Friday, 26 March 2021

చంద్ర‌బాబు ఏ1గా, నారాయ‌ణ ఏ2 అమ‌రావ‌తి ల్యాండ్‌పూలింగ్‌.. - శైలజా చరణ్ రెడ్డి


అమ‌రావ‌తి ల్యాండ్‌పూలింగ్‌.. చంద్ర‌బాబు ఏ1గా, నారాయ‌ణ ఏ2గా  ప్ర‌పంచంలోనే అతిపెద్ద స్కామ్‌,
ద‌ళితుల అసైన్డ్ భూములను బెదిరించి లాక్కున్నారు. దీనిపైనే సీఐడీ కే‌సు న‌మోదు చేసింది. దీనిలో చంద్ర‌బాబు ఏ1గా, నారాయ‌ణ ఏ2గా ఉన్నారు. విచార‌ణ ఎదుర్కొనే శ‌క్తి లేక వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేసి స్టే తెచ్చుకున్నారు అని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజనల్ కోఆర్డినేటర్, పూతలపట్టు నియోజకవర్గ ఇంచార్జ్ శైలజ చరణ్ రెడ్డి మండిపడ్డారు.
అమ‌రావ‌తి పేరుతో చంద్ర‌బాబు చేప‌ట్టిన ల్యాండ్ పూలింగ్ ప్ర‌పంచంలోనే అతిపెద్ద స్కామ్‌. రాజ‌ధానిపేరుతో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌కు పాల్ప‌డ్డారు.  వేల ఎక‌రాల దోపిడీకి పాల్ప‌డ్డారు. దీనిలో ఆయ‌న బినామీలు, చాలా మంది ప్ర‌ముఖులు ఉన్నారు. వారంద‌రూ క‌లిసి పేద‌ల భూములు కొల్ల‌గొట్టారు అని ఆమె తెలిపారు

చంద్ర‌బాబు, ఆయ‌న బినామీలు కారుచ‌వ‌క‌గా పేద‌ల భూములు కొట్టేశారు. వీటిని స‌క్రమం చే‌సుకునేందుకే  జీవో నెం 41 తీ‌సుకొచ్చారు.  సీఆర్‌డీఏ చైర్మన్‌గా ఉన్న చంద్రబాబు, అప్పటి మంత్రి నారాయణ సంతకం కూడా ఈ జీవోలో ఉంది. 

రాజ‌ధాని ఎక్క‌డ ఉంటుందో ముందే.. త‌న అనునాయుల‌కు చెప్పారు చంద్ర‌బాబు. అందుకే అమ‌రావ‌తి ప్రాంతంలోనే చంద్ర‌బాబు బినామీలంతా భూములు కొనుగోలు చేశారు. 

ప్ర‌జా రాజ‌ధాని ఏర్పాటుపై ఆయ‌న‌కు ఇంట్రెస్ట్ లేదు. అలా ఉండి ఉంటే విజ‌య‌వాడ - గుంటూరు మ‌ధ్య‌లో రాజ‌ధాని ఏర్పాటు చేసేవారు. దోపిడీ చేయాల‌నే ఉద్దేశంతోనే మూరుమూల గ్రామాల్లో రాజ‌ధాని ఏర్పాటు చేశారు. దాదాపు  ల‌క్ష కోట్ల స్కామ్ జ‌రిగింది. 

దీనిపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం ని‌ష్ప‌క్ష‌పాత విచార‌ణ చేస్తోంది. టీడీపీ కావాల‌నే ఈ విష‌యంపై రాద్దాంతం చేస్తోంది. పేద‌ల భూములు తిరిగి ఇప్పించేందుకు జగన్ ప్రభుత్వం చ‌ర్య‌లు చేప‌డుతుంది అని ఆమె తెలియజేశారు

అసైన్డ్‌, లంక భూములున్నాయ‌ని ల్యాండ్ పూలింగ్ చట్టంలో ఎందుకు పొందుప‌ర‌చ‌లేదు. 2016 ఫిబ్ర‌వ‌రిలో చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లు చేశారు. ల‌బ్ధి చేసుకోవాల‌నే ఉద్దేశంతోనే స‌వ‌ర‌ణ‌లు చే‌సుకున్నారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?

జీఓ నెం:41  కు జీఓ నెం 72  కు పోలికే లేదు 

జీఓ నెం:41 

అసైన్డ్‌ భూములు బెదిరించి, ప్రలోభపెట్టి తీసుకున్నారు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, వారి బినామీలు, తాబేదార్లు, చంద్రబాబు కోటరీలో ఉన్న వారు పేదల భూములను చౌక ధరకు అగ్రిమెంట్లు పూర్తి చేసుకోవడం, ఆ తర్వాత ల్యాండ్‌ పూలింగ్‌ గైడ్‌లైన్సులకు సవరణలు చేసి, వారికి లబ్ధి చేకూర్చారు. అదే జీఓ నెం.41. 

అది అసైన్డ్‌ భూమి కాబట్టి, పరిహారం రాదని పేదలను బెదిరించి, అగ్రిమెంట్లు చేసుకుని, ఆ తర్వాత జీఓ నె.41 ద్వారా లబ్ధి పొందారు

జీఓ నెం.72 

నాడు చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.41ని, ఇప్పుడు ఈ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.72తో పోలుస్తున్నారు. 

నిజానికి జీఓ.72 పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా ఇళ్లు కట్టించడం కోసం జారీ చేసిన జీఓ. అయినా టీడీపీ నేతలు జీఓ నెం.41తో జీఓ నెం.72తో పోలుస్తున్నారు. 

విశాఖలో దాదాపు 1.50 లక్షల నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు కట్టించడం కోసం జారీ చేసిన జీఓ నెం.72. 

ఇక్కడ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ లేదు అని ఆమె తెలిపారు

Saturday, 20 March 2021

విజయవంతంగా ముగిసిన అతిపెద్ద సుదీర్ఘ ఓట్ల లెక్కింపు.. 90 గంటలు సాగిన ప్రక్రియ... సిబ్బందికి కమీషనర్ అభినందనలు....


హైదరాబాద్, మార్చి 20:: నాలుగు రోజులుగా ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్సీ లెక్కింపు ప్రక్రియ సాయంత్రం విజయవంతంగా ముగిసింది.  దాదాపు తొంబై గంటలపాటు  నిర్విరామంగా ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉమ్మడి రాష్ట్రమ్ తొ పాటు తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే రికారడుగా చెప్పవచ్చు. .జిహెచ్ఎంసి కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి డి ఎస్ లోకేష్ కుమార్,  ఎమ్మెల్సీ  రిటర్ర్నింగ్ అధికారి  ప్రియాంక ఆల తో పాటు,  50 మంది సీనియర్ అధికారులు  నిరంతరం ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో  పాల్గొన్నారు. 
ఎన్నికల సంఘం అబ్జర్వర్ హరి ప్రీత్ సింగ్ పర్యవేక్షణలో జరిగిన ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో  ప్రతి రోజు 3 షిఫ్ట్ లుగా,  ప్రతి షిఫ్ట్ కు ఎనిమిది వందల మంది కౌoటింగ్ సిబ్బంది ఎనిమిది హాళ్ళలో రోజుకు 2400 మంది చొప్పున నాలుగు రోజులపాటు 9600 మంది నేరుగా పాల్గొన్నారు.  వీరితో పాటు సహాయ రిటర్నింగ్ అధికారులు,  జిహెచ్ఎంసి, రెవిన్యూ, సీనియర్ అధికారులు  నిర్విరామంగా తమ సేవలను అందించారు.  ప్రధానంగా జీహెచ్ఎంసి కి చెందిన ఎన్టమాలాజీ విభాగానికి చెందిన 2100  వర్కర్లు జంభో బ్యాలెట్ బాక్స్ లను స్థాంగ్ రూమ్ ల నుండి కౌంటింగ్ హల్ కు తరలించడం, తిరిగి స్ట్రాంగ్ రూమ్ లకు పంపివ్వడంలో చేసిన సంక్లిష్టమైన కృషిని ప్రతి ఒక్కరు అభినందించారు.  రు. అదేవిధంగా  దాదాపు పదివేల మందికి కనీస సౌకర్యాలను, టీ, టిఫిన్, భోజనంతో పాటు లెక్కింపు కేంద్రం పరిశుభ్రంగా ఉంచుడంలో ఎల్. బి. నగర్ జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డి నెత్రుత్వంలో మున్సిపల్ అధికారులు, పారిశుధ్య సిబ్బంది విశేషాలు సేవలoదించారు.
   ఎమ్మెల్సీ కౌంటింగ్ వివరాలను ఎప్పటికప్పుడు ఎలక్రానిక్, ప్రింట్ తదితర మాద్యమాల ద్వారా ప్రజలకు అన్సించేందుకు జీహెచ్ఎంసి సీపీఆర్ఓ క్. వెంకట రమణ ఆధ్వర్యంలో స్టేడియం ఆవరణలో మీడియా సెంటర్ ఆర్పారు చేశారు. ఏవిధమైన అవాంచనీయ సంఘటనలు జరగకుండా రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ నేత్రుత్వంలో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటుచేశారు. మొత్తానికి ఉమ్మడి రాష్ట్రంతోపాటు, తెలంగాణా రాష్ట్రంలో జరిగిన సుదీర్ఘ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ను ఏవిధమైన వివాదాలు లేకుండా, కౌంటింగ్ ఏజెంట్లు, పోటీచేసిన అభ్యార్థుల నుండి చిన్న ఫిర్యాదు లేకుండా పూర్తి చేయడంపట్ల రిటర్నింగ్ అధికారిని, జీహెచ్ఎంసి ఎన్నికల అధికారులు, మొత్తం సిబనందిని పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు అభినందించారు.
--------------------------------------------

Sunday, 14 March 2021

పవన్ కళ్యాణ్ వాక్యలను పరిశీలిస్తాం.... తెలంగాణ ఎస్.ఇ.సీ. శశాంక్ గోయల్


వరంగల్‌: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా పట్టభద్రుల నుంచి వస్తున్న స్పందన బాగుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ అన్నారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా శశాంక్‌ గోయల్ మాట్లాడుతూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లతో మాట్లాడానని తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియ వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నకిలీ కార్డులతో ఓటేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శశాంక్‌ గోయల్‌ స్పష్టం చేశారు.... టీఆర్ఎస్ అభ్యర్థి పీవీ వాణీదేవీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్‌‌పై కూడా దర్యాప్తు జరుపుతామని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్నారు. అలాగే వాణీదేవికి ఓటేశానని చెప్పిన హోంమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యల పైనా విచారణ చేపడతామన్నారు. హన్మకొండలోని పలు పోలింగ్ కేంద్రాలను శశాంక్ గోయల్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందన్నారు. పోలింగ్ శాతం పెరగడం సంతోషకరమని,  ఆన్‌‌లైన్‌‌లో డిలీట్ ఆప్షన్ వల్ల ఓటర్లకు నష్టం జరుగుతుందని మా దృష్టికి వచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ న్యూస్ ప్రచారంపై సైబర్ క్రైం వాళ్లు చర్యలు తీసుకుంటారు.. ఫేక్ ఓటర్లపై ఆధారాలు చూపిస్తే దర్యాప్తు చేస్తాం అని శశాంక్ గోయల్ చెప్పారు.


Thursday, 11 March 2021

కుంభమేళాకు సర్వం సిద్దం.. హరిద్వార్ కు పోటేత్తిన భక్తులు..


కుంభమేళా-2021 కోసం ఉత్తరఖండ్ రాష్ట్రం.. హరిద్వార్‌లో సర్వం  కరోనా మార్గదర్శకాలతో కుంభమేళా జరుగుతున్న శివరాత్రి కుంభమేళాలో ఉత్తరాఖండ్‌ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తగు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. గురువారం శివరాత్రి పర్వదినం సందర్భంగా పవిత్ర గంగానదిలో మొదటి షాహి స్నానం ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు, సాధువులు తరలివచ్ఛారు. ఇప్పటికే వేలాది మంది సాధువులు హరిద్వార్‌ చేరుకున్నారు.    రాష్ట్రంలోని హరిద్వార్‌, పౌరి గర్హ్వాల్‌, డెహ్రాడూన్‌ జిల్లాల పరిధిలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు కుంభమేళా అధికారి దీపక్‌ రావత్‌ మంగళవారం వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. దీంతోపాటు పలుచోట్ల శానిటైజర్స్‌ స్టాల్స్‌ కూడా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. కుంభమేళా సందర్భంగా భద్రత కోసం ఘాట్ల వెంట, రహదారులపై భద్రతా సిబ్బందిని మోహరించామని.. పరిశుభ్రత కోసం స్వచ్ఛంద కార్యకర్తలను నియమించామని తెలిపారు.

కుంభమేళాలో పాల్గొనే భక్తులు ముందుగా వెబ్‌పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోనే వారికి ఈ-పాస్‌లు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కుంభమేళాలో పాల్గొనేవారంతా అడ్మినిస్ట్రేషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని.. దీంతోపాటు 72 గంటల ముందు తీసుకున్న కరోనావైరస్ నెగెటివ్‌ రిపోర్ట్‌ సహా ఐడెంటిటీ పత్రాలను అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఆ తర్వాతే ఈ-పాస్‌‌ను జారీ చేయనున్నట్లు వెల్లడించారు. కుంభమేళాలో పాల్గొనే యాత్రికులంతా ఆరు అడుగుల భౌతికదూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చేవారంతా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించిన మేరకు మార్గదర్శకాలను తప్పని సరిగా పాటించాల్సి ఉంటుందని.. ఒకవేళ పాటించకపోతే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


ఈ కుంభ‌మేళా ప్రతి ప‌న్నేండు ఏళ్లకు ఒక‌సారి జరుగుతుంది. ఈ మహాకుంభ్ జనవరి 14న మకర సంక్రాంతి రోజున ప్రారంభమై.. ఏప్రిల్ 27 చైత్ర పూర్ణిమ వరకు కొనసాగనుంది. గంగా నది ఒడ్డునున్న హరిద్వార్ నగరంతోపాటు అలహాబాద్, ఉజ్జయిని, నాసిక్‌లో కుంభమేళాను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించడం వలన మోక్షం లభిస్తుందని, వ్యాధులు, పాపల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల అపార విశ్వాసం. ఈ కుంభంలో ప్రధానంగా 4 షాహిస్నాన్ ఘాట్‌లు, 6 ప్రధాన స్నాన్ ఘాట్‌లుంటాయి. దానిలో భాగంగా భక్తులు గంగా నదిలో రేపు మొదటిగా పవిత్ర స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకోనున్నారు.

Monday, 8 March 2021

తిరుపతి కళ్యాణ వెంకటేశ్వరునికి కమనీయంగా బ్రహ్మోత్సవాలు.... వాహన సేవలలో భక్తులకు కనువిందు..

శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవం తిరుపతి 

సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనం..
ఆదివారం గజవాహనంం..


 ఆదివారం ఉదయం
హ‌నుమంత వాహ‌నంపై కోదండరాముని అలంకారంలో శ్రీ కల్యాణ వెంకన్న అభ‌యం


శనివారం.. మోహినీ ఆవతరంలో భక్తులను మోహ పరవశులను చేసిన కళ్యాణ వెంకటేశ్వరుడు..

💐ఓం నమో వెంకటేశాయ💐

తిరుపతిని శ్రీ రామానుజాచార్యులవారు గరుడ పక్షి ఆకారంలో గోవిందరాజస్వామి వారి ఆలయం చుట్టూ నిర్మించాలని సంకల్పించారు.  నాటి ఆ గోవిందరాజపట్టణమే దిన దిన ప్రవర్దమానమై నేడు తిరుపతి smart city గా అభివృద్ధి చెందింది.

Sunday, 7 March 2021

పరిశుభ్రతలో ఏపీ టాప్ , ఇది జగన్ ఘనత - శైలజా చరణ్ రెడ్డి


-స్వచ్ఛభారత్‌–2 కార్యక్రమంలో రాష్ట్రం ఘనత

దేశవ్యాప్తంగా ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాలుగా 1,060 పల్లెలు ఎంపిక

అందులో అత్యధికంగా 680 గ్రామాలు మన రాష్ట్రంలోనివే

రెండో స్థానంలో  హర్యానా.. అక్కడ 199 గ్రామాల్లో..

స్వచ్ఛభారత్‌–2 కార్యక్రమంలో వందశాతం మురుగు, చెత్త రహిత,  మరుగుదొడ్ల వినియోగం వంటి ఎనిమిది అంశాల ప్రాతిపదికన ఎంపికలో ఆంధ్ర రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకుందని ఇది ఖచ్చితంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఘనతే అని వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర మహిళా నాయకురాలు శైలజ చరణ్ రెడ్డి కొనియాడారు
గ్రామాలను పూర్తి పరిశుభ్రంగా ఉంచడంలో మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. రోడ్లపై మురుగు నీరు నిలబడకుండా, చెత్తచెదారం లేకుండా చూడడం.. గ్రామస్తులందరూ వంద శాతం మరుగుదొడ్లు వినియోగించడం వంటి ఎనిమిది అంశాల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘ఓడీఎఫ్‌ ప్లస్‌’ పేరుతో స్వచ్ఛభారత్‌–2 కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా.. కేంద్ర ప్రమాణాలకు తగ్గట్లుగా రాష్ట్రంలో పూర్తి పరిశుభ్ర గ్రామాలుగా 680 పల్లెలను గుర్తించారు అని ఆమె తెలిపారు

ఇలా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,060 గ్రామాలను గుర్తించగా.. అందులో సగానికి పైగా మన రాష్ట్రంలోవే ఉండడం విశేషం. హర్యానా రెండో స్థానం దక్కించుకుంది. అక్కడ 199 గ్రామాలను ఓడీఎఫ్‌ ప్లస్‌ ప్రమాణాలకు తగ్గట్లుగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 89 గ్రామాలను గుర్తించగా.. తెలంగాణలో 22 గ్రామాలను గుర్తించారు. ఇక కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి దేశంలో మొత్తం 35 రాష్ట్రాలుండగా, 24 రాష్ట్రాల్లో ఒక్క గ్రామం కూడా ఈ ఘనతను సాధించలేకపోయాయి అని ఆమె వివరించారు

ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పాలన 40 ఏళ్ల ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే సీనియర్ నాయకులు  చంద్రబాబు బాబు నాయుడు గారికి సైతం చెంపపెట్టు గా ఉందని ఏ రంగంలో చూసిన జగన్ మోహన్ రెడ్డి గారి పాలన మొదటి స్థానం దక్కించుకుందని జనరంజక పాలన కొనసాగుతుందని శైలజా చరణ్ రెడ్డి హర్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

CHIEF PONTIFF OF SRI RANGAM SRIMATH ANDAVAN ASHRAMAM OFFERED PRAYERS TO LORD VENKATESWARA_____!


Sri Sri Varaha Mahadesikan (Andavan), Chief Pontiff of Srirangam Srimath Andavan Ashramam offered prayers in Tirumala temple on Sunday.
He was received at the Sacred Fig tree located near Old Annaprasadam Complex as per temple traditional honours (Pedda Maryada). Later Additional EO Sri AV Dharma Reddy welcomed the seer, while the archakas took the Pontiff to Bedi Anjaneya Swamy temple with Isthikapal honours.
DyEO Sri Haridranath, VGO Sri Bal Reddy, Parpatheyadar Sri Gurappa and others were present.