Sunday, 14 March 2021

పవన్ కళ్యాణ్ వాక్యలను పరిశీలిస్తాం.... తెలంగాణ ఎస్.ఇ.సీ. శశాంక్ గోయల్


వరంగల్‌: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా పట్టభద్రుల నుంచి వస్తున్న స్పందన బాగుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ అన్నారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా శశాంక్‌ గోయల్ మాట్లాడుతూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లతో మాట్లాడానని తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియ వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నకిలీ కార్డులతో ఓటేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శశాంక్‌ గోయల్‌ స్పష్టం చేశారు.... టీఆర్ఎస్ అభ్యర్థి పీవీ వాణీదేవీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్‌‌పై కూడా దర్యాప్తు జరుపుతామని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్నారు. అలాగే వాణీదేవికి ఓటేశానని చెప్పిన హోంమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యల పైనా విచారణ చేపడతామన్నారు. హన్మకొండలోని పలు పోలింగ్ కేంద్రాలను శశాంక్ గోయల్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందన్నారు. పోలింగ్ శాతం పెరగడం సంతోషకరమని,  ఆన్‌‌లైన్‌‌లో డిలీట్ ఆప్షన్ వల్ల ఓటర్లకు నష్టం జరుగుతుందని మా దృష్టికి వచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ న్యూస్ ప్రచారంపై సైబర్ క్రైం వాళ్లు చర్యలు తీసుకుంటారు.. ఫేక్ ఓటర్లపై ఆధారాలు చూపిస్తే దర్యాప్తు చేస్తాం అని శశాంక్ గోయల్ చెప్పారు.


No comments:

Post a Comment