Tuesday, 25 March 2025

చెట్టుకొమ్మ పుటుక్కున ఇరుగుతుంది.. కానీ ఎముకను మాత్రం బలంగా ఉంచుతుంది...#కల్పవృక్షం..🌳 #మునగ…🌿



మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబారులో జుర్రుకునే మునక్కాడల రుచే. కానీ ఆఫ్రికన్‌ దేశాలకి మాత్రం మునగ అంటే పోషకాల్ని కురిపించే కల్పవృక్షం.
 
భూగోళం మీదున్న సమస్త పోషకాహార లోపాల్నీ సకల రోగాల్నీ నివారించడానికి మునగను మించినది లేదని రకరకాల అధ్యయనాల ద్వారా తెలుసుకున్న ఆఫ్రికా దేశాలు పోషకాహార లోపంతో బాధపడే తల్లులూ పిల్లలకు మందులతోబాటు మునగాకు పొడినీ బోనస్‌గా ఇస్తున్నాయి. అందుకే మునగాకు టీ తాగడం వల్ల మధుమేహం తగ్గిందనీ పొడి తినడం వల్ల పాలు బాగా పడ్డాయనీ చెప్పే ఆఫ్రికన్ల సంఖ్య కోకొల్లలు.
 
ఆనోటా ఈనోటా ఇది మనవరకూ వచ్చింది. ‘పెరటి చెట్టు వైద్యానికి పనికిరాద’న్నట్లు నిన్నమొన్నటివరకూ మనం మునగ చెట్టుని పెద్దగా పట్టించుకోలేదు. తలపైకెత్తి దానివైపే చూడలేదు- సాంబారులోకి నాలుగు కాయలు అవసరమైనప్పుడు తప్ప. కానీ అమెరికాకి చెందిన ‘ద ట్రీస్‌ ఫర్‌ లైఫ్‌’ స్వచ్ఛంద సంస్థ మునగ చెట్టులోని అణువణువూ ఉపయోగపడుతుందన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. దానికి పలు అంతర్జాతీయ సంస్థలూ శృతి కలిపాయి. ప్రపంచ దేశాలకు ఆ సంజీవని గురించి కథలుగా చెప్పడం ప్రారంభించాయి.

ఐక్యరాజ్యసమితి కూడా మునగ ప్రాధాన్యతను గుర్తించి ఆ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. దాంతో మన దృష్టీ అటు మళ్లింది. న్యూట్రిషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ సి.గోపాలన్‌, డాక్టర్‌ కమలా కృష్ణస్వామిలు మునగాకు లోగుట్టుని విప్పారు. వారికి ఆయుర్వేద వైద్యులూ తోడయ్యారు. అంతా కలిసి మరీ ‘మునగ’ మహత్యాన్ని కొనియాడుతున్నారు.

ఏముంది మునగాకులో..?
 
‘బతికుంటే బలుసాకు తినొచ్చు’... ఓ పాత నానుడి. ఆ బలుసాకు ఏమోగానీ, ‘రోజూ కాస్త మునగాకు తింటే చాలు, వందేళ్లు బతకొచ్చు అన్నది కొత్త సామెత. ఎందుకంటే...
 
వంద గ్రా. తాజా మునగాకుల్లో... నారింజల్లోకన్నా ఏడు రెట్లు సి-విటమిన్‌, క్యారెట్లలోకన్నా నాలుగింతల కాల్షియం, అరటిపండ్లలోకన్నా మూడు రెట్లు పొటాషియం, పాలకూరలోకన్నా మూడింతల ఐరన్‌, బాదంలోకన్నా మూడు రెట్లు విటమిన్‌- ఇ, పెరుగులోకన్నా రెండింతల ప్రొటీన్లూ ఉంటాయి.

అంటే ఇరవై గ్రా.మునగాకు నుంచి మనిషికి నిత్యం అవసరమయ్యే ఎ,సి-విటమిన్లూ, వంద గ్రా.ఆకు నుంచి కాల్షియం, మూడొంతుల ఐరన్‌, సగం ప్రొటీన్లూ దొరుకుతాయి.
 
అందుకే పోషకాహార లోపాన్ని నివారించడానికి దీన్ని మించినది లేదు. అంతెందుకు... ప్రపంచవ్యాప్తంగా ఏటా ఐదు లక్షల మంది విటమిన్‌-ఎ లోపం కారణంగానే అంధులవుతున్నారు. దీనికి మునగాకే మహత్తరమైన పరిష్కారం అంటున్నారు పోషక నిపుణులు. 
ఆ కారణంతోనే క్యూబా అధ్యక్షుడు ఫిడేల్‌ క్యాస్ట్రో మునగ చెట్లను పెంచి, ఆ కాయల్ని రోజూ తినేవాడట. ‘ఒమేగా-3, 6, 9 ఫ్యాటీఆమ్లాలూ, సకల విటమిన్లూ, అన్ని రకాల అమైనో ఆమ్లాలు... మొత్తంగా 96 పోషకాలున్న ఒకే ఒక చెట్టు మునగ...పేదవాడి ఆహారం’ అంటూ దాని గొప్పతనం గురించి పత్రికల్లో వ్యాసాలూ రాశాడు క్యాస్ట్రో. ఇప్పుడు క్యూబా వాసులు మునగాకుని పండించి, పొడి చేసి విక్రయిస్తున్నారు. భారత్‌ కూడా మునగ ఆకుల పొడిని ఎగుమతి చేయడం ప్రారంభించింది. కానీ ఆకుని తినడం పట్ల ఇప్పటికీ మనదగ్గర అలసత్వమే.
 
నిజానికి ప్రాచీన కాలం నుంచీ ఆఫ్రికా దేశాల్లోనూ భారత్‌లోనూ తాజా మునగాకుల్ని తినే అలవాటు ఉంది. మధ్యలో మాయమై, మళ్లీ తెరమీదకొచ్చింది. టైమ్‌ మ్యాగజైన్‌ ‘ద నెక్స్ట్‌ క్వినోవా’గా అభివర్ణించింది. దాంతో పాశ్చాత్య దేశాల్లో ఎండిన ఆకుల పొడిని స్మూతీలూ సలాడ్ల మీద చల్లుకోవడం, టీ, సప్లిమెంట్ల రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. 
ఎందుకంటే... 

100 గ్రా. ఎండిన ఆకుల్లో... పాలల్లో కన్నా 17 రెట్లు కాల్షియం, అరటిపండ్లలోకన్నా 15 రెట్లు పొటాషియం, క్యారెట్లలోకన్నా 10 రెట్లు విటమిన్‌-ఎ, పాలకూరలోకన్నా 25 రెట్లు ఐరన్‌... ఇలా చాలా లభిస్తాయి. 
మునగాకుని ఎండబెట్టి పొడి చేసుకునే తినాల్సిన అవసరం మనకి లేదు. తాజా మునగాకు పుష్కలం. ఒకప్పుడు శుభసూచకం కాదన్న కారణంతో పెరట్లో మునగ పెంచేవారు కాదు. కాలం మారింది. పట్టింపూ పోయింది. దాంతో కాయలకోసం చాలామందే పెంచుతున్నారు. కాబట్టి ఇతర ఆకుకూరల్లానే మునగాకుతో పప్పూ కూరలూ పచ్చళ్లూ పొడులూ రైస్‌ వెరైటీలూ కోఫ్తాలూ... అన్ని రకాలూ వండుకోవచ్చు. దోసెల్లో రొట్టెల్లో దట్టించినా రుచే. పొడిని టీ రూపంలో తాగొచ్చు, సూపుల్లో అన్నంలో కూరల్లో... ఎలా కావాలంటే అలా తినొచ్చు. అయితే ముదిరిన ఆకుల్లో పీచెక్కువ. కాబట్టి కుక్కర్‌లో ఉడికించాలన్నది నిపుణుల సలహా.

ఔషధగుణాలెన్నో... 
మరే చెట్టు ఆకులకీ లేనంత మహత్తు మునగాకుకి ఉంది. ఇది 300 వ్యాధుల్ని నివారించగలదు. మునగాకులో రోగనిరోధకశక్తిని పెంచే 46 యాంటీఆక్సిడెంట్లూ అనేకానేక బయోయాక్టివ్‌ పదార్థాలూ ఉండటంతో శాస్త్రవేత్తలు దీనిమీద పరిశోధనలు ముమ్మరం చేశారు. ఇందులోని ఓషధుల ప్రభావానికి శరీరంలోని బ్యాక్టీరియా, ఫంగస్‌లన్నీ పలాయన మంత్రం పఠిస్తాయి. క్యాన్సర్లూ అల్సర్లూ కనుచూపుమేర కనిపించవు. ఆల్జీమర్స్‌ ఎగిరిపోతుంది. బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్‌ దరి చేరడానికి భయపడతాయి.

గాయాలన్నీ మునగాకు పేస్టుతో గాయబ్‌.
 
అంతేనా... రక్తహీనతతో బాధపడుతుంటే కాస్త వండిన మునగాకునో లేదా టీస్పూను పొడినో రోజూ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఐరన్‌ వృద్ధి, రక్తం సమృద్ధి. ఈరోజుల్లో పసివయసు దాటకుండానే కంటిజబ్బులనేకం. రేచీకటి బాధితులూ ఎక్కువే. వాటన్నింటినీ మునగాకులోని బీటాకెరోటిన్‌ నివారిస్తుందని ఇంటర్నేషనల్‌ ఐ ఫౌండేషన్‌ అంటోంది.
 
ఇంటాబయటా అంతటా ధూళిమేఘాలే... కాలుష్యకాసారాలే. మరి ఆస్తమా, బ్రాంకైటిస్‌, ట్యుబర్‌క్యులోసిస్‌ పిలవకుండానే పలుకుతున్నాయి. ఊపిరితిత్తుల్లో తిష్ట వేస్తున్నాయి. అందుకే ఆకుల్ని సూపులా చేసుకుని రోజుకి రెండుసార్లు తీసుకుంటే లంగ్సులోని టాక్సిన్లు తొలగి, ఆ వ్యాధులన్నీ పారిపోతాయి. 
రజస్వలానంతరం అమ్మాయిలకి ఎన్ని కష్టాలో... కొందరిలో నెలసరి సమయంలో గడ్డలు పడుతుంటాయి. అప్పుడు ఆకులతో చేసిన సూపుని 21 రోజులపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే సరి. మునగాకు రసం తాగితే గర్భసంచి సాగకుండా ప్రసవం సులభంగా అవుతుంది. పాలుపడని బాలింతలకి కాసిని నీళ్లలో ఉప్పు, మునగాకులు వేసి కాసేపాగి ఆ నీటిని వంపేసి ఆకుల్ని నేతితో తినిపిస్తే ఫలితం ఉంటుంది. పొడి రూపంలో ఇచ్చినా పాలు పుష్కలమే. 
డయేరియా, కామెర్లూ, కలరా బాధితుల బాధ కాదు. ఒకటే దాహం. నీరసం. అప్పుడు రోజుకి రెండుమూడుసార్లు గ్లాసు కొబ్బరినీళ్లలో టీస్పూను మునగాకు రసం, కొద్దిగా తేనె కలిపి తాగితే సరి. మూత్ర సమస్యలకీ మునగ బెస్ట్‌ మెడిసినే. ఆకుల్ని ముద్దలా చేసి క్యారెట్‌ రసంలో కలిపి పదిగంటలకోసారి తీసుకుంటే హానికర బాక్టీరియా, వైరస్‌లన్నీ తొలగిపోతాయి.
 
ఆకుల్ని కణతలకి రుద్దితే తలనొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ ఆకుల రసాన్ని నిమ్మరసంతో కలిపి మొటిమలమచ్చలు, బ్లాక్‌హెడ్స్‌ మీద రాస్తే అవి మాయమై చర్మం మెరుస్తుంది. స్కర్వీ, చర్మవ్యాధులు, ఆందోళనలకి 
మునగాకు టీ రుచికరమైన పరిష్కారం.

వహ్వా... మునక్కాడ! 
సీజన్‌లో చిటారుకొమ్మ వరకూ చిగురు కనబడకుండా కాసిన కాయలు చూసేవాళ్లకి కన్నులపండగ అయితే, ఆ కాయల రుచి తెలిసినవాళ్లకి విందుభోజనమే. దక్షిణాదిన సాంబారు, పులుసు, అవియల్‌ వంటల్లో మునక్కాడ కనిపించాల్సిందే. ఇక, బియ్యప్పిండి, బెల్లం లేదా అల్లంవెల్లుల్లి వేసి వండే మునగగుజ్జు కూర ఎవరికైనా నోరూరాల్సిందే. మునక్కాడలతో పట్టే నిల్వ పచ్చడి మహారుచి. మటన్‌లో మునక్కాడ పడితే నాన్‌వెజ్‌ ప్రియులకి పండగే. ఆకులతో పోలిస్తే కాయల్లో పోషకాల శాతం తక్కువే. కానీ మిగిలిన కూరగాయలతో పోలిస్తే ఎక్కువే. 
‘ఈ ఒక్క మునక్కాడ తినవూ బోలెడు బలం’ అంటూ బామ్మలు బతిమిలాడి తినిపించడం చాలామందికి అనుభవమే. తెలిసి చెప్పినా తెలియక చెప్పినా అది నిజమే. మునక్కాడల్లోని యాంటీబయోటిక్‌ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తే; కాల్షియం, ఐరన్‌లు ఎముకబలాన్నీ బరువునీ పెంచుతాయి. రక్తంలో చక్కెర శాతాన్నీ తగ్గిస్తాయి. పిత్తాశయం యమా జోష్‌గా పనిచేస్తుంది.
 
శస్త్రచికిత్సానంతరం మునగాకునీ, మునక్కాడలనీ తింటే త్వరగా కోలుకుంటారని చెప్పడం తెలిసిందే. దానిక్కారణం మరేంటో కాదు, మునక్కాడల్లోని ఐరన్‌వల్ల హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుందట. మునక్కాడల్ని మరిగించిన నీళ్లతో ఆవిరిపట్టడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలూ తగ్గుతాయి. వీటిని ఉడికించిన నీరు తాగితే చర్మం మెరుస్తుందట.
 
‘తరచూ జలుబు చేస్తోందా... జ్వరమొస్తోందా... అయితే రోజూ మునక్కాడలు తినండొహో’ అంటూ చాటింపు వేస్తున్నారు ఆధునిక వైద్యులు. వాటిల్లోని విటమిన్‌-సి జలుబూ ఫ్లూ జ్వరాలకి ట్యాబ్లెట్‌లా పనిచేస్తుందట. వీటిని ఎక్కువగా తినేవాళ్లకి పొట్టలో నులిపురుగుల బాధ ఉండదు. ఈ ముక్కలను ఉడికించిన సూప్‌ డయేరియాకి చక్కని నివారణోపాయం. కీళ్లనొప్పులయితే పరారే. కాలేయం, ప్లీహ సంబంధిత వ్యాధులన్నీ హాయ్‌ చెప్పడానికే సందేహిస్తాయి. 
‘ఏమోయ్‌... ఇంకా పిల్లల్లేరా... అమ్మాయిని మునక్కాయ కూర వండమనోయ్‌...’ అని ఏ పెద్దాయనో అంటే సరదాగా తీసుకోవద్దు. వీటిల్లోని జింక్‌ స్త్రీ, పురుషుల్లో వంధ్యత్వాన్ని తగ్గిస్తుంది. వీర్యం చిక్కబడుతుంది.

 
నియాసిన్‌, రిబోఫ్లేవిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పైరిడాక్సిన్‌ వంటి బి-కాంప్లెక్స్‌ విటమిన్లు మునక్కాడల్లోనూ సమృద్ధిగా దొరుకుతాయి. ఇవి సంక్లిష్ట పిండిపదార్థాలూ ప్రొటీన్లూ 
జీర్ణమయ్యేలా చేస్తాయి.
 
ఏదేమైనా మునక్కాడలు ఎక్కువగా తినేవాళ్లలో రోగనిరోధకశక్తి ఎక్కువ. శ్వాససంబంధ సమస్యలు తక్కువ. వీటిల్లోని ప్రొటీన్లూ పీచూ కారణంగా పోషకాహార లోపమూ ఉండదు. నాడీవ్యవస్థా భేషుగ్గా పనిచేస్తుంది.

పూలు... తేనెలూరు..! 
పచ్చదనంతో కళకళలాడే దీని ఆకులూ కాయలే కాదు, సువాసనభరితమైన తెల్లని పూలూ ఔషధ నిల్వలే. ఆయుర్వేద వైద్యంలో వాడదగ్గవే. పూలతో కాచిన కషాయం లేదా టీ పిల్లతల్లుల్లో పాలు బాగా పడేలా చేస్తుంది. ఇది మూత్రవ్యాధుల నివారణకూ దోహదపడుతుంది. ఈ పూలను మరిగించిన తేనీరు జలుబుకి మంచి మందు. కొన్ని ప్రాంతాల్లో ఈ పూలను సెనగపిండిలో ముంచి పకోడీల్లా వేస్తారు, కూరలూ చేస్తారు. మునగ పూలలో తేనె ఎక్కువ. దాంతో ఇవి తేనెటీగల్ని ఆకర్షించి, తేనె ఉత్పత్తికీ తోడ్పడతాయి.

విత్తనంతో నీటిశుద్ధి..! 
విరగ్గాసిన కాయలు ఎండిపోయాయా... ఫరవాలేదు, ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. విటమిన్‌-సి పుష్కలంగా ఉండే వీటిని వేయించి పల్లీల్లా తినొచ్చు. నూనె తీయొచ్చు. దీన్ని వంటనూనెగానూ సౌందర్యసాధనంగానూ ల్యూబ్రికెంట్‌గానూ వాడుతుంటారు. 
రక్షిత నీటి పథకాలు కరవైన ప్రాంతాలకు మునగ విత్తనాలే నీటిశుద్ధి పరికరాలు. కఠిన జలాల్ని సైతం ఈ గింజలు ఉప్పు లేకుండా తేటగా మారుస్తాయి. సూడాన్‌, ఇండొనేషియా వాసులు ఆ కారణంతోనే విత్తనాలను ప్రత్యేకంగా సేకరించి, ఆ గింజల్ని పొడిలా చేసి, కప్పు నీళ్లలో కలిపి, వడగడతారు. ఇప్పుడు ఈ నీళ్లను బిందెలోని నీళ్లలో కలిపి, ఓ ఐదు నిమిషాలు గరిటెతో కలుపుతారు. తరవాత ఓ గంటసేపు కదపకుండా ఉంచితే మలినాలన్నీ కింద పేరుకుని పైనున్న నీరంతా తేటగా అవుతుంది. వీటిని విడిగా పాత్రలో పోసుకుని తాగుతారు. శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ పొడి కలిపిన ద్రవాన్ని నీటిలో కలపగానే అది పాలీ ఎలక్ట్రోలైట్‌గా పనిచేసి నీటిలోని మలినాలను అయాన్లుగా మార్చడం ద్వారా వాటిని ఆకర్షించి కింద పేరుకునేలా చేస్తుంది.ఇంకా... ఇంకా...! 
మునగాకు మనుషులకే కాదు, పశువులకీ బలవర్థకమైనదే. పశువుల మేతగానూ పంటలకు ఎరువుగానూ వాడతారు. చెట్టు కాండం నుంచి వచ్చే గుజ్జుని కాగితం తయారీకి వాడతారు.  ఆగ్రో ఫారెస్ట్రీకి మునగ చక్కగా సరిపోతుంది. ఈ మొక్కల్ని కంచె చుట్టూ పెంచవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీన్ని పెంచుతున్నా మునగ పంటలో మనదేశమే ఫస్ట్‌. ఏటా 13 లక్షల టన్నుల కాయల్ని పండిస్తున్నాం. రాష్ట్రాలకొస్తే ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మునగ ఉత్పత్తుల విలువ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.27వేల కోట్లు. వాటిల్లో 80 శాతం మనవే. కాయలతోబాటు పొడినీ 
ఎగుమతి చేస్తున్నాం. కాయల్ని శీతలీకరించి చక్కెరపాకంలో వేసి ఎగుమతి చేస్తారు. 
మునగలో రకాలనేకం. కుండీల్లో కాసే హైబ్రిడ్‌ రకాలూ ఉన్నాయి. జాఫ్నా రకం కాయలు 60 నుంచి 120 సెం.మీ. వరకూ కాస్తే, ఆరునెలలకే పూతొచ్చి, కాయలు కాసే కెఎం-1, పీకేఎం-1, పీకెఎం-2, పీఏవీఎం రకాలూ వస్తున్నాయి. నేలతీరు, వాతావరణాన్ని బట్టి ఆయా రకాలని ఎంపికచేసుకుని ఈ చెట్లను పెంచి ఎకరాకి కనీసం లక్ష రూపాయల లాభాన్ని పొందుతున్నారు రైతులు. వ్యవసాయపరంగానే కాదు, 
ఇంటి అవసరాలకోసం పెరట్లోనో లేదంటే కుండీల్లోనో మునగను పెంచితే, రోజూ ఓ గుప్పెడు తాజా ఆకుల్ని కూరల్లో వేస్తే మీ ఆహారంలో సూపర్‌ఫుడ్‌ చేరినట్లే, మీకు డాక్టరుతో పనిలేనట్లే..!BPS.

Friday, 21 March 2025

రాయిలోనే రహస్యమంతా అంటున్న రైతన్నలు

సెవెంత్ సెన్స్ సినిమా గుర్తు ఉంది కదా.. పూర్వీకుల రహస్య నిధి పరిశోధనలు జరిగే పరిణామాలు కథాంశం. ఆధునీకతలో ఏదో సాధించేసాం అనుకున్న .. రాతి యుగంలో జీవిస్తున్నాం అని విమర్శించుకున్న ఆ రాయిలోనే గొప్ప రహస్యం ఉందంటున్నారు  రైతులు సహజత్వంలో ఉండే సౌలభ్యం ఆరోగ్యం దానికి అదే సాటి.. పూర్వీకుల్ని కొన్ని విషయాల్లో అనుసరించగా తప్పదని చైనా వారు చెప్పకనే చెబుతున్నారు.  చైనాలోని కొన్ని ప్రాంతాల్లో వాటర్‌మెలన్‌లపై రాళ్లు ఉంచి పండిస్తున్న దృశ్యం చూశారా? అది చూడ్డానికి వింతగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. ఈ రాతి రహస్యం వాటర్‌మెలన్‌ను మరింత తియ్యగా, రుచిగా మార్చడంలో సహాయపడుతుంది. ఈ రోజు మనం ఈ సాంప్రదాయిక సాగు పద్ధతి గురించి, దాని వెనుక ఉన్న హార్టికల్చర్ సైన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. రండి, ఈ ప్రయాణంలోకి వెళ్దాం!
రాతి ఎందుకు ఉంచుతారు? దీని ఉపయోగం ఏమిటి?

మనకు తెలిసినట్లు, వాటర్‌మెలన్ అనేది వేసవి పండు. ఇది ఎండాకాలంలో బాగా పెరుగుతుంది, కానీ అధిక వేడి, అస్థిరమైన ఉష్ణోగ్రతలు దీని రుచిని, తీపిని ప్రభావితం చేస్తాయి. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు ఈ సమస్యను అధిగమించడానికి ఒక సాంప్రదాయిక పద్ధతిని ఉపయోగిస్తారు—వాటర్‌మెలన్‌పై ఒక చిన్న రాయిని ఉంచడం!

ఈ రాయి వాటర్‌మెలన్‌ను దొంగల నుండి కాపాడటానికి కాదు, లేదా దాన్ని కదలకుండా ఉంచడానికి కూడా కాదు. ఇది ఒక సైన్స్ ఆధారిత టెక్నిక్, దీని ద్వారా వాటర్‌మెలన్‌లో చక్కెర స్థాయిలు (బ్రిక్స్ విలువ) పెరుగుతాయి, అంటే పండు మరింత తియ్యగా మారుతుంది.

రాయి ఎలా పనిచేస్తుంది? సైన్స్ ఏమిటి?

రాతి ఒక సహజమైన "హీట్ రెగ్యులేటర్"లా పనిచేస్తుంది. దీని పనితీరును రెండు దశల్లో అర్థం చేసుకోవచ్చు:

1. పగటిపూట రక్షణ (హీట్ అబ్జార్ప్షన్):  
   వేసవిలో సూర్యుడి వేడి చాలా తీవ్రంగా ఉంటుంది. వాటర్‌మెలన్‌లు నేరుగా ఈ వేడికి గురైతే, అవి అధిక ఉష్ణోగ్రత వల్ల ఒత్తిడికి గురవుతాయి (హీట్ స్ట్రెస్). ఇది పండు పెరుగుదలను, చక్కెర ఉత్పత్తిని దెబ్బతీస్తుంది. రాతి ఈ సమస్యను తగ్గిస్తుంది. రాయి సూర్యుడి వేడిని గ్రహించి, వాటర్‌మెలన్‌పై నేరుగా వేడి పడకుండా కాపాడుతుంది. దీనివల్ల పండు చల్లగా ఉంటూ, ఒత్తిడి లేకుండా పెరుగుతుంది.

2. రాత్రిపూట వేడి విడుదల (థర్మల్ కాంట్రాస్ట్):  
   రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి. ఈ సమయంలో రాతి తనలో నిల్వ చేసిన వేడిని నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఈ వేడి వాటర్‌మెలన్‌కు స్థిరమైన ఉష్ణోగ్రతను అందిస్తుంది. ఈ పగలు-రాత్రి ఉష్ణోగ్రతల మధ్య వచ్చే తేడా (థర్మల్ కాంట్రాస్ట్) వాటర్‌మెలన్‌లో చక్కెర ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీనివల్ల పండు మరింత తియ్యగా, రుచిగా మారుతుంది.

హార్టికల్చర్ సైన్స్ దీన్ని ఎలా వివరిస్తుంది?

వాటర్‌మెలన్‌లో చక్కెర ఉత్పత్తి (సుక్రోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్) అనేది ఒక జీవరసాయన ప్రక్రియ (మెటబాలిజం) ద్వారా జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఉష్ణోగ్రతలు కీలక పాత్ర పోషిస్తాయి. రాత్రిపూట స్థిరమైన, స్వల్ప వేడి ఉష్ణోగ్రతలు (20-25°C) వాటర్‌మెలన్‌లో ఎంజైమ్‌ల చర్యను (ఎంజైమాటిక్ యాక్టివిటీ) పెంచుతాయి. ఈ ఎంజైమ్‌లు స్టార్చ్‌ను చక్కెరగా మార్చడంలో సహాయపడతాయి.

అదే సమయంలో, పగటిపూట అధిక వేడి నుండి రక్షణ కల్పించడం వల్ల వాటర్‌మెలన్‌లో ఫోటోసింథెసిస్ ప్రక్రియ సమర్థవంతంగా జరుగుతుంది. ఫోటోసింథెసిస్ సరిగ్గా జరిగితే, పండులో గ్లూకోజ్ ఉత్పత్తి పెరుగుతుంది, ఇది తీపి రుచికి దోహదపడుతుంది.

ఈ పద్ధతిని మనం ఎలా అమలు చేయవచ్చు?

మన తెలుగు రైతులు కూడా ఈ సాంప్రదాయిక చైనీస్ టెక్నిక్‌ను సులభంగా అమలు చేయవచ్చు. ఇది చాలా సింపుల్, ఖర్చు లేని పద్ధతి. ఎలాగో చూద్దాం:

1. సరైన రాయిని ఎంచుకోండి:  
   చిన్న, మధ్యస్థ పరిమాణంలో ఉన్న రాళ్లను ఎంచుకోండి. రాయి చాలా పెద్దగా ఉంటే వాటర్‌మెలన్‌పై ఒత్తిడి పడవచ్చు, చిన్నగా ఉంటే వేడిని సరిగ్గా నిల్వ చేయలేదు. 1-2 కిలోల బరువు ఉన్న రాయి సరిపోతుంది.

2. రాయిని సరిగ్గా ఉంచండి:  
   వాటర్‌మెలన్ పెరుగుతున్నప్పుడు, అది మధ్యస్థ పరిమాణంలో ఉన్నప్పుడు రాయిని దానిపై జాగ్రత్తగా ఉంచండి. రాయి పండును ఒత్తకుండా చూసుకోండి.

3. ప్లాస్టిక్ మల్చింగ్ ఉపయోగించండి:  
   చిత్రంలో చూసినట్లు, నేలపై ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ వేయడం వల్ల నీటి ఆవిరి తగ్గుతుంది, కలుపు మొక్కలు పెరగవు, మరియు నేల ఉష్ణోగ్రత కూడా నియంత్రణలో ఉంటుంది.

4. సరైన సమయంలో కోత:  
   వాటర్‌మెలన్‌లు పూర్తిగా పండిన తర్వాత, అంటే 30-40 రోజుల తర్వాత (పంట రకాన్ని బట్టి) కోయండి. రాతి పద్ధతి వల్ల తీపి ఎక్కువగా ఉంటుంది, కానీ సరైన సమయంలో కోత చేయడం ముఖ్యం.

ఈ పద్ధతి యొక్క ప్రయోజనాలు:

తీపి పెరుగుతుంది: వాటర్‌మెలన్‌లో చక్కెర స్థాయిలు 10-15% వరకు పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఖర్చు లేదు: రాళ్లు ఉచితంగా దొరుకుతాయి, ఈ పద్ధతికి అదనపు ఖర్చు అవసరం లేదు.

సహజమైన పద్ధతి: రసాయనాలు ఉపయోగించకుండా, సహజంగా పండు రుచిని పెంచుకోవచ్చు.

మార్కెట్ విలువ: తియ్యని వాటర్‌మెలన్‌లకు మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్, ధర ఉంటుంది.

 జాగ్రత్తలు:

రాయి చాలా బరువుగా ఉండకూడదు, లేకపోతే పండు దెబ్బతింటుంది.

వాటర్‌మెలన్‌లు ఎక్కువ రోజులు రాయి కింద ఉంటే, అవి అధిక వేడికి గురై పాడయ్యే అవకాశం ఉంది. సరైన సమయంలో రాయిని తీసేయండి.

ఈ పద్ధతి వేసవి కాలంలోనే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది, వర్షాకాలంలో ఉపయోగించడం మానుకోండి.

రైతన్నలారా, ఈ చిన్న రాతి రహస్యం మీ వాటర్‌మెలన్ సాగును ఒక మెట్టు పైకి తీసుకెళ్తుంది. సైన్స్‌తో సాంప్రదాయాన్ని కలిపి, మనం మన పంటలను మరింత రుచికరంగా, లాభదాయకంగా మార్చుకోవచ్చు. ఈ పద్ధతిని ఒకసారి ప్రయత్నించి చూడండి, మీ అనుభవాన్ని మాతో పంచుకోండి. సహజ సాగుతో సంపద సృష్టిద్దాం, సంతోషంగా జీవిద్దాం!
సేకరణ.... రైతే రాజు...@

Friday, 14 March 2025

*మత్తేభ విక్రీడితము*.. జీవితం వర్ణమయం అని తెలిపే.. హోలీ...


   ప్రతి సంవత్సరం హిందూ సంప్రదాయం ప్రకారం పాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు హోలీ పండుగను జరుపుకుంటాము. రంగుల ఆనందంతో చిన్నా, పెద్ద, మత, వయో బేధం లేకుండా హోలీ ఉత్సవాలను జరుపుకుంటారు. హోలీ పూర్ణిమను కాముని పున్నంగా పిలుస్తుంటారు. ఈ పౌర్ణమికి ముందురోజు రాత్రి అన్ని ప్రాంతాలలో కాముడి దహానాన్ని గ్రామంలో ఇంటింటి నుండి సేకరించిన పిడుకలతో దగ్ధం చేస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని హోళీ జరుపుకుంటారు. ఫాల్గుణ మాసం పూర్ణిమనాడు జరుపుకునే పండుగ కనుక ఫాల్ఘుణోత్సవమని, వసంత రుతువును స్వాగతించే వేడుక కాబట్టి వసంతోత్సవమని పిలుచుకుంటాము.

మన తెలుగు నేలలోనూ కాముని పున్నమ, మదనోత్సవం అనే పేర్లతోనూ హోళీ వేడుకలను జరుపుకుంటాము. కన్నడ ప్రాంతంలో 'కామన హబ్బ', తమిళనాట 'కామక్ పండిగె' అని పిలుస్తారు. మదనుడి దహనం, ఆయన పునరుజ్జీవనాన్ని పురస్కరించుకుని ఈ వేడుక చేసుకుంటారు. దక్షిణాదికన్నా ఉత్తర భారతంలో హోలీ పండుగకు ఎక్కవ ప్రాముఖ్యం ఉంది.

పురాణ గాథలు

హోళీ పర్వదినం వెనుక చాలా పురాణ గాథలు ఉన్నాయి. దైవకార్య నిమిత్తం.. యోగ నిష్ఠలో ఉన్న పరమేశ్వరుడికి తపోభంగం కలిగించమని దేవతలందరూ మన్మథుడిని కోరడంతో ఆయన శివుడి మీదకు తన బాణం ప్రయోగిస్తాడు. దీనిపై ఆగ్రహం చెందిన పరమేశ్వరుడు.. తన మూడో కంటిని తెరచి మన్మధుడిని బూడిద చేస్తాడు. మదనుడి భార్య రతీదేవి పరమేశ్వరుడిని వేడుకోవడంతో బోళా శంకరుడు కరిగిపోయి మన్మధుడు.. రతీదేవికి మాత్రమే కనిపించేలా వరమిచ్చాడు. అలా మళ్లీ మన్మధుడు రతీదేవికి దక్కాడు. ఈ పండుగ జరుపుకోవడానికి ఈ కథ కూడా ఓ కారణమైందని కొందరు విశ్వసిస్తారు.

పూర్వం రఘుమహారాజు కాలంలో హోలిక అనే ఓ రాక్షసి ఉండేదట. అది పసిపిల్లలను సంహరిస్తుండేది. ఒక యోగి సూచన మేరకు ఓ వృద్ధురాలు.. పిల్లల చేత ఆ రాక్షసిని బాగా తిట్టించిందట. ఆ తిట్లు వినలేక హోలిక చినిపోయింది. ఆమెను ఊరి ప్రజలందరూ తగలబెట్టి హోలీ పండుగను జేరుపుకున్నారట. ఆ సంప్రదాయమే ఇప్పటికీ కొనసాగుతోందని మరికొందరి నమ్మకం

హోలీ పండుగ పుట్టుకకు మరో కథ కూడా ఉంది. చిన్నారి శ్రీకృష్ణుడు తన శరీరరంగు... రాథ శరీరరంగు మథ్య ఎందుకింత వ్యత్యాసం ఉందని తల్లికి ఫిర్యాదు చేయడంతో.... యశోద...  రాథను ముఖానికి రంగువేసుకోమని కోరిందంట. అలా హోళీ ప్రసిద్ధిగాంచింది. శ్రీకృష్ణుడు పెరిగిన మథుర, బృందావనంలో ఇప్పటికీ 16 రోజులపాటు హోళీ వేడుకలను జరుపుకుంటారు.

మరో కథ కూడా వాడుకలో ఉంది. అయితే ఈ కథ ప్రేమ దేవుడైన కామదేవుడు గురించి తెలుపుతుంది. పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగ పరచాలనుకుంటాడు. ఇందులో భాగంగా అతనిపై పూల బాణం వదిలిన కామదేవుని శరీరాన్ని శివుడు నాశనం చేసాడు. తరువాత శివుడు, తన త్రినేత్రాన్ని తెరిచి, కామదేవుని శరీరాన్ని బూడిద చేస్తాడు. కామదేవుని యొక్క భార్య రతి కోరిక మేరకు శివుడు కామదేవుడిని మరలా బ్రతికిస్తాడు. అయితే, భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేక పూరిత ప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకొంటారు.ఇలా దేశవ్యాప్తంగా ఎన్నెన్నోకథలు హోలీ ఆవిర్భావానికి కారణాలుగా చెబుతారు. వసంత రుతువు శోభకు ప్రకృతి పులకిస్తూ ఉన్న తరుణంలో ప్రజలంతా మహోఉత్సాహభరితంగా ఈ వసంతోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ హోలీ మీ అందరి జీవితాలను మరింత వర్ణమయంగా మార్చాలని, శుభం చేకూర్చాలని దీవిస్తూ...మీ.. చింతా గోపీశర్మ సిద్ధాంతి. 

ఈరోజు హోలీ పూర్ణిమ శుక్రవారం అఖండ గోదావరి నది తీరాన వెలసిన శ్రీ క్షేత్రపాలక కాలభైరవ స్వామి వారికి త్రిశూల హారతి సమర్పణ కార్యక్రమం జరుగుతుంది..

👉*హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు*
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
*మత్తేభ విక్రీడితము*
హరుడే గౌరికి పాపిటన్ నలమగా హ్లాదమ్ముచే కుంకుమన్
మురిపెంబున్ వరవర్ణినిన్ గిరిజయే పూసేను మాహేశుకున్,
పరమానందము నాచరించి రపుడున్ పన్నీటి స్నానమ్ములన్
జరిపేరంత వసంతపౌర్ణమి కడున్ సంతోషమున్ హోళిగన్

(వరవర్ణినిన్ = పసుపును)

*సీస పద్యము*
వేగము, నభిరుచి విరిసేటి రంగంచు
         యెరుపును జల్లేరు యెంచు కొనుచు
సంతోషమును, యాశ సమకూరు చందాన
         నీలము పసుపులు నింగి వెలుగు
కొత్తదనము, శాంతి కురియంగ ధరలోన
         యాకుపచ్చను పూసి యాడుకొంద్రు
రంగులే వివిధ తెరంగులై హంగులై
         యుత్సాహమును గూర్చు నుత్సవమ్ము

*తేటగీతి*
రంగులన్నియు బాగుగా రంగరించి
తారతమ్య భావమ్ముల తరిమివైచి
జల్లుకొనురయ్య హ్లాదమే వెల్లివిరియ
భళి! వసంతోత్సవములిట్లు పరిఢవిల్ల

                     యజ్ఞమూర్తి ద్వారకానాథ్



Monday, 10 March 2025

రిజిస్ట్రేషన్తో పాటు ఎల్ఆర్ఎస్ ఆన్లైన్ చేసుకోండి : జిల్లా రిజిస్ట్రార్ రవీందర్రావు విజ్ఞప్తి


ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ పై సోమవారం ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయం మీటింగ్ హాల్లో జిల్లా రిజిస్టర్ రవీందర్ రావు అవగాహన సదస్సు నిర్వహించారు 
2020 సంవత్సరంలో దాదాపు 25 వేల పైబడి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఆన్లైన్ చేసుకున్నారని..
వాటి పరిష్కారం విషయమై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కసరత్తు జరుగుతుంది రవీందర్ అన్నారు 
 ఇకపై 2020 సంవత్సరం ముందు రిజిస్ట్రేషన్ అయిన దరఖాస్తులు..  వెంచర్లల్లో పది శాతం రిజిస్ట్రేషన్ అయ్యి మిగిలిన ప్లాట్లు అమ్మకాలు చేసుకునేవారు రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో ఎల్ఆర్ఎస్ కాలం కూడా పూర్తి చేయాలని అందుకు సంబంధించి వచ్చే ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించుకొని రిజిస్ట్రేషన్ అమలు జరిపించుకోవాలని ఆయన కోరారు.. ఎల్ఆర్ఎస్ ఫీజు రిజిస్ట్రేషన్ శాఖ చలానా వేరువేరుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు
ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన పలువురు ఎల్ఆర్ఎస్ పై పలు సూచనలు చేశారు వీటిని తప్పకుండా రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని రవీందర్ వారికి హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా  రిజిస్ట్రేషన్ శాఖ తరుపున LRS -2020 పథకం పై అవగాహన సదస్సు 10/3/2025 న ZP సమావేశ మందిరంలో నిర్వహించారు 
** ఖమ్మం, [10/03/2025]: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (LRS) 2020 పై అవగాహన సదస్సును ఖమ్మం జిల్లా రిజిస్ట్రార్
 ఎమ్. రవిందర్ రావుశఆధ్వర్యం లో సోమవారం ఉదయం 9:00 నుండి 11:30 గంటల వరకు ZP హాల్, ఖమ్మంలో నిర్వహించారు. సదస్సుకు 300 మందికి పైగా ప్రాపర్టీ యజమానులు, డాక్యుమెంట్ రైటర్లు, రియల్టర్లు, రిజిస్ట్రేషన్ సిబ్బంది హాజరయ్యారుపథకంలోని కొత్త మార్గదర్శకాలు, ప్రయోజనాలు మరియు ప్రక్రియలను తెలుసుకున్నార ఈ సందర్భంగా జిల్లా రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి విక్రయ దస్తావేజు  ప్రక్రియతో పాటు ఆన్లైన్ ద్వారా చేపట్టాల్సిన  LRS-2020 మార్గదర్శకాలు అర్హత ప్రమాణాలను వివరించారు,
ఈ ప్రక్రియ ద్వారా  26 ఆగస్టు 2020 కంటే ముందు 10% విక్రయించిన ప్లాట్స్ అనధికార లేఅవుట్లను రెగ్యులరైజ్ చేసేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ చేసుకునేవారు ప్రభుత్వ భూమి, చెరువులు లేదా పర్యావరణ అనుబంధ జోన్లలో ఉన్న స్థిరాస్తులను రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకోకుండా ఉండటం మంచిదని  రవీందర్రావు హితవు పలికారు. అనంతరం
IGRS (ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ సిస్టం) LRS పోర్టల్స్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలను స్క్రీన్ పై ప్రదర్శించారు, అలాగే అవసరమైన డాక్యుమెంట్స్, ఆస్తి యజమాన్యపు సాక్ష్యపత్రాలు, సర్వే నెంబర్లు, EC ప్రతులు లేఅవుట్ ప్రణాళికలను వివరించారు. ముఖ్యంగా 31 మార్చి నాటికి చెల్లింపులు చేసినవారికి రెగ్యులరైజేషన్ ఛార్జీలపై రాష్ట్ర ప్రభుత్వం 25% రాయితీ ప్రకటించడం జరిగిందని తెలిపారు.LRS చెల్లింపుల అనంతరం, అభ్యర్థులు IGRS పోర్టల్‌కు తిరిగి వెళ్లి ఆస్తి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. చెల్లింపుల అనంతరం పొందిన ట్రాన్సాక్షన్ సమ్మరీ మరియు అంగీకారం (Undertaking) Sub-Registrar కార్యాలయానికి తుది అనుమతి కోసం సమర్పించాలన్నారు..
స్టేక్‌హోల్డర్ల అభ్యర్థనల డాక్యుమెంట్ రైటర్లు మరియు రియల్టర్ల నుండి మార్కెట్ విలువ లెక్కింపులు, డాక్యుమెంట్ ధృవీకరణ  వంటి విషయాలపై  వచ్చిన ప్రశ్నలకు జిల్లా జిల్లా రిజిస్ట్రార్ సమాధానాలు ఇచ్చారు.
రిజిస్ట్రార్, సాంకేతిక సమస్యలు మరియు దరఖాస్తు లోపాల పరిష్కారానికి ప్రత్యేక సాయం డెస్కులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు
కొత్త విధానాలు మరియు మార్గదర్శకాల ఈ సమావేశం LRS-2020 పథకంలో దరఖాస్తు చేసుకోవడానికి కొత్త విధానాలు, అవసరమైన డాక్యుమెంట్లు మరియు చెల్లింపు విధి విధానాల జిల్లా రిజిస్ట్రార్, ప్రీ-రిజిస్ట్రేషన్ పాటించాల్సిన  మార్గదర్శకాలను తెలిపారు,
జిల్లా రిజిస్ట్రార్, అన్ని స్టేక్‌హోల్డర్లను రాయితీని సద్వినియోగం చేసుకుని LRS దరఖాస్తులు  చెల్లింపులు 31 మార్చి నాటికి పూర్తి చేయాలన్నారు. ఈ పథకం, ఆస్తి యజమానులకు వారి ఆస్తులను రెగ్యులరైజ్ చేసుకుని భవిష్యత్‌లో లీగల్ ఇబ్బందులను నివారించుకోవడానికి ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు. సదస్సులో పలువురు ప్రశ్నలకు జిల్లా రిజిస్టర్ రవీందర్ రావు ఓపికగా సమాధానం ఇవ్వడంతో వారు సంతృప్తి చెందారు మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేశారు అసలే బేరాలు లేక ఇబ్బందులు పడుతుంటే తేదీ నిబంధనలతో రిజిస్ట్రేషన్ చేసుకోమనడం ఇబ్బందికరమని సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ విషయం తాను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని జిల్లా రిజిస్టర్ రవీందర్రావు వారికి బదులిచ్చారు


Sunday, 9 March 2025

జిల్లా పరిషత్లో ఎల్.ఆర్.ఎస్. పై అవగాహన సమావేశం... జిల్లా రిజిస్ట్రార్ రవీందర్ రావు

 
ఖమ్మం జిల్లా, రిజిస్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశానుసారం ఎల్.ఆర్.ఎస్. ను అనుసరించి రిజిస్ట్రేషన్ లకు సంబంధించిన విధివిధానాలపై అవగాహనకు నేడు (సోమవారం) స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ ఎం. రవీందర్ రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇట్టి సమావేశం సోమవారం ఉదయం 9.00 గంటల నుండి చేపడుతున్నట్లు, ఇట్టి సమావేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వెంచర్ల యజమానులు, ప్లాట్ల యజమానులు, దస్తావేజు లేఖరులు హాజరుకావాలని జిల్లా రిజిస్ట్రార్ అన్నారు. ఈ సమావేశంలో  రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన అధికారులు పాల్గొని ఎల్.ఆర్.ఎస్. పై పూర్తి అవగాహన కల్పిస్తారని, ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Saturday, 8 March 2025

ఒక మర్డర్ చేసుకునే అవకాశం మహిళలకు ఇవ్వండి.. రాష్ట్రపతికి ఎస్.పి.మహిళా నేత విజ్ఞప్తి...


రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు విజ్ఞప్తి చేసిన NCP SP మహిళా విభాగం ప్రెసిడెంట్ రోహిణి ఖడ్సే
స్త్రీలందరి తరఫున మేం ఒకటే డిమాండ్ చేస్తున్నాం.. ఒక మర్డర్ చేసేందుకు మాకు ఇమ్యూనిటీ కల్పించండి..
ఎలాంటి పనిష్మెంట్ లేకుండా ఒక మర్డర్ చేసుకునే అవకాశం ఇవ్వండి అంటూ విజ్ఞప్తి చేస్తూ లేఖ రాసిన రోహిణి ఖడ్సే మహిళలపై నేరాలు ఎక్కువగా జరుగుతున్న నైపథ్యంలో ఈ వెసులుబాటు కల్పించాలని లేఖ రాశారు..##########################
 The Nationalist Congress Party (SP) leader Rohini Khadse has made a unique demand on the occasion of women's day - immunity to commit one murder. The demand, however, comes in the context of rising crimes against women across the nation.In a letter addressed to President Droupadi Murmu, Khadse begins with an apology and goes on to list out the reasons behind her demand....

Friday, 7 March 2025

ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం : మంత్రి పొంగిలేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్....పేదవారి ప్రభుత్వం కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుని ఈ రోజుతో 15 నెలలు అయ్యింది. ఎన్నికల సందర్భంగా మేము ఇచ్చిన హామీలను కొన్ని పూర్తి చేశాం... మిగిలిన వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తాం.
రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3500 ఇళ్ళను ఇచ్చే కార్యక్రమం మరో వారంలో మొదలవుతుంది అర్హులైన వారికి అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు బాగోలేని కారణంగా తులం బంగారం లేటవుతుంది ఆనాటి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అరాచకం సృష్టించింది. వాటన్నింటినీ గాడిన పెడుతూ అభివృద్ధి, సంక్షేమం చేపడుతున్నాం ఎక్కడ తగ్గకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. పేదవారి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్త శుద్దితో పని చేస్తోంది
ఇచ్చిన ప్రతి మాటను..హామీని ఆలస్యమైనా నిలబెట్టుకుంటాం

Thursday, 6 March 2025

తిరుమల అన్నసదనంలో ప్రతిరోజు 35వేల వడల తయారు.. భక్తులకు మరింత రుచి-చూచి ఆహారం



తిరుమల, 2025 మార్చి 06: తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో గురువారం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిలతో కలిసి టిటిడి ఛైర్మన్ భక్తులకు వడ వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్న ప్రసాదం మెనూలో భక్తులకు అదనంగా ఒక పదార్థం వడ్డించాలని ఆలోచన కలిగిందన్నారు. ఈ విషయాన్ని సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన అంగీకారంతో వడల వడ్డింపు కార్యక్రమాన్ని ఈరోజు నుండి ప్రారంభించామన్నారు.ఇప్పటికే భక్తులకు నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్న ప్రసాదాలు అందిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు తెలియజేశారు.భక్తులకు పంపిణీ చేసే వడ తయారీలో శెనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పొదీన, సోంపును ఉపయోగించనున్నారు.అన్న ప్రసాద కేంద్రంలో ఇకపై ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు 35 వేల వడలను భక్తులకు వడ్డించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి భక్తులకు రుచికరమైన భోజనం  అందించేందుకు కృషి చేయనున్నట్లు టిటిడి వర్గాలు పేర్కొన్నాయి.

Wednesday, 5 March 2025

పెరిగిన మందుల ధరలపై సుప్రీంకోర్టు ఆగ్రహం....





న్యూ ఢిల్లీ :-సామాన్యులకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని సుప్రీంకోర్టు మండిపడింది. ఇది ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరేలా పరోక్షంగా ప్రేరేపించడమే అని పేర్కొంది. తమ ఫార్మసీలోనే మెడిసిన్ కొనాలనే ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై దాఖలైన పిల్పై విచారణ జరిపిన సుప్రీం ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, బిహార్, తమిళనాడు , హిమాచల్ ప్రదేశ్,రాజస్థాన్లకు నోటీసులు జారీచేసింది.*ప్రైవేట్ ఆసుపత్రుల్లో ధరలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఔషదాల ధరలు పెరిగడం కొనుగోలు దారులకు భారమని సుప్రీం అభిప్రాయపడింది  ప్రైవేట్ ఆసుపత్రుల పై చర్యలు తీసుకోండంటూ రాష్ట్రాలకు సుప్రీం కోర్టు డైరెక్షన్.

Saturday, 1 March 2025

ఎల్లారీస్ లేకుంటే అక్రమ నిర్మాణాలకు అనుమతి నిల్.: జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్


*30 రోజుల్లో పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేయాలి .... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*

*ఇంటర్ పరీక్షలు, ఎల్.ఆర్.ఎస్.  పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, అదనపు కలెక్టర్ లు*
ఖమ్మం :  30 రోజుల్లో పెండింగ్ లో ఉన్న 70 వేల  ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఎల్.ఆర్.ఎస్. పై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాసరెడ్డి లతో కలిసి పాల్గొన్నారు.ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఎల్ఆర్ఎస్ పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇంటర్ పరీక్ష కేంద్రాలలో ఎవరికి సెల్ ఫోన్ అనుమతి లేదని, పరీక్షలు సజావుగా నిర్వహించాలని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసిందని అన్నారు. 
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం *జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులతో మాట్లాడుతూ* రెవెన్యూ , ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులు కలిసి బృందంగా పని చేస్తేనే ఎల్ఆర్ఎస్ లో పురోగతి సాధ్యమని అన్నారు. శనివారం అదనపు కలెక్టర్, తహసిల్దార్, ఎంపిడిఓ, ఎంపీఓ, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని కలెక్టర్ అన్నారు.
జిల్లాలో 70 వేల ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని, ప్రతి రోజు ఎంత మేరకు దరఖాస్తులు పరిష్కరించవచ్చు పరిశీలించి, ప్రతి బృందానికి లక్ష్యాలు నిర్దేశించాలని కలెక్టర్ తెలిపారు. పనుల పురోగతిని కలెక్టర్ గా తాను ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని, 30 రోజుల వ్యవధిలో 70 వేల దరఖాస్తుల  ప్రక్రియ పూర్తి కావాలని అన్నారు.9 వేల ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులను జిల్లాలో ఆమోదించామని అన్నారు. ఎల్.ఆర్.ఎస్. క్రమబద్ధీకరణ లేని పక్షంలో అక్రమ నిర్మాణాల తొలగింపు ఉంటుందని, నిర్మాణాలకు అనుమతి ఉండదని వారిని ఫాలో అప్ చేయాలని కలెక్టర్ సూచించారు.మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి సజావుగా నిర్వహించాలని  తెలిపారు.  పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యార్థులకు పరీక్ష హాల్స్ లో త్రాగునీరు అందించాలని, పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం రవాణా కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని,  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక శ్రద్ధ వహించాలని, ప్రత్యేక బస్సులను నడపాలని  తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కనీస మందులతో పారా మెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. 
ఈ సమావేశంలో జెడ్పీ సిఇఓ దీక్షా రైనా, డిపిఓ ఆశాలత, డిఎం&హెచ్ఓ డా. కళావతి బాయి, ఆర్డీవోలు నరసింహా రావు, ఎల్. రాజేందర్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు,  ఆర్టిసి, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 
*ప్రణాళికాబద్ధంగా పెండింగ్ ఎల్.ఆర్.ఎస్.  దరఖాస్తులను పరిష్కరించాలి... అదనపు కలెక్టర్ లు డా. శ్రీజ, శ్రీనివాస్ రెడ్డి*

**టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలి*

**మండలాల్లో అవసరమైన మేర బృందాలను ఏర్పాటు చేయాలి*

**ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తుల స్క్రూటినీ, పరిష్కారంపై సంబంధిత అధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించిన అదనపు కలెక్టర్ లు*
------------------------------------------------------------------------
ఖమ్మం : ప్రణాళికాబద్ధంగా పెండింగ్ ఎల్.ఆర్.ఎస్.  దరఖాస్తులను మార్చి నెలాఖరు లోగా స్క్రూటినీ పూర్తి చేసి పరిష్కరించేలా చూడాలని అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు.శనివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఎల్.ఆర్.ఎస్. పై సంబంధిత అధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా *అదనపు కలెక్టర్ లు మాట్లాడుతూ* పెండింగ్ ఉన్న ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తుల స్క్రూటినీ కోసం అవసరమైన మేర బృందాలను ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి బృందంలో నీటి పారుదల శాఖ అధికారి, రెవెన్యూ అధికారి, టౌన్ ప్లానింగ్, సంబంధిత అధికారులు ఉండాలని అన్నారు. మండలంలో అవసరమైన మేర లాగిన్ అందించడం జరుగుతుందని, అవసరమైన బృందాలను ఏర్పాటు చేసుకొని ప్రతి రోజూ ఎన్ని దరఖాస్తులు స్క్రూటినీ జరుగుతుందో లక్ష్యాలు నిర్దేశించుకోవాలని అన్నారు. భూ క్రమబద్ధీకరణలో భాగంగా ప్రభుత్వ భూములలో, నీటి వనరుల ఎఫ్టిఎల్, బఫర్ జోన్లలో క్రమబద్ధీకరణకు అనుమతించరాదని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ధృవీకరణ చేయాలని, బృందంలో ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తును పూర్తి స్థాయిలో స్క్రూటినీ చేయాలని అదనపు కలెక్టర్ అన్నారు. భూ క్రమబద్ధీకరణలో ఎక్కడైనా అవతవకలకు పాల్పడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఎల్.ఆర్.ఎస్. స్క్రూటినీ పూర్తి చేసుకుని ఆమోదించిన దరఖాస్తుదారులను ఫాలో అప్ చేస్తూ మార్చి 31 లోపు ప్రభుత్వం అందించే రాయితీ వినియోగించుకునేలా చూడాలని అన్నారు. అనంతరం మండలాల వారిగా అదనపు కలెక్టర్ సమీక్షించి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యల గురించి వివరించి, సందేహాలను నివృత్తి చేసారు. ఈ సమావేశంలో డిపిఓ ఆశాలత, డిఎల్పీఓ రాంబాబు, 
ఖమ్మం నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమీషనర్ షఫీయుల్లా, తహసీల్దార్ లు, ఎంపిడిఓ, నీటి పారుదల శాఖ, టౌన్ ప్లానింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.