హైదరాబాద్, మార్చి 20:: నాలుగు రోజులుగా ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్సీ లెక్కింపు ప్రక్రియ సాయంత్రం విజయవంతంగా ముగిసింది. దాదాపు తొంబై గంటలపాటు నిర్విరామంగా ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉమ్మడి రాష్ట్రమ్ తొ పాటు తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే రికారడుగా చెప్పవచ్చు. .జిహెచ్ఎంసి కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి డి ఎస్ లోకేష్ కుమార్, ఎమ్మెల్సీ రిటర్ర్నింగ్ అధికారి ప్రియాంక ఆల తో పాటు, 50 మంది సీనియర్ అధికారులు నిరంతరం ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎన్నికల సంఘం అబ్జర్వర్ హరి ప్రీత్ సింగ్ పర్యవేక్షణలో జరిగిన ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో ప్రతి రోజు 3 షిఫ్ట్ లుగా, ప్రతి షిఫ్ట్ కు ఎనిమిది వందల మంది కౌoటింగ్ సిబ్బంది ఎనిమిది హాళ్ళలో రోజుకు 2400 మంది చొప్పున నాలుగు రోజులపాటు 9600 మంది నేరుగా పాల్గొన్నారు. వీరితో పాటు సహాయ రిటర్నింగ్ అధికారులు, జిహెచ్ఎంసి, రెవిన్యూ, సీనియర్ అధికారులు నిర్విరామంగా తమ సేవలను అందించారు. ప్రధానంగా జీహెచ్ఎంసి కి చెందిన ఎన్టమాలాజీ విభాగానికి చెందిన 2100 వర్కర్లు జంభో బ్యాలెట్ బాక్స్ లను స్థాంగ్ రూమ్ ల నుండి కౌంటింగ్ హల్ కు తరలించడం, తిరిగి స్ట్రాంగ్ రూమ్ లకు పంపివ్వడంలో చేసిన సంక్లిష్టమైన కృషిని ప్రతి ఒక్కరు అభినందించారు. రు. అదేవిధంగా దాదాపు పదివేల మందికి కనీస సౌకర్యాలను, టీ, టిఫిన్, భోజనంతో పాటు లెక్కింపు కేంద్రం పరిశుభ్రంగా ఉంచుడంలో ఎల్. బి. నగర్ జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డి నెత్రుత్వంలో మున్సిపల్ అధికారులు, పారిశుధ్య సిబ్బంది విశేషాలు సేవలoదించారు.
ఎమ్మెల్సీ కౌంటింగ్ వివరాలను ఎప్పటికప్పుడు ఎలక్రానిక్, ప్రింట్ తదితర మాద్యమాల ద్వారా ప్రజలకు అన్సించేందుకు జీహెచ్ఎంసి సీపీఆర్ఓ క్. వెంకట రమణ ఆధ్వర్యంలో స్టేడియం ఆవరణలో మీడియా సెంటర్ ఆర్పారు చేశారు. ఏవిధమైన అవాంచనీయ సంఘటనలు జరగకుండా రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ నేత్రుత్వంలో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటుచేశారు. మొత్తానికి ఉమ్మడి రాష్ట్రంతోపాటు, తెలంగాణా రాష్ట్రంలో జరిగిన సుదీర్ఘ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ను ఏవిధమైన వివాదాలు లేకుండా, కౌంటింగ్ ఏజెంట్లు, పోటీచేసిన అభ్యార్థుల నుండి చిన్న ఫిర్యాదు లేకుండా పూర్తి చేయడంపట్ల రిటర్నింగ్ అధికారిని, జీహెచ్ఎంసి ఎన్నికల అధికారులు, మొత్తం సిబనందిని పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు అభినందించారు.
--------------------------------------------
No comments:
Post a Comment