ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ పై సోమవారం ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయం మీటింగ్ హాల్లో జిల్లా రిజిస్టర్ రవీందర్ రావు అవగాహన సదస్సు నిర్వహించారు
2020 సంవత్సరంలో దాదాపు 25 వేల పైబడి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఆన్లైన్ చేసుకున్నారని..
వాటి పరిష్కారం విషయమై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కసరత్తు జరుగుతుంది రవీందర్ అన్నారు
ఇకపై 2020 సంవత్సరం ముందు రిజిస్ట్రేషన్ అయిన దరఖాస్తులు.. వెంచర్లల్లో పది శాతం రిజిస్ట్రేషన్ అయ్యి మిగిలిన ప్లాట్లు అమ్మకాలు చేసుకునేవారు రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో ఎల్ఆర్ఎస్ కాలం కూడా పూర్తి చేయాలని అందుకు సంబంధించి వచ్చే ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించుకొని రిజిస్ట్రేషన్ అమలు జరిపించుకోవాలని ఆయన కోరారు.. ఎల్ఆర్ఎస్ ఫీజు రిజిస్ట్రేషన్ శాఖ చలానా వేరువేరుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు
ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన పలువురు ఎల్ఆర్ఎస్ పై పలు సూచనలు చేశారు వీటిని తప్పకుండా రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని రవీందర్ వారికి హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ తరుపున LRS -2020 పథకం పై అవగాహన సదస్సు 10/3/2025 న ZP సమావేశ మందిరంలో నిర్వహించారు
** ఖమ్మం, [10/03/2025]: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (LRS) 2020 పై అవగాహన సదస్సును ఖమ్మం జిల్లా రిజిస్ట్రార్
ఎమ్. రవిందర్ రావుశఆధ్వర్యం లో సోమవారం ఉదయం 9:00 నుండి 11:30 గంటల వరకు ZP హాల్, ఖమ్మంలో నిర్వహించారు. సదస్సుకు 300 మందికి పైగా ప్రాపర్టీ యజమానులు, డాక్యుమెంట్ రైటర్లు, రియల్టర్లు, రిజిస్ట్రేషన్ సిబ్బంది హాజరయ్యారుపథకంలోని కొత్త మార్గదర్శకాలు, ప్రయోజనాలు మరియు ప్రక్రియలను తెలుసుకున్నార ఈ సందర్భంగా జిల్లా రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి విక్రయ దస్తావేజు ప్రక్రియతో పాటు ఆన్లైన్ ద్వారా చేపట్టాల్సిన LRS-2020 మార్గదర్శకాలు అర్హత ప్రమాణాలను వివరించారు,
ఈ ప్రక్రియ ద్వారా 26 ఆగస్టు 2020 కంటే ముందు 10% విక్రయించిన ప్లాట్స్ అనధికార లేఅవుట్లను రెగ్యులరైజ్ చేసేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ చేసుకునేవారు ప్రభుత్వ భూమి, చెరువులు లేదా పర్యావరణ అనుబంధ జోన్లలో ఉన్న స్థిరాస్తులను రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకోకుండా ఉండటం మంచిదని రవీందర్రావు హితవు పలికారు. అనంతరం
IGRS (ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ సిస్టం) LRS పోర్టల్స్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలను స్క్రీన్ పై ప్రదర్శించారు, అలాగే అవసరమైన డాక్యుమెంట్స్, ఆస్తి యజమాన్యపు సాక్ష్యపత్రాలు, సర్వే నెంబర్లు, EC ప్రతులు లేఅవుట్ ప్రణాళికలను వివరించారు. ముఖ్యంగా 31 మార్చి నాటికి చెల్లింపులు చేసినవారికి రెగ్యులరైజేషన్ ఛార్జీలపై రాష్ట్ర ప్రభుత్వం 25% రాయితీ ప్రకటించడం జరిగిందని తెలిపారు.LRS చెల్లింపుల అనంతరం, అభ్యర్థులు IGRS పోర్టల్‌కు తిరిగి వెళ్లి ఆస్తి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. చెల్లింపుల అనంతరం పొందిన ట్రాన్సాక్షన్ సమ్మరీ మరియు అంగీకారం (Undertaking) Sub-Registrar కార్యాలయానికి తుది అనుమతి కోసం సమర్పించాలన్నారు..
స్టేక్‌హోల్డర్ల అభ్యర్థనల డాక్యుమెంట్ రైటర్లు మరియు రియల్టర్ల నుండి మార్కెట్ విలువ లెక్కింపులు, డాక్యుమెంట్ ధృవీకరణ వంటి విషయాలపై వచ్చిన ప్రశ్నలకు జిల్లా జిల్లా రిజిస్ట్రార్ సమాధానాలు ఇచ్చారు.
రిజిస్ట్రార్, సాంకేతిక సమస్యలు మరియు దరఖాస్తు లోపాల పరిష్కారానికి ప్రత్యేక సాయం డెస్కులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు
కొత్త విధానాలు మరియు మార్గదర్శకాల ఈ సమావేశం LRS-2020 పథకంలో దరఖాస్తు చేసుకోవడానికి కొత్త విధానాలు, అవసరమైన డాక్యుమెంట్లు మరియు చెల్లింపు విధి విధానాల జిల్లా రిజిస్ట్రార్, ప్రీ-రిజిస్ట్రేషన్ పాటించాల్సిన మార్గదర్శకాలను తెలిపారు,
జిల్లా రిజిస్ట్రార్, అన్ని స్టేక్‌హోల్డర్లను రాయితీని సద్వినియోగం చేసుకుని LRS దరఖాస్తులు చెల్లింపులు 31 మార్చి నాటికి పూర్తి చేయాలన్నారు. ఈ పథకం, ఆస్తి యజమానులకు వారి ఆస్తులను రెగ్యులరైజ్ చేసుకుని భవిష్యత్‌లో లీగల్ ఇబ్బందులను నివారించుకోవడానికి ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు. సదస్సులో పలువురు ప్రశ్నలకు జిల్లా రిజిస్టర్ రవీందర్ రావు ఓపికగా సమాధానం ఇవ్వడంతో వారు సంతృప్తి చెందారు మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేశారు అసలే బేరాలు లేక ఇబ్బందులు పడుతుంటే తేదీ నిబంధనలతో రిజిస్ట్రేషన్ చేసుకోమనడం ఇబ్బందికరమని సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ విషయం తాను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని జిల్లా రిజిస్టర్ రవీందర్రావు వారికి బదులిచ్చారు
No comments:
Post a Comment