బీసీ ముసుగులో కాంగ్రెస్ మతపరమైన ఆటలు!
* జంతర్ మంతర్‌కు బీసీలు కరువై, పేమెంట్ ప్రదర్శకులు!
* 42% రిజర్వేషన్ అంత నాటకం.
* ముస్లింల రిజర్వేషన్‌కి బీసీ ముసుగు.
* మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు .
ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో బీసీ హక్కుల పేరిట మత రాజకీయాలకు దారితీసే కుట్రను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోందని, బీసీల హక్కులను ముసుగుగా ఉపయోగిస్తూ ముస్లింలకు రిజర్వేషన్ కల్పించాలనే అజెండాతో ముందుకు సాగుతుండటం బాధాకరమని భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఖమ్మం బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీ ధర్నా ప్రయోజనాల వెనుక దాగిన అసలైన లక్ష్యాన్ని బహిర్గతం చేశారు.
“డిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన ధర్నా ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీల హక్కుల కోసం కాదు. అది పూర్తిగా ముస్లింలకు రిజర్వేషన్ కల్పించే ప్రయత్నమే. బీసీ రిజర్వేషన్ బిల్డప్‌తో మతపరమైన వర్గాలకు లాభం చేకూర్చాలన్నదే వారి దుశ్చింతన,” అని మండిపడ్డారు.
నిజమైన బీసీ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను వేదికగా పెట్టుకొని ముస్లింలకు ప్రాధాన్యతనిచ్చే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. “బీసీలకు ఐదు శాతం, ముస్లింలకు పక్కాగా ఇరవై శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న కాంగ్రెస్ విధానం రాజ్యాంగానికి విరుద్ధం. మతపరమైన రిజర్వేషన్ అనేది రాజ్యాంగం స్పష్టంగా నిషేధించింది,” అని స్పష్టం చేశారు.జంతర్‌మంతర్ వద్ద జరిగిన ధర్నాకు బీసీల మద్దతు కరువై, పేమెంట్ ఆర్టిస్టులను తీసుకెళ్లి బంధువుల మధ్య తలెత్తే దయనీయ దృశ్యాలను కనిపించేలా చేశారు. “ఇది బీసీలకు సంఘటన కాకుండా బీజేపీపై కుట్రగా అభివర్ణించాల్సిన స్థితి. కాంగ్రెస్ నేతలు సమాజాన్ని మోసం చేస్తున్నారు,” అని విమర్శించారు.
* ఒక బీసీని సీఎం చేసిన దాఖలా ఉందా?
బీసీల హక్కులపై పెద్ద గొంతుగా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక్క బీసీ నేతను కూడా ముఖ్యమంత్రిగా చేసిందా? అని ప్రశ్నించారు. "బీసీ లు వాడుకునే వస్తువులుగా మారిపోయారు. పదవులు బీసీలకు ఇవ్వడం కన్నా తమ నేతల కులరాజకీయాలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి," అని మండిపడ్డారు.
"బీసీ డిక్లరేషన్ కేవలం మాటల మాయ. బడ్జెట్‌లో దానికి ప్రతిఫలించేదేమీ లేదు. రూ. 20 వేల కోట్ల సబ్ ప్లాన్ హామీ గాలికి వదిలేశారు. ఇది బీసీలను మోసం చేసే అత్యంత ఘోరమైన రాజకీయ వ్యూహం," అని పేర్కొన్నారు.
* కేంద్రంలో బీసీ అభ్యున్నతికి బీజేపీ కృషి.
బీజేపీ పాలనలో బీసీల అభ్యున్నతి కోసం అనేక ప్రయోజనాత్మక పథకాలు అమలవుతున్నాయని, ప్రధానమంత్రి ముద్రా యోజన, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, బీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవడం వంటి విషయాలను ఉదహరించారు. “మేం హామీ ఇచ్చిన వాటిని నెరవేర్చే బాటలో ఉంటాం. కాంగ్రెస్‌లా మాటలు చెబుతూ మోసంచేయం,” అని ఆయన హామీ ఇచ్చారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని వ్యాఖ్యానించిన ఆయన, “ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని భయపడి బీసీ రిజర్వేషన్ బిల్లు లేవనెత్తారు. కానీ దాన్ని సీరియస్‌గా తీసుకోనవసరం లేదు. ప్రజలు మోసాల్ని గుర్తించగలరు,” అన్నారు.
ఈ సమావేశంలో నాయకులు ఈ వి రమేష్, నల్లగట్టు ప్రవీణ్ కుమార్, ఆల్లిక అంజయ్య, కుమిలి శ్రీనివాసరావు, పమ్మి అనిత,తడుపునూరి రవీందర్ , రుద్రగాని మాధవ్,జ్యోతుల యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
*@ మణికుమార్ కొమ్మమూరు...*
మోబైల్: 9032075966
No comments:
Post a Comment