Wednesday, 31 August 2022

ఖమ్మం గాంధీచౌక్ లో ఘనంగా గణనాథునికి పూజలు.... కిరాణం -జాగిరి ఆధ్వర్యంలోని ఉత్సవాలను ప్రారంభించిన కార్పోరేటర్ పసుమర్తి రాంమోహన్ రావు.


ఖమ్మం : బుధవారం గాంధీ చౌక్ ప్రాంతంలో కిరాణం & జాగిరి మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను ఆయ కమిటీ సభ్యులతో కలిసి 36వ డివిజన్ కార్పోరేటర్ పసుమర్తి రాంమోహన్ రావు ప్రారంభించారు . అనంతరం గణనాథుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు . మనం చేసే ప్రతీ కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని , సకల జనులు ఈ నవరాత్రులను ఎంతో భక్తిశ్రద్ధలతో , వినయంతో , నియమ నిష్టలతో ఉండి ఎటువంటి ఆటంకాలు కలగకుండా స్వామివారిని పూజించాలని ఆకాంక్షించారు . ఈ కార్యక్రమంలో కిరాణం & జాగిరి మర్చంట్స్ అసోసియేషన్ గాంధీచౌక్ యూత్ కమిటీ నాయకులు కాకరపర్తి వెంకట్ రామ్ ప్రతాప్ ( రమేష్) , వేములపల్లి నగేష్ , వజ్రపు మోహన్ , తెళ్లాకుల సంజయ్ , రాయపూడి రామకృష్ణ , ఆత్మకూరు నాని , నోముల శ్రీనివాస్ , నోముల శబరి , గోళ్ళ నరసింహారావు మరియు తదితరులు పాల్గొన్నారు . ఈ సందర్బంగా కార్పోరేటర్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు .

No comments:

Post a Comment