Thursday, 25 August 2022

సీఎం సభకు భారీ బందోబస్తు... అడిషనల్ డీజీ నాగిరెడ్డి


తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటన కోసం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మల్టీజోన్ వన్ అడిషనల్ డీజీ నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈనెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించే కలెక్టరేట్ భవనాన్ని, సభ స్థలి ప్రదేశం ను ఇంచార్జ్ సిపి సత్యనారాయణ ఐపిఎస్ గారితో కలిసి  పరిశీలించారు. బందోబస్తుపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సిపి సత్యనారాయణ, డిసిపిలు రూపేష్, అఖిల్ మహాజన్, ఏసిపి సారంగపాణి, సిఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్ తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment