Thursday, 16 March 2023

ఇద్దరు సూడో నక్సల్స్ అరెస్టు....*

*ఇద్దరు సూడో నక్సల్స్ అరెస్టు....*

*నక్సలైట్  పేరు చెప్పుకొని, ఎయిర్ గన్స్ తో బెదిరించి డబ్బులు వసూలు.*
 
*నేరము చేయడానికి ఉపయోగించిన రెండు ఎయిర్ గన్స్, ఒక  మోటర్ సైకిల్,  ఒక ఫోన్  స్వాధీనం*

 రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ డీసీపీ గారి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి  నక్షలైట్లం అని ఎయిర్ గన్స్ తో బెదిరించిన నిందితుల అరెస్టు వివరాలను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీమతి రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి ) గారు వెల్లడించడం జరిగింది.
మీడియాను ఉద్దేశించి శ్రీమతి రెమా రాజేశ్వరి, IPS., సిపి, రామగుండం గారు మాట్లాడుతూ...,మంచిర్యాల జోన్ సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై రవి కుమార్ గారు సిబ్బందితో కలిసి సిసిసి నస్పూర్ లోని తోళ్లవాగు సమీపంలో వాహన తనిఖీ  నిర్వహిస్తున్న సమయంలో పోలీస్ వారిని గమనించి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ద్విచక్రవాహనంపై పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు నిందితులని పట్టుకొని క్షుణ్ణంగా విచారించగా, నిందితులు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. 
*నిందితుల వివరాలు*              
*మేడి.వెంకటేష్ s/0  రాజయ్య, 26 సం.  బెస్త, ని. ఇటిక్యాల, మం. లక్షెట్టిపేట.  మంచిర్యాల జిల్లా*.
*ఆరేందుల.రాజేష్ తండ్రి:  మల్లయ్య, 31సం.,  నివాసం: పెద్దంపేట.*
 *వివరాల్లోకి వెళితే....*
నిందితులు ఇద్దరు చిన్నపటి నుండి మిత్రులు. గత కొంత కాలంగా ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఈ మధ్య రియల్ ఎస్టేట్ సరిగా లేక ఇద్దరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో వెంకటేష్, రాజేష్ సులువుగా డబ్బులు సాధించాలని ఆలోచనతో ఎవరినైనా అమాయకులని నక్సలైట్ ల పేరు తో ఫోన్ లో బెదిరించి డబ్బులు వసూలు చేయాలనీ ఆలోచించి రాజేష్ తను చెప్పినట్లు వింటే నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానని వెంకటేష్ ని ఒప్పించి, గత కొంత కాలం నుండి ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకోకుండా, కలిసినపుడే మాట్లాడుకోవాలని నిర్ణయం తీసుకోన్నారు. గత కొన్ని రోజుల క్రితం రాజేష్ చెప్పిన ప్రకారం వెంకటేష్ హైదరాబాద్ నుండి రెండు ఎయిర్ గన్స్ కొనుగోలు చేసి, నక్సలైట్ పేరు తో మాట్లాడానికి గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుండి ఫోన్, సిమ్ కొనుగోలు చేసారు. తరువాత నస్పూర్ లో కాంతయ్య ఇంటి వద్ద రెక్కీ చేసి, గత నెల ఫిబ్రవరి  21 నాడు రాత్రి సమయంలో  రాజేష్ చెప్పిన పథకం ప్రకారం వెంకటేష్ తన పల్సర్ బండి మీద రెండు ఎయిర్ గన్స్ ని సంచిలో పెట్టుకొని వచ్చి అర్దరాత్రి సమయంలో కాంతయ్య ఇంటి ఆవరణలో పడవేసి తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు తెల్లవారు జామున రాజేష్, వెంకటేష్ లు కలిసి కాంతయ్య, మరియు అతని కొడుకు నాగరాజుల కి ఫోన్ చేసి తిర్యాణి అడవుల నుండి నక్సలైట్ లము మాట్లాడ్తున్నాం, మీ ఇంటి ముందు తుపాకులు పెట్టాం, మీరు 40 లక్షలు ఇవ్వకపోతే  మీ కుటుంబ సభ్యులను అందరిని చంపుతాం అని బెదిరించారు. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి  మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞాన విధానంలో దర్యాప్తు చేయగా నింధితుల ఇద్దరినీ అరెస్ట్ చేయడం జరిగింది. రాజేష్ మీద గతంలో మంచిర్యాల , హాజీపూర్   ఏరియాలలో పలు కేసులు నమోదు అయినవి.

*స్వాధీనం చేసుకొన్న వాటి వివరాలు*        
👉 PRECIHOLE SPORTS VS100 Air Gun                     
👉 RANGER Air Gun
👉పల్సర్ బైక్ , SAMSUNG మొబైల్ స్వాదీనం చేసుకోన్నాం అని సీపీ గారు తెలిపారు.


*నిందితులని పట్టుకోవడానికి మరియు నిందితులు మరియు కేసుల గుర్తింపు లో చాకచక్యంగా వ్యవహరించిన  శ్రీ  బి.సంజీవ్,సీఐ మంచిరియాల్ (రూరల్ ), ఎం . రవికుమార్, SI ఆఫ్ పోలీస్, సీసీసీ నస్పూర్.  శ్రీ ఎండీ. సలీం, శ్రీ బి.దేవేందర్, శ్రీధర్ పిసి, ఇర్షాద్ పీసీ  లను సీపీ మేడమ్ గారు రివార్డ్ అందజేసి అభినందించారు.*

No comments:

Post a Comment