తిరుపతి కపిలతీర్థంలో గల పురాతన
శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం శాస్త్రోక్తంగా మహాశాంతి తిరుమంజనం నిర్వహించారు.ఇందులో భాగంగా ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, అక్షిణ్మోచనం, పంచగవ్యాధివాసం, క్షీరాదివాసం, జలాధివాసం, రత్నన్యాసం, బింబస్థాపన, అష్టబంధన, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. సాయంత్రం బింబవాస్తు, నవ కలశ చతుర్దశ కలశ స్నపనం, మహాశాంతి, తిరుమంజనం, పూర్ణాహుతి, శయనాధివాసం నిర్వహించారు. మే 14న ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య మిథున లగ్నంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఆ తర్వాత భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
No comments:
Post a Comment