున రాజేష్, వెంకటేష్ లు కలిసి కాంతయ్య, మరియు అతని కొడుకు నాగరాజుల కి ఫోన్ చేసి తిర్యాణి అడవుల నుండి నక్సలైట్ లము మాట్లాడ్తున్నాం, మీ ఇంటి ముందు తుపాకులు పెట్టాం, మీరు 40 లక్షలు ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యులను అందరిని చంపుతాం అని బెదిరించారు. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞాన విధానంలో దర్యాప్తు చేయగా నింధితుల ఇద్దరినీ అరెస్ట్ చేయడం జరిగింది. రాజేష్ మీద గతంలో మంచిర్యాల , హాజీపూర్ ఏరియాలలో పలు కేసులు నమోదు అయినవి.
*స్వాధీనం చేసుకొన్న వాటి వివరాలు*
👉 PRECIHOLE SPORTS VS100 Air Gun
👉 RANGER Air Gun
👉పల్సర్ బైక్ , SAMSUNG మొబైల్ స్వాదీనం చేసుకోన్నాం అని సీపీ గారు తెలిపారు.
*నిందితులని పట్టుకోవడానికి మరియు నిందితులు మరియు కేసుల గుర్తింపు లో చాకచక్యంగా వ్యవహరించిన శ్రీ బి.సంజీవ్,సీఐ మంచిరియాల్ (రూరల్ ), ఎం . రవికుమార్, SI ఆఫ్ పోలీస్, సీసీసీ నస్పూర్. శ్రీ ఎండీ. సలీం, శ్రీ బి.దేవేందర్, శ్రీధర్ పిసి, ఇర్షాద్ పీసీ లను సీపీ మేడమ్ గారు రివార్డ్ అందజేసి అభినందించారు.*
Monday, 13 March 2023
అంగ రంగ వైభవంగా కదిరి లక్ష్మి నృసింహుని కళ్యాణం-రథోత్సవం భారీగా తరలివచ్చింది భక్తజనం
ఇసుకేస్తే రాలంత జనం నమో నరసింహ..
గోవిందా గోవిందా అంటూ కదిరి
శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ప్రతిధ్వనిం చింది ఉదయం శ్రీదేవి భూదేవి ల సమేతుడై లక్ష్మీ నరసింహుడు రధోత్సవ సంబురంలో భక్తులకు దర్శనం ఇచ్ఛారు. వేద పండితుల వేద మంత్రాలు ప్రబంధ పారాయణాలతో అనంతపురం జిల్లా
కదిరిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన బ్రహ్మ రథోత్సవం వేడుక కనులారా వీక్షించడానికి తెలుగు రాష్డల నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి లక్షలాదిగా భక్తులు తరలి వచ్చారు.
అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం స్వామివారి రథాన్ని కుటాగుళ్ల, మూర్తిపల్లి, గజ్జలరెడ్డి పల్లి గ్రామస్తులు స్వామివారు ఆశీనులైన బ్రహ్మ రథం ముందుకు లాగుతున్నారు. రథం లాగేందుకు వీలుగా పెద్ద పెద్ద తాళ్ళు,నియంత్రించేందుకు తెడ్లు సిద్ధం చేశారు.
స్వామివారి రథోత్సవం ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ యదస్థానానికి చేరుకోవడం అద్భుత దృశ్యం,మాటల్లో చెప్పలేని భక్తి మదూరానుభూతిని కనులారా వీక్షించడానికి భక్తులు భక్తి పరవశ్యంతో తన్మయత్వం పొందుతున్నారు.
దేశంలోనే అతి పెద్ద మూడవ రథంగా కదిరి రథోత్సవానికి పేరుంది. తమిళనాడు లోని అండాల్ అమ్మవారి శ్రీవళ్లి పుత్తూరు రథం, తంజావూరు లోని తిరువల్లూరు రథం తరువాత మూడవ అతి పెద్ద రథం కదిరి నరసింహుడిదే అని చరిత్ర చెబుతోంది. యేటా పదిహేను రోజుల పాటు కదిరి నరసింహుడి బ్రహ్మోత్సవాలు జరుపుతారు. జై నరసింహ అంటూ కులాలు, మతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు కదిరి కి తరలి వస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద మూడవ రథంగా ప్రసిద్ధి గాంచిన ఈ రథం బరువు 540 టన్నులు 37.5 అడుగుల ఎత్తు ఉంటుంది. 120 యేళ్ళ క్రితం ఈ రథం తయారు చేశారు.
కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవంతు.
-మీ కార్తీక్
బయటపడ్డ సింహయాళీల శాసనాలు
యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పట్టణంలో ఒక పాతింటిని కూల్చిన సందర్భంలో నేలలో దేవాలయా స్తంభాలు, సింహయాళీలు బయటపడ్డాయి. ఒక శాసనం కూడా బయటపడ్డది. శిలాఫలకానికి ఒకే పక్క చెక్కబడిన శాసనం 13వ శతాబ్దపు తెలుగులిపిలో రాసిన కాకతీయ ప్రతాపరుద్రదేవ మహారాజు కాలం నాటిది. ఆ వివరాలు:
భువనగిరి శాసనం:
1. స్వస్తిశ్రీ మన్మహామండలేశ్వర కాకతి
2. య్య ప్రతాపరుద్రదేవ మహారాజు
3. లు సుఖసంకథావినోదంబుల
4. 0 బ్రదివి రాజ్యంబు సేయుచుం
5. డంగాను శక వరుషాలు 1240 అ
6. వు కాళయుక్తి సంవత్సర ఆషాఢ
7. శు 15గు భునగిరి అష్టాదశప్రజను
8. మహారాజునకూను లెంకలకూను
9. అధికారులకూను కరణాలకూను తమ
10. కూం బుణ్యముగాను గొని ఆయూరి శ్రీవి
11. రద్రేశ్వర దేవరకూను ఆపురోతు
12. లకు అంగభోగాత్తమ బలంజ
13. లు పెఱుకందెచ్చిన బండానను పెఱు
14. కను సోవందూను ప్రతిమలగను
15. ఫలమెందూను వా02కలు అసి
16. బెనులయిదు పొంకలూను దీపా
17. నకు వడ్డలగండెగానుగును నిత్య
18. సోలెండు నూనెను ఆచంద్రస్తాయిగా
19. ను చెల్లను ధారవొస్తిమి ...క్రమ
20. ము యట్లచెల్లించుట మహాపుణ్య
21. ము అయినందుగాను శ్రీరామ
22. వాక్యం శ్లోకం ..సామాన్యోయం
శాసన సారం:
మహామండలేశ్వరుడైన కాకతీయ ప్రతాపరుద్రదేవ మహారాజు పాలిస్తుండగా శక సం.లు 1240, కాళయుక్తి సం. ఆషాఢ శు.15/పౌర్ణిమ గురువారం అనగా క్రీ.శ.1318 జూన్ 14వ తేదీన
భువనగిరి చెందిన అష్టాదశప్రజలు, మహారాజుకు, లెంకలకు, అధికారులకు, కరణాలకు, తమకు పుణ్యంగా ఆవూరి అనగా భువనగిరి శ్రీవీరభద్రేశ్వర దేవరకు, పురోహితులకు, అంగభోగ నిమిత్తం
బలంజలు పెఱుకలో తెచ్చిన బండా(రం)ను పెఱుకకు సోవందు ప్రతిమలకుగాను ఫలం నిమిత్తం, వాకలు అసిబెనులు అయిదు పొంకలు దీపానికి వడ్డెలగండెగానుగునూనె నిత్యం సోలెడు నూనెను ఆచంద్ర(ఆ సూర్య, చంద్రులున్నంతవరకు) చెల్లేటట్లు ధారవోసినాము. ఈ క్రమం చెల్లించటం పుణ్యం.
శాసన పరిష్కారం: శ్రీరామోజు హరగోపాల్, కన్వీనర్, కొత్తతెలంగాణ చరిత్రబృందం
శాసనప్రతి సహకారం: ఆవుల వినోద్, భువనగిరి
అస్కార్ గుండెల్లో తెలుగు "నాటు" చంద్రమౌళివాణిల "పరి"శ్రమకు పురస్కారం.
నాటు పాటకు త్రిమూర్తులైన చంద్రబోస్ కీరవాణి రాజమౌళి పరిశ్రమకు కీర్తి కిరీటం దక్కింది ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా అస్కార్ ఆర్ఆర్ ఆర్ ముంగిట నిలిచింది నాటు పాటకు ఆస్కార్ ప్రకటన వెలువడిన వెంటనే తెలుగు వారి గుండెల్లో లక్ష కోట్ల బాంబుల విస్పోటనం..
ఆస్కార్ వేదికపై బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పురస్కారాన్ని ముద్దాడింది.
సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే ఆస్కార్ పురస్కారాన్ని అందుకుంది తెలుగు చిత్రం #RRR. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఈ చిత్రంలోని నాటునాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ వరించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కించుకుంది. ఆస్కార్‌ను దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా నాటునాటు రికార్డులకు ఎక్కింది. హాలీవుడ్ పాటలను తలదన్నుకుంటూ చివరకు వరకు చేరిన నాటునాటు విజయకేతనం ఎగరవేసింది. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి కుమారుడు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటను చంద్రబోస్ రచించగా.. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. నాటునాటు పాటకు ఎన్టీఆర్, రామ్‌చరణ్ అదిరిపోయే స్టెప్పులు వేశారు. దీనికి ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ ఆవార్డులు సాధించింది.
అయితే తాజాగా ఆస్కార్ గెలుచుకున్న ఈ నాటు నాటు సాంగ్ ఇప్పటికే.. ప్రతిష్టాత్మకమైన గోల్డెన్‌గ్లోబ్ సహా ఎన్నో అవార్డులను గెలుచుకుంది. రిహాన్నా పాడిన లిఫ్ట్ మి అప్, టేలర్ స్విఫ్ట్ పాడిన కరోలినా, లేడీ గగా పాడిన హోల్డ్ మై హ్యాండ్ పాటలను వెనక్కి నెట్టి.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును కైవసం చేసుకున్న తొలి ఆసియా పాటగా నాటు నాటు నిలిచింది.
మరో ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డు క్రిటిక్స్ ఛాయిస్‌ను కూడా నాటు నాటు దక్కించుకుంది. ఇందులో బెస్ట్ సాంగ్ అవార్డును నాటు నాటు సొంతం చేసుకోగా.. ఉత్తమ విదేశీ భాషా చిత్రం అవార్డును 'RRR' అందుకుంది. కరోలినా, సియావో పపా, హోల్డ్ మై హ్యాండ్ పాటలతో నాటు నాటు పోటీపడింది. ఉత్తమ పాట విభాగంలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్-HCA అవార్డును సైతం నాటు నాటు కొల్లగొట్టింది. HCA అవార్డుల్లో బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం HCA అవార్డులను దక్కించుకుంది.ప్రాంతీయంగా పలు అవార్డులతో పాటు బెస్ట్ సాంగ్ విభాగంలో హ్యూస్టన్ ఫిల్మ్ క్రిటిక్ సొసైటీ అవార్డును దక్కించుకోగా ఇప్పుడు తెలుగు నాటునాటు అస్కార్ దరికి చెరి సంచలనంగా నిలిచింది.
@మణికుమార్ కొమ్మమూరు
Wednesday, 8 March 2023
FEEL SAFE WE ALL WITH YOU : MADHAPUR DCP - SHILPA VALLI
Hyderabad : Women safety and also asked the girls to utilize their freedom and independence in a judicious manner In line with the vision of CP Cyberabad Sri Stephen Raveendra IPS to create a safe environment for women more particularly those staying in Hostels and PGs, on the eveof IWD the IT Corridor Hostels Asosciation under Sri Amarnath reddy, Sri Krunakar, Sri Maheedhar and others has organized a meeting with women inmates. DCP Madhapur Smt Shilpavalli attended the event as chief giest and Smt Kaza Madhavi principal government women's college golkonda also graced the occassion.
DCP Madhapur spoke about the various initiatives of Telangana State Police and Cyberabad Police towards women safety and also asked the girls to utilize their freedom and independence in a judicious manner by being alert, brave and focussed all the time to acieve their dreams and goals. She asked them to be strong and inspire and help other women and to raise voice and stand up for themselves against any odds.
Tuesday, 7 March 2023
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అంధ విద్యార్థులు ..దివ్యానుభూతిని మాటల్లో చెప్పలేమంటు ఆనంద పరవశం..
తిరుమల శ్రీవారిని మంగళవారం
దాదాపు 400 మంది అంధ విద్యార్థులు, ప్రత్యేక ప్రతిభావంతులు తమ దివ్యనేత్రాలతో దర్శనం చేసుకుని ఆనంద పరవశులయ్యారు.
హైదరాబాద్ కు చెందిన శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీరు మంగళవారం తిరుమలకు చేరుకున్నరు. వీరికి టిటిిడి అధికారులు స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం వారు పొందిన దివ్యానుభూతికి ఆనందం వ్యక్తం చేశారు. దర్శన ఏర్పాట్లు చేసిన టిటిడి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
#
ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు
తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు.
ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీభూ సమేతంగా శ్రీమలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది.
#ttd
#Tirumala
భద్రాద్రి రాముని సన్నిదిలో హోలీ రంగుల ముచ్ఛట..గోటి బియానికి పసుపు పచ్ఛందనాలు అద్దిన మత్తైదువులు ..
ఈ నెల 30 న జరగనున్న సీతారాముల కళ్యానానికి పాల్గుణ పౌర్ణమి సందర్భంగా ఈ రోజు నుంచి పనులు ప్రారంభించిన ఆలయ అధికారులు.
రోలు రోకలి కి పూజలు చేసి ముత్తైదువులతో పసుపు కొమ్ములు దంచి పసుపు తయారు చేసి కళ్యాణ తలంబ్రాలు కలిపిన మహిళలు.
అనంతరం డొలోత్సవం, వసంతోత్సవం వేడుకలు.
తలంబ్రాలు కలపడానికి అధిక సంఖ్యలో ఆలయం వద్దకు కదిలి వచ్చిన మహిళలు...
Subscribe to:
Comments (Atom)