Sunday, 19 March 2023

భద్రాద్రి రాముని పట్టాభిషేకానికి తరలివచ్చిన పుణ్య నదీ జలం...వైభవంగా శోభాయాత్ర.

భద్రాద్రి: భద్రాద్రి రామయ్య పుష్కర పట్టాభిషేకానికి నదీ జలాలు తరలివచ్చాయి భద్రాద్రి రాముని కళ్యాణ అనంతరం దశమి రోజు జరిగే మహా పుష్కర పట్టాభిషేకానికి రుత్వికులు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి పుణ్య నదీ జలాలను సేకరించి తిరిగి నిన్న శనివారం సాయంత్రం భద్రాచలం చేరుకున్నారు. నేటి ఉదయం శోభాయాత్ర నిర్వహించి భద్రాద్రి రాముని సన్నిధికి చేర్చారు వివరాల్లోకి వెళ్తే భద్రాచలంలో ఈ నెల 31న జరగనున్న  పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకమునకు దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్న  పుణ్య జలాలు  సేకరించిన భద్రాచలం అర్చక వైదిక కమిటీ. 
 9 మంది అర్చక , వైదిక సిబ్బంది రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశంలోని  వివిధ రాష్ట్రాల్లో ఉన్న 12 పుణ్య నదీ జలాలు, 12 పుష్కరిణిల జలాలు, సముద్ర జలాలు తీర్ధాన్ని సేకరించిన అర్చక వైదిక సిబ్బంది శనివారం భద్రాచలం చేరుకొగా..ఆలయ అర్చకులు  పుష్కర నది జలాలకు ప్రత్యేక పూజలు చేసి,  మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల  నడుమ శోభాయాత్ర నిర్వహిం చారు.... కార్యక్రమంలో భక్తులు భద్రాద్రివాసులు ఆలయ సిబ్బంది ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment