Wednesday, 6 August 2025

ఆరోగ్య మిత్ర సేవలు అభినందనీయం.. డాక్టర్ అశోక్ పరికిపండ్లకు ఖమ్మం కలెక్టర్ ప్రశంసలు..

కారేపల్లి(సింగరేణి) :  *ఆరోగ్య మిత్ర రజతోత్సవాల(2000_2025)పోస్టర్లు కరపత్రాలు ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి............ *25 వేల మందికి ఉపయోగపడేలా, 25 నెలల పాటు, 25 జిల్లాల్లో, 25 రకాల సేవా కార్యక్రమాలు ప్రారంభం*.............           
 *లాభాపేక్ష లేకుండా 25 సంవత్సరాలుగా నిరంతర సేవలు అందించడం డాక్టర్ అశోక్ పరికిపండ్ల అభినందనీయుడని కలెక్టర్ ప్రశంస*........
కొత్త కమలాపురం వాసి డాక్టర్ అశోక్ పరికిపండ్ల ఆరోగ్యవంతమైన సమసమాజ స్థాపనకై మిత్రుల సంఘటితంతో స్థాపించిన ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ రజ తోత్సవ సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ 25 వసంతాల కార్యక్రమాల పోస్టర్లు కరపత్రాలను కలెక్టరేట్లో ఆవిష్కరించి రజతోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000 నుండి ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రయాణం రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యా, వైద్యం, ఆరోగ్యం, యువత, పర్యావరణం, ఆత్మహత్యల నివారణ, స్వయం ప్రతిపత్తి, స్వావలంబన తదితర అనేక అంశాలపై 25 సంవత్సరాలుగా నిరంతర కార్యక్రమాలు చేపడుతుండటం హర్షనీయమని,   ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ రజతోత్సవ వేడుకల (2000_2025) ను పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలలోని 25 వేల మందికి ఉపయోగపడేలా, 25 జిల్లాల్లో, 25 అంశాలపై, 25 సంస్థలతో కలిసి, 25 నెలల పాటు నిరంతర సేవా కార్యక్రమాలను నిర్వహించడం, అంతేకాక   25 మందికి జాతీయ అవార్డులను అందజేయడం  గొప్ప కార్యమని,  ప్రభుత్వం నుంచి ఇటువంటి సామాజిక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తోడ్పాటు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఆరోగ్య మిత్ర వ్యవస్థాపకులు ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ తెలంగాణలోని 33 జిల్లాలు, 189 రోజులపాటు 28,600 కిలోమీటర్లు బైక్ యాత్ర చేసి, 2680 చోట్ల ఉచిత వైద్య శిబిరాల ద్వారా సుమారు 8 లక్షల మందికి ఉచితంగా హోమియోపతి  కరోనా వ్యాధి నిరోధక మందులు పంపిణీ చేశామని మరియు,ఎక్స్ప్రెస్ రైలలో సాధారణ భోగిల పెంపు పై దేశవ్యాప్త ప్రధానమంత్రికి కోటి ఉత్తరాల ఉద్యమాన్ని చేపట్టి ఈరోజు ప్రతి ఎక్స్ప్రెస్ ట్రైన్ లో నాలుగు సాధారణ భోగిలను సాధించిన ఉద్యమానికి ఆరోగ్యమిత్ర నేతృత్వం వహించిందని అంతేగాక  ఆత్మహత్యలపై గత 20 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరంతరం చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పటివరకు 28 మందిని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడగలిగామని,  తెలంగాణ రాష్ట్ర డిజిపి డాక్టర్ జితేందర్ గారీ ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణలోని ప్రతి జిల్లాలో పోలీసు వారికి ఆత్మహత్యల పై సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ రాజ తోత్సవ వేడుకలకు ప్రతి ఒక్కరూ సహకరించి, ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఖమ్మం జిల్లా కన్వీనర్ గద్దె వెంకట్రామయ్య, అన్నం శ్రీనివాస్, వలస సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
*@ మణికుమార్ కొమ్మమూరు...*
మోబైల్: 9032075966

No comments:

Post a Comment