ఖమ్మం, ఆగస్టు -05: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆశ్రమ పాఠశాల, పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్, గురుకులాలు, ఈఎంఆర్ఎస్ పాఠశాలల్లో గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు సరఫరా చేస్తున్న అల్పాహారం, భోజనాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని, కల్లూరు గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలో జరిగిన పరిణామాలు ఒక హెచ్చరికగా భావించి ఇకముందు ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత సంబంధిత ప్రిన్సిపాల్, హెచ్ఎం, వార్డెన్లపై ఉందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఇన్స్టిట్యూషన్లలో పనిచేయుచున్న ప్రిన్సిపాల్, హెచ్ఎం వార్డెన్ లతో, ఐటిడిఎ పీవో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐటిడిఎ పీవో మాట్లాడుతూ, ఒకటిన్నర సంవత్సరాల పాటు విద్యార్థుల చదువుపరంగా గాని, ఆహార విషయంలో గాని, ఆరోగ్య విషయంలో గానీ ఎటువంటి పొరపాట్లు జరగలేదని, కానీ ఈ మధ్యకాలంలో సిబ్బంది నిర్లక్ష్యం, వార్డెన్, హెచ్ఎం, ప్రిన్సిపాల్ ల అశ్రద్ధ వలన తప్పులు జరుగుతున్నాయని, ఇక ముందు ఇలా జరగకుండా చూసుకోవలసిన బాధ్యత మీపై ఉందని అన్నారు. కమిషనర్ జాయిన్ అయి వారం రోజులు కూడా కాలేదని ఈ లోపల మన జిల్లాలో ఉన్న ఇన్స్టిట్యూషన్లో ఇటువంటి తప్పులు దొర్లడం చాలా క్షమించరాని విషయమని, ఎవరిని ఉపేక్షించమని ఇకముందు ఇటువంటి పరిమాణాలు ఏ ఇన్స్టిట్యూషన్లో జరిగిన ఆ సిబ్బందిపై క్రిమినల్ కేసులు పెట్టి శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, విద్యార్థులకు అందించే ఫుడ్ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని అన్నారు. ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఫుడ్ విషయంలో ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని, వండిన ఆహారాన్ని ముందుగా ప్రిన్సిపాల్, హెచ్ఎం, వార్డెన్, ఉపాధ్యాయులు తిన్న తర్వాతనే సర్టిఫై చేసి పిల్లలకు పెట్టాలని, పిల్లలు భోజనాలు చేసిన తర్వాత అస్వస్థకు గురి అయితే సర్టిఫై చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. వంటగది, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, వారానికి ఒకసారి హెచ్ఎం, వార్డెన్, టీచర్లు, విద్యార్థినీ విద్యార్థులు ఐకమత్యంగా ఉండి శ్రమదానం చేసుకోని పరిసరాలలో మొక్కలు నాటించాలని, జి సి సి నుండి సరఫరా అయ్యే బియ్యం పప్పులు అన్ని సక్రమంగా చూసుకోవాలని ఏమైనా నాసిరకంగా ఉంటే వాపస్ చేసి వెంటనే ఏటీడీవోకు తెలియజేయాలని, పిల్లల చదువుకు భంగం కలగకుండా చూడాలని, ప్రిన్సిపాల్, హెచ్ఎం, వార్డెన్ సిబ్బంది అందరూ స్థానికంగా ఉండాలని, ఆర్ సి ఓ లు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు, ఏటీడీవోలు, ఐటీడీఏ నుంచి నియమించబడ్డ స్పెషల్ ఆఫీసర్లు, ఎస్ సి ఆర్ పి లు వారానికి తప్పనిసరిగా మూడు ఇన్స్టిట్యూషన్లు సందర్శించి ఇన్స్టిట్యూషన్ యొక్క బాగోగులు పిల్లలను అడిగి తెలుసుకోవాలని, ఇకముందు ఫుడ్ పాయిజన్, పిల్లలతో మాట్లాడిన వీడియోలకు సంబంధించిన చిత్రాలు నా దృష్టికి వస్తే అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రతి ఇన్స్టిట్యూషన్లో 100% కొత్త మెనూ అమలు చేసి పిల్లలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, పాఠశాలలకు, వసతి గృహాలకు ఏమైనా మరమ్మతులు ఉంటే చేయిస్తామని అన్నారు. ఈ సమావేశంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ విజయలక్ష్మి, ఆర్సిఓ గురుకులం అరుణకుమారి, ఏటీడీవోలు సత్యవతి, భారతీదేవి, ఖమ్మం జిల్లాలోని ప్రిన్సిపాల్, హెచ్ఎం, వార్డెన్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment