అమరావతి ల్యాండ్‌పూలింగ్.. చంద్రబాబు ఏ1గా, నారాయణ ఏ2గా ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్,
దళితుల అసైన్డ్ భూములను బెదిరించి లాక్కున్నారు. దీనిపైనే సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిలో చంద్రబాబు ఏ1గా, నారాయణ ఏ2గా ఉన్నారు. విచారణ ఎదుర్కొనే శక్తి లేక వ్యవస్థలను మేనేజ్ చేసి స్టే తెచ్చుకున్నారు అని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజనల్ కోఆర్డినేటర్, పూతలపట్టు నియోజకవర్గ ఇంచార్జ్ శైలజ చరణ్ రెడ్డి మండిపడ్డారు.
అమరావతి పేరుతో చంద్రబాబు చేపట్టిన ల్యాండ్ పూలింగ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్. రాజధానిపేరుతో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. వేల ఎకరాల దోపిడీకి పాల్పడ్డారు. దీనిలో ఆయన బినామీలు, చాలా మంది ప్రముఖులు ఉన్నారు. వారందరూ కలిసి పేదల భూములు కొల్లగొట్టారు అని ఆమె తెలిపారు
చంద్రబాబు, ఆయన బినామీలు కారుచవకగా పేదల భూములు కొట్టేశారు. వీటిని సక్రమం చేసుకునేందుకే జీవో నెం 41 తీసుకొచ్చారు. సీఆర్‌డీఏ చైర్మన్‌గా ఉన్న చంద్రబాబు, అప్పటి మంత్రి నారాయణ సంతకం కూడా ఈ జీవోలో ఉంది.
రాజధాని ఎక్కడ ఉంటుందో ముందే.. తన అనునాయులకు చెప్పారు చంద్రబాబు. అందుకే అమరావతి ప్రాంతంలోనే చంద్రబాబు బినామీలంతా భూములు కొనుగోలు చేశారు.
ప్రజా రాజధాని ఏర్పాటుపై ఆయనకు ఇంట్రెస్ట్ లేదు. అలా ఉండి ఉంటే విజయవాడ - గుంటూరు మధ్యలో రాజధాని ఏర్పాటు చేసేవారు. దోపిడీ చేయాలనే ఉద్దేశంతోనే మూరుమూల గ్రామాల్లో రాజధాని ఏర్పాటు చేశారు. దాదాపు లక్ష కోట్ల స్కామ్ జరిగింది.
దీనిపై జగన్ ప్రభుత్వం నిష్పక్షపాత విచారణ చేస్తోంది. టీడీపీ కావాలనే ఈ విషయంపై రాద్దాంతం చేస్తోంది. పేదల భూములు తిరిగి ఇప్పించేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అని ఆమె తెలియజేశారు
అసైన్డ్, లంక భూములున్నాయని ల్యాండ్ పూలింగ్ చట్టంలో ఎందుకు పొందుపరచలేదు. 2016 ఫిబ్రవరిలో చట్టంలో సవరణలు చేశారు. లబ్ధి చేసుకోవాలనే ఉద్దేశంతోనే సవరణలు చేసుకున్నారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?
జీఓ నెం:41 కు జీఓ నెం 72 కు పోలికే లేదు
జీఓ నెం:41
అసైన్డ్ భూములు బెదిరించి, ప్రలోభపెట్టి తీసుకున్నారు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, వారి బినామీలు, తాబేదార్లు, చంద్రబాబు కోటరీలో ఉన్న వారు పేదల భూములను చౌక ధరకు అగ్రిమెంట్లు పూర్తి చేసుకోవడం, ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్ గైడ్‌లైన్సులకు సవరణలు చేసి, వారికి లబ్ధి చేకూర్చారు. అదే జీఓ నెం.41.
అది అసైన్డ్ భూమి కాబట్టి, పరిహారం రాదని పేదలను బెదిరించి, అగ్రిమెంట్లు చేసుకుని, ఆ తర్వాత జీఓ నె.41 ద్వారా లబ్ధి పొందారు
జీఓ నెం.72
నాడు చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.41ని, ఇప్పుడు ఈ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.72తో పోలుస్తున్నారు.
నిజానికి జీఓ.72 పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా ఇళ్లు కట్టించడం కోసం జారీ చేసిన జీఓ. అయినా టీడీపీ నేతలు జీఓ నెం.41తో జీఓ నెం.72తో పోలుస్తున్నారు.
విశాఖలో దాదాపు 1.50 లక్షల నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు కట్టించడం కోసం జారీ చేసిన జీఓ నెం.72.
ఇక్కడ ఇన్‌సైడర్ ట్రేడింగ్ లేదు అని ఆమె తెలిపారు
No comments:
Post a Comment