Sunday, 7 March 2021

పరిశుభ్రతలో ఏపీ టాప్ , ఇది జగన్ ఘనత - శైలజా చరణ్ రెడ్డి


-స్వచ్ఛభారత్‌–2 కార్యక్రమంలో రాష్ట్రం ఘనత

దేశవ్యాప్తంగా ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాలుగా 1,060 పల్లెలు ఎంపిక

అందులో అత్యధికంగా 680 గ్రామాలు మన రాష్ట్రంలోనివే

రెండో స్థానంలో  హర్యానా.. అక్కడ 199 గ్రామాల్లో..

స్వచ్ఛభారత్‌–2 కార్యక్రమంలో వందశాతం మురుగు, చెత్త రహిత,  మరుగుదొడ్ల వినియోగం వంటి ఎనిమిది అంశాల ప్రాతిపదికన ఎంపికలో ఆంధ్ర రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకుందని ఇది ఖచ్చితంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఘనతే అని వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర మహిళా నాయకురాలు శైలజ చరణ్ రెడ్డి కొనియాడారు
గ్రామాలను పూర్తి పరిశుభ్రంగా ఉంచడంలో మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. రోడ్లపై మురుగు నీరు నిలబడకుండా, చెత్తచెదారం లేకుండా చూడడం.. గ్రామస్తులందరూ వంద శాతం మరుగుదొడ్లు వినియోగించడం వంటి ఎనిమిది అంశాల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘ఓడీఎఫ్‌ ప్లస్‌’ పేరుతో స్వచ్ఛభారత్‌–2 కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా.. కేంద్ర ప్రమాణాలకు తగ్గట్లుగా రాష్ట్రంలో పూర్తి పరిశుభ్ర గ్రామాలుగా 680 పల్లెలను గుర్తించారు అని ఆమె తెలిపారు

ఇలా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,060 గ్రామాలను గుర్తించగా.. అందులో సగానికి పైగా మన రాష్ట్రంలోవే ఉండడం విశేషం. హర్యానా రెండో స్థానం దక్కించుకుంది. అక్కడ 199 గ్రామాలను ఓడీఎఫ్‌ ప్లస్‌ ప్రమాణాలకు తగ్గట్లుగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 89 గ్రామాలను గుర్తించగా.. తెలంగాణలో 22 గ్రామాలను గుర్తించారు. ఇక కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి దేశంలో మొత్తం 35 రాష్ట్రాలుండగా, 24 రాష్ట్రాల్లో ఒక్క గ్రామం కూడా ఈ ఘనతను సాధించలేకపోయాయి అని ఆమె వివరించారు

ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పాలన 40 ఏళ్ల ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే సీనియర్ నాయకులు  చంద్రబాబు బాబు నాయుడు గారికి సైతం చెంపపెట్టు గా ఉందని ఏ రంగంలో చూసిన జగన్ మోహన్ రెడ్డి గారి పాలన మొదటి స్థానం దక్కించుకుందని జనరంజక పాలన కొనసాగుతుందని శైలజా చరణ్ రెడ్డి హర్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

No comments:

Post a Comment