Wednesday, 24 August 2022

మానవత్వం పరిమళించిన వేళ... ఆమేకు అతను దొరికే....


నేను ఈరోజు సూర్యాపేట నుండి హైదరాబాదుకు డ్యూటీ చేయుచుండగా ఒక ప చంటి పాప తో వచ్చిన ప్రయాణికురాలు సూర్యాపేట నుండి గాంధీ బస్టాండ్ కు టికెట్ తీసుకున్నది. మార్గమధ్యలో కొత్తగూడెం రాగానే ఆ ప్రయాణికురాలు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నది అని నాకు ప్రక్కన ఉన్న ప్రయాణికులు తెలపగా వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి వివరాలు అడగగా తన భర్త నన్ను విడిచి వెళ్లాడని  తను హైదరాబాదులో ఉంటున్నాడని అతని కోసం వెళుతున్నానని తను  రమ్మని ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడని  నాకు హైదరాబాదు తెలియదని చుట్టాలు లేరని  చంటి పాప తో బాధపడుతూ ఏడుస్తూ చెప్పింది..  నేను  గాంధీ బస్టాండ్ పోయే వరకు ప్రయత్నం చేశాను.  తన భర్త  ఫోను ఎత్తడం లేదు..  ఒక్కోసారి ఫోన్ కలవడం లేదు..  గాంధీ బస్టాండ్ వెళ్ళినాక దీనస్థితిలో చంటి పాపతో ఆకలితో అలమటిస్తున్న ఆ చెల్లెమ్మ ని చూసి మనసు చలించిపోయింది.  నేను  తెచ్చుకున్న అన్నం ను తనకు పెట్టి ఆమె ఆకలి తీర్చే ప్రయత్నం చేశాను.  అన్నం తిన్నాక చివరిసారిగా ప్రయత్నం చేద్దామని తన భర్తకు ఫోన్ చేసాను.  అదృష్టం కొద్దీ అతను ఫోను ఎత్తి మాట్లాడినాడు.  నేను బస్టాండ్ కి వచ్చి తీసుకెళ్తానని మాట్లాడినాడు. చెల్లెమ్మ కళ్లల్లో చిరునవ్వు వెలిసినది.  ఆర్టీసీ  కార్మికుల ఈ మానవత్వాన్నికి  ధన్యవాదాలు అంటూ రెండు చేతులు జోడించి నమస్కారం చేసినది.  ఈ సంఘటన నాకు చాలా తృప్తినిచ్చింది.  ఇంతకంటే ఆనందం, ఆస్తి ఏముంటుంది.  సాటి మనుషులకు సహాయం చేద్దాము మానవత్వాన్ని చాటుదాం...  ఆర్టీసీ కార్మికులు ఒంటరివారు కాదు అందరికోసం పాటుపడేవారే...

No comments:

Post a Comment