ఖమ్మం : బుధవారం గాంధీ చౌక్ ప్రాంతంలో కిరాణం & జాగిరి మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను ఆయ కమిటీ సభ్యులతో కలిసి 36వ డివిజన్ కార్పోరేటర్ పసుమర్తి రాంమోహన్ రావు ప్రారంభించారు . అనంతరం గణనాథుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు . మనం చేసే ప్రతీ కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని , సకల జనులు ఈ నవరాత్రులను ఎంతో భక్తిశ్రద్ధలతో , వినయంతో , నియమ నిష్టలతో ఉండి ఎటువంటి ఆటంకాలు కలగకుండా స్వామివారిని పూజించాలని ఆకాంక్షించారు . ఈ కార్యక్రమంలో కిరాణం & జాగిరి మర్చంట్స్ అసోసియేషన్ గాంధీచౌక్ యూత్ కమిటీ నాయకులు కాకరపర్తి వెంకట్ రామ్ ప్రతాప్ ( రమేష్) , వేములపల్లి నగేష్ , వజ్రపు మోహన్ , తెళ్లాకుల సంజయ్ , రాయపూడి రామకృష్ణ , ఆత్మకూరు నాని , నోముల శ్రీనివాస్ , నోముల శబరి , గోళ్ళ నరసింహారావు మరియు తదితరులు పాల్గొన్నారు . ఈ సందర్బంగా కార్పోరేటర్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు .
Wednesday, 31 August 2022
Friday, 26 August 2022
సిజేఐ ఎన్.వి.రమణ.. చివరి రోజు 5 కీలక కేసులు...
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీకాలం ఈ రోజుతో ముగుస్తుంది. సీజేఐగా చివరి రోజు ఆయన విచారించే కేసుల వివరాలను గురువారం అర్థరాత్రి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అప్‌డేట్ చేసింది. తన పదవీకాలం ముగిసే రోజున ఎన్వీ రమణ ఐదు కీలక తీర్పులు వెలువరించనున్నారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ ఐదు కేసులను విచారించి, తీర్పు ఇవ్వనుంది. అవేంటో చూద్దాం.
ఎన్నికల ఉచితాలు
సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వాగ్దానం చేసే ‘అహేతుకమైన ఉచితాలను’నిషేధించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై తీర్పును వెలువరించనుంది. ఢిల్లీ బీజేపీ నేత అశ్వనీ ఉపాధ్యాయ దాఖలు చేసిన ఈ పిటిషన్ దేశంలో ‘రేవారీ సంస్కృతి’పై భారీ చర్చకు తెరతీసింది. బుధవారం ఈ వ్యాజ్యాన్ని విచారిస్తున్నప్పుడు, రాజకీయ పార్టీలు, అవి చేసే ఎన్నికల వాగ్దానాలకు ఆదేశాలు జారీ చేయడానికి కోర్టుకు ఉన్న అధికార పరిధిని, అలాగే ఉచితాలను ఎలా నిర్వచించాలనే దానితో సహా వివిధ అంశాలను కోర్టు పరిగణించవలసి ఉంటుందని సీజేఐ గమనించారు. ‘ఉచితాల’ విషయంలో ఆప్, వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, డీఎంకే సహా వివిధ రాజకీయ పార్టీలు తమ సూచనలు, అభిప్రాయాలను సమర్పించాయి. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో పరిశీలించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు పిలవలేదని సీజేఐ ప్రశ్నించారు.
గోరఖ్‌పూర్ అల్లర్లపై పిటిషన్
2007 లో గోరఖ్‌పూర్‌లో అనేక హింసాత్మక సంఘటనలను రెచ్చగొట్టి ద్వేషపూరిత ప్రసంగాల ఆరోపణపై ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతరులను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిని మంజూరు చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది. బుధవారం ఈ కేసులో వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
కర్ణాటక మైనింగ్ కేసు
2009లో సమాజ్ పరివర్తన్ సముదాయ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిల్.. భారీ అక్రమ మైనింగ్ కారణంగా కర్ణాటకలో ఇనుప ఖనిజం గనులను మూసివేయడానికి దారితీసింది. అయితే, ఇనుప ఖనిజం, గుళికల ఎగుమతిపై పూర్తి నిషేధం విధిస్తూ 2013లో కొన్ని గనులను తిరిగి తెరవడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఇనుప ఖనిజం ఎగుమతిపై దశాబ్దాల నాటి నిషేధాన్ని ఎత్తివేయడానికి, కర్ణాటకలో ఇనుప ఖనిజం తవ్వకాలపై జిల్లా స్థాయి పరిమితులను తొలగించడానికి వివిధ మైనింగ్ కంపెనీలు దాఖలు చేసిన పలు దరఖాస్తులు కోర్టు పరిశీలనలో ఉన్నాయి.
రాజస్థాన్ మైనింగ్ లీజు సమస్య
రాజస్తాన్ మైనింగ్ లీజు విషయంలో 2016లో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాజస్థాన్ ప్రభుత్వం చేసిన అప్పీల్‌పై సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. ఈ ప్రాంతంలో మైనింగ్‌ను కొనసాగించడానికి అనుమతిస్తే అపారమైన పర్యావరణ నష్టం వాటిల్లుతుందని రాజస్థాన్ ప్రభుత్వం వాదించింది. పర్యావరణ క్లియరెన్స్‌కు లోబడి మైనింగ్ కార్యకలాపాలను ప్రారంభించడానికి కంపెనీని అనుమతిస్తూ 2003లో జారీ చేసిన లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో 2005 నుంచి ఈ సమస్య న్యాయ పోరాటంలో ఉంది.
దివాలా చట్టం కింద లిక్విడేషన్ ప్రొసీడింగ్స్‌పై నిబంధనలు
విజయవంతమైన బిడ్డర్ ద్వారా చెల్లింపు కోసం 90 రోజుల సమయం ఉందా? అనే అంశంపై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ ఏటీ) జారీ చేసిన ఉత్తర్వుకు వ్యతిరేకంగా ఏబీజ షిప్‌యార్డ్ అధికారిక లిక్విడేటర్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు తీర్పును ప్రకటిస్తుంది.
Thursday, 25 August 2022
మండపంలో మట్టిగణపతిని నిలపండి : కలేక్టర్ వి.పి.గౌతమ్ విజ్జప్తి
వినాయక చవితి సందర్భంగా ఈ రోజు ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ గారి ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ప్రజ్ఞా హాల్ నందు ఏర్పాటుచేసిన సమావేశానికి ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ,ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,పలువురు ప్రభుత్వ అధికారులు,స్తంభాద్రి ఉత్సవ సమితి ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో చేసే పనుల గురించి చర్చించడం జరిగింది.మౌనిక గణేష్ నిమజ్జనం దృశ్య చేపట్టవలసిన చర్యల్ని శాఖల వారీగా కలెక్టర్ గారు సమీక్ష చేయడం జరిగింది. ఖమ్మం నగరంలో మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని గణేష్ మండప నిర్వాహకులు తప్పనిసరిగా మట్టి విగ్రహాలని ప్రతిష్టించాలని పర్యావరణాన్ని కాపాడాలని వారు కోరారు.
ఈ సందర్భంగా నిమజ్జనం సందర్భంగా గణేష్ విగ్రహాలని త్వరగా మున్నేరు వద్దకు తీసుకురావాలని 10 గంటలకే నిమజ్జనం శోభాయాత్ర మొదలు చేయాలని వారు సూచించారు.
ఖమ్మం నగరంలో ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 10 నిమజ్జనం వరకు జరగనున్న గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వపరంగా అన్ని విధాల సహకారం అందిస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ గారు, స్తంభాద్రి ఉత్సవ సమితి అధ్యక్షులు వినోద్ లాహోటి,కార్యాధ్యక్షుడు గెంటేల విద్యాసాగర్,సెక్రెటరీ జయపాల్ రెడ్డి,కన్వీనర్ కన్నం ప్రసన్న కృష్ణ,ఆర్గనైజింగ్ సెక్రటరీ అల్లిక అంజయ్య,ఉపాధ్యక్షులు డౌలె సాయి కిరణ్,సుధాకర్ చంద్రశేఖర్,పోలీస్ అధికారులు మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు..
సీఎం సభకు భారీ బందోబస్తు... అడిషనల్ డీజీ నాగిరెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటన కోసం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మల్టీజోన్ వన్ అడిషనల్ డీజీ నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈనెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించే కలెక్టరేట్ భవనాన్ని, సభ స్థలి ప్రదేశం ను ఇంచార్జ్ సిపి సత్యనారాయణ ఐపిఎస్ గారితో కలిసి పరిశీలించారు. బందోబస్తుపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సిపి సత్యనారాయణ, డిసిపిలు రూపేష్, అఖిల్ మహాజన్, ఏసిపి సారంగపాణి, సిఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్ తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Wednesday, 24 August 2022
మానవత్వం పరిమళించిన వేళ... ఆమేకు అతను దొరికే....
నేను ఈరోజు సూర్యాపేట నుండి హైదరాబాదుకు డ్యూటీ చేయుచుండగా ఒక ప చంటి పాప తో వచ్చిన ప్రయాణికురాలు సూర్యాపేట నుండి గాంధీ బస్టాండ్ కు టికెట్ తీసుకున్నది. మార్గమధ్యలో కొత్తగూడెం రాగానే ఆ ప్రయాణికురాలు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నది అని నాకు ప్రక్కన ఉన్న ప్రయాణికులు తెలపగా వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి వివరాలు అడగగా తన భర్త నన్ను విడిచి వెళ్లాడని తను హైదరాబాదులో ఉంటున్నాడని అతని కోసం వెళుతున్నానని తను రమ్మని ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడని నాకు హైదరాబాదు తెలియదని చుట్టాలు లేరని చంటి పాప తో బాధపడుతూ ఏడుస్తూ చెప్పింది.. నేను గాంధీ బస్టాండ్ పోయే వరకు ప్రయత్నం చేశాను. తన భర్త ఫోను ఎత్తడం లేదు.. ఒక్కోసారి ఫోన్ కలవడం లేదు.. గాంధీ బస్టాండ్ వెళ్ళినాక దీనస్థితిలో చంటి పాపతో ఆకలితో అలమటిస్తున్న ఆ చెల్లెమ్మ ని చూసి మనసు చలించిపోయింది. నేను తెచ్చుకున్న అన్నం ను తనకు పెట్టి ఆమె ఆకలి తీర్చే ప్రయత్నం చేశాను. అన్నం తిన్నాక చివరిసారిగా ప్రయత్నం చేద్దామని తన భర్తకు ఫోన్ చేసాను. అదృష్టం కొద్దీ అతను ఫోను ఎత్తి మాట్లాడినాడు. నేను బస్టాండ్ కి వచ్చి తీసుకెళ్తానని మాట్లాడినాడు. చెల్లెమ్మ కళ్లల్లో చిరునవ్వు వెలిసినది. ఆర్టీసీ కార్మికుల ఈ మానవత్వాన్నికి ధన్యవాదాలు అంటూ రెండు చేతులు జోడించి నమస్కారం చేసినది. ఈ సంఘటన నాకు చాలా తృప్తినిచ్చింది. ఇంతకంటే ఆనందం, ఆస్తి ఏముంటుంది. సాటి మనుషులకు సహాయం చేద్దాము మానవత్వాన్ని చాటుదాం... ఆర్టీసీ కార్మికులు ఒంటరివారు కాదు అందరికోసం పాటుపడేవారే...
Tuesday, 23 August 2022
నయన్ - అపర్ణ ల వివాహ రిసెప్షన్ తో మురిసిన ఖమ్మం.. అందరికీ కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఆజయ్ కుమార్..
,
ఖమ్మం టేకులపల్లిలో మమత ఎడ్యుకేషనల్ సంస్థల స్థలంలో జరిగిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వసంత లక్ష్మీ గార్ల తనయుడు Dr.పువ్వాడ నాయన్ రాజ్, అపర్ణ ల వివాహ రిసెప్షన్ వేడుక మంగళవారం వైభవోపేతంగా జరిగింది.
ఈ వేడుకలకు వివిధ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులకు ఆశీర్వదించారు.
కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత సర్వమత ప్రార్థనలతో ప్రారంభించారు.
తాతయ్యా, నాయనమ్మ పువ్వాడ నాగేశ్వర రావు, విజయలక్ష్మి గార్ల దంపతుల ఆశీర్వాదంతో జరిగిన వేడుకలో నూతన దంపతులు Dr.పువ్వాడ నయన్ రాజ్, అపర్ణ లను హాజరైన అతిరథమహారథులు మనసారా ఆశీర్వదించి, తమ దీవెనలు అందించారు.
వేడుకకు హాజరైన అతిథులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా భోజన ప్రాంగణంలో టీమ్స్ ను నియమించి భోజనం వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
నూతన వధూవరులను ఆశీర్వదించడానికి ప్రజలు భారీ ఎత్తున హాజరు కావడంతో అందుకు తగ్గ ఎర్పాటు నేపథ్యంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు
వేడుక ప్రధాన మండపం వివిధ రకాల పూలతో అలకరించడంతో వేదిక ప్రాంగణం అబ్బురపడే విధంగా ఉంది. పూల పరిమళాలు ప్రత్యేక ఆకరణలతో రిసెప్షన్ వేదికను సిద్ధం చేయడంతో పూలతోటను తలపించాయి.
ఈ నెల 20న హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం వద్ద గల GMR ARENA లో అంగరంగ వైభవంగా వివాహం జరిగిన విషయం విదితమే. కళ్యాణ తంతు పూర్తయిన నేపథ్యంలో నేడు రిసెప్షన్ కు భారీ ఏర్పాట్లు చేశారు మంత్రి పువ్వాడ.
ఖమ్మం ప్రజల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ నందు సుమారు 20 వేల మంది ఒకేసారి భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా 30 ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
వచ్చి పోయే అతిథులకు ఎక్కడ చిన్న ఇబ్బంది కలుగకుండా అదనపు DCP ASC బోస్ నేతృత్వంలో పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
వివాహ రిసెప్షన్ నకు నూతన దంపతులు ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మం వచ్చి వేడుక ముగిసిన అనంతరం సాయంత్రం హైదరాబాద్ కు తిరిగి పయనమయ్యారు...
నూతన దంపతులను MLC తాత మధు, ఎంపి నామా నాగేశ్వర రావు, MLA లు సండ్ర వెంకట వీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ నాయక్, రాములు నాయక్, మెచ్చా నాగేశ్వర రావు, బోల్లం మల్లయ్య యాదవ్, శంకర్ నాయక్, డోర్నకల్ బిషప్ (CSI) పద్మారావు, మేయర్ పునుకొల్లు నీరజ గారు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార, మాజి MLC లు బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, విత్తనాభివృద్ది సంస్ధ చైర్మన్ కొండబాల కోటేశ్వర రావు, ZP చైర్మన్ లు లింగాల కమల్ రాజ్, కొరం కనకయ్య, జిల్లా కలెక్టర్ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్, అదనపు కలెక్టర్ లు స్నేహలత, మధు సుధన్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మాజి ఎమ్మెల్యే చంద్రావతి, సుడా చైర్మన్ విజయ్, AMC చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, CPI జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, CPM రాష్ట్ర నాయకుడు పోతినేని సుదర్శన్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పుర ప్రముఖులు, పోలీస్ అధికారులు, TNGO's, TGO's, వైద్యులు, మమత వైద్య విద్యా సంస్థల సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Saturday, 20 August 2022
వజ్రోత్సవాల వేళ జాతీయతను చాటిన రంగవల్లులు : మువ్వన్నేలతో మురిసిన పటేల్ మైదానం.
ఖమ్మం ; స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ది.20-08-2022 నాడు ఉ.9.00 గం. లకు సర్దార్ పటేల్ స్టేడియం, ఖమ్మం నందు స్వయం సహాయక సంఘ సభ్యులు, ఐసిడిఎస్ సిబ్బంది మరియు ఆరోగ్యశాఖ సిబ్బందితో జాతీయ పతాకంలోని కాషాయ, తెలుపు, ఆకుపచ్చ రంగుల దుస్తులతో *75 ఆకారంలో సాతంత్ర్యోద్యమ స్ఫూర్తి ప్రతిబింబించే విధముగా* ముగ్గుల పోటీలు, (దేశభక్తి ప్రధానాంశంగా) పాటల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ముగ్గులపోటీలో ప్రతి మండలం నుండి 10 మంది యస్.హెచ్.జీ మహిళలు, ఐ.సీ.డియస్ అంగన్వాడీ టీచర్లు, వివిధ గ్రామాల నుండి పాల్గొనడం జరిగింది. ముగ్గుల పోటీలు మొత్తం గౌతమి జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగింది.
శ్రీమతి అనసూయ గారు జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ గారు, శ్రీమతి మల్లీశ్వరి అసిస్టెంట్ కమిషనర్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ గారు, శ్రీమతి డి.శిరీష అడిషనల్ డి.ఆర్.డి.ఓ ఈ.జి.యస్ గారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినారు మరియు గౌరవ అడిషనల్ కలెక్టర్ గారి చేతుల మీదుగా గెలుపొందిన మహిళలకు ప్రథమ, ద్వితీయ తృతీయ మరియు కన్సోలేశన్ బహుమతులు అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా శ్రీమతి స్నేహాలత మొగిలి, ఐ.ఏ.యస్ అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) గారు, శ్రీమతి విద్యా చందన గారు డి.ఆర్.డి.ఓ, డి.ఆర్.డి.ఏ, ఖమ్మం గారు, శ్రీమతి సి.హెచ్ సంధ్యారాణి జిల్లా సంక్షేమ అదికారి గారు, శ్రీమతి. ఆర్. జయశ్రీ అడిషనల్ డి.ఆర్.డి.ఓ సెర్ప్ గారు, డి.ఆర్.డి.ఏ సిబ్బంది మరియు జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి అరుణ మరియు కోశాధికారి ఇతర ఓ,బి సభ్యులు, , డీపీఎంలు, ఏపిఎం లు, సీ.సీలు యస్.హెచ్.జీ సభ్యులతో దేశభక్తి ఇనుమడింపజేసే విధంగా గౌతమి జిల్లా సమాఖ్య ఆధ్యర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
Thursday, 18 August 2022
మాజీ ఎం.పి., తెరాస రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె సప్నిరెడ్డి దంపతుల వివాహ రిజిస్ట్రేషన్ ..సర్టిఫికెట్ అందజేసిన సబ్ రిజిస్ట్రార్ రవీంద్ర బాబు
పొంగులేటి కుమార్తె వివాహం అంగరంగవైభవంగా జరిగింది.. లక్షలాది మంది అభిమానులు వివాహానికి హాజరై నవదంపతులకు ఆశీస్సులు అందజేసి..విహహ భోజనంబును పొంగులేటి వారి విందు బలే పసందు అంటూ ఆరగించి..ఆనందం వ్యక్తం చేశారు... ఈ సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున పొంగులేటి కుటుంబంపై తమ అనుబంధాన్ని..అభిమానాన్ని చాటుతూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వివాహ ఫోటోలు..సెల్ఫీలు షేర్ చేశారు.. ఇంత భారీ విహహాం మంగళ వాయిద్య లు..వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా అత్యంత శోభాయమానంగా నిర్వహించారు.. ఆనంతరం వధువరులు వివాహాన్ని ప్రభుత్వ పరంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.. వీరి వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను ఖమ్మం రిజిస్ట్రార్ అడపా రవీంద్ర బాబు వధువరులకు అందజేశారు.. ఆనంతరం వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు... @ మణికుమార్...
Tuesday, 16 August 2022
ప్రజలు..అదికారుల సహకారంతో.. సామూహిక జాతీయ గీతాలాపన విజయవంతం :: జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్*
ఖమ్మం, ఆగస్టు 16:- జాతి ఐక్యతను చాటే విధంగా జిల్లాలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు జిల్లా వ్యాప్తంగా ఎక్కడి ప్రజలు అక్కడే ఉండి సామూహికంగా జాతీయ గీతాలాపన చేశారని కలెక్టర్ అన్నారు. జిల్లాలోని ప్రతి ట్రాఫిక్ కూడలి వద్ద, ప్రతి గ్రామంలో, ప్రతి ఆవాసంలో, ప్రతి మున్సిపల్ వార్డులో, సినిమా హాళ్లలో, ప్రతి ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయంలో, ప్రతి విద్యా సంస్థలో, ప్రతి వాణిజ్య కేంద్రం వద్ద ప్రజలంతా స్వచ్ఛందంగా సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొని విజయంతం చేశారని కలెక్టర్ తెలిపారు. స్థానిక జెడ్పి సెంటర్ వద్ద నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి కలెక్టర్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా, జాతి ఐక్యతను చాటే విధంగా విజయవంతంగా సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమాన్ని అమలు చేసిన అధికారులను, స్వచ్చందంగా పాల్గొన్న ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, డిఆర్వో శిరీష, ఏసీపీ రమేష్, జిల్లా అధికారులు, సిబ్బంది, వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Monday, 15 August 2022
ఖమ్మంలో ఘనంగా అమృత మహోత్సవ వేడుక... జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి అజయ్ కుమార్... సంక్షేమ ఫలాలు అన్నివర్గాలకు అందిస్తున్నామని ఉద్ఘాటన
మణికుమార్, సత్యన్యూస్,ఖమ్మం.
ఖమ్మంలో జెండా పండుగ
పోలిస్ పేరేడ్ గ్రౌండ్లో.. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు..
ఆనంతరం మంత్రి మాట్లాడారు..
తెరాస ప్రభుత్వసంక్షేమ ఫలాలు
అన్ని వర్గాలకు అందుతున్నాయని,
భారత జాతి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు పోరాడిన త్యాగధనులందరికీ ఈ సందర్భంగా వినమ్ర నివాళులు సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.. ప్రతిఒక్కరికీ ముందుగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సోదరభావం వంటి గొప్ప ఆదర్శాలకు అంకితమిచ్చే రోజుగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని కన్నులపండుగగా జరుపుకుందాము. ఈ పవిత్రమైన రోజున దేశ నిర్మాణానికి అందరూ కారణభూతులమవుతూ పునరంకితం కావాలి. జాతీయోద్యమం స్పూర్తితో అహింసా మార్గంలో శాంతియుత పంథాలో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఏ ఆశయ సాఫల్యం కోసం మనం స్వరాష్ట్రాన్ని కోరుకున్నామో ఆ లక్ష్య సాధన దిశగా సీఎం కేసిఆర్ సారథ్యంలో రాష్ట్రం పురోగమిస్తున్నందుకు ఎంతగానో హర్షిస్తున్నాను.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీస్సులతో..ఖమ్మం ఉమ్మడి జిల్లా సమగ్రంగా అభివృద్ధి సాధించిందన్నారు..
ఇటీవల వచ్ఛిన గోదావరి వరదలను అధికారుల సమన్వయం తో..సమర్థవంతంగా ఎదుర్కోని..ప్రజలను సురక్షితంగా వుంచగలిగామని పేర్కొన్నారు..
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు కనీస జీవన భద్రతను కల్పించేందుకు సంక్షేమ రంగానికి బడ్జెట్ లో సింహ భాగాన్ని వెచ్చిస్తున్నది.
అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాల మీద పరిపాలన సాగుతున్నది. ఇది భారత స్వాతంత్ర్య 75వ స్వాతంత్ర్య ఉత్సవాలు జరుగుతున్న సందర్భం. జాతి చరిత్రలో ఇది ఒక విశిష్ట ఘట్టం. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సాధన కోసం జరిగిన పోరాటంలోని ఉజ్వల ఘట్టాలను, స్వాతంత్ర్య సమరవీరుల మహోన్నత త్యాగాలను యావత్ భారత జాతి సగర్వంగా స్మరించుకుంటున్నది.
ఈ 75 ఏళ్ళ స్వతంత్ర భారత దేశ ప్రస్థానం లోని వెలుగు నీడలను అందరం వివేచించుకోవాలి. మనం సాధించింది ఏమిటి? ఇంకా సాధించాల్సింది ఏమిటన్నది ఒక్కసారి మదింపు చేసుకోవాలి.
ఒకవైపున దేశం అనేక రంగాలలో కొంతమేరకు పురోగతిని సాధించింది. అదేసమయంలో నేటికీ చాలా రాష్ట్రాలలో ప్రజలు కనీస అవసరాలకోసం కొట్టుమిట్టాడుతున్న దుస్థితీ ఉంది.
మరింత నిబద్ధత, నిజాయితీ. సామరస్యం, సమభావం నిండిన దృక్పథంతో దేశ భవిష్యత్ నిర్మాణానికి భారతప్రజలు పునరంకితం కావాలని కోరుకుంటున్నాను. భరతమాత దాస్య శృంఖలాలను తెంచి, బ్రిటీష్ వలస పాలనను పారదోలాలని మహా సంకల్పంతో భారత స్వాతంత్య్ర సమరం సాగింది. నాటి మహనీయుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు. ఇవి ఎంతటి విలువైనవో నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. భారత జాతి తన స్వాతంత్య్రం కోసం దాదాపు ఒకటిన్నర శతాబ్దంపాటు సుదీర్ఘమైన పోరాటం చేసింది. అనేకమంది అనేక రకాల పద్ధతుల్లో వలస పాలకులకు వ్యతిరేకంగా అపురూపమైన త్యాగాలు చేస్తూ పోరాడారు. అనేక త్యాగాలతో, పోరాటాలతో స్వాతంత్య్రాన్ని సముపార్జించి, స్వయంపాలనలో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న భారతావని 75 సంవత్సరాలు పూర్తి చేసుకొంటున్నది. దీనిని మనం వజ్రోత్సవాలుగా నిర్వహించుకొంటున్నామన్నారు.
అహింసాయుత మార్గంలో స్వాతంత్ర్యన్నీ సాధించిన మహాత్మాగాంధీ సంకల్పాన్ని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గాంధీజీ ఉద్యమ స్ఫూర్తిని వర్తమాననికి, భావితరాలకు అందించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం. స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో విపక్ష, వెనుకబాటుతనం ఉన్నది దాన్ని రూపుమాపాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. స్వరాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు, ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు ఉండాలనేది మా ఆకాంక్ష 75 సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించి చూపిందని మంత్రి అజయ్ కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించే మార్గంలో ఎన్నో అవరోధాలు, సమస్యలు, సవాళ్ళు, మరెన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రాష్ట్ర ప్రజల ఆశీర్వాద బలంతో వాటన్నిటినీ అధిగమించి పురోగమించగలుగుతున్నది. ప్రతీ రంగంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న పరిస్థితులకు, నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యం. అన్నిరంగాలలో గుణాత్మకమైన, గణనీయమైన అభివృద్ధిని ఆవిష్కరించగలిగాము. వాస్తవం కళ్ళముందే కనపడుతోంది. ప్రగతి ఫలాలు ప్రజల అనుభవం లో ఉన్నాయి. విద్యుత్ సమస్య, తాగునీటి సమస్య, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవడమే కాదు, ఈ రంగాలలో నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆశించిన గమ్యం లక్ష్యం చేరుకోవాలంటే వాక్ శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి ఉండాలని సీఎం కేసిఆర్ చెప్పినట్లు ఈ మూడింటి మేళవింపుతో తెలంగాణా ప్రభుత్వం ప్రజాభ్యుదయ పథంలో మునుముందుకు సాగుతుందని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. సమానత్వం, సామాజిక న్యాయం అనే ఉదాత్త లక్ష్యాలను సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నది. కేవలం ఆర్థిక లక్ష్యాలను సాధించడమే కర్తవ్యంగా భావించే యాంత్రిక ధోరణిని ప్రభుత్వం విడనాడింది. ప్రతీప శక్తులు సీఎం కేసిఆర్ నేతృత్వంలో సాగే మా ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలిగించేందుకు ఎన్ని కుట్రలు చేస్తున్నా ప్రజల ఆశీర్వాదంతో వాటన్నింటిని ఛేదిస్తూ ముందడుగు వేయగలుగుతున్నాం.తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం నిరంతరం పాటు పడే మా ఏకాగ్రతను ఇటువంటి క్షుద్ర ప్రయత్నాలతో మరల్చలేరని వారికి మరోసారి స్పష్టం చేస్తున్నాను. శ్రామిక జనుల సౌభాగ్యంకోసం, సకల జనుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతుంది. ప్రజల అండదండలే మాకు తిరుగులేని ఆత్మబలాన్ని అందిస్తున్నాయి. మాలో అంకిత భావాన్ని పెంపొందిస్తున్నాయి. అట్టడుగు వర్గాల దాకా అభివృద్ది ఫలాలను చేరవేసి ప్రజల ముఖాలపై చిరునవ్వులు విరబూసే బంగారు తెలంగాణను సాకారం చేసే మా ప్రయత్నంలో కలిసి వస్తున్న వారందరికీ హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఎన్నో అవాంతరాలు, మరెన్నో విలయాలను అధిగమిస్తూ ఎందరో మేధావులు, రాజనీతిజ్ఞులు, కవులు, కళాకారులు, కోట్లాది మంది కార్మిక కర్షకులను భారత్ ఈ ప్రపంచానికి అందిస్తూనే ఉంది. శతవార్షిక స్వాతంత్ర్య దినోత్సవం నాటికి నిరక్షరాస్యత, పేదరికం, సాంఘిక అసమానతలు లేని దేశంగా భారత్ రూపుదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. అలానే తెలంగాణాకే ఆదర్శంగా మన ఖమ్మం అభివృద్ధి చెందుతుంది. ఖమ్మం నగర పాలక సంస్థ ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. రూ.4 కోట్లతో లకారం చెరువు సుందరీకరణ, రూ.70 కోట్లతో గోళ్లపాడు చానల్ పనులు, రూ.14 కోట్లతో నూతన మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణం జరిగింది. మిషన్ భగీరథ అమృత్ పథకంలో రూ. 229 కోట్లతో మంచినీటి సరఫరా అభివృద్ధి పనులు పురోగతిలో ఉండగా.. నగరంలో ఇంటింటికీ నల్లా పథకంలో 84 వేల గృహాలకు నీరు అందించాము.
17,043 ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు, రూ.73.50 లక్షలతో జిల్లా ప్రధాన గ్రంథాలయం, గాంధీపార్కు గ్రంథాలయాలను ఆధునీకరించాము. నగరంలో రూ.28 కోట్లతో రెండు స్టేజ్‌లలో నిర్మించిన ఐటీ హబ్ ప్రారంభించుకున్నాము. రూ.70 కోట్లతో ధ్వంసలాపురం ఆర్‌వోబీ బ్రిడ్జీని ముస్తాఫానగర్ నుంచి ధ్వంసలాపురం గేటు వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మించాము. ఖమ్మం నగరంలోని టేకులపల్లి వద్ద 1,210 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు కేటాయించాము. నగరంలో పారిశుధ్య పనులను మెరుగుపర్చే లక్ష్యంతో రూ.50 కోట్లతో వివిధ కార్యక్రమాలు చేపట్టాము. ఎన్నెస్పీ క్యాంపులో రూ.17.05 కోట్లతో నూతన బస్టాండ్ నిర్మించి రద్దీ తగ్గించి ట్రాఫిక్ సమస్య తీర్చాము. నగరంలో రూ.1000 కోట్ల పైచిలుకు నిధులతో అభివృద్ధికి బాటలు వేయడమైంది. నగరపాలక సంస్థకు ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తున్నాము ఈ నిధులతో అంతర్గత రహదారులు, మంచినీటి వసతి, ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్, వాడవాడలా సీసీ రోడ్లు, సైడు కాలువలు, జనాభా ప్రతిపాదికన కూరగాయల మార్కెట్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టాము. గతంలో నగరంలో ఉన్న పరిస్థితులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు అందరికీ కనిపిస్తున్నాయి నగర అభివృద్ధిలో కీలకమైన తాగునీరు, కరెంటు సరఫరా, విద్య, వైద్యం, రవాణా వ్యవస్థ ఇలా అనేక రంగాల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి నగరాభివృద్ధి సాధనలో ఖమ్మం దూసుకెళ్తుతుంది, సుస్థిర అభివృద్ధిని సాధించడమైంది మన ఖమ్మం ప్రగతికి నా సహాయ సహకారాలు ఎల్లపుడూ ఉంటాయని మరో సారి స్పష్టమైన హామీని ఇస్తూ ప్రజలందరికీ మరోమారు భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను
Subscribe to:
Comments (Atom)