Thursday, 21 August 2025

రిజిస్ట్రేషన్ శాఖకు సొంత కార్యాలయాలు అత్యంత అవసరం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు రూపుదిద్దుకోవాలని చెప్పారు.
✅ గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్  (TALIM) సమీపంలో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ భవనంతో పాటు సమీకృత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల భవన సముదాయాలకు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు  పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతొ కలిసి ముఖ్యమంత్రి  శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు
✅ ఈ సందర్భంగా భవన సముదాయాల నిర్మాణ సామగ్రిని పరిశీలించారు. అనంతరం 'ప్రజా పాలన – ప్రగతి బాట'  సభలో ప్రసంగించారు ప్రభుత్వ కార్యాలయాల ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవం, మధ్య తరగతి ప్రజలకు రాజీవ్ స్వగృహ గృహ నిర్మాణం, నైట్ ఎకానమీని పెంచుతూ విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి సంబంధించిన ప్రణాళికలను సమగ్రంగా వివరించారు.
✅ “ప్రభుత్వ కార్యాలయాలు ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలున్నా ప్రభుత్వ కార్యాలయాలు సరిగా లేవు. ఏటా 15 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చే స్టాంపులు - రిజిస్ట్రేషన్ శాఖకు ప్రజలు కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్నారు.✅ ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుతున్న వారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వస్తే వారిని ఏదో తప్పు చేసిన దోషుల్లా చూసే పరిస్థితి ఉంది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటే, సదుపాయాలు లేక దారుణంగా ఉన్నాయి.
✅ రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సంవత్సరానికి 19 లక్షల డాక్యుమెంట్లు చేస్తున్నారు. ఈ కార్యాలయాల్లో వసతులు పెంచడం వల్ల ప్రభుత్వానికి ఆదాయమే కాకుండా గౌరవం కూడా పెరుగుతుంది. ప్రపంచంతో పోటీ పడే విధంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వ కార్యాలయాలు రూపుదిద్దుకోవాలి. 
✅ గచ్చిబౌలిలో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వచ్చే రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. కార్యాలయాలాల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించి గంటల కొద్ది నిరీక్షించే పనిలేకుండా టైమ్ స్లాట్ ప్రకారం పనులు ప్రజలకు పనులు పూర్తి కావాలి.
✅ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అపర్ణ గ్రూప్ 30 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ కార్యాలయం నిర్మాణానికి ముందుకు రావడం పట్ల సంస్థ ఎండీ ఉదయ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. మిగతా కార్యాలయాలను కూడా ఇదే స్ఫూర్తితో మంత్రులు చొరవ తీసుకుని పూర్తయ్యేలా చూడాలి.
✅ వచ్చే పదేళ్లలో ప్రపంచమంతా హైదరాబాద్ నగరాన్ని చూడటానికి వచ్చే విధంగా తీర్చిదిద్దుతాం. గత పాలకులు కొంత పరిమితితో కూడిన దృక్పథంతో ముందుకు వెళ్లారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం విశాల దృక్పథంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో అభివృద్ధిని అడ్డుకునే వారంతా శత్రువులే. అలాంటి వారిని నిలువరించాల్సిన బాధ్యత ప్రజలదే. గడిచిన కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఆగిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లయ్యే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా రాష్ట్రం ఎదగాలని తెలంగాణ రైజింగ్ 2047 (Telangana Rising 2047) దార్శనికతతో ముందుకు వెళుతున్నాం.
మూసీ ప్రక్షాళన (Musi Rejuvenation), భారత్ ఫ్యూచర్ సిటీ (Bharath Future City) నిర్మాణం కొంతమందికి ఇష్టం లేదు. ఒకనాడు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడితే అదెందుకు. కార్లు ఉన్న వారికోసమా అని అవహేళన చేశారు. హైదరాబాద్ నీటి సమస్యతో గతంలో ఖాళీ కుండల ప్రదర్శనలు కనిపించేవి.  తాగునీటి సమస్య పరిష్కారానికి కృష్ణా నదీ జలాలను తరలించగా, అవి కూడా సరిపోకపోవడంతో, గోదావరి, మంజీరా జలాలను తరలించడం జరిగింది.
హైదరాబాద్ అభివృద్ధికి చేయాల్సింది ఇంకా చాలా ఉంది. అందుకే మన టార్గెట్ బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ నగరాలతో కాదు. న్యూయార్క్, సింగపూర్, టోక్యో నగరాలతో పోటీ పడదలచుకున్నాం. అందుకు మనకు చేతనవుతుంది. మన దగ్గర సాంకేతిక నైపుణ్యం ఉంది. కావలసింది చిత్తశుద్ధి మాత్రమే.మిగతా రాష్ట్రంలో సబర్మతీ, యమునా, గంగా నదులను ప్రక్షాళన చేస్తున్నప్పుడు హైదరాబాద్ నగర ప్రతిష్టను పెంచే మూసీ నది ప్రక్షాళన చేపడితే ఎందుకు అడ్డుపడుతున్నారు. ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ. దాన్ని గోల్డ్ సిటీగా మార్చాలి.
 మూసీని పునరుజ్జీవింపజేసి నైట్ ఎకానమీని పెంచాలని అనుకుంటున్నాం. ఆ ప్రాంతంలో వ్యాపారాలు వృద్ధి చెందాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అలాగే సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు వ్యాపారాలు సాగేలా నైట్ ఎకానమీని వృద్ధి చేయాలి. నైట్ ఎకానమీ వృద్ధి సాధించాలంటే ఎలివేటెడ్ కారిడార్ రావాలి. 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించి 365 రోజుల పాటు మూసీలో నీరు ఉండే విధంగా రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసి, ఆర్థికంగా తెలంగాణ ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
నగరాల్లో మధ్య తరగతికి రాజీవ్ స్వగృహ ద్వారా సరసమైన ధరలకు ఇళ్లు కట్టుకోవడానికి వీలు కల్పించాలి. అందుకు మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొంగులేటి గారు  ప్రణాళికలు రూపొందించాలి. మధ్య తరగతి గురించి ఆలోచన చేయాలి. వారికి సొంతింటి కల నెరవేరాలంటే నగరం విస్తరణ ఇవసరం. మెట్రో, రీజినల్ రోడ్డు, మూసీ ప్రక్షాళన వంటివి జరగాలి. ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధిస్తున్న తరుణంలో  హైదరాబాద్ నగరాన్ని మురికి కూపంగా, చెత్త చెదారం పేరుకుపోయిన నగరంగా, నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్యలతో అలాగే వదిలేయడానికి వీలులేదు. ఒక గొప్ప విశ్వనగరంగా రూపుదిద్దుకోవాలి..” అని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Chief Minister Shri A. Revanth Reddy emphasized the urgent need to modernize government offices across Telangana to provide better services to the public and make them globally competitive through technology. He laid the foundation stone for the Ranga Reddy District Registrar Office and the Integrated Sub-Registrar Offices complex near TALIM, Gachibowli, along with Ministers Duddilla Sridhar Babu and Ponguleti Srinivasa Reddy. The construction materials were inspected, and plans for modern facilities, including technology-driven workflows to reduce waiting times, were discussed. The Chief Minister appreciated the CSR contribution of Rs 30 crore from Uday, MD of the construction company, for building this office, which is expected to be completed by the next State Formation Day.

🔹 Highlighting the poor conditions in sub-registrar offices, he noted that 19 lakh documents are processed annually in 144 offices across the state. Many offices lack basic facilities despite generating substantial revenue for the government. Improving these offices will not only increase government income but also enhance public respect.

🔹 Speaking on urban development, the Chief Minister outlined plans to revive the Musi riverfront, ensuring water remains in the river throughout the year, and to develop the night economy so businesses can operate 24x7. He emphasized affordable housing for the middle class through Rajiv Swagruha, expansion of the city with Metro and regional roads, and creation of elevated corridors. He added that Hyderabad should compete with global cities like New York, Singapore, and Tokyo, using technical expertise, strategic planning, and sincerity.

🔹 The Chief Minister stressed that stalled development must be accelerated under the vision of Telangana Rising 2047, aiming to make the state a $3 trillion economy by 2047. He called upon citizens to support progress and eliminate obstacles to urban and state-wide development.

🔹 The program was attended by Legislative Council Whip Patnam Mahender Reddy, City Mayor Gadwala Vijayalakshmi, Government Chief Secretary Ramakrishna Rao, along with other ministers, officials, and public representatives.
#RegistrationAndStamps #TelanganaRising

Sunday, 10 August 2025

జీవించి లేకున్నా తమ్మునికి రాఖి... ముంబాయి టు ఆహ్మాదాబాద్ రాఖీ స్టోరీ....



జీవించి లేకున్నా ఆ అక్క తమ్మునికి రాఖీ కట్టింది 
అవయవ దానం రూపంలో ఆమె మరో జన్మ ఎత్తింది మహారాష్ట్ర ముంబై నుండి కదలి వచ్చిన అక్క గుజరాత్ అహ్మదాబాద్ లో ఉంటున్న తమ్మునికి రాఖీ కట్టింది. 
16 సంవత్సరాల అనంత ముంబైలో ఉంటుంది అనారోగ్య కారణంగా అహ్మదా బాద్ గుజరాత్ లో నివాసం వుండే శివం మిస్త్రీ సోదరి మరణానంతరం ఆమే అవయవదానం వల్ల అనంతకు పునర్ జన్మ లభించింది.
తనకు అవయవ దానం చేసిన ఆమె తమ్ముడు శివంమిస్త్రీ రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టి అతన్ని ఆనందంలో ముంచెత్తింది. తమ ఇంటి ఆడపిల్ల తిరిగి బతికి వచ్చినంత ఆనందం శివ మిస్త్రీ కుటుంబానికి కలిగించింది.. ఇది కదా నిజమైన రాఖి అంటూ ఆ ప్రాంతవాసుల పేర్కొన్నారు 
Mumbai to Gujarat Rakhi story
Sixteen-year-old Anamta Ahmad from #Mumbai tied a rakhi to 14-year-old Shivam Mistry, the brother of her organ #donor, with the very hand she had received from his late sister, Riya.

మణికుమార్ కొమ్మమూరు..
మొబైల్ : 9032075966

Wednesday, 6 August 2025

ఆరోగ్య మిత్ర సేవలు అభినందనీయం.. డాక్టర్ అశోక్ పరికిపండ్లకు ఖమ్మం కలెక్టర్ ప్రశంసలు..

కారేపల్లి(సింగరేణి) :  *ఆరోగ్య మిత్ర రజతోత్సవాల(2000_2025)పోస్టర్లు కరపత్రాలు ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి............ *25 వేల మందికి ఉపయోగపడేలా, 25 నెలల పాటు, 25 జిల్లాల్లో, 25 రకాల సేవా కార్యక్రమాలు ప్రారంభం*.............           
 *లాభాపేక్ష లేకుండా 25 సంవత్సరాలుగా నిరంతర సేవలు అందించడం డాక్టర్ అశోక్ పరికిపండ్ల అభినందనీయుడని కలెక్టర్ ప్రశంస*........
కొత్త కమలాపురం వాసి డాక్టర్ అశోక్ పరికిపండ్ల ఆరోగ్యవంతమైన సమసమాజ స్థాపనకై మిత్రుల సంఘటితంతో స్థాపించిన ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ రజ తోత్సవ సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ 25 వసంతాల కార్యక్రమాల పోస్టర్లు కరపత్రాలను కలెక్టరేట్లో ఆవిష్కరించి రజతోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000 నుండి ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రయాణం రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యా, వైద్యం, ఆరోగ్యం, యువత, పర్యావరణం, ఆత్మహత్యల నివారణ, స్వయం ప్రతిపత్తి, స్వావలంబన తదితర అనేక అంశాలపై 25 సంవత్సరాలుగా నిరంతర కార్యక్రమాలు చేపడుతుండటం హర్షనీయమని,   ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ రజతోత్సవ వేడుకల (2000_2025) ను పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలలోని 25 వేల మందికి ఉపయోగపడేలా, 25 జిల్లాల్లో, 25 అంశాలపై, 25 సంస్థలతో కలిసి, 25 నెలల పాటు నిరంతర సేవా కార్యక్రమాలను నిర్వహించడం, అంతేకాక   25 మందికి జాతీయ అవార్డులను అందజేయడం  గొప్ప కార్యమని,  ప్రభుత్వం నుంచి ఇటువంటి సామాజిక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తోడ్పాటు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఆరోగ్య మిత్ర వ్యవస్థాపకులు ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ తెలంగాణలోని 33 జిల్లాలు, 189 రోజులపాటు 28,600 కిలోమీటర్లు బైక్ యాత్ర చేసి, 2680 చోట్ల ఉచిత వైద్య శిబిరాల ద్వారా సుమారు 8 లక్షల మందికి ఉచితంగా హోమియోపతి  కరోనా వ్యాధి నిరోధక మందులు పంపిణీ చేశామని మరియు,ఎక్స్ప్రెస్ రైలలో సాధారణ భోగిల పెంపు పై దేశవ్యాప్త ప్రధానమంత్రికి కోటి ఉత్తరాల ఉద్యమాన్ని చేపట్టి ఈరోజు ప్రతి ఎక్స్ప్రెస్ ట్రైన్ లో నాలుగు సాధారణ భోగిలను సాధించిన ఉద్యమానికి ఆరోగ్యమిత్ర నేతృత్వం వహించిందని అంతేగాక  ఆత్మహత్యలపై గత 20 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరంతరం చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పటివరకు 28 మందిని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడగలిగామని,  తెలంగాణ రాష్ట్ర డిజిపి డాక్టర్ జితేందర్ గారీ ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణలోని ప్రతి జిల్లాలో పోలీసు వారికి ఆత్మహత్యల పై సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ రాజ తోత్సవ వేడుకలకు ప్రతి ఒక్కరూ సహకరించి, ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఖమ్మం జిల్లా కన్వీనర్ గద్దె వెంకట్రామయ్య, అన్నం శ్రీనివాస్, వలస సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
*@ మణికుమార్ కొమ్మమూరు...*
మోబైల్: 9032075966

కాంగ్రెస్ ది రిజర్వేషన్ల నాటకం : భాజాపా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు

బీసీ ముసుగులో కాంగ్రెస్ మతపరమైన ఆటలు!
* జంతర్ మంతర్‌కు బీసీలు కరువై, పేమెంట్‌ ప్రదర్శకులు!
*  42% రిజర్వేషన్ అంత నాటకం.
* ముస్లింల రిజర్వేషన్‌కి బీసీ ముసుగు.
* మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు .

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో బీసీ హక్కుల పేరిట మత రాజకీయాలకు దారితీసే కుట్రను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోందని, బీసీల హక్కులను ముసుగుగా ఉపయోగిస్తూ ముస్లింలకు రిజర్వేషన్‌ కల్పించాలనే అజెండాతో ముందుకు సాగుతుండటం బాధాకరమని భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఖమ్మం బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీ ధర్నా ప్రయోజనాల వెనుక దాగిన అసలైన లక్ష్యాన్ని బహిర్గతం చేశారు.
“డిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన ధర్నా ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీల హక్కుల కోసం కాదు. అది పూర్తిగా ముస్లింలకు రిజర్వేషన్‌ కల్పించే ప్రయత్నమే. బీసీ రిజర్వేషన్‌ బిల్డప్‌తో మతపరమైన వర్గాలకు లాభం చేకూర్చాలన్నదే వారి దుశ్చింతన,” అని మండిపడ్డారు.
నిజమైన బీసీ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను వేదికగా పెట్టుకొని ముస్లింలకు ప్రాధాన్యతనిచ్చే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. “బీసీలకు ఐదు శాతం, ముస్లింలకు పక్కాగా ఇరవై శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలన్న కాంగ్రెస్ విధానం రాజ్యాంగానికి విరుద్ధం. మతపరమైన రిజర్వేషన్ అనేది రాజ్యాంగం స్పష్టంగా నిషేధించింది,” అని స్పష్టం చేశారు.జంతర్‌మంతర్ వద్ద జరిగిన ధర్నాకు బీసీల మద్దతు కరువై, పేమెంట్‌ ఆర్టిస్టులను తీసుకెళ్లి బంధువుల మధ్య తలెత్తే దయనీయ దృశ్యాలను కనిపించేలా చేశారు. “ఇది బీసీలకు సంఘటన కాకుండా బీజేపీపై కుట్రగా అభివర్ణించాల్సిన స్థితి. కాంగ్రెస్ నేతలు సమాజాన్ని మోసం చేస్తున్నారు,” అని విమర్శించారు.

* ఒక బీసీని సీఎం చేసిన దాఖలా ఉందా?
బీసీల హక్కులపై పెద్ద గొంతుగా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక్క బీసీ నేతను కూడా ముఖ్యమంత్రిగా చేసిందా? అని ప్రశ్నించారు. "బీసీ లు వాడుకునే వస్తువులుగా మారిపోయారు. పదవులు బీసీలకు ఇవ్వడం కన్నా తమ నేతల కులరాజకీయాలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి," అని మండిపడ్డారు.
"బీసీ డిక్లరేషన్‌ కేవలం మాటల మాయ. బడ్జెట్‌లో దానికి ప్రతిఫలించేదేమీ లేదు. రూ. 20 వేల కోట్ల సబ్ ప్లాన్ హామీ గాలికి వదిలేశారు. ఇది బీసీలను మోసం చేసే అత్యంత ఘోరమైన రాజకీయ వ్యూహం," అని పేర్కొన్నారు.

* కేంద్రంలో బీసీ అభ్యున్నతికి బీజేపీ కృషి.
బీజేపీ పాలనలో బీసీల అభ్యున్నతి కోసం అనేక ప్రయోజనాత్మక పథకాలు అమలవుతున్నాయని, ప్రధానమంత్రి ముద్రా యోజన, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, బీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవడం వంటి విషయాలను ఉదహరించారు. “మేం హామీ ఇచ్చిన వాటిని నెరవేర్చే బాటలో ఉంటాం. కాంగ్రెస్‌లా మాటలు చెబుతూ మోసంచేయం,” అని ఆయన హామీ ఇచ్చారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని వ్యాఖ్యానించిన ఆయన, “ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని భయపడి బీసీ రిజర్వేషన్ బిల్లు లేవనెత్తారు. కానీ దాన్ని సీరియస్‌గా తీసుకోనవసరం లేదు. ప్రజలు మోసాల్ని గుర్తించగలరు,” అన్నారు.
ఈ సమావేశంలో  నాయకులు ఈ వి రమేష్, నల్లగట్టు ప్రవీణ్ కుమార్, ఆల్లిక అంజయ్య, కుమిలి శ్రీనివాసరావు, పమ్మి అనిత,తడుపునూరి రవీందర్ , రుద్రగాని మాధవ్,జ్యోతుల యుగంధర్  తదితరులు పాల్గొన్నారు.

*@ మణికుమార్ కొమ్మమూరు...*
మోబైల్: 9032075966

ఢిల్లీలో బిజీబిజీగా... "తెలంగాణ సి.ఎం., డిప్యూటి సీఎం, మంత్రులు. ఒకేరోజు ప్రోఫేసర్ జయంతి - యుద్ధం నౌక వర్థంతి

తెలంగాణ సాధన కోసం తన జీవితాన్ని ధారపోసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్, ఉద్యమానికి తన పాట ద్వారా ప్రజల్లో చైతన్యం నింపిన ప్రజా యుద్ధ నౌక గద్దర్  అందించిన సేవలను ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు.ఆచార్య జయశంకర్ సార్ జయంతి, గద్దర్ వర్ధంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి  ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఆ మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Hon'ble Chief Minister Shri A. Revanth Reddy remembered the services of Professor Kothapalli Jayashankar, who dedicated his life to the cause of Telangana, and Praja Yuddha Nauka Gaddar, who inspired the people through his songs during the movement.On the occasion of Professor Jayashankar’s birth anniversary and Gaddar’s death anniversary, the Chief Minister paid floral tributes to their portraits at his official residence in Delhi. Several ministers and public representatives participated in the programme.#
*మధిర నియోజకవర్గంలో రెండు  పారిశ్రామిక పార్కులకు ఆర్థిక సహాయం అందించండి* 

*ప్రతి నియోజకవర్గంలో MSME పార్కులు ఏర్పాటు చేస్తున్నాం* 

*కేంద్ర మంత్రి జితేంద్ర మాంజిని కలిసి విజ్ఞప్తి చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు*

తెలంగాణ రాష్ట్రం MSME (మైక్రో, చిన్న మరియు మధ్యతరః పరిశ్రమల)రంగ అభివృద్ధిలో మరో అడుగు ముందుకు వేస్తోంది, రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రెండు కొత్త MSME పార్కులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కేంద్ర MSME మంత్రి జితన్ రామ్ మాంజీ కి వివరించారు. బుధవారం ఉదయం ఢిల్లీలో కేంద్ర మంత్రిని డిప్యూటీ సీఎం తో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ మల్లు రవి , కలిసి విజ్ఞప్తి చేసి లేఖను అందించారు. 
 MSME రంగం సమగ్ర ఆర్థిక ప్రగతికి కీలక క్షేత్రంగా మారుతుందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఖమ్మం జిల్లా మధిర మండలంలోని యెండపల్లి, ఎర్రుపాలెం మండలంలోని రె మిడిచర్ల గ్రామాల్లో MSME పార్కులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం, వరుసగా 85 ఎకరాలు మరియు 60 ఎకరాల్లో ఈ పార్కులు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రికివివరించారు. జాతీయ రహదారి 65 (హైదరాబాద్–విజయవాడ కారిడార్)కు సమీపంలో ఉండటంతో, వీటి భౌగోలిక స్థానం వ్యూహాత్మకంగా ఉంది. సమీప పట్టణాలు, రైల్వే నెట్వర్క్‌లు, పోర్టులతో అనుసంధానం ఉందనీ తెలిపారు. ఈ పార్కుల అభివృద్ధి ద్వారా ఆ ప్రాంత యువతకు, ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు చెందిన యువతకు పారిశ్రామిక అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఈ పార్కులు వివిధ తయారీ రంగాలకు అనుకూలంగా అభివృద్ధి చేయబడి, కనీసం 5,000 ప్రత్యక్ష మరియు 15,000 పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించగలవనే అంచనాలతో ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రికి వివరించారు.
MSME-CDP పథకం కింద ఈ పార్కుల అభివృద్ధికి ఆర్థిక సహాయానికి ప్రాజెక్ట్ ప్రతిపాదనలు పంపించేందుకు ముందస్తు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం లేఖల కోరింది.
తెలంగాణలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక MSME పార్క్ – రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన
MSME-CDP పథకం కింద కేంద్ర నుంచి ఆర్థిక సహాయం ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రికి తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం MSME రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రతిష్టాత్మక ప్రణాళికను రూపొందించింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో (మొత్తం 119) చిన్న స్థాయి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీలతో కూడిన MSME పార్క్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందనీ, ఈ పార్కులు, చిన్న స్థాయి పారిశ్రామిక సంస్థలు తమ వ్యాపారాలను ప్రారంభించి, నడిపించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ అనుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని అందించనున్నాయి అని కేంద్రమంత్రికి తెలిపారు.ఈ MSME పార్కుల్లో హాస్టళ్లు, కిచెన్లు, టాయిలెట్లు, టెస్టింగ్ సెంటర్లు, ఇతర సాధారణ వసతులు  ఉంటాయి. వ్యాపార అభివృద్ధి, ఉత్పత్తి ఆవిష్కరణ, మార్కెట్ వ్యూహం వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. మహిళా ప్రాధాన్యత గల సంస్థలకు ప్రోత్సాహంగా స్ట్రీనిధి పథకం ద్వారా రుణాల మద్దతు కూడా ఇవ్వనున్నామని కేంద్రమంత్రికి వివరించారు. దీని ద్వారా మహిళల ఆధ్వర్యంలోని సంస్థలు బలోపేతం కావడంతోపాటు, జీవనోపాధి అవకాశాలు విస్తరించనున్నాయి.
ప్రస్తుతం MSME-CDP పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 25 ప్రాజెక్టులను కేంద్ర MSME మంత్రిత్వశాఖ సహకారంతో అమలు చేస్తోంది. వీటిలో ఇండస్ట్రియల్ పార్కులు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సులు, కామన్ ఫెసిలిటీ సెంటర్లు (CFCs) ఉన్నాయి. ఇవి రాష్ట్రంలో MSME వ్యవస్థను బలంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఈ క్రమంలో, తెలంగాణ రాష్ట్రం కేంద్ర MSME మంత్రిత్వశాఖ మద్దతుతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా MSME పార్కులను నెలకొల్పడానికి సంబంధిత పథకాల ద్వారా ఆర్థిక సహాయం కోరుతోంది. ఈ ప్రయోజనాత్మక కార్యక్రమాల ద్వారా భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్న 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తెలంగాణ రాష్ట్రం కీలక భాగస్వామిగా నిలుస్తుందనే నమ్మకాన్ని  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రి ఎదుట వ్యక్తం చేశారు.

*@ మణికుమార్ కొమ్మమూరు...*
మోబైల్: 9032075966

Tuesday, 5 August 2025

అశ్రద్ధ చూపితే.. క్రిమినల్ చర్యలు తప్పవు : ఐటిడిఎ పిఓ రాహుల్ వార్నింగ్


ఖమ్మం, ఆగస్టు -05: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆశ్రమ పాఠశాల, పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్, గురుకులాలు, ఈఎంఆర్ఎస్ పాఠశాలల్లో గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు సరఫరా చేస్తున్న అల్పాహారం, భోజనాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని, కల్లూరు గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలో జరిగిన పరిణామాలు ఒక హెచ్చరికగా భావించి ఇకముందు ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత సంబంధిత ప్రిన్సిపాల్, హెచ్ఎం, వార్డెన్లపై ఉందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఇన్స్టిట్యూషన్లలో పనిచేయుచున్న ప్రిన్సిపాల్, హెచ్ఎం వార్డెన్ లతో, ఐటిడిఎ పీవో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 
ఈ సందర్భంగా ఐటిడిఎ పీవో మాట్లాడుతూ, ఒకటిన్నర సంవత్సరాల పాటు విద్యార్థుల చదువుపరంగా గాని, ఆహార విషయంలో గాని, ఆరోగ్య విషయంలో గానీ ఎటువంటి పొరపాట్లు జరగలేదని, కానీ ఈ మధ్యకాలంలో సిబ్బంది నిర్లక్ష్యం, వార్డెన్, హెచ్ఎం, ప్రిన్సిపాల్ ల అశ్రద్ధ వలన తప్పులు జరుగుతున్నాయని, ఇక ముందు ఇలా జరగకుండా చూసుకోవలసిన బాధ్యత మీపై ఉందని అన్నారు. కమిషనర్ జాయిన్ అయి వారం రోజులు కూడా కాలేదని ఈ లోపల మన జిల్లాలో ఉన్న ఇన్స్టిట్యూషన్లో ఇటువంటి తప్పులు దొర్లడం చాలా క్షమించరాని విషయమని, ఎవరిని ఉపేక్షించమని ఇకముందు ఇటువంటి పరిమాణాలు ఏ ఇన్స్టిట్యూషన్లో జరిగిన ఆ సిబ్బందిపై క్రిమినల్ కేసులు పెట్టి శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, విద్యార్థులకు అందించే ఫుడ్ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని అన్నారు. ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఫుడ్ విషయంలో ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని, వండిన ఆహారాన్ని ముందుగా ప్రిన్సిపాల్, హెచ్ఎం, వార్డెన్, ఉపాధ్యాయులు తిన్న తర్వాతనే సర్టిఫై చేసి పిల్లలకు పెట్టాలని, పిల్లలు భోజనాలు చేసిన తర్వాత అస్వస్థకు గురి అయితే సర్టిఫై చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. వంటగది, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, వారానికి ఒకసారి హెచ్ఎం, వార్డెన్, టీచర్లు, విద్యార్థినీ విద్యార్థులు ఐకమత్యంగా ఉండి శ్రమదానం చేసుకోని పరిసరాలలో మొక్కలు నాటించాలని, జి సి సి నుండి సరఫరా అయ్యే బియ్యం పప్పులు అన్ని సక్రమంగా చూసుకోవాలని ఏమైనా నాసిరకంగా ఉంటే వాపస్ చేసి వెంటనే ఏటీడీవోకు తెలియజేయాలని, పిల్లల చదువుకు భంగం కలగకుండా చూడాలని, ప్రిన్సిపాల్, హెచ్ఎం, వార్డెన్ సిబ్బంది అందరూ స్థానికంగా ఉండాలని, ఆర్ సి ఓ లు,  ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు, ఏటీడీవోలు, ఐటీడీఏ నుంచి నియమించబడ్డ స్పెషల్ ఆఫీసర్లు, ఎస్ సి ఆర్ పి లు వారానికి తప్పనిసరిగా మూడు ఇన్స్టిట్యూషన్లు సందర్శించి ఇన్స్టిట్యూషన్ యొక్క బాగోగులు పిల్లలను అడిగి తెలుసుకోవాలని, ఇకముందు ఫుడ్ పాయిజన్, పిల్లలతో మాట్లాడిన వీడియోలకు సంబంధించిన చిత్రాలు నా దృష్టికి వస్తే అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రతి ఇన్స్టిట్యూషన్లో 100% కొత్త మెనూ అమలు చేసి పిల్లలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, పాఠశాలలకు, వసతి గృహాలకు ఏమైనా మరమ్మతులు ఉంటే చేయిస్తామని అన్నారు. ఈ సమావేశంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ విజయలక్ష్మి, ఆర్సిఓ గురుకులం అరుణకుమారి, ఏటీడీవోలు సత్యవతి, భారతీదేవి, ఖమ్మం జిల్లాలోని ప్రిన్సిపాల్, హెచ్ఎం, వార్డెన్ తదితరులు పాల్గొన్నారు.

Monday, 4 August 2025

కాళేశ్వరం తప్పిదాలపై చర్యలు వుంటాయి : తెలంగాణ సి.ఎం.రేవంత్ రెడ్డి.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి సమగ్ర చర్చ చేపడతామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, బాధ్యులపై చర్యలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ న్యాయ విచారణ కమిషన్ చేసిన సూచనలను ప్రభుత్వం అమలు చేస్తుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలిపారు. అసెంబ్లీలో చర్చించి, రాజకీయాలకు అతీతంగా పూర్తిగా చట్టబద్ధంగా ముందుకు వెళతామని స్పష్టం చేశారు.

నల్గొండను విద్యా హబ్ గా తీర్చిదిద్దుతాము... 9 నెలల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయాలి... రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...



నల్గొండ జిల్లాను విద్యా హబ్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అన్ని వర్గాల విద్యార్థులకు ఉత్తమమైన చదువులను అందించాలన్న లక్ష్యంతో నల్గొండ జిల్లా కేంద్రంలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల రాష్ట్రంలోనే మొదటిది కావాలన్నారు. 9 నెలల్లో  ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు.సోమవారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని గంధం వారి గూడెంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులకు  మంత్రి భూమి పూజ నిర్వహించారు.నల్గొండ జిల్లాలోని విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి చేపట్టిన బృహత్తర పాఠశాల యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల అని, రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలతో ఇలాంటి పాఠశాలలను డిజైన్ చేసి నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు.  రాష్ట్రంలోనే నల్గొండ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల మొదటిదని ,ఇది  రికార్డు కావాలన్నారు. రెసిడెన్షియల్ పాఠశాల పక్కనే మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ ఉన్నాయని, నల్గొండ లో అన్ని హంగులతో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉందని, నల్గొండ జిల్లాను విద్యా హబ్ గా మార్చడానికి కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఇటీవలే ఎం ఫార్మసీ ,ఎల్ఎల్ బి కోర్సులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్ హాబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, విద్యార్థులు చదువుపైనే దృష్టి సారించాలని, మధ్యలో బడి మానివేయవద్దని అన్నారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారని, వారందరినీ ఇలాంటి ఉత్తమమైన పాఠశాలల్లో చదివించి వారికి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని,విద్య ,ఉపాధిలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలోనిలిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంతున్నదని తెలిపారు. ప్రస్తుతం నల్గొండలో బాలికలకు ఉద్దేశించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు కాగా,
 బాలురకు కూడా ఇలాంటి పాఠశాల నిర్మాణానికిచర్యలుతీసుకుంటామన్నారు. 

Nalgonda to be developed as an Education Hub.
Minister Komatireddy Venkat Reddy laid the foundation for Telangana’s first Young India Integrated Residential School at Gandhamvari Gudem, Nalgonda. ₹200 Cr project to be completed in 9 months.

Saturday, 2 August 2025

ఓవైపు ప్రభుత్వ ఉద్యోగం - మరోవైపు సమాజ సేవ సమాజ సేవ

పెనుబల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 200 నోటు పుస్తకాలు స్పాన్సర్ చేసి పంపిణీ చేసిన బాబురావు
చేసేది చిరు ఉద్యోగం అయినా సమాజ సేవ చేయాలనే సంకల్పం అందుకే ఖమ్మానికి చెందిన బాబురావు ప్రస్తుతం పెనుబల్లి లో ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నారు 

తనకొచ్చిన జీతం లో కొంత మొత్తం సామాజిక అవసరాల కోసం సేవా కార్యక్రమాల కోసం ఆయన వినియోగిస్తూ అందరి మనన్నలు పొందుతున్నారు

మానవత్వంతో అమరత్వం*. Or *మరణానంతర జీవం*---- డా:అశోక్ పరికిపండ్ల,

*మానవత్వంతో అమరత్వం*. Or *మరణానంతర జీవం*---- డా:అశోక్ పరికిపండ్ల, తెలంగాణ
 నేత్ర శరీర అవయవ దాతల సంఘం రాష్ట్ర  సహాధ్యక్షులు ,ఫోన్ -9989310141.       ------------------------------  (ఆగస్ట్ -03, జాతీయ అవయవ దాన  దినోత్సవం_ National  Organ Donation Dayను పురస్కరించుకొని)....-------------------------------- ఒక కోటీశ్వరుడు కోట్ల రూపాయలు ఖరీదు చేసే కారును, ఫలానా రోజున అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు పేపర్లో ప్రకటన వేశాడు. ఆ కారు అంటే తనకు చాలా ఇష్టమని, తాను చనిపోయిన తరువాత కూడా ఈ కారు తనకే చెందాలి కాబట్టి అంత్యక్రియలు చేస్తున్నట్లు ఆ ప్రకటన సారాంశం.కారుకు అంత్యక్రియలు ఏమిటని ఆశ్చర్య పోయిన జనాలు ఆ తంతు చూడటానికి  చాలా మంది వచ్చారు. కారుకు సరిపోయేలా అక్కడ ఓ పెద్ద గొయ్యి తవ్వి ఉంది, ఇంతలో కారులో కోటీశ్వరుడు వచ్చారు. తల తల మెరిసిపోతున్న ఖరీదైన కారుని మట్టిలో  పాతి పెడుతున్నారని, అక్కడ చేరిన వారందరికీ మనసు ఓ రకంగా బాధ అనిపించింది.
కొందరయితే ఆయన మీద ఆగ్రహంతో  గొడవకు దిగారు. "ఇంత విలువైన కారు ని  పాతి పెట్టడానికి నీకు మనసెలా ఒప్పింది, ఎవరికైనా ఇస్తే వాడుకుంటారు కదా !  అమ్మితే వచ్చిన డబ్బుతో ఎందరికో ఆకలి తీర్చ వచ్చు కదా,మీరు చచ్చిపోయాక కారు ఏమి అయితే మీకు ఎందుకు ? మరీ ఇంత మూర్ఖత్వమా!" అంటూ నిలదీశారు దానికి ఆయన ఇలా వివరించారు. "నిజమే ఖరీదైన కారును మట్టిపాలు చేస్తున్నానని మీకు కోపం వచ్చింది, కోటి రూపాయలు పెడితే కొత్త కారు వస్తుంది. కానీ నాకు గుండె కావాలి 10 కోట్లు ఇస్తాను, ఎవరైనా ఇవ్వగలరా ? ఇవ్వలేరు! ఖరీదు కట్టలేని అలాంటి విలువైన అవయవాలను ఎన్నింటినో చనిపోయిన మనిషి తో పాటు మట్టిలో పాతి పెడుతున్నాం లేదా కాల్చి బూడిద చేస్తాం,అప్పుడు ఎవరు ఈ పద్ధతులను ప్రశ్నించలేదు ఎందుకు" అని నిలదీశాడు. ఆ ప్రశ్నలు విని అందరూ తెల్లబోయారు. కారు మీద ప్రేమతో నో, మూర్ఖత్వం తోనో నేను ఈ పని చేయ లేదు, అవయవ దానం  విలువ మీకు గుర్తు చేయాలని ఇదంతా చేశాను. ఇప్పటికైనా ఆలోచించండి అవయవ దాతలు కండి అని చెప్పి ఆయన కారు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు..........                                *పరో పకారం ఇదం శరీరం*................----------------------------అనే ఉపనిషద్ వాక్యమే కర్మభూమి అయిన భారత దేశంలో అవయవదానం కు స్ఫూర్తి దాయకంగా నిలిచింది.అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది...నాటిమాట,అన్ని దానాళ్లో కెల్లా అవయవ దానం అత్యున్నతమైనది.... నేటి మాట. "యావత్తు మానవాళి శరీర దానానికి ముందుకు వస్తే ....మానవుడు మరణాన్ని జయించినట్లే."... అన్నారు ప్రముఖ కవి శ్రీ శ్రీ. ఆరోగ్యవంతమైన మనిషి నుంచి అవయవాలు సేకరించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో రోగికి వాటిని  అ మార్చడం ను  అవయవదానం అంటారు . ఆధునిక వైద్య విజ్ఞాన శాస్త్రం సాధించిన అద్భుత విజయం ఇది, రోగి శరీరంలో పూర్తిగా పాడై విధులను సక్రమంగా నిర్వర్తించలే ని స్థితి  ఉత్పన్న మైనప్పుడు  అటువంటి వారికి అవయవ మార్పిడి అవసరమవుతుంది, దీన్ని ప్రణాళిక, నిబద్ధత కలిగిన యంత్రాంగం, సంస్థలు ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతంగా నిర్వహించవచ్చును. ప్రపంచంలో తొలి  అవయవ దానం చేసిన దాత రోనాల్డ్ లీ హె రిక్. ఆయన తన కవల సోదరుడికి 1954లో మూత్రపిండాన్ని దానం చేశారు. ఈ చికిత్స నిర్వహించిన వైద్యుడు జోసెఫ్ ముర్రే కి 1990లో నోబెల్ బహుమతి ప్రధానం చేశారు. కేవలం 100 నిమిషాల జీవనకాలం ఉన్న ఓ చిన్నారి నుండి మూత్రపిండాలను తీసి 2015లో మరొకరికి అమర్చారు. స్కాట్లాండ్ దేశానికి చెందిన 107 సంవత్సరాల మహిళ తన కంటిలోని కార్నియాను మరొకరికి దానం చేయడం ద్వారా అతి వృద్ధ అవయవ దాత గా చరిత్రలో నిలిచారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో అవయవదానానికి సంబంధించి అనేక చట్టాలు రూపొందించారు. అర్జెంటీనాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ అవయవదానానికి అర్హులే నని తీర్మానం ఇస్తూ 2005 నవంబర్లో చట్టం తెచ్చారు. బ్రెజిల్, చిలీ ,కొలంబియా లోనూ ఇదే తరహా చట్టాలున్నాయి. ఐరోపాలోని వివిధ దేశాల్లో అవయవదానంపై పటిష్ఠ చట్టాలు అమలు అవుతున్నాయి. స్పెయిన్ , ఆస్ట్రియా , బెల్జియం లలో అత్యధిక సంఖ్యలో అవయవ దాతలు స్వచ్ఛందంగా తమ పేర్లు నమోదు చేసుకోవడం విశేషం. స్కాట్లాం డ్ లో పౌరులంతా అవయవ దాన పత్రంలో తమ పేర్లు తప్పని సరిగా నమోదు చేసుకోవాలి. భారత దేశంలో కార్నియా మార్పిడి మాత్రమే పూర్తిస్థాయిలో అమలు అవుతోంది. భారత ప్రభుత్వం 1994లో మానవ అవయవ మార్పిడి చట్టం తీసుకువచ్చింది. దీనికి 2011లో కొన్ని మార్పులు చేశారు. దేశంలో 2013లో మరణానంతర అ అవయవదాన సందర్భాలు అధికంగా నమోదయ్యాయి.....    
*సమస్య తీవ్రత*......
---------------------------
మన దేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలలో దాదాపు లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ప్రమాదాల లోనే బ్రెయిన్ డెడ్  కేసులు ఎక్కువగా ఉంటాయి.అలాంటి వారి కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరిస్తే అవయవాల కొరత సగానికి సగం తీరుతుంది. చాలా దేశాల్లో బ్రెయిన్డెడ్ కేసుల్లో ఆ శరీరాలపై సర్వహక్కులు ప్రభుత్వా లవే. కుటుంబ సభ్యుల అనుమతి తో నిమిత్తం లేకుండా అవయవాలను స్వీకరించి అవసరమైన వారికి అమరుస్తారు.అవసరానికి అందుబాటులో ఉన్న అవయవాలకి మధ్య విపరీతమైన తేడా ఉంది మనదేశంలో. ఆ పరిస్థితిని అంకెల్లో పెడితే....
అవసరమైన అవయవాలు అందుబాటులో లేక సంవత్సరానికి  5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రెండు లక్షల 20 వేల మంది మూత్రపిండాల మార్పిడి కోసం ఎదురు చూస్తూ ఉండగా, 15వేల మూత్రపిండాలు మాత్రమే లభిస్తున్నాయి. లక్ష మంది కాలేయ జబ్బులతో మరణిస్తున్నారు. కేవలం వెయ్యి మంది కే కాలేయం దొరుకుతుంది. కళ్ళ కోసం 10 లక్షల మంది, గుండె మార్పిడి కోసం 50 వేల మంది, ఊపిరితిత్తుల కోసం 20 వేల మంది వేచి చూస్తున్నారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లలో లో గత ఎనిమిదేళ్లలో మొత్తం అన్ని రకాల అవయవ మార్పిడి ఆపరేషన్ లు కలిపి 2216 మాత్రమే జరిగాయి. అయితే ప్రతి సంవత్సరం గత సంవత్సరం కంటే ఇవి పెరగడం సానుకూల అంశం.2010 లో ఒకే ఒక గుండె మార్పిడి జరగగా 2017 లో 32 జరిగాయి. మూత్రపిండాల మార్పిడి ఆపరేషన్ లు నలభై ఆరు నుంచి 221 కి పెరిగాయి. తెలంగాణలో ఈ సంవత్సరం జనవరి నుండి జూలై 24 వరకు జరిగిన అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు మొత్తం 351. జీవించి ఉండగానే, మరణించిన తర్వాత.... రెండు రకాలుగా అవయవ దానం చేయవచ్చు. మూత్రపిండాలు రెండు ఉంటాయి కాబట్టి  ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి నుంచి ఒకటి తీసి అవసరమైనా మరొకరికి పెట్టవచ్చు. అలాగే కాలేయంలో కొంత భాగం కూడా మరొకరికి దానం చేయవచ్చు. కానీ ఎక్కువగా అవయవదానం జరిగేది మరణించాక అంటే బ్రెయిన్డెడ్ సందర్భాలలో. చాలా వరకు రోడ్డు ప్రమాదాల్లో , కొన్నిరకాల అనారోగ్యాల లో ఉరి వేసుకోవడం లాంటివి జరిగినప్పుడు మొదట మెదడు దెబ్బతింటుంది . అది తీవ్రంగా దెబ్బతిని ఇక కోలుకునే అవకాశం లేని పరిస్థితిని బ్రెయిన్డెడ్ అంటారు. ఆ పరిస్థితిలో వైద్య పర్యవేక్షణలో కృత్రిమ శ్వాస అందిస్తే శరీరంలోని మిగతా అవయవాలన్నీ పని చేస్తూనే ఉంటాయి. కుటుంబ సభ్యులు అనుమతిస్తే వాటిని తీసి ఇతరులకు అమరుస్తారు. సహజ మరణం తర్వాత కూడా అ కళ్ళు ఇతర కణజాలాన్ని దానం చేయవచ్చు. చనిపోయిన తర్వాత పార్ధివదేహాన్ని మెడికల్ కాలేజీలో విద్యార్థులు విద్యని అభ్యసించే ఈ క్రమంలో లో  డిసెక్షన్ కొరకు ఉపయోగిస్తారు. బ్రెయిన్ డెత్ కోమా ఒకటి కావు. కోమాలో ఉన్న వ్యక్తికి వెంటిలేటర్ తప్పనిసరి కాదు. అటువంటి వ్యక్తి మెదడు తిరిగి కోలుకునే అవకాశం ఎంతో కొంత ఉంటుంది. మనదేశంలో దీన్ని నిర్ధారించడానికి నలుగురు వైద్యులతో కూడిన బృందం ఆరు గంటలపాటు ఒకటికి రెండు సార్లు పరీక్షించాలి. ఆ తరువాతే ఆయా వ్యక్తులను  బ్రెయిన్ డెడ్  గా నిర్ధారించి అవయవాలని సేకరిస్తారు..........     *వీరిని
సంప్రదించవచ్చు*  ....--------------------------భారతదేశంలో అవయవ దానం లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండడం గర్వకారణం. అవయవ దాన ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోవడం లో అనేక స్వచ్ఛంద సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయి.  వాటిలోముఖ్యంగా తెలంగాణ నేత్ర శరీర అవయవ దాతల సంఘం, అఖిలభారత అవయవ దాతల సంఘం, మోహన్ ఫౌండేషన్, కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్, శతాయు , లాంటి వెబ్ సైట్లు అవయవ దానం చేయాలనుకునే వారిని ప్రోత్సహిస్తున్నాయి.   అవయవ మార్పిడి అవసరమైన వారు రాష్ట్రాల రాజధాని కేంద్రాలలో ఉన్నటువంటి జీవన్ దాన్ కార్యాలయాల్లో తమ వివరాలను నమోదు చేయించుకోవాలి. అలాగే అవయవ దాతల సమాచారం వివిధ ఆసుపత్రుల ద్వారా వారికి చేరుతుంది అందుబాటులో ఉన్న అవయవాలను బట్టి అవసరమైన వారికి సమాచారం ఇచ్చి వెంటనే శస్త్రచికిత్సకు వెసులుబాటు కల్పిస్తారు. ఉస్మానియా గాంధీ లాంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే ఆరోగ్యశ్రీ కింద అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు ఉచితంగా చేస్తున్నారు. అవయవ దానానికి సంబంధించిన సమాచారం కోసం జీవన్దాన్ పథకానికి చెందిన ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేయవచ్చు...తెలంగాణ : 9603944026,8885060092.
ఆంధ్రప్రదేశ్ : 180042564444.
*సామాజిక బాధ్యత*
--------------------------- అవయవ దాన కార్యక్రమం పై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. పాఠశాల స్థాయి నుండే ఆ మేరకు అవగాహన పెంచాలి. ప్రభుత్వంతోపాటు ప్రసార మాధ్యమాలు చురుగ్గా ఉన్నప్పుడే ఈ కార్యక్రమం సజావుగా సాగుతుంది. వాహన రవాణా లైసెన్సు స్వీకరణ సమయంలోనే ప్రతి వాహన యజమాని తో " నేను అవయవ దాత ను" అనే అంగీకార  పత్రంపై సంతకం పెట్టించాలి .  దేశంలోని ప్రతి కళాశాల , విశ్వవిద్యాలయంలోనూ ఇందుకు సంబంధించి ఒక సమన్వయ కర్త ను నియమించాలి. సమీప ప్రాంతాల్లో నిరంతరం పర్యటిస్తూ రక్తదానంతో పాటు ఇతర అవయవ దానాలు పైన ప్రజలలో చైతన్యం తీసుకురావడం వీరి బాధ్యత కావాలి. దేశంలోని ప్రతి వైద్య విద్యార్థికి అవయవదాన చైతన్య కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను కోర్సులో భాగంగా నిర్దేశించాలి. అవయవ దానం చేసిన వారి కుటుంబీకుల నుండి ఎట్టిపరిస్థితుల్లోనూ శస్త్రచికిత్స, వైద్య సేవలకు సంబంధించి ఖర్చులను  వసూలు చేయరాదు. పైగా అవయవ దాతల పేరిట కొంత మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయగలిగితే అది అద్భుతమైన ప్రోత్సాహకరంగా ఉంటుంది. అందుకోసం అన్ని విషయాలను పరిగణలోకి తీసుకునేందుకు ఒక ఒక ప్రత్యేక కమిటీని నియమించాలి. అవయవ స్వీకర్త ప్రతినెల ఔషధాల కోసం కనీసం 15 వేల నుండి 20000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి శస్త్ర చికిత్స అనంతరం వారికి కనీసం రెండు మూడు సంవత్సరాల పాటు ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు కొంతమేర ఆర్థిక సహాయం అందించాలి. పేదరికం వల్ల అవసరమైన మందులు కొనుగోలు చేయలేక , అనారోగ్యం సమస్యలు తలెత్తి స్వీకర్త కు జరగరానిది జరిగితే మొత్తంగా అవయవ దాన ప్రక్రియే అర్థం లేనిది అవుతుంది. ప్రభుత్వం చట్టాలు చేసినా నా ఇప్పటికీ డబ్బు కోసం మూత్రపిండాలు అమ్ముకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి . పేద ప్రజలను లక్ష్యంగా చేసుకొని దళారులు చేస్తున్న మోసాలకు అడ్డుకట్ట వేయాలి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఒక ఒక అవయవ మార్పిడి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. కొన్ని సందర్భాల్లో అవయవాలను అత్యంత వేగంగా ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వస్తోంది. అలాంటప్పుడు విమానయాన సంస్థలు ప్రయాణ ఖర్చులకు ప్రత్యేక రాయితీలు ప్రకటించాలి . అవయవ స్వీకర్త లే అవయవ దానానికి సంబంధించిన ప్రచారకర్తలుగా మారి ప్రజల్లో విస్తృత చైతన్యం కల్పించాలి. అవయవ మార్పిడి కి సంబంధించిన కార్యక్రమంలో ఆర్థిక లావాదేవీలు హద్దుమీర రాదు . ఏ మాత్రం గతి తప్పిన నైతిక విలువలను పణంగా పెట్టి  రోగులను వైద్య శాలలు మోసం చే సే ప్రమాదాలు కొట్టిపారేయలేం . రోగులు చిన్నపాటి కోమాలోకి వెళ్లిన కూడా బ్రెయిన్డెడ్ గా చూపించేందుకు వాళ్లు ప్రయత్నించవచ్చు. మరణించిన తర్వాత పది మంది జీవితాల్లో వెలుగు నింపే అవకాశాన్ని ఆధునిక వైద్య శాస్త్రం అందుబాటులోకి తెచ్చింది. ఆ అవకాశాన్ని ఓ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి.